Showing posts with label క్రికెట్. Show all posts
Showing posts with label క్రికెట్. Show all posts

Saturday, October 10, 2009

క్రికెట్ తెలియనివాడు ...

అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి ఒకడు వచ్చి బుజ్జిగాడి మేధస్సు చూసి "మామూలుగా రండి మేధవులుగా పొండి" అనే పోటికి పంపమని ఆ ఊరువాళ్ళతో చెప్పాడు. ఊరు పరువు పేరు నిలబెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి బుజ్జిగాడికి ఓ తోడు ఇచ్చి ఆ పోటి కి పంపారు.

బుజ్జిగాడు వాడి స్నేహితుడు పోటి జరుగుతున్న స్థలానికి చేరారు. మొత్తం ఇంకా అన్ని ప్రదేశాల నుండి ఓ వంద మంది వచ్చారు. అసలు పోటిల్లో పాల్గొనే అర్హత ఉందో లేదో అని ముందు చిన్న చిన్న పరీక్షలు పెట్టి మొత్తం మీద ఓ ఆరు మందిని ఎన్నుకున్నారు. ఇంక పోటిలూ ప్రారంభమైయ్యాయి. మొదటిది ఏంటంటే మూడు అగ్గిపుల్లల్తో ముప్పై మందికి మూడు రకలా వంటలు చేసి పెట్టాలి. ఇలాంటివి మన బుజ్జిగాడికి పప్పుతో పెట్టిన విద్య .. వెంట్టనే మూడు పుల్లల్ల్ని వేరు వేరు చేసి మూడు గిన్నెల కింద పెట్టి చక చక వంట చేసేసాడు. పోటిలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండో పోటి ఐస్కాంతం తో ఓ కాంత ని ఆకర్షించాలి. ఇది కూడా చిల్లర పని కాబట్టి నిమిషాల్లో చేసేసాడు. ఇలా ఐదు విడతల పోటిల తర్వాత మొదటి స్థానం లో బుజ్జిగాడు నిల్చున్నాడు. ఇంక ఫలితాలు చెప్పే సమయం అయ్యింది.. అందరు ఇంక బుజ్జిగాడికే వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. బుజ్జిగాడు కూడా విజయగర్వం తో అందరికి చేతులు ఊపుతు నిల్చున్నాడు. కాని చివరి క్షణంలో ఆ పోటి విజేత విజేంద్ర వర్మ అని చెప్పేసరికి ఎనలేని నిరాశ నిస్ప్రుహతో స్ప్రుహ కోల్పోయాడు బుజ్జిగాడు. ఇంక జీవితం మీద విరక్తి కలిగి అలా అలా నడుచుకుంటు దగ్గర్లో ఉన్న అడివిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కొద్ది రోజులు తర్వత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైయ్యాడు. అప్పుడు బుజ్జిగాడు అడిగిన ఏకైక ప్రశ్న అన్నింటిలోను తాను ముందుండగా మేధావి అనే బిరుదు మాత్రం వేరేవాడికి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు "నీకు దైవ క్రీడ్ ఐన క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమే కారణం బుజ్జి" అని. ఆ మాటకి అవాక్కైన బుజ్జికి మించు ఇంచు గా మతి భ్రమించింది. "దేవా.. దేవాది దేవా మహాదేవా ....ఏంటి మీరంటుందేది. కొంచం వివరంగా చెప్పగలరు" అని పరిపరివిధములుగా ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు -

ఒకానొకప్పుడు దేవుళ్ళు దూర్వస ముని శాపము వలన వారి శక్తులు అన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరు విష్ణు మూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి సంతుషూటుడై వారికి వారి గతవాఇభవం చేరూకే ఒక ఉపాయము చెప్పెను. క్షేరసాగరాన్ని మదించి అందులోనుండి వెలువడిన అమ్రుతాన్ని సేవించినచో దేవుళ్ళకి వారి గత వైభవం తిరిగివచ్చునని తెలిపెను. దేవుళ్ళు ఒక్కరే ఆ సాగరాన్ని మదించలేరు కాబట్టి వారి చుట్టలైన అసురులని కూడా ఆహ్వానించిరి. అలా ఇరువురు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మదనాన్ని ఆరంభించిరి. హాలాహలము, కామధేనువు గట్ర అన్ని వచ్చాక అమృతం బయటకి వచ్చెను. ఆ అమృతానికి దేవుళ్ళు అసురులు కొట్లాడుకోవడం ఆరంభించారు. ఆ కొట్లాటని పరిష్కరించేదానికి కనుగొనబడిన క్రీడ ఈ క్రికెట్. ఆ రోజు జరిగిన మ్యాచ్ కి అంపైర్ గా వ్యవరించినది సాక్షాత్తూ ఆ బ్రహ్మే. మధ్యలో అసురులు వీరవిపరీతం గా విజ్రుంభిస్తూంటే వారి ఆటని దెబ్బకొట్టేదానికి విష్ణుమూర్తి మోహిని గా వచ్చే సరికి ఆ సుందరిని చూస్తూ మతిచెడి అసురులు ఓడిపోయారు. అలాంటి ఆటని హేళన చేసినందుకును ఇష్టపడనందుకును నీకు ఆ బిరుదు రాలేదు.

ఇది విన్న బుజ్జిగాడికి కళ్ళు చెమ్మగిల్లాయి.. ఐతే దేవా ఈ క్రీడని తెల్లోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఇది మన జాతీయ క్రీడ అవ్వాలి కద? అని అడిగాడు. అందుకు ఆ మహదేవుడి ఇలా సెలవిచ్చాడు - "భారతీయులకి ఓ భయంకరమైన జబ్బు ఉంది. అది ఎందుకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అసంధర్భం కావున చెప్పడం లేదు.. కాని ఆ జబ్బేంటంటే 'భారతీయులకి - పొరుగింటి పుళ్ళకూర రుచి! మనది, మన దేశానిది మన వాళ్ళూ అంటే చచ్చిన అవళంబించరు సరికద అపహాసం చేస్తారు. అందుకనే ఈ క్రీడని తెల్లోళ్ళకి అంటగట్టాల్సి వచ్చింది. అలా అయినా మనవాళ్ళు దీన్ని పుళ్ళకూరంత రుచిగా చూసుకుంటారని. ఇప్పుడు జరుగుతుండేది అదే కద!" ఇలా చెప్పేసరికి బుజ్జిగాడికి బోధిచెట్టుకింద కూర్చున్నంత జ్ఞానమొచ్చి ఇలా అన్నడు:

ఖగపతితోడన్ క్షీరసాగరము మదించగన్,
తగువున్ చేదించుటకు విధాత తలపుగన్,
జన్మనొందెన్ ఈ మహోనత క్రికెట్ క్రీడన్,
క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్..

గమనిక: ఈ టపా ఎవ్వరిని ఉద్దేసించి వ్రాసినదికాదు. 'నేను-నేనుగా' యే 'నేస్తా'ల సహాయం లేకుండా రాసినది. ఎవరినైన బాధ కలిగిస్తే కేసేసుకోండి. నేను దానికి బదులుగా ముందే ఓ రెండు మూడు కేసులేసేస్తా.

Read more...

Saturday, August 22, 2009

విశ్వ దర్శిని - sports edition

ఉసేన్ బోల్ట్ strikes again
Lightning Bolt గురించి దేవుడెరుగు ఉసేన్ బోల్ట్ గురించి ప్రపంచం అంతా చెప్తారు. పోయినేడు చైనా లో జరిగిన ఒలంపిక్స్ 100, 200 మీటర్ల పరుగు పందాళ్ళో ప్రపంచాన్ని ఆహ్లాదపరచి ప్రత్యర్థులని భయపెట్టి రెండు ప్రపంచ రికార్డ్లని స్థాపించాడు. 100 మీ పరుగులో 80 తర్వత కొంచం మెళ్ళాగా అయిపోయీ అప్పుడే celebrations మొదలెట్టాడంటే ఆలోచించండి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అని. అప్పుడు నెలకొలిపిన రికార్డు 9.69 సెకన్లు. గతవారం జెర్మనీ లో జరిగిన పరుపుపోటీళ్ళో మళ్ళీ తర రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకొని ఈ సారి 9.58 సె లో 100 మీ పరిగెత్తాడు. 100 meters in 9.58 secs!!!! ఒక కాలం లో 100 మీ లని 10 సే లో పరిగెట్టడం గొప్పగా ఉండేది. ఇప్పుడు ఈ 22 యేళ్ళ కుర్రాడు ఇంకొన్ని యేళ్ళవరకు ఎవ్వరికి అందకుండా పరిగెత్తి ఆ రికార్డ్లని దాచేటట్టు ఉన్నాడు. పనిలో పనిగా 200 మీ లని 19.19 సె లో ఛేదిచ్చేసాడు. ఆ రెండు పరుగుల వీడియోలు ఇక్కడ:





Where is Tiger?
ఈ ప్రశ్న నాతోబాటే ప్రపంచంలో చాలామంది అడిగింటారు. అసలు PGA ఆడుతున్నది టైగర్ వుడ్సేనా ఇంకెవరైన నా అని. ఐదో సారి గెలిచేటందుకు అన్ని సెట్ చేసుకొని ఉన్న టైగర్, చివరి రోజున యాంగ్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఇప్పటివరకు మేజర్స్ లో అంటే ఎనిమిది సార్లు టైగర్ చివరి రోజున ఆధిక్యం లో ఉంటే ఎప్పుడు ఓడిపోలేదు. ఈ సారి కూడా అంతేనేమో అని అందరు ఊహించారు. టైగర్ మీద నమ్మకమో యాంగ్ అంటే "ఎవరు?" అన్న ధైర్యమో తెలీదు కాని ఒక ఐరిష్ బుకీ మాత్రం ఆదివారం ముగిసే PGA tournament కి శుక్రవారం, టైగర్ 4 షాట్ల ఆధిక్యం లో ఉండగా, టైగర్ మీద పందెం కాసిన వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేసారు. ఆదివరం అది ఉల్టా అయ్యింది.. దెబ్బకి ఓ $2.12 మిల్లియన్లు నష్టం కోరితెచ్చుకున్నారు. ఆత్రమో ఆవేశమో ఓ ఐదు నిమిషాలు.. ఇక్కడ ఓ రోజు.. ఓపిక పట్టుకోవాలి అని ఊరికే కాదు అనేది. యాంగ్ టైగర్ ని ఓడించడం ఇది రేండో సారి. 2006 HSBC tournament లో ఒక్కసారి ఇంతకముందే ఓడించాడు. ఈ PGA గెలుపువళ్ళ మేజర్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చరిత్ర పుట్టాళ్ళో తన స్థానాన్ని చేజిక్కిచ్చుకున్నాడు.

యేయ్ యేయ్ ఇంగ్లండ్.
మన దేశాన్ని దోచుకొని ఇన్నేసి కలతల్ని రేపి విభజించి భ్రష్టుపట్టించి మన దారిద్ర్యానికి కారకులైన ఇంగ్లాండ్ ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఒక్క బుడిదలో తప్ప.. అదే అదే ఆషెస్ లో తప్ప. ఇంగ్లాండ్ మీద కోపం కంటే ఆసీస్ అంటే చిరాకు ఎక్కువ. చిరాకు చాలా చిన్న పదమేమో. కంపరం apt. అందుకని ఆసీస్ ని ఎవ్వరు ఓడించిన ఒక్క పాకిస్తాన్ తప్ప వాళ్ళకి నేను అభిమానిని. తప్పుబట్టకండి .. స్టీవ్ వా ఉన్నప్పుడు కొంచం బాగుండేది వాళ్ళ బిహేవియర్. ఈ పంటర్ చేత్లో వచ్చాక అదేదో god given right గా అతిగా చాలా చేసాడు. ఈ సారి ఓడిపోతే పీకేస్తారు పంటర్ ని. హమ్మయ్య ఈ పీడ విరగడైద్ది. షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, గిల్లి గట్ర ఉన్నప్పుడు నిజంగానే ఆసీస్ రాజుల్లా ఉండేవారు. ఇప్పుడు world XI లో చోటు సంపాదిచ్చుకునే ప్లేయరే లేడు. కాని పంటర్ పొగరు మాత్రం అలనే ఉంది. ఈ దెబ్బతో అతడి క్యాప్టన్సీ పొగరు రెండు హూష్ కాకి ఔతాయేమో అని చిన్ని చిన్ని ఆశ..

బ్రేడి ఈజ్ బ్యాక్ ..so is Favre.
2001 లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి దాక రోజంత క్రికెట్ చూస్తూ ఆనందంగా ఉండే నా జీవితం సడన్ గా ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా MLB, NBA చూడ్డం మొదలెట్టాను. కొద్ది రోజులు చూసాకా నాకు పరమ బోరింగ్ గా అనిపించింది. ఇలా ఐతే నాకు పిచ్చి ఎక్కుతుంది అని అనిపించేది. అప్పుడు చూసా NFL. అర్థం చేసుకునేదానికి ఓ సీజన్ పట్టింది కాని నాకు భలే నచ్చింది. అసలు క్రికెట్ కి మన ఊర్లో ఉన్నంత అభిమానం ఈ క్రీడకి ఉండడం అన్నింటికన్న నన్ను ఆకట్టుకున్న విషయం. దానికి తోడు MLB NBA లా కాకుండా ఒక్క రోజు.. ఒక్క గేం లో తేలిపోద్ది.. అది ఇంకా నచ్చింది నాకు. ఈ గేం ని అర్థం చేసుకునేదానికి నేను ఫాలో అయినా టీం పేట్రియట్స్. 2001 సూపర్ బోల్ గెలుచుకున్న టీం. అప్పటి నుండి నాకు పేట్రియట్స్ అన్నా టాం బ్రేడి అన్న అభిమానం. 2008 లో ఏడే ఏడు నిమిషాలు ఆడాడు. మళ్ళా ఆడగలడొ లేదో అని అనుమానం వచ్చింది. కాని ఈ యేడు ప్రీ సీజన్ గేం లో ఆడి న్యూ ఇంగ్లాండ్ వాళ్ళందరికి పేట్ర్యియాట్స్ ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. హమ్మయ్య.

అలనే నేను ఒక్కప్పుడు అభిమానించే ఇంకో QB బ్రెట్ ఫావ్ర్. గ్రీన్ బే కి ఆడినన్ని రోజులు బాగుండేవాడు.. ఇప్పుడు సంవత్సరానికి ఓ రెండు సార్లు రిటైర్ అయ్యి ఒక వేరే వేరే టీం లో చేరి తన అభిమానులని దూరం చేసుకుంటున్నాడు. బహూసా ఈ జన్మ లో రిటైర్ అయ్యి Hall of Fame కి వెళ్తే చాలా మంది మర్చిపోతారేమో. కాని అసలు ఆ మనిషి రిటైర్ ఔతాడా అన్నది కోటి రూపాయల ప్రశ్న.

Read more...

Thursday, June 11, 2009

మరో T20 ప్రపంచ కప్.

టెన్నిస్, చెస్, జిమ్నాస్టిక్స్ చివరకి ఫుట్ బాల్ లో కూడా అమ్మయిలు వాళ్ళ సత్తా చూపించారు. తదణుగునంగా ఆ ఆటలని అమ్మయిలూ ఆడుతున్నప్పుడు ప్రజాధారన చాలానే ఉంటోంది. మన జాతియా క్రీడ అయిన హాకీ లో కూడా అమ్మయిలు చాలా ముందంజలో ఉన్నారు. చాలా స్వర్ణ పతకాలు సంపాదించారు కొన్ని కప్పులు కూడా చేజిక్కిచుకున్నారు. అప్పుడప్పుడైనా వీళ్ళని మన పత్రికలు / టి.వీ చానల్ వాళ్ళు చూపిస్తారు చదివి మనం ఆనందిస్తాం.

ఈ రోజుల్లో T20 క్రికెట్ చాలా చాలా జరుగుతోంది. మొన్ననే IPL2 ముగిసింది.. వెన్వెంటనే T20 World Cup మొదలైంది. చాలా మంది ఆ మ్యాచస్ ని చూస్తూ లేక చదువుతూ ఉంటారనే భావిస్తున్నాను. వీరు భుజం నెప్పితో ఇంటికి వచ్చేస్తున్నాడని, వీరు కి ధోని కి మధ్యలో ఎదో జరిగింది అని మనం ప్రతి రోజు చూస్తున్నాం. కాని అదే సమయం లో ఇంకొక World Cup మొదలైంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అదే women T20 World Championships. ఈ రోజు నుండే అది ప్రారంభమైంది. అబ్బాయిల కప్ లా కాకుండా కేవలం 8 టీంలతో మొదలైంది.

ఇదే మొట్టమొదటి women's T20 ప్రపంచ కప్. తొమ్మిది రోజుళ్ళో అయిపోతుంది. ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియూ దక్షిన ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంటభరితం గా చివరి ఓవర్ దాకా సాగింది. పోయినేడు జరిగిన ODI ప్రపంచ కప్ ని చేజిక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ సారి కూడా అందరికి గట్టి పోటి ని ఇచ్చి ఈ కప్ కూడా పొందే ప్రయత్నం లో ఉంది. ఇంగ్లిష్ జట్టు చాలా మట్టుకు వాళ్ళ క్యప్టన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. తను చాలా మంచి ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా జట్టు కి సారాధ్యం వహిస్తున్న కారెన్ కి ఇదే చివరి ప్రపంచ కప్. ODI కప్ ని ఆస్ట్రేలియా గెలుచుకున్నది ఈవిడ క్యాప్టన్సి లోనే.

వీళ్ళ ప్రపంచం లో పవర్ హౌజుల్లో ఒకటిగా అభివర్ణించే జట్టు మన దేశానిది. మెర్క్యూరియల్ అని ఇంకొక పేరు కూడా ఉంది మన జట్టు కి. పోయినేడు జరిగిన ప్రపంచ కప్ లో మూడో స్థానం లో నిలిచాము. అప్పటి జట్టుకి ఇప్పటి ఈ T20 జట్టుకి పెద్దగా మార్పులు లేకపోయినా మన క్యాప్టైన్ మాత్రం మారింది. ఇప్పుడు ఝులన్ గోస్వామి కి ఇచ్చారు ఆ పదవి. తను మంచి ఫాస్ట్ బోలర్. చక్కని యాక్షన్ తో 120kph వేగం తో వేస్తుంది. మన బ్యాటింగ్ ప్రత్యేకించి అంజుం చోప్రా, మిథాలి రాజ్ ల మీద ఆధరపడి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా యేళ్ళ నుండి క్రికెట్ అన్ని ఫార్మాట్ల్లల్లో వారి నైపుణ్యం చూపారు. అలనే బోలింగ్ మన క్యాప్టన్ ఝులన్, చిచ్చుర పిడుగు అమితా షర్మా (మన వైస్-క్యాప్టన్), హైదరాబాద్ కి చెందిన గౌహెర్ సుల్తానా మీద ఆధరపడి ఉంటుంది. వీళ్ళందరు చాలా చాలా చక్కని ఫీల్డర్స్ కూడాను. వీళ్ళే కాదు మిగితా జట్టుళ్ళోని వారు కూడాను!! మెన్స్ క్రికెట్ కి ఏ మాత్రం తీసిపోకుండా వీళ్ళు ఆడతారు. కాని తగిన గుర్తింపుకి నోచుకోకుండా ఉన్నారు.

ఈ యేడు ఇప్పుడు జరుగుతున్న T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో మెన్స్ కప్ తో బాటే కొనసాగుతుంది. అదే గ్రండ్లల్లో వీళ్ళు ఆడుతున్నారు. మన దేశం గెలుస్తుంది అన్న ఆశ ఎక్కువగా లేదు నాకు... ఎందుకంటే మన వాళ్ళా కంటే న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులు బాగున్నాయి. ఈ ఫార్మాట్ లో మన వాళ్ళ కంటే ఎక్కువా ఆడారు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఉండి. చూడాలి ఎవరు గెలుస్తారో అని. ఎవ్వరు గెలిచినా, మహిళా క్రికెట్ లో ఇదో కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. may the best team win, and may the best team be INDIA.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP