Sunday, May 17, 2009

ఒక్క రోజు తర్వాత..

నిన్న (అమేరికా టైం ప్రకారం) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లా అనిపించింది. రాష్ట్రం లో తెలుగుదేశమో, చిరంజీవో (అత్యాశ కాని లోక్ సత్తానో) వస్తుందేమో అని భావించా. మన ఆంధ్ర ప్రజలు నువ్వేమనుకుంటే నాకేంట్రా అని తిరిగి రాజశేఖర్ రెడ్డినే ఎన్నుకున్నారు. అలనే దేశం లో కాంగ్రెస్ రాదేమో బహుశా భా.జ.పా. వస్తుందేమో .. ఎదో చమత్కారం అయి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిపోతాడేమో అని అనుకున్న. ఆశ పడ్డ. కాని ఏం చేస్తాం.. మళ్ళ మన్మోహనుడినే ఎన్నుకున్నారు.

మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు. ఎందుకో రాష్ట్రం లో చెం.బా రాలేదు అని ఎక్కడో ఒక మూల కొంచం రిలీఫ్ గా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. నేను జన్మతహా కాంగ్రెస్ వ్యతిరేకుడ్ని. ఒక్క శ్రీ పీ.వీ.నరసింహా రావు గారు తప్ప ఎవ్వరు నచ్చరు నాకు. అలాంటిది రాష్ట్రం లో వై.యెస్.ఆర్ కేంద్రం లో మన్మోహన్ రావడం అంత చెడేమి కాదని అనిపిస్తోంది. ఎందుకో తెలీడం లేదు.

కొంచం ఆలోచించగా రాష్ట్రం లో కాంగ్రెస్ రావడం కంటే ఎక్కువగా తె.రా.స ని చిత్తు చిత్తు గా కొట్టడం ఆనందంగా అనిపిస్తోంది. తెలంగాణా ప్రజలని స్వార్థం కోసం ఇన్ని యేళ్ళగా వాడుకొని విసిరేసిన కే.సీ.ఆర్ ని ఈ సారి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలు. తెలంగాణా లో కాంగ్రెస్ కి మహాకూటమి కి సరిసమానంగా 54 సీట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి తెలంగాణా కి ఎదైన మేలు చేసేది వై.యెస్.ఆర్ ప్రభుత్వమే తప్ప కే.సీ.ఆర్ కాదని భావించినట్టు ఉన్నారు. మళ్ళా ఇక్కడ తెలంగాణా సాయుధ పోరటం తెలంగాణా ప్రజలు వేరు భాష వేరు గట్ర గట్ర అని ఎవరైన అనకముందే ఒక్క మాట చెప్పాలి. మా కుటుంబం కూడా ఆ నాడు జరిగిన పోరాటం లో పాల్గొన్నదే. త్యాగాలు చేసినదే. ఓ రెండొందల యేళ్ళ నుండి మా నాన్నమ్మా వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళే. అయినా నాకు విశాలాంధ్రే ఇష్టం. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసుకోడం ఇష్టం లేదు. నా స్వభిప్రాయం. ఈ సారి తగిలిన దెబ్బ వళ్ళన ఇంక తె.రా.స సంగతి అయినట్టే అనిపిస్తోంది. మళ్ళ ఇంకో "నాయకుడు" వచ్చి స్వార్థానికి ఆశలు రేపి నట్టేట్లో ముంచేదాకా తెలంగాణా ప్రజలకి కొంచం విరామం.

ఇంక కేంద్రం లో.. నాకు ఈ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని బ్లాక్ మేల్ చేయడం అస్సలు నచ్చదు. గత పది యేళ్ళ గా ఇలాంటి స్వార్థలు వళ్ళనా దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన వలని వచ్చింది. ఒక ఎన్నికల భారాన్ని కూడా అధికంగా మోసింది. మాటి మాటికి ఆ కమ్యునిస్ట్ల చెత్త ని సేవించాల్సి వచ్చింది. హమ్మయ్య.. దెబ్బకి దరిద్రం ఒదిలింది. 60 నుండి 24 కి పడ్డ వాళ్ళ సీట్లని చూస్తే అబ్బో సంబరం పట్టలేకపోయా. నాకు బేసిక్ కా కమ్యునిస్ట్లన్నా ఫెమినిస్ట్లన్న పడరు. 60 సీట్లతో దేశాన్ని ఓ ఐదేళ్ళూ చీడపురుగుల్లా వేధించిన దానికి తగిన శాస్తే జరిగింది. ఇంక దేశాం నుండి శాస్వతంగా ఈ చెండాలం వెళ్ళిపోతే ఆ రోజు మనకి పెద్ద పండగే. పలిసీలకి చైనా ని సమర్థించే ఈ బూటకపు నాయకులని జైల్లో వేయాలి. ఆ అవసరం లేకుండా దేశ ప్రజలు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. అలనే మిగితా లోకల్ రాష్ట్ర నాయకులని కూడా ఎక్కువగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ భా.జ.ప కలిపి 320-330 సీట్లు వచ్చాయి ఈ సారి. ఇద్దరి ఎకనామిక్ పాలిసీలు ఇంచు మించు ఒకటే అవడం వలన తొంభై శాతం దేశ భవిషత్తుకి మంచిదయ్యే పాలిసీలు సులువుగా నెగ్గుతాయి అనిపిస్తోంది. చూద్దాం. మధ్యలో ఎక్కడ ములాయాం ప్రధాని అయిపోతాడో అని టెన్షన్. హమ్మయ్యా అనిపించింది లెక్కలు చూసాక.

చివరిది ఎందుకో నాకు అద్వాని కంటే మన్మోహనే మంచి ప్రధానిలా అనిపిస్తాడు. అంటే అద్వాని ఎప్పుడు ప్రధాని కాలేదు అనకండి. ప్రధాని అయ్యింటే కూడా మన్మోహన్ అంత అయ్యిండేవాడు కాదు అని నా అభిప్రాయం. ఇవ్వన్నీ చూతే మన ప్రజలు బాగా ఆలోచించే వోటు వేసారనిపిస్తోంది. I seriously hope that is the case, and that we have turned a corner. చూద్దాం. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది.. రాష్ట్రం లో పోయిన సారి చేపట్టినన్ని అభివృధి కార్యక్రమాలు మాత్రం జరగవు.. కేంద్రం లో పోయినసారి కంటే ఎక్కువ అభివృధి జరుగుతుంది అని. చూద్దాం.

6 comments:

జీడిపప్పు May 17, 2009 11:04 PM  

Good analysis.

దేశానికి పట్టిన కమ్యూనిస్టుల శని అంతమవడానికి ఇది ఆరంభమేమో!
చేతకానితనానికి చిహ్నమయిన చిరంజీవిని ప్రజలు తన్ని తరమడం ఈ ఎన్నికల్లో నాకు బాగా నచ్చిన అంశం.
అలాగే కేసీయార్‌కు బుద్ది చెప్పడం కూడా బాగుంది.
రాహుల్ గాంధీకి ఇంత ఫాలోయింగ్ ఉంటుంది అనుకోలేదు!!

చిలమకూరు విజయమోహన్ May 18, 2009 12:01 AM  

దేశానికి పట్టిన కమ్యూనిస్టుల శని అంతమవడానికి ఇది ఆరంభమేమో!
వీళ్ళు భూస్థాపితమైతే గానీ దేశం బాగుపడదు.
వాస్తవానికి మా తాతగారు పక్కా కమ్యూనిస్టు.పార్టీకోసం ఆస్థినే కరిగించారు.ఇప్పటి కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
రాంవిలాస్ పాశ్వాన్,లాలూ,మాయావతి,జయలలితలకు తగిన శాస్తి జరగడం చాలా ఆనందంగా ఉంది.

sreechandana May 18, 2009 12:19 AM  

nice one... naa blog mi blog roll lo ledandi shahshak gaaru... add chesukondi...

Naresh,  May 18, 2009 12:52 AM  

>> మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు.

Same feeling for me !!

Kathi Mahesh Kumar May 18, 2009 2:03 AM  

అద్వానీ మైనస్ వాజ్పాయ్ ఎందుకో ఆనలేదు ప్రజలకు. అదీగాక 2014 లో మోడీ ప్రధాని అని ఒక కర్ణకఠోరమైన కొత్తరాగం ఒకటి మధ్యలో వినిపించింది. దాని ప్రభావంకూడా ఈ ఓటమి మీద ఉందేమో!

Shashank May 18, 2009 7:49 AM  

@ బుడుగు - థాంక్స్. ఈ రోజు మార్కేట్ ఓ 1000 పెరుగుతుంది అనుకున్న.. మరీ సర్క్యుట్ బ్రేక్ చేస్తుంది అనుకోలే. :) . యూ.పీ లో రాహుల్ కి ఫాలోయింగ్ కంటే మాయావతి అతిగా పెట్టిన విగ్రహాలే కారణం.

@విజయ్ గారు - అప్పట్లో మా అమ్మ కూడా కమ్మునిస్టే అట. ఇప్పటికీ ఏడిపిస్తాం తనని. చూడూ మీ వాళ్ళూ ఎల తగలెడుతున్నారో దేశాన్ని అని. అయినా అప్పటి రోజుల్లో ఉన్న వాళ్ళాకి ఇప్పటి ఈ యేచూరి, కరాట్ గట్ర కి అసలు పొంతనే లేదు.

@శ్రీ - అయ్యో. ఇంతక ముందు ఉండేది నీ బ్లాగు. కాని మొన్న బ్యక్ గ్రౌండ్ మార్చాను. అప్పుడు పోయినట్టు ఉంది. adding right away.

@ నరేష్ గారు - చాలా మందిది అదే ఫీలింగ్ అనుకుంటా. అనుకున్నది రాకపోయిన తె.రా.స / పింకోస్ రాలేదు అన్న ఆనందం ఎక్కువగా ఉంది.

@ మహేష్ - మన దేశం లో ప్రజలకి ఎదైన కొంచం మంచి చేస్తున్న ముగ్గురు ముఖ్య మంత్రుల్లో మోడి ఒకడు. గుజరాత్ లో జరిగిన సంఘటన తర్వత ఎన్నో మంచి పనులు చేసాడు. and AFAIK he has a very clean incorrigible image. and a very good administrator. భ.జ.ప ఇంకో అదిదేళ్ళూ కృషి చేస్తే వాళ్ళకి ఉన్న "హిందుత్వా" ఇమేజ్ పోతుంది. చూడాలి నేర్చుకుంటారో లేదో అని.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP