జన గణ మన రణ...
అంటే తప్పేంటి? గత కొద్ది రోజుల్లో మీరు ఈ మాట / పాట వినే ఉంటారు. ఈ ప్రశ్న నేనడిగింది కాదు.. రాం గోపాల్ వర్మ కొత్త చిత్రంది. మన జాతీయ గీతాన్ని కొంచం మార్చి ఒక ప్రశ్న గా మార్చాడు. అందులో నాకేమి తప్పు అనిపించడం లేదు. రాజకీయనేతల్ని ఎలాగు మనం ప్రశ్నించము.. లంచం అడిగే ట్రాఫిక్ కానిస్టేబల్ ని ప్రశ్నించము .. నగర పాలక సంస్థ లో ఏదైన పనికి లంచం అడిగినప్పుడు ప్రశ్నించము.. వోట్లడ్డుక్కొని ఎన్నికబడ్డ "నాయాకులు" ఏ ఒక్క ఎన్నికల వాగ్ధానాలని పూరించనప్పుడు ప్రశ్నించము.. ఒక్కడైన ధైర్యం చేసి అడిగాడే అనము.. మన జాతి ఇల ఎందుకు అయ్యింది అని ప్రశ్నించిన వాడ్ని మాత్రం అర్రెర్రె అది మన జాతీయ గీతాన్ని కించపరుస్తున్నాడు అని అంటాం.
అసలు మనలో ఇంత నిరాశ నిస్ప్రుహ ఎల జీర్నించుకుపోయిందో నాకు తెలేదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఐతే ఇలా ఉండిఉండదు.. మన దేశాన్ని పునరుద్దరించుకోవాలి అన్న తాపత్రయం తో అప్పటి స్వాతంత్ర సమరయోధులు ఆశావాదులై ఉండిఉంటారు. లేకుంటె మనకి "ఉందిలే మంచి కాలం ముందు ముందు నా.." అన్న పాట ఉండేది కాదేమో. కాని తర్వత ఏమైందో తెలేదు.. ఇలా ఆ నాకేమి కాలేదు కద అలాంటప్పుడు నాకెందుకు అని అయిపోయాం. మొత్తం భారతావని లో ఏదైన భావం ఏక కంఠం తో వినిపిస్తుంది అంటే అది - మన దేశం ఇంతే. దీన్ని ఎవ్వడు బాగుచేయలేడు అన్నదే కద. అరవై యేళ్ళ తర్వత కూడా ఇంత దరిద్రం, ఇంత చండాలం మొత్తం దేశం యే ఒక్క ఇంచు కూడా వదలకుండా మనలో మనతోనే అది పెరుగుతోంది. మేరా భారత్ మహాన్ అని కపటపు గర్వాన్ని నెత్తినేసుకొని ఓ ఊరేగుతాం.. దేశాలేగుతాం. కాని అంథ మహాన్ అనేంత ఏముంది మన కాడ? పదివేల సంవత్సారల చరిత్ర? ప్రపంచ జ్ఞాన నిధి వేదాలా? కౌటిల్యుని అర్థశాస్త్రమా? ఇవ్వన్ని ఉన్నాయి.. కాని ఇవ్వన్ని ఎప్పటివో. కాదనడం లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు ఈ మన నవ సమాజం లో ఏముంది మన దేశాన్ని చూసి గర్వ పడేదానికీ? ఎలుగెత్తి మేరా భారత్ మహాన్ అని చాటేదానికి? అలాంటప్పుడు ఓ "థా" తగిలిస్తే సరిపోద్ది కద.. అప్పుడు మేరా భారత్ మహాన్ థా అయిపోతుంది. లెక్క సరిపోతుంది.
మామూలుగా మన దినచర్య లో ఎదైన సమస్య వస్తే అసలు ఇది ఎందుకు అయ్యిందో అని అనుకుంటాం. మరోసారి అల జరగకుండా చూసుకుంటాం.. కాని అరవైయేళ్ళు వీళ్ళు కకపోతే వాళ్ళు ఎవరైన దొబ్బెవాళ్ళే తప్ప మంచి చేసే వాళ్ళని ఎందుకు ఎన్నుకోము? అసలు ఎన్నుకున్న వాళ్ళాని ఎందుకు ప్రశ్నించము? ఎందుకు నిలదీయము? ఇప్పుడంటే గూండాలు, డాకూలు, కనిష్టం ఒక 2-3 కేసులైన ఉన్నవాళ్ళాకే పార్టీ టికెట్లు ఇస్తున్నారు అనుకో.. కాని ఓ 30 యేళ్ళ క్రితం వరకు ఇల లేదు కద. అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు నిలదీయలేదు? అంటే స్వాతంత్రం వచ్చేసింది మన పని అయిపోయింది అని ఆ తరం వాళ్ళు అనుకున్నారా? ఇది మన తరానిదా ఇంతక ముందు తరానిదా అని తప్పులు నెట్టుకోవడం వలన ప్రయోజనం ఎమైన ఉందా? తప్పెవరిదైన శిక్ష యావత్మందీ అనుభవిస్తున్నాము. మన రాబోయే తరలవారు అనుభవిస్తారు. అంత మాత్రాన ఈ దేశాం మొత్తం ఎదో బాగుచేసేస్తా అని నేనేమి అనడం లేదు. అసలు ఎందుకు ఇలా అయ్యిందో ప్రశ్నించడం మానద్దు అంటున్నా. ఎక్కడ తేడ జరిగింది అన్నది నా ప్రశ్న.
అఖండ భారతావనిని రెండుగా చీల్చుకున్నాం. తర్వతా భాష మీద విడగొట్టుకున్నాం. ఇప్పుడు యాసల మీద. తర్వత? వాడ ల మీదా? మనం భారతీయులం అని మర్చిపోయి చాలా యేళ్ళైంది. ఒక్క రణం వళ్ళనో లేకుంటే క్రికెట్ వళ్ళనో తప్ప భారతీయులం అనిపించుకోం. మనలో ఎన్ని విభజనలు ఉన్నయో ఆ చిత్రగుప్తునికి కూడా తెలీదు. మనం మారమా? ఇంక ఇంతేనా ? ప్రేమికుల రోజు గురించి పట్టించుకుంటాం. పార్కులో ప్రేమికుల గురించి పట్టీంచుకుంటాం. ఎవరిని ఎన్నుకున్నామో వాళ్ళేమి చేస్తున్నారో అది మాత్రం పట్టించుకోం. శాస్త్రి గారు అన్నట్టూ:
తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో బీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమె మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ