Wednesday, May 27, 2009

ఇది చాలా హాట్ గురు

ఈ మధ్యలో రోజు కి ఓ పది గంటలు ఇదే వింటున్నా. రేడియో మిర్చి 98.3 FM. అసలు మన దేశం లో ఈ FM revolution వళ్ళ వెలువడిన ఓ మహత్తరమైన స్టేషన్ ఇది, నా దృష్టిలో. ప్రొదున్నే అంటే అదే అమేరికా లో సాయంత్రం టైం లో ఎంచక్క భక్తి గీతాల్తో అనామికా ఉరఫ్ బేబీ శుభోదయం పలుకుతుంది. ఓ రెండు గంటలు అల భక్తి గీతాల తర్వత లొల్లి షురు.

హలో హైదరాబాద్ అంటూ తిక్క మగాడు ఉరఫ్ హేమంత్ మొదలెడతాడు. అదో నాలుగు గంటల కాలక్షేపం. నేను ఎప్పుడు రోజంతా అంటే మన దేశం లో రోజంత వినలేదు. ఎందుకంటే హేమంత్ ప్రోగ్రాం సగం అయ్యేపాటికి నేను నిద్రావస్త లో ఉంటా. తర్వత మళ్ళ అనామిక లేడీస్ కార్నర్ మొదలెడుతుంది. తర్వత బంపర్ టు బంపర్ లో భారతి పాప వస్తుంది. ఓ నాలుగు గంటలు బుర్ర తిన్నాకా భార్గవి వంతు. ఈ టాలివుడ్ భామ బోలెడు విషయాలు చెప్ప్తుంది ఓ రెండు గంటలు. తర్వత డక్టర్ లవ్ ఉరఫ్ సౌమ్య ఇంకో రెండు గంటలు.

ఇలా నాన్-స్టాప్ గోల తో రోజంతా హాయిగ గడిపేయచ్చు. నాకు పని చేస్తున్నప్పుడు పాటలు వినడం అలవాటు. అల వెత్తుకొని వెత్తుకొని వినెబదులు ఈ రేడియో వింటే ఉత్తమం కద.. అందునా సరదా అయిన యాడ్స్ వస్తాయి.. బేబీ - మమ్మీ అనుకుంటు. (ఆ గొంతులు భార్గవి - అనామిక వి).

ప్రవాశాంధ్రులకి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి సొంత ఊరు గుర్తుచేసే ప్రయత్నం అని రాజ్ అంటాడు. కాని ఇది వింటే i miss hyderabad even more. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదే గనక మన కార్ రేడియో లో వస్తె ఎంత బాగున్ను అని. కాని ఏం చేస్తం.. అన్ని రోజులు మనవి కావు కద. అందాకా హాయిగ వినండి. రాడియో మిర్చి.. ఇది చాల హాట్ గురు..

Read more...

Tuesday, May 19, 2009

మిషన్: షాపింగ్

అసలు భూ ప్రపంచం లో అతి బోర్ కొట్టే పనుల్లో ఈ షాపింగ్ ఒకటి. అన్-లైన్ కాదు నడుచుకొని వెళ్ళి కొంటామే అది. నా లిస్ట్ లో బట్టలు మడతపెట్టడం తర్వత వస్తుంది ఇది. అంత బోర్ నాకు షాపింగ్ అంటే. ఒక్క పుస్తకాలు కొనేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇది ఇష్టం ఉండదు నాకు. పుస్తకాలు అంటే అబ్బో అదో సరద నాకు. చిన్నప్పుడు కోఠీ లో, ఆబిడ్స్ లో ప్రతి ఆదివారం పెట్టే పుస్తకాల కొలువు కి వెళ్ళేవాడ్ని. ఓ 3-4 గంటలు తీరిగ్గా వెతికి బేరమాడి నాకు నచ్చేవి నచ్చుతాయి అనుకున్నవి తెచుకునెవాడ్ని. ఇది ప్రతి వారం కాదు.. నాన్న ఇచ్చిన జేబు డబ్బు లో నా "దినసరి" ఖర్చులు పోను మిగిలినవి దాచుకొని రెండొందలో మూడొందలో అయ్యాక వెళ్ళేవాడ్ని. ఇప్పటికి గుర్తొస్తే ఆ రోజులు కొంచం బాధగ కొంచం ఆనందంగా ఉంటది.

కాని నేను మాట్లాడుతున్న షాపింగ్ పుస్తకాలు కాదు.. రోజు వారి చేసేది. మొన్నామధ్య దివ్య వాళ్ళ స్నేహితుడు ఒకడు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండచ్చు కద... పనికిమాలిన రాళ్ళ నుమాయిష్ (అదే జెం షో) ఉందని చెప్పడు. అప్పటికి చెప్పా నువ్వు వాడు వెళ్ళిరండి నన్ను ఒగ్గేయండి అని. ఊ హూ.. నా మాటే వింటే తను దివ్య ఎందుకు అవుద్ది? రారా అని లకలకలక అని నిను వీడని నీడను నేనే... అంటే మరి మరి చివరి పాట కాదు కాని మిగితావి పాడతా అని బెదిరించి లాక్కెళ్ళింది నన్ను. నాకు ముందే బద్దకం. అసలు ఆదివారం (ఎన్.ఎఫ్.ఎల్ అప్పుడు) సోఫా నుండి కదలకుండా అలనే శిలా విగ్రహం లా పడుకొని దినమంతా టీ.వి చూస్తా. అలాంటిది వారాంతం అని కూడా చూడకుండ నన్ను ఆ దిక్కుమాలిన జెం షో కి తీస్కెళ్తె ఎల ఉంటది? ఏం చేస్తాం.. కష్టాలు మనుషులకి కాకుండా మంచు బ్రదర్స్ కి వస్తాయా అని వెళ్ళా. తీరా చూస్తే అదేదో సుల్తాన్ బజార్ టు పవర్ సుల్తాన్ బజార్ లా ఉంది. అందరు తెలుగే మాట్లాడుతున్నారు. ఇదేమైన విజేంద్ర వర్మ లా బాలాయ్య కొత్త చిత్రం షూటింగా అని ఒక్క సారి అనుమానం వచ్చింది. తర్వత తట్టింది ఇలా రాళ్ళు రప్పలు రత్నాలు అంటే మనవాళ్ళాకే అమితమైన ఇష్టం కదా అని. అలా మొదలైంది నా దినం.. అదే నాకు ఆ దినం.

సీన్ కట్ చేస్తే ఓ రెండు గంటల తర్వత కూడా వీళ్ళు ఏ ఒక్క "రాయి" కొనలేదు. నేనేమో అప్పటికే కన్య కుమరి నుండి కాష్మీరం వరకు మోకాలి మీద పాకినట్టు నీరశించి పోయా. పోనీ టైం పాస్ కి ఎవరైన అమ్మయిలని చూద్దం అనుకుంటే దివ్య ఫీల్ ఔతుందేమో అని ఆగిపోయా. ఇంక ఇలా అయితే రోజంతా అక్కడే ఉండి నిమిష నిమిషానికి ఓ ఇంచి చొప్పున భూస్థాపితం అయిపోతా అని అనుమానం వచ్చి ఇంక మొదలెట్ట.. ఆకలి, త్వరగా కానివ్వండి అని. అప్పటికి నా పరిస్థితి అగమ్యగోచరమే! గోమేధుకం బఠాని లాగ ముత్యాలు సబ్బు బియ్యం లా కనిపించాడం మొదలయ్యాయి.. అదే విషయం చెపా దివ్య కి. ఇంక నా వళ్ళ కాదే ఇంక పి.టీ.ఉష లా పరిగెట్టేళ్ళి తినకపోతే సోషొచ్చిపడిపోతా అని. పాపాం నిజంగానే అల అయిపోతా అని ఇంకో గంట లో మొత్తం షాపింగ్ అవ్వగొట్టింది.

అదే విషయం ఆలోచిస్తుంటే నాకు ఒక్కటి అనిపించింది. అసలు దివ్య కి ఇంత ఓపిక ఎక్కడిది అని. మామూలుగా అయితే ఎక్కడైన మాల్ గట్రా వెళ్తే ఓ గంట-గంటన్నర తిరిగేసరికి ఇద్దరికి ఓపిక నశిస్తుంది. అసలు అమేరికా లో పరమవిపరీతల్టిమేట్ షాపింగ్ బొనాంజా అయిన థాంక్స్-గివింగ్ షాపింగే రెండు గంటలకంటే ఎక్కువ తిరగము. నాకు బోర్ లెవెల్ తారాస్థాయి కి చేరిపోద్ది అప్పటికి. పద ఇంటికి పోదాం సినిమా కి పోదాం కార్ వరకు పోదాం అని మొదలెడుతా. తనకి అంతే. ఎక్కువ సేపు చేయదు షాపింగ్. కాని మొన్న అలా అవలీలగ నాలుగు గంటలు తను ఏక ధాటిగా షాపింగ్ చేసేసరికి భయం వేసింది. ఇది అలవాటు అయిపోతే నా గతేంటి అని? నేను షాపింగ్ అంటే ముందే ఎల వెళ్ళాలో ఏమి ఏమి కొనాలో అవి ఎక్కడ ఉంటాయో ముందే ఆలోచిచేసుకుంటా. అంతెందుకు సపోజ్ పర్ సపోజ్ హొల్ ఫుడ్స్ కి, లైబ్రరి కి సేఫ్ వే కి వేళ్ళాలంటే ముందుగా కార్ ఎక్కేలోపే ఏ దారి లో వెళ్తే త్వరగ పనులు అయిపోతాయో అని ఓ నాలుగు ఐదు దారులు ఆలోచించేసి "షార్టెస్ట్ పాథ్" ఎన్నుకొని హొల్ ఫుడ్స్ లో సేఫ్ వే లో ఏది ఎక్కడ ఉంటదో బాగా తెలుసు కాబట్టి అందులో కూడా ఏ దారి లో వెళ్తే త్వరగా బిల్ చేయించూవాచ్చో అని ఆలోచించి అలనే చేస్తా.

మామూలుగా నాకు తెలిసి.. అంటే నాకు తెలిసిన బాయ్స్ అందరు ఇలనే చేస్తారు అనుకుంటా. బ్రహ్మచారి గా ఉన్నప్పుడు షాపింగ్ కి ముగ్గురం వెళ్తే కొనాల్సిన వస్తువుల పట్టి ని ముగ్గురం పంచేసుకొని టక టక కొనేసి వచ్చేవాళ్ళాం కార్ దగ్గరికి. బిల్ దగ్గర క్యూ పెద్దగా ఉంటే ఒకడిని అక్కడ ముందు ఆగమని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళి అన్ని కొనేసి తెచ్చేవాళ్ళాం. ఇలా కాకుండా యే షాప్ కి వెళ్ళినా ప్రతి వస్తువుని చూసి పరిశీలించి వీలైతే ఆ వస్తువు ఎల ఉందో మిగితా వాళ్ళూ ఏమన్నరో అని తెలుసుకొని అప్పుడు కొనలా వద్దా అని ఆలోచించి ఓ నాలుగైదు ఫోన్లు చేసి కొనచ్చని తర్వత తర్వత తెలిసింది. ఇల దివ్య చేయదు. ముందే చెప్తున్నా మళ్ళా మొదలెట్టకండి. పాపాం తనకి షాపింగ్ అంటే బోరే. నా పూర్వ జనం సుకృతం అని డిసైడ్ అయ్యా. కాని కొంత మంది నా స్నేహితులని చూసి ఈ అనుమానం వచ్చింది. జీవితం లో నాకు తెలియని అతి తక్కువ విష్యాల్లో ఇదొకటి. అందుకే అడిగి తెలుసుకుందాం అని అడుగుతున్నా. అబ్బయిలు అందరు నాలాగే ఒక మిలిటరి మిషన్ లా షాపింగ్ చేస్తారా? మనలో కూడా షాపింగ్ ని "అనందించే" వాళ్ళు ఉన్నారా? ఆడలేడీస్ కి (ప్రత్యేకించి గంటలు గంటలు తిరిగి షాపింగ్ చేసే వాళ్ళాకి) నా ప్రశ్న - మీ దృష్టి లో షాపింగ్ అంటే ఏంటి : అవసరమా - ఆనందమా - ఏం తోచకుండా కాలం వెళ్ళబుచ్చడమా?

Read more...

Sunday, May 17, 2009

ఒక్క రోజు తర్వాత..

నిన్న (అమేరికా టైం ప్రకారం) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లా అనిపించింది. రాష్ట్రం లో తెలుగుదేశమో, చిరంజీవో (అత్యాశ కాని లోక్ సత్తానో) వస్తుందేమో అని భావించా. మన ఆంధ్ర ప్రజలు నువ్వేమనుకుంటే నాకేంట్రా అని తిరిగి రాజశేఖర్ రెడ్డినే ఎన్నుకున్నారు. అలనే దేశం లో కాంగ్రెస్ రాదేమో బహుశా భా.జ.పా. వస్తుందేమో .. ఎదో చమత్కారం అయి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిపోతాడేమో అని అనుకున్న. ఆశ పడ్డ. కాని ఏం చేస్తాం.. మళ్ళ మన్మోహనుడినే ఎన్నుకున్నారు.

మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు. ఎందుకో రాష్ట్రం లో చెం.బా రాలేదు అని ఎక్కడో ఒక మూల కొంచం రిలీఫ్ గా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. నేను జన్మతహా కాంగ్రెస్ వ్యతిరేకుడ్ని. ఒక్క శ్రీ పీ.వీ.నరసింహా రావు గారు తప్ప ఎవ్వరు నచ్చరు నాకు. అలాంటిది రాష్ట్రం లో వై.యెస్.ఆర్ కేంద్రం లో మన్మోహన్ రావడం అంత చెడేమి కాదని అనిపిస్తోంది. ఎందుకో తెలీడం లేదు.

కొంచం ఆలోచించగా రాష్ట్రం లో కాంగ్రెస్ రావడం కంటే ఎక్కువగా తె.రా.స ని చిత్తు చిత్తు గా కొట్టడం ఆనందంగా అనిపిస్తోంది. తెలంగాణా ప్రజలని స్వార్థం కోసం ఇన్ని యేళ్ళగా వాడుకొని విసిరేసిన కే.సీ.ఆర్ ని ఈ సారి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలు. తెలంగాణా లో కాంగ్రెస్ కి మహాకూటమి కి సరిసమానంగా 54 సీట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి తెలంగాణా కి ఎదైన మేలు చేసేది వై.యెస్.ఆర్ ప్రభుత్వమే తప్ప కే.సీ.ఆర్ కాదని భావించినట్టు ఉన్నారు. మళ్ళా ఇక్కడ తెలంగాణా సాయుధ పోరటం తెలంగాణా ప్రజలు వేరు భాష వేరు గట్ర గట్ర అని ఎవరైన అనకముందే ఒక్క మాట చెప్పాలి. మా కుటుంబం కూడా ఆ నాడు జరిగిన పోరాటం లో పాల్గొన్నదే. త్యాగాలు చేసినదే. ఓ రెండొందల యేళ్ళ నుండి మా నాన్నమ్మా వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళే. అయినా నాకు విశాలాంధ్రే ఇష్టం. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసుకోడం ఇష్టం లేదు. నా స్వభిప్రాయం. ఈ సారి తగిలిన దెబ్బ వళ్ళన ఇంక తె.రా.స సంగతి అయినట్టే అనిపిస్తోంది. మళ్ళ ఇంకో "నాయకుడు" వచ్చి స్వార్థానికి ఆశలు రేపి నట్టేట్లో ముంచేదాకా తెలంగాణా ప్రజలకి కొంచం విరామం.

ఇంక కేంద్రం లో.. నాకు ఈ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని బ్లాక్ మేల్ చేయడం అస్సలు నచ్చదు. గత పది యేళ్ళ గా ఇలాంటి స్వార్థలు వళ్ళనా దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన వలని వచ్చింది. ఒక ఎన్నికల భారాన్ని కూడా అధికంగా మోసింది. మాటి మాటికి ఆ కమ్యునిస్ట్ల చెత్త ని సేవించాల్సి వచ్చింది. హమ్మయ్య.. దెబ్బకి దరిద్రం ఒదిలింది. 60 నుండి 24 కి పడ్డ వాళ్ళ సీట్లని చూస్తే అబ్బో సంబరం పట్టలేకపోయా. నాకు బేసిక్ కా కమ్యునిస్ట్లన్నా ఫెమినిస్ట్లన్న పడరు. 60 సీట్లతో దేశాన్ని ఓ ఐదేళ్ళూ చీడపురుగుల్లా వేధించిన దానికి తగిన శాస్తే జరిగింది. ఇంక దేశాం నుండి శాస్వతంగా ఈ చెండాలం వెళ్ళిపోతే ఆ రోజు మనకి పెద్ద పండగే. పలిసీలకి చైనా ని సమర్థించే ఈ బూటకపు నాయకులని జైల్లో వేయాలి. ఆ అవసరం లేకుండా దేశ ప్రజలు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. అలనే మిగితా లోకల్ రాష్ట్ర నాయకులని కూడా ఎక్కువగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ భా.జ.ప కలిపి 320-330 సీట్లు వచ్చాయి ఈ సారి. ఇద్దరి ఎకనామిక్ పాలిసీలు ఇంచు మించు ఒకటే అవడం వలన తొంభై శాతం దేశ భవిషత్తుకి మంచిదయ్యే పాలిసీలు సులువుగా నెగ్గుతాయి అనిపిస్తోంది. చూద్దాం. మధ్యలో ఎక్కడ ములాయాం ప్రధాని అయిపోతాడో అని టెన్షన్. హమ్మయ్యా అనిపించింది లెక్కలు చూసాక.

చివరిది ఎందుకో నాకు అద్వాని కంటే మన్మోహనే మంచి ప్రధానిలా అనిపిస్తాడు. అంటే అద్వాని ఎప్పుడు ప్రధాని కాలేదు అనకండి. ప్రధాని అయ్యింటే కూడా మన్మోహన్ అంత అయ్యిండేవాడు కాదు అని నా అభిప్రాయం. ఇవ్వన్నీ చూతే మన ప్రజలు బాగా ఆలోచించే వోటు వేసారనిపిస్తోంది. I seriously hope that is the case, and that we have turned a corner. చూద్దాం. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది.. రాష్ట్రం లో పోయిన సారి చేపట్టినన్ని అభివృధి కార్యక్రమాలు మాత్రం జరగవు.. కేంద్రం లో పోయినసారి కంటే ఎక్కువ అభివృధి జరుగుతుంది అని. చూద్దాం.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP