Beat in my heart..
దాదాపుగ ఒక పదైయేళ్ళ (అంటే పదిహేనేళ్ళన్నమాట) క్రితం ఒక అద్భుతమైన చిత్రం వచ్చింది. చాలా మంది మదిలో ఎదలో మెదడులో అంతక ముందే ఉన్న ఆలోచనలకి ప్రరిబింబం గా నిలచింది. తేజా "చిత్రం" అంత కాకపోయిన కొంచం చెడగొట్టింది అనే అనాలి. 'క్లాసు రూముల్లో తప్పస్సు చేయుట వేస్టు రా గురూ..' అని మాకున్న లక్ష సాకులు సరిపోదనట్టు ఇంకో గ్రేట్ సాకు ని చూపించింది. సరే ఎలాగూ క్లాస్ ఎగ్గొట్టాం కదా ఏం చేద్దామా తర్వతా అంటే దానికీ ఒక దారి చూపించింది.. ' బీట్ ఇన్ మై హార్ట్ ..' అని.
అసలు ఆ పాట విన్న మొదటిసారి ఇంచు మించు గా పిచ్చెక్కింది. ఆ ఊపూ ఆ బీటు.. దానికి తగ్గట్టుగానే సినిమా చూస్తే ఆ పాట picturization.. అది మా ఇంటర్ రోజులు. ఇంటర్ అంటే పెద్దగ లైఫ్ లో దేనికి టైం ఉండదు (ఇప్పటి సంగతి తెలీదు మా రోజుల్లో ఐతే ఇంటర్ లో మాకు లైఫే ఉండేది కాదు).. ఒహో ఇంజనీరింగ్ చేరితే ఇలా ఎంచక్క బైకుల మీద అమ్మయిని వెనకేసుకొని జాం చక్ అని రోడ్లెంబడి తిరగచ్చేమో అని తెగ చదివేసాం "సాంకేతిక వ్యవసాయ వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష" కి .. అదే ఎంసెట్ కి. ఎదో కొద్దో గొప్పో ర్యాంక్ రావడం తో సిటి లోనే కాలేజి లో చేరాం. రోజు అంతంత దూరం సిటి బస్సుల్లో వేలాడ్డం, ఇంటి ముందరే రన్నింగు బస్సు దిగడం... ఇలా ఉండేది. మా నాన్న ఓ రోజు "ఒరేయ్ నీకు కంప్యూటర్ కావాలా? బైకు కావాలా?" అని అడిగారు.. ఈ మాట కోసం ఒక రెండేళ్ళ నుండి కాచుకున్నా కద.. వెంట్టనే బైక్ అని చెప్పా. నాన్న అంత చట్టుకున్న చెప్పినందుకు ఆశ్చర్య పడి కొంచం నిరాశ పడి వీడి జన్మలో మారడు అని బాధపడి కొనిచ్చారు. ఇంకే.. ఇంటర్ నుండి దాచుకున్న నా లిస్ట్ బయటకి తీసి "ఇంజినీరింగ్" పక్కన, "బైక్" పక్కన "చెక్" మార్క్ పెట్టా. ఇంక కావాల్సింది కాలేజి బంక్ కొట్టడం - ఇది చాలా కష్టమైన పని (ఎప్పుడు చేయలేదు కాబట్టే), ఇంక ఒక గరల్ ఫ్రెండ్ ని పటాయించడం - అన్నేసి సినిమాలు చూసి ఇదెంత పని చిటికెలో ఐపోద్ది అని అనుకున్నా. ప్చ్...
క్లాసు రూముల్లో తప్పస్సు వేస్టని బైకుల మీద రోడ్లెంబడి తిరిగాము. సినిమ రెలీస్ అంటే అక్కడ ప్రత్యక్షమైపోయేవాళ్ళం. అలనే ఓ సారి అమరావతి లో 'గణేష్' విడుదలా అంటే మా వాడు ముందే వెంకీ ఫ్యాన్ .. లంచం ఇచ్చి నన్ను తీసుకొని వేళ్ళాడు. అక్కడేమో భయంకరమైన జనం. మరి మొదటి రోజు మొదటి ఆట అంటే ఆ మాత్రం ఉండాలి కద.. సరే అని క్యూ లో నిలబడ్డాం. మా గోల తట్టుకోలేక పోలీసులు లాఠీ అన్నారు. అది తప్పించుకునే ప్రయత్నం లో కాలి మీద ఓ వాత కూడా పడ్డది. సినిమా వద్దు ఏమి వద్దురా నాయాన అని .. మా ఆస్థాన థియేటర్ "శ్రీ రమణ" లో చూసాం.. అలా కాలాం సాగిపోతోంది. సీన్ కట్ చేస్తే ఇంజినీరింగ్ రెండో సంవత్సరం సగం అయిపోయింది.. కాని "నాకో గరల్ ఫ్రెండ్ కావాలి" అన్న కోరిక మాత్రం అలనే మిగిలిపోయింది. లేట్ గా అయినా లేటెస్ట్ గా అప్పుడర్థమైంది.. బంక్ కొట్టడం కాదు కష్ఠమైనది అని. సినెమాల్లో చూపిచినట్టుగా చేస్తే అమ్మయిలు పడ్డం కాదు చెప్పుదెబ్బలు పడతాయి అని. అయినా మానుతామా? ఎన్నోయేళ్ళ కోరిక కదా.. మా కాలేజి కాకుంటే పక్క కాలేజి లేకుంటే st. anns ఎక్కడ ట్రై చేసినా ఫలితం సున్నానే.
ఆలా చూస్తున్నే ఇంజినీరింగ్ అయిపోయింది.. సరే అమేరికా కి వస్తున్నాం ఇక్కడైనా అద్రుష్టం వరించకపోద్దా అని ఆశతో ఉన్నా. తీరా ఇక్కడ చూస్తే మా కాలేజి లో అబ్బాయిలు: అమ్మాయిల ratio 100:1 లా ఉండేది. ఖండాంతరాలు దాటొచ్చినా ఇంకా ఆంధ్రా అమ్మయిలేనా అని విదేశిలని పటాయించుదాం అని అనుకొని సైకాలజి కోర్స్ ఒకటి తీసుకున్నా మా సీనియర్ల అడుగుజాడల్లో. వారం వెళ్ళేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. తాజ్ మహల్ కట్టింది నేనే అని నా పేరు టిప్పూ సుల్తాన్ అని నేను క్రీ.పూ. 200 సంవత్సరం లో పుట్టానని ఇలా కొన్ని నిజాలు తెలిసే సరికి ఎందుకొచ్చిన కొచ్చిన్ అని మానేసా. ఇలా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నా చిరకాలా కోరిక మాత్రం అలనే ' హీట్ ఇన్ మై థాట్ ' అని వెంటాడుతునే ఉంది.
తర్వత తర్వత బోధి చెట్టుక్రింద కూర్చున్న బుద్ధుని లా నాకూ జ్ఞానోదయం అయ్యిన తర్వాత తెలుసుకున్నా... అలా ఆ రోజ్జుల్లో అలా తిరిగింటే మా ఆవిడ నా బెండు తీసేదని. ఒకందుకు అదే మంచిదైంది అని. మా నిశ్చితార్థం అయ్యాక .. అంటే అపటికే నా బండి 3000 కి ఎవరికో అమ్మేసారు మా ఇంట్లో.. అది అంత పెట్టి కొన్నవాడు ఎవాడో అని ఆశ్చర్యపడ్డా అది వేరే విషయం... మా ఆవిడ ని వాళ్ళ ఆపీసు నుండి పిక్ చేసుకొని లంచ్ కి వెళ్ళి మళ్ళా డ్రాప్ చేద్దాం అని ఓ గ్రేట్ ప్లాన్ వేసా. మా శ్రీ గాడి బండేసుకొని అంత దూరం మే ఎండ్డాళ్ళో వెళ్ళి పిక్ చేసుకొని లంచ్ చేసి 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ ఎంచక్కా డ్రాప్ చేస్తున్న సమయంలో ఢామాల్ అని పెద్ద సౌండ్ తో ఆ ముష్టి టైర్ పగిలింది. ఆహా నా రాజా ఏం టైమింగో అని మా ఆవిడని ఆటో ఎక్కించి ఓ రెండు కిలోమీటర్లు తోసుకొని టైర్ మార్చుకొని ఇల్లు చేరా. మొదటిసారి నా ఖ్వాయిష్ తీరేపాటికి ఇలా అయ్యింది అని బాధేసినా.. ఈ సారి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు శ్రీ గాడి బండి బదులు ఇంకో కొత్త బైక్ ఉంది.. దాని మీద వెళ్తా.. 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ...
14 comments:
ఏమి చేస్తాము మిత్రమా...జీవితంలో రాజీ పడాలి కదా...ఐనా నాకో డౌట్...మీరు నిజం చెప్పలేదేమోనని!! :)
బండిని మాత్రమే మార్చండి...
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
100:1 దారుణం కదా
ఆ ఒక్కరు కూడా తెలుగా ! ఇది మహా దారుణం
హిల్లరీ duff లా వుంటుందా ఆ అమ్మాయి ?
తర్వాత ఏం జరిగింది ?
విధాత తలపు అలా ఉంది మరి?
nice one...monna memu srisailam nunchi return vastu aa movie songs ne vinnam...chala baguntayi andulo songs anni..
@విశ్వా - హ హ. జీవితం లో కొన్ని దాచుకోవాలి కొన్ని పంచుకోవాలి.. ఇది యే సినిమా లో డైలాగ్ చెప్పుకో చూద్దాం!! ఐనా (ఆల్ మోస్ట్) అన్ని నిజాలే చెప్పాను.
@పద్మార్పిత గారు - ఇంక అంత కంటే ఏం చేయలేను కదండి. ప్చ్...
@సునిత గారు - మరే.. నా తలపే ..
@ సిరీషా - me knows me knows ఎన్నేళ్ళైన ఆ పాటలు మాత్రం అద్భుతం.
@ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామా హరే హరే
ఆడ జరిగింది ఏమి లేదు లే బ్రదర్. మనకి మాట్లాడలంటే చచ్చేంత బిడియం భయం..
hare hare
http://jyothivalaboju.blogspot.com
nee comment em raasthavo choodalani vundi
జీవితము లో అన్నిటికి రాజీ పడాలా.
please watch my new posting
మా నాన్న ఓ రోజు "ఒరేయ్ నీకు కంప్యూటర్ కావాలా? బైకు కావాలా?" అని అడిగారు.. ఈ మాట కోసం ఒక రెండేళ్ళ నుండి కాచుకున్నా కద.. వెంట్టనే బైక్ అని చెప్పా. నాన్న అంత చట్టుకున్న చెప్పినందుకు ఆశ్చర్య పడి కొంచం నిరాశ పడి వీడి జన్మలో మారడు అని బాధపడి కొనిచ్చారు
హ హ సీన్ కళ్ళ ముందు కనబడింది
hahahaa baagunnai nee cinemaa kastaalu
@ నేస్తం - థ్యంక్స్!! ఇది నిజంగ నిజం. ఈ సీను కి ఓ పది మంది సాక్షులు కూడా ఉన్నారు.
@ అక్కా - నీకు అలానే అనిపిస్తది.
తమ్మీ,
ఏదో గుతొచ్చింది -
మావాడొకడు, నీలాగనే కాలేజి ఎగ్గొట్టి రంగ మహల్లో (గుంటూర్లో రంగమహల్లో ఎట్టాంటి సినిమలేత్తారో జెప్పాల్సిన పనిలేదనుకుంటా) ఓ సినిమకెల్లాడు. ఇంటర్వెల్లులో, బయటకొచ్చి, నోట్టో ఛోటా (చిన్న గోల్డ్ ఫ్లేక్) పెట్టుకుని, ముందున్నాయంతో (ఆయన దమ్ముకొడుతున్నాళ్ళే) మాస్టారూ అగ్గిపెట్టె ఇస్తారా అని అడిగాడు. ఆయన ఎనక్కి తిరిగటం, మనోడి కళ్ళు ఆయన కళ్ళు కలవటం, మనోడు మూర్ఛ వచ్చి కిందపడిపోవటం ఠకా ఠక్ జరిగిపొయినై. ఆయన ఎవరోకాదు మనోడి పాద్రి.
నీకెలా తెల్సు అని అడగమాక, మనం అక్కడలేములే, ఇంకొంచెం ముందు సోడా బండికాడ...
hare hare
busy naa..ippude nee treasurer comment choosa:)
Post a Comment