Friday, December 25, 2009

The Known Universe - మనమొక్కరమే అంటే నమ్మలేను...

నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి అన్నింటిని ఒక చోట పెడితే ఇలా ఉంటుంది..

మధ్యలో భాగం మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఈ ధరణి నుండి పైకో కిందికో చూసి అటువైపు ఉండే నక్షత్రాలని చూడగలము. కాని కుడీ యెడమల్లో చూడలంటే మనకి ఆకాశ గంగ లోని ఇతరనక్షత్రాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు భాగాల్లో ఇంకా మ్యాప్ చేయలేదు. బహుశా ఏదో ఒక రోజు మనము ఆ భాగాలని కూడా ఇంతకంటే సూక్ష్మంగా పరిశీలించచ్చేమో. ఆ రోజుకోసమే చూస్తున్నా.



ఈ వీడియో చూసాక ఎవ్వరికైన అనిపించాలి - మనము ఉండే చోటు ఎంత చిన్నది అంటే it is just not worth fighting over petty things. మనవజాతి అంతా ఒక తాటిపై నిలబడి సమస్త జగతిని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతరిక్షాన్ని అర్థం చేసుకొని వేరే గ్రాహాల మీద ఇంక ఎవరైన ఉన్నరేమో అని వెతికేదానికి సర్వ శక్తుల ప్రయత్నం చేయాలి. అన్ని కోట్ల కోట్ల నక్షత్రాల చుట్టు ఇంకా కోట్ల కోట్ల భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో జీవులు ఉంటారన్నది ఖండించలేని వాస్తవం. ఒక ఊహ ప్రకారం వాళ్ళు ఎంత ముందు ఉండింటారంటే వాళ్ళు పంపే సిగ్నల్స్ మనకి అర్థం కావడం లేదు - ఒక చీమకి మన భాష ఎట్ల అర్థం కాదో అలా అన్నమాట. అది కూడా అయ్యిండచ్చు. చూద్దాం.. ఇంకో ఇరవై యేళ్ళల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ఆ మాత్రం అభివృద్ధి చెందదా? Hopefully someday we will be able to make contact with the others....Hopefully..

Read more...

Tuesday, December 22, 2009

ఒక తెలుగు వాడి క్షోభ.

జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.

దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.

ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?

రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.

Read more...

Saturday, December 19, 2009

అవతార్ - my experience

ప్రతీ యేట కొన్ని వేల చిత్రాలు విడుదతౌతాయి. కాని కొన్ని సంవత్సరాలకి ఒక్క సారి ఓ చిత్రం వస్తుంది.. సినీ చత్రిరనే తిరిగిరాసే చిత్రం. ఒక్కప్పుడు స్టార్ వార్స్ వచ్చింది. (1979 మొదటిది).. ఆ రోజుల్లో అంత ఆధునికంగా తీసిన చిత్రం. తర్వాత తర్వాత ఆ టెక్నాలజి అందరికి అందుబాటలోకి వచ్చి ఇప్పటి తరం వారికి స్టర్ వార్స్ చూపిస్తే ఓస్ ఇంతేనా.. దీనికంటే గొప్ప సినెమాలు చూసాము అని అంటారు. రాముడు భీముడు ఇప్పుడు చూస్తే అలనే ఉంటది.

ప్రపంచ సినీ చరిత్రలో తనకంటు ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న అలాంటి ఒక (వి)చిత్రమే ఈ "అవతార్". సినెమాలు వచ్చాయి. 3D సినెమాలు వచ్చాయి. కాని ఇలాంటి 3D చిత్రం రాలేదు. ఇంకొన్ని సంవత్సరాల్లో బోలేడు వస్తాయి ఇలాంటి సినెమాలు కాని ఇదే ప్రథమం. ఊహని అందని అందాలని అధ్భుతంగా చూపించాడు జేంస్ క్యామరూన్. టర్మినేటర్, ఏలియన్స్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత ..టైటానిక్ లాంటి పరమ సుత్తి చిత్రం తర్వాత 12 యేళ్ళకి ఈ సినెమా తీసాడు. ఈ సినిమ మీద అతడి (+ ఫాక్స్ కూడా) ఖర్చు 1200 కోట్ల రూపాయలు. అంత ఖర్చు పెట్టాడు అని కాదు.. ఖర్చు పెట్టిన ప్రతి పవల కనిపిస్తుంది మూవీ లో. మన వాళ్ళు ఖర్చుపెడతారు.. గజిని ని నలభై కోట్లు అయ్యింది అట.. ఎందుకు అయ్యిందో ఎక్కడ ఖర్చు చేసారో కనిపించదు. అలా కాదు ఈ అవతార్.

కథా పరంగా పెద్దగ చెప్పుకునేదానికి ఏమి లేదు. కాని for some reason I could identify with the story at multiple levels. అంగ్రేజులు రాకమునుపు ఓ తొమ్మిది వేళ సంవత్సరాలు మన దేశం లో మనము ప్రకృతిని చాలా గొప్పగా ఆధారించేవాళ్ళం. ఒక చెట్టు కొట్టేసేమునుపు ఇంకో రెండు నాటేవాళ్ళం. అందుకే చాలా చాలా చాలా అరుదుగా మన దేశం లో కరువు ఉండేది. నీళ్ళని కాని భూమిని కాని విచ్చలవిడిగా ఉపయోగించేవాళ్ళం కాదు.. ఎదైన ఉపయోగించే ముందు ఆలోచించి వాడేవాళ్ళం. అందువలన there was a balance in the environment. ఇలా మనం తొమ్మిదివేల సంవత్సరాలు గడిపాము. కాని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇవన్ని గాలికి వదిలేసి.. ఇదిగో ఇలా తయారయ్యాం. కథ కూడా ఇలాంటిదే.. పండోరా అనే గ్రహం మీద ఉండేవాళ్ళు ఇలానే ప్రకృతి తో అవినాభావంగా ఉంటారు. కాని భూమి నుండి వెళ్ళిన వాళ్ళు ఆ గ్రాహన్ని కూడా స్వార్థం కోసం ఎలా ధ్వంసం చేస్తారో .. అది కథ.

కథ కొంచం సైడ్ కి పెడితే తీసిన విధానం మాత్రం -A W E S O M E !!!! హెలీకాప్టర్లు మొదలుకొని అన్ని 100 years into the future లా ఉంది. తీసిన టెక్నాలజీ కూడా ఓ పదేళ్ళ ముందే వచ్చినట్టు ఉంది. ఆర్థర్ క్లార్క్ ఊహమీద పుట్టినదే జియో-స్టేషనరీ సటిలైట్ (geo-stationary statellite), జూల్స్ వెర్న ఊహే సబ్మరీన్ (సుబ్మరినె).. అలనే జేంస్ క్యమరూన్ ఊహే ఈ రకం చిత్రం అని చెప్పుకోవచ్చు. 3D లోనే చూడాలి మూవి. వీలైతే IMAX 3D లో చూడండి. anything less would be doing injustice to the effort that went into making this movie.

గమనిక: ఇలా నకు నచ్చే చిత్రాలు నాకు నచ్చే విధం గానే మీకు నచ్చాలని రూల్ లేదు. Every movie is a personal experience. నాకు ఇలాంటి technically advanced movies చాలా ఇష్టం.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP