సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.
ఈ రోజు కృష్ణాష్టమి. ఆ యోగేశ్వరున్ని కొంచం సేపు మన ఆలోచనల్లో బంధిద్దాం. చిలిపి చేష్టలు చేసినా గీతని భోదించినా విశ్వరూపాన్ని ప్రదర్శించినా అది ఆ కృష్ణపరమాత్మునికే చెల్లు. యుగపురుషులు రాబోయే యుగానికి నిదర్శనంగా ఉంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అంటే కృష్ణావతారం ద్వాపరం చివర్లో వస్తుంది. ఆ అవతారం ముగిసినవెంట్టనే ద్వాపరం ముగిసి కలి మొదలైంది అని మన నమ్మకం. అంటే కృష్ణావతారం లో బోధించిన భగవత్ గీత ఆ యుగానికంటే మన కలికే ఎక్కువగా వర్తిస్తుంది. సత్య, త్రేత తో పోలిస్తే ద్వాపరం లో ఈర్షలు, కుట్రలు, రాజకీయాం గట్ర కలి కంటే కొంచం తక్కువగా ఉన్నయనే చెప్పాలి. అలాంటి యుగానికి కృష్ణావతారం తగునైంది అని చెప్పడం లో ఎటువంటి అనునామం లేదు.
జగమంత కుటుమబైనా ఏకాకిగానే జీవించాడు. ఎవ్వరిని నొప్పించలేదు. అందరికి అందుబాటులోనే నిలచాడు. యుద్ధం తథ్యం అని తెలిసినా నివారించేదానికి ఓ ప్రయత్నం కూడా చేసాడు .సకల వేదాల సారామైన గీతని యుద్ధభూమి మీద ప్రబోధించాడు. ఆ ఒక్క అవతారం లోనే "నేనే భవగంతుడని.." అని చెప్పాడు. దశావతారాల్లో అన్నింటికంటే మోస్ట్ పవర్ఫుల్ అవతారం కృష్ణుడే అని చెప్పచ్చు. అంటే మనుషులకి అన్ని యుగాలు పట్టిందనుకోవాలా.. ఆ పరమేశ్వరుడ్ని అర్థం చేసుకునేదానికి? అంతకముందు యే అవతారం లోను తన విశ్వరూపం చూపలేదు. తర్వత యే అవతారం లోను అవసరం పడలేదు.
ఏ విషయం మారదో అదే సత్యం అని అంటారని మా గురువుగారు చెప్పారు. అలానే ఎవరైతే మారరో.. స్థితప్రజ్ఞులుగా ఉంటారో వారే అచ్యుతులని అంటే భగవంతుడని చెప్పారు. గీతలో శ్రీ కృష్ణుడు అదే అంటాడు తానే సత్యాన్ని అని. అంటే తానే ఆ పరమపురుషుడని. తానే తత్వదర్శి అని. తానే జ్ఞానాన్ని అని. ఆ యోగేశ్వరుడ్ని ఆ జ్ఞానేశ్వరుడ్ని ఆ కృష్ణపరమాత్ముడ్ని తలచుకుంటూ కొన్ని పాటలు / సంకీర్తనలు.
శ్రావణుడు అన్నమయ్య సంకీర్తనలకు తద్వారా తెలుగు కి చేస్తున్న ఎనలేని కృషికి సత సహస్ర వందనాలు. అన్నమయ్య కృష్ణునుని మీద రచించిన అరుదైన సంకీర్తనలు ఇక్కడ వినచు.
అందరికి గోకులాష్టమి శుభాకాంక్షలు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!