Thursday, May 14, 2009

జన గణ మన రణ...

అంటే తప్పేంటి? గత కొద్ది రోజుల్లో మీరు ఈ మాట / పాట వినే ఉంటారు. ఈ ప్రశ్న నేనడిగింది కాదు.. రాం గోపాల్ వర్మ కొత్త చిత్రంది. మన జాతీయ గీతాన్ని కొంచం మార్చి ఒక ప్రశ్న గా మార్చాడు. అందులో నాకేమి తప్పు అనిపించడం లేదు. రాజకీయనేతల్ని ఎలాగు మనం ప్రశ్నించము.. లంచం అడిగే ట్రాఫిక్ కానిస్టేబల్ ని ప్రశ్నించము .. నగర పాలక సంస్థ లో ఏదైన పనికి లంచం అడిగినప్పుడు ప్రశ్నించము.. వోట్లడ్డుక్కొని ఎన్నికబడ్డ "నాయాకులు" ఏ ఒక్క ఎన్నికల వాగ్ధానాలని పూరించనప్పుడు ప్రశ్నించము.. ఒక్కడైన ధైర్యం చేసి అడిగాడే అనము.. మన జాతి ఇల ఎందుకు అయ్యింది అని ప్రశ్నించిన వాడ్ని మాత్రం అర్రెర్రె అది మన జాతీయ గీతాన్ని కించపరుస్తున్నాడు అని అంటాం.

అసలు మనలో ఇంత నిరాశ నిస్ప్రుహ ఎల జీర్నించుకుపోయిందో నాకు తెలేదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఐతే ఇలా ఉండిఉండదు.. మన దేశాన్ని పునరుద్దరించుకోవాలి అన్న తాపత్రయం తో అప్పటి స్వాతంత్ర సమరయోధులు ఆశావాదులై ఉండిఉంటారు. లేకుంటె మనకి "ఉందిలే మంచి కాలం ముందు ముందు నా.." అన్న పాట ఉండేది కాదేమో. కాని తర్వత ఏమైందో తెలేదు.. ఇలా ఆ నాకేమి కాలేదు కద అలాంటప్పుడు నాకెందుకు అని అయిపోయాం. మొత్తం భారతావని లో ఏదైన భావం ఏక కంఠం తో వినిపిస్తుంది అంటే అది - మన దేశం ఇంతే. దీన్ని ఎవ్వడు బాగుచేయలేడు అన్నదే కద. అరవై యేళ్ళ తర్వత కూడా ఇంత దరిద్రం, ఇంత చండాలం మొత్తం దేశం యే ఒక్క ఇంచు కూడా వదలకుండా మనలో మనతోనే అది పెరుగుతోంది. మేరా భారత్ మహాన్ అని కపటపు గర్వాన్ని నెత్తినేసుకొని ఓ ఊరేగుతాం.. దేశాలేగుతాం. కాని అంథ మహాన్ అనేంత ఏముంది మన కాడ? పదివేల సంవత్సారల చరిత్ర? ప్రపంచ జ్ఞాన నిధి వేదాలా? కౌటిల్యుని అర్థశాస్త్రమా? ఇవ్వన్ని ఉన్నాయి.. కాని ఇవ్వన్ని ఎప్పటివో. కాదనడం లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు ఈ మన నవ సమాజం లో ఏముంది మన దేశాన్ని చూసి గర్వ పడేదానికీ? ఎలుగెత్తి మేరా భారత్ మహాన్ అని చాటేదానికి? అలాంటప్పుడు ఓ "థా" తగిలిస్తే సరిపోద్ది కద.. అప్పుడు మేరా భారత్ మహాన్ థా అయిపోతుంది. లెక్క సరిపోతుంది.

మామూలుగా మన దినచర్య లో ఎదైన సమస్య వస్తే అసలు ఇది ఎందుకు అయ్యిందో అని అనుకుంటాం. మరోసారి అల జరగకుండా చూసుకుంటాం.. కాని అరవైయేళ్ళు వీళ్ళు కకపోతే వాళ్ళు ఎవరైన దొబ్బెవాళ్ళే తప్ప మంచి చేసే వాళ్ళని ఎందుకు ఎన్నుకోము? అసలు ఎన్నుకున్న వాళ్ళాని ఎందుకు ప్రశ్నించము? ఎందుకు నిలదీయము? ఇప్పుడంటే గూండాలు, డాకూలు, కనిష్టం ఒక 2-3 కేసులైన ఉన్నవాళ్ళాకే పార్టీ టికెట్లు ఇస్తున్నారు అనుకో.. కాని ఓ 30 యేళ్ళ క్రితం వరకు ఇల లేదు కద. అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు నిలదీయలేదు? అంటే స్వాతంత్రం వచ్చేసింది మన పని అయిపోయింది అని ఆ తరం వాళ్ళు అనుకున్నారా? ఇది మన తరానిదా ఇంతక ముందు తరానిదా అని తప్పులు నెట్టుకోవడం వలన ప్రయోజనం ఎమైన ఉందా? తప్పెవరిదైన శిక్ష యావత్మందీ అనుభవిస్తున్నాము. మన రాబోయే తరలవారు అనుభవిస్తారు. అంత మాత్రాన ఈ దేశాం మొత్తం ఎదో బాగుచేసేస్తా అని నేనేమి అనడం లేదు. అసలు ఎందుకు ఇలా అయ్యిందో ప్రశ్నించడం మానద్దు అంటున్నా. ఎక్కడ తేడ జరిగింది అన్నది నా ప్రశ్న.

అఖండ భారతావనిని రెండుగా చీల్చుకున్నాం. తర్వతా భాష మీద విడగొట్టుకున్నాం. ఇప్పుడు యాసల మీద. తర్వత? వాడ ల మీదా? మనం భారతీయులం అని మర్చిపోయి చాలా యేళ్ళైంది. ఒక్క రణం వళ్ళనో లేకుంటే క్రికెట్ వళ్ళనో తప్ప భారతీయులం అనిపించుకోం. మనలో ఎన్ని విభజనలు ఉన్నయో ఆ చిత్రగుప్తునికి కూడా తెలీదు. మనం మారమా? ఇంక ఇంతేనా ? ప్రేమికుల రోజు గురించి పట్టించుకుంటాం. పార్కులో ప్రేమికుల గురించి పట్టీంచుకుంటాం. ఎవరిని ఎన్నుకున్నామో వాళ్ళేమి చేస్తున్నారో అది మాత్రం పట్టించుకోం. శాస్త్రి గారు అన్నట్టూ:

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో బీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమె మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ

10 comments:

Varunudu May 14, 2009 7:43 PM  

పత్రం పుష్పం ఫలం తోయం..

అని గీతాకారుడు ఎప్పుడో చెప్పాడు. CD బాబూ... ఇంతేనా మనం ఇంతేనా అని అనుకొనే బదులు ..

నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను..అనుకోవచ్చు గా..

చాలా మారాయ్.. కాబట్టి.. అన్నీ వదిలేద్దాం అనుకొంటే ఎలా? మార్పు అనేది చిన్నగా మొదలవాలి. ఊళ్ళను తారు మారు చేసే హరికేన్ కూడా చిన్న వర్షం తోనే మొదలౌతుంది.

కాబట్టి నైరాశ్యపు నిశీధి నుండి... నిర్మాణాత్మక తేజం వైపు మరల్చగలిగిన యే చిన్న పనైనా చాలు.. సమాజం లో మార్పు మొదలవడానికి...! ఆ దిశలో ఆలోచించు.

చీకటిని తిడుతూ కూచునే కంటే, చిరు దీపం వెలిగించడం అర్థవంతమైన విషయం !

జీడిపప్పు May 14, 2009 8:03 PM  

Wonderful post శశాంక్ అన్నా. నేను రాం గోపాల్ వర్మ బ్లాగులో ఈ పాట గురించి చూసాను. నాకయితే నూటికి నూరు శాతం కరెక్టనిపించింది. కానీ మనవాళ్ళ సంగతి తెలిసిందే కదా, కేసుపెట్టి ఆ పాట తీయించేసారు.

వరుణుడు గారు, మీరు చెప్పేది సరిగా అర్థం కాలేదు. మీరు చిరుదివ్వె వెలిగించి చేపట్టిన చిన్న పని గురించి కాస్త వివరించగలరా? :)

Varunudu May 14, 2009 8:32 PM  

అర్థం కాక పోవడం అంటే అదే మరి.. !

అది బాలేదు, ఇది బాలేదు అని తిట్టేవాళ్ళకు, అది బాగు చెయ్యడానికి తమ పాత్ర ఎంత ఉందో చెప్పే ప్రయత్నం చేసా కానీ, నేను కంప్లైంట్లు ఇవ్వలేదు ! నా మట్టుకు నాకు అనిపించేది.. ఒక పనిని తిడుతూ కూచోడం కంటే ఆ పనిని బాగు పరచే చిన్న చర్య తీసుకోవడం మేలు అని. ఎవరో అన్నీ చెయ్యాలి. నేను మాత్రం తిడతా అనే సిధ్ధాంతానికి వ్యతిరేకిని నేను.. !

నేను ఏం చేస్తాను అన్నావ్ కాబట్టి చెపుతా..ఎదైనా బావోలేదు అని సాధ్యమైనంత వరకూ అనను. ఒక వేళ అనే పరిస్థితే

Shashank May 14, 2009 8:49 PM  

వరుణుడు - నేను చీకటిలో దీపం, కంప్లైంట్ల గురించి మాట్లాడ్డం లేదు. మనం ఎందుకు ఇల తగలెడ్డాం అని సూటిగా సుత్తిలేకుండా అడిగేవాళ్ళని నిరోధిస్తున్నాము, నిషేదిస్తున్నాము. అది తప్పు అని చెబుతున్నా. మనని మనం ప్రశ్నించుకోకుండా ఉండడం వళ్ళనే ఇలా ఉన్నాము అని అంటున్నా. ఆ ప్రయత్నం ఈ రణ్ అయినా సింధూరం అయినా అంటున్నా. I am not talking about what we should do to eradicate the poverty of thought or poverty of action, I am merely stating the fact that we are not letting people question the steps we have taken as a nation. పాకిస్తాన్ ఒక దేశం గా విఫలమైతే మనం ఒక జాతిగా విఫలమయ్యాము అనిపిస్తుంది నాకు. ఎందుకు? అన్నది నా ప్రశ్న. ఏం చేస్తే ఇప్పుడు విజయం సాధిస్తాం అని కాదు. అది మరో టప కి ఒదిలేస్తా. అందులోను మీ బ్లాగు కి వదిలేస్తా.


btw మీ వ్యాఖ్య సగమే పడింది. మిగితాది పోస్టు చేయండి. :flower:

Varunudu May 14, 2009 9:19 PM  

సరే సూటిగా సుత్తి లేకుండా నా ప్రశ్న ఇదిగో....

జాతీయ గీతాన్ని పబ్లిసిటీ కోసం వాడుకొన్నా అని సాక్షాత్తూ వర్మే ఒప్పుకొన్నాడు..

ఎవడు బడితే వాడు... ఎక్కడ బడితే అక్కడ.. జాతీయ గీతాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం తప్పు కాదా?(ఎంత గొప్ప కారణం వల్ల అయినా కానీ..!)

Shashank May 14, 2009 9:50 PM  

వర్మ ఎదో అన్నడని నాకెందుకు? అసలు జాతీయ గీతాన్నే ప్రశ్నిచాలి అన్నది నా సమాధానం. మన రాజ్యాంగాన్ని కూడా ప్రశ్నించాలి. ప్రశ్నలు లేకుండా జీవిస్తే మనకి గొడ్డుకి తేడా ఏటుంటంది? అసలు మీరు ఆ రివైస్డ్ వర్షన్ చదివారా? అందులో అభ్యంతరంగా నాకేమి అనిపించలేదు. నేటి సమాజాన్ని వర్ణిస్తున్నట్టే ఉంది. కాదంటారా?

Shashank May 14, 2009 9:55 PM  

నోటితో జాతీయ గీతాన్ని పాడుతూ వెనక అదే జాతికి గోతులు తొవ్వుతూ ఉన్నరే అది తప్పుకాదు. నిజాన్ని చెప్పడం తప్పు అంటారా? నా దృష్టిలో మొదతిది క్షమించరాని నేరం. రెండవది అభినందించాల్సిన పని. మన దేశం లో ఏది మాట్లాడిన కులం రంగుతో పులుముతారు... అలాంటిది నిర్భయంగా మొత్తం దేశాన్ని ప్రశ్నిస్తున్న ఆ పాట నాకేమి దేశాన్ని కించపరుస్తున్నట్టుగా వెక్కిరిస్తున్నట్టుగా అగుపించడం లేదు. on the contrary, i think it elevates us as a nation.

జీడిపప్పు May 14, 2009 10:02 PM  

వరుణుడు గారు, పనిగట్టుకొని మరీ వెతికి లోపాలు చూపడం తప్పేమో కానీ, కనీసం ఎదురుపడినపుడయినా బాగలేనిదాన్ని "బాగలేదు" అని చెప్పాలి. CD అన్నట్టు ఆ పాటలో ఎటువంటి తప్పు కనిపించలేదు నాకు.

Karthika May 15, 2009 1:49 AM  

Enti babu template marchaaav?blue ne fav color aaa?

Post chadive time ledu sooo uri ninchi vachakaa chaduthaa.Saremarii enjooy byee tc.

Shashank May 20, 2009 7:32 AM  

template aa.. adi patadi poyindi. ante edo chestunte adi poyindi. monnane malla vetika. marchedaaniki baddakam.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP