Monday, August 10, 2009

పరీక్షలే లేకుంటే..

ప్రతి ఒక్కరి జీవితం లో అసలు మరిచిపోలేని మరపురాని రోజులు ఏంటా అని తిరిగిచూస్తే సగానికి సగం పరీక్షలు రాసిన రోజులే అయ్యింటాయేమో. పదవ తరగతి పరీక్షలు మొదలైన రోజు.. మొదలైయ్యే ముందు రోజు పొట్టలో పోటి పడ్డ పక్షులు గుర్తొస్తాయి. మాకు అంటే cbse ఉద్దరించిన వాళ్ళకి పదవ తరగతే మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. జీవితం లో మొట్ట మొదటి సారి హాల్ కి వెళ్ళి పరీక్ష రాయడం అంటే అదేదో గొప్ప అనుభూతి. అంత మందితో పోటి పడ్డం పక్కన.. అసలు నెగ్గుతామా లేదో తెలీని పరిస్థితి. రాస్తున్నప్పుడు అల్ల నన్ను ఎవరైన చూస్తున్నరేమో డిబార్ చెస్తారేమో అని పిచ్చి టెన్షన్. కాని అల ఏమి జరలఏదు. అది వేరే విషయం. తర్వాత తర్వాత అన్ని పబ్లిక్ పరీక్షలు కావడం తో ఇంజనీరింగ్ రేండో యేడు వచ్చేపాటికి పెద్దగా ఏమీ అనిపించేది కాదు. జెస్ట్ పాసా ఫేల్ ఆ అని తప్ప.

ఇంకొద్ది రోజుల్లో ఇలాంటి గొప్ప అనుభూతి ఉండకపోవచ్చేమో. మన విద్యాసాఖ మంత్రి కపిల్ సిబాల్ పావు పారితే ఇంక పదవ తరగతి కి పరీక్షలు ఉండకపోవచ్చు. అసలు పరీక్ష అంటే ఆ యేడు మనం ఎంత నేర్చుకున్నామో మన పుర్రెల్లో ఎంత పోయిందో ఎంత గాలికి వదిలేసామో సినిమాల చూసి ఎంత నేర్చుకున్నామో కొత్త స్టెప్పులు కొత్త కామెడి గట్ర గట్ర అని. సరే సరే సినిమా విషయం పక్కనపెడితే మిగితావి అన్ని పరీక్షిస్తారు. అలానే ఈ యేడు కొత్తగా కాపీ కొట్టే పద్దథులని కూడా పనిలో పని గా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు పబ్లిక్ పరీక్షల ముందు ఓ రెండు మూడు నెలల నుండి ఇంట్లో బయట నెలకొనే ఉత్కంఠత మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించింటారు. అనుభవించాలి. జీవితం అంటే ఏంటో చాలా మందికి బోధ పడే సమయం కూడా అదే అనుకుంట.

అసలుకే మోసం తేవడం లో కపిల్ సిబాల్ ఆలోచన నాకు అంతు చిక్కడం లేదు. మన పరీక్షా విధానం కొంచం తప్పే. అంటే బొరుగుల బట్టి కొట్టగలిగేవాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటారు .. కొంచం చదివి అర్థం చేసుకొని వాళ్ళా భాషలో రాసేవాళ్ళు కొంచం కష్టంగా మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఎంత పెద్ద తప్పో లోక విధితమే! పరీక్షా విధానాన్ని సవరించాల్సింది పోయీ అసలు ఆ సంస్థనే తీసేద్దాం అనడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి నిపుణులతో చర్చించాల్సి తీసుకోవాల్సిన నిర్ణయం. స్కూల్ స్కూల్ కి విడి విడిగా పరీక్ష ఒక ఉపాయం కాని అప్పుడు స్కూల్ వాళ్ళే స్వార్థం కోసం పరీక్ష విధానాన్ని వారికి అనుకూలంగ మార్చుకోరు అని నమ్మకం ఏంటి? అసలు ఇలా జరగకూడదూ అనే కద పబ్లిక్ పరీక్ష పద్దతి ని ప్రవేశపెట్టింది. బట్టికొట్టే విధానన్ని అరికట్టాలి... అంతే కాని అసలు పరీక్షలే ఎత్తేస్తే సినిమా హాల్లు నిండడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు.

ఉన్నత విద్య ని కూడా కొంచం మెరుగు పరిస్తే బాగుంటుంది. ఆంధ్ర దేశం లో మొత్తం మీద ఓ 5-6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే అమేరికా లో ఐతే దాదాపుగా ఓ 3000-5000 దాకా ఉన్నాయి. రెంటికి పోలికే లేదు. కొత్త పదవి జోష్ లో రెండు దశాబ్దాల నుండి ఎవ్వరు పట్టించుకోని ఉన్నత విద్య ని కపిల్ సిబల్ గారు ఎమైన చొరవ చూపి modernize చేస్తే అదే పది వేలు, పది లక్షలు. చూద్దాం. మనిషి ఆశా జీవి కద..

16 comments:

Bhãskar Rãmarãju August 10, 2009 2:36 PM  

ఈ మధ్య చలా కాలేజీలకి స్వయం ప్రతిపత్తి వచ్చింది. అవి డీమ్డ్ యూనివర్సిటీస్ అయ్యాయి.
అయితే నువ్వు అన్నట్టుగా మన విద్యావ్యవస్థని కూలంకుషంగా పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Varunudu August 10, 2009 2:49 PM  

ఈ పరీక్షల గురించి శ్రీ కత్తి మహేష్ గారు మొన్నీ మధ్యే ఒక వ్యాసం వ్రాశారు. వీలైతే చదువు.ఇదిగో లింకు ==> http://parnashaala.blogspot.com/2009/06/blog-post_26.html.

నీ వ్యాసం ఆ వ్యాసానికి మరో కోణం లా ఉంది. కాస్తా అటూ ఇటూ గా నేను భీ నీ ఐడియాలజీ కే ఓటు వేస్తాను. అసలు పరీక్షలే వద్దు అనడం బావోలేదు.

సందర్భం కాదు గానీ అప్పట్లో ఒక సారి "పద్య భాగం శుధ్ధ దండగ" అని జరిగిన గొడవలాంటి చర్చలో ఎలాంటి అభిప్రాయం చూసామో - ఈ పరీక్షలు తీసెయ్యాలి అనే మాటకు కూడా ఇంచు మించు అలాంటి అభిప్రాయమే ఉన్నట్టు గా నాకు అనిపించింది. కత్తి గారి వ్యాసం లో ఈ విషయం కూలంకషం గా, సోదహరణం గా, సవివరం గా వివరింప బడింది. 10 వ తరగతి ఫెయిల్ కావడం వల్ల ఎంతో మంది జీవితాలు పాడవుతున్నాయి, అలా జరక్కుండా చూడడం అనేది ఈ చర్య యొక్క నేపథ్యమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. కానీ పరీక్షలు అసలు తీసివెయ్యడం జరగదు, పరీక్షలు వుంటాయి కానీ అవి భవితను నిర్దేశించవు అని ఆయన చెప్పిన సమాధాన సారాంశం. కానీ ఎందుకో ఈ వాదనలో లోపం కనిపించింది. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి మరీను ! అసలే జనాభా ఎక్కువ. ఇక పదో తరగతి పాస్ ఐనా ఫెయిల్ ఐనా పర్లేదు, ఇంటర్మీడియేట్ కు వెళ్ళొచ్చు అనే వాదనకు మూలం, పట్టు లేని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ ఐనా పర్లేదు అనే భావన. అసలు పదో తరగతి వరకూ ఎలాంటి తోముడూ ఉండదు. ఇప్పుడు అక్కడా పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తే.. ఇక ఇంటర్మీదియేట్ లో ఒక్క సారి గా పెరిగిన పెను భారం తో సతమతమయ్యే వాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుంది. నీకు పదో తరగతి లో జరిగిన అనుభవం ఇక నుండీ 12 వరకూ జరక్క పోవచ్చు. 12 వరకూ ఒక విద్యార్థి ఎలాంటి గొడవలూ లేకుండా రాగలిగితే, అతగాడికి ఇక కష్టం నష్టం ఎలా తెలుస్తాయ్? కష్టంఊ, భావి జీవనం లో ఎప్పుడూ ఉపయోగపడదు కాబట్టి తెలుగులో చందస్సూ.. పస్స్ అవడం కష్టం కాబట్టి జీవశాస్త్రాలు, గణితాలు ఇత్యాదులన్నీ తీసేసి, పరీక్షలూ తీసేసి, ఒక్క సారిగా 12 తరగతి లో పబ్లిక్ పరీక్షలు ఎం సెట్ లూ పెట్టి బెండు తిస్తామంటే.. చెప్పేదేముంది.. జయహో భారత విద్య విధానం అనడం తప్ప?

Shashank August 10, 2009 4:17 PM  

@భాస్కర్ - అసలు అది an beast of it's own magnitude. ఇప్పుడు జరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు

@వరుణ్ - కరెష్ట్ గా చెప్పవు. అసలంటూ అలవాటు లేకపోతే ఏంసెట్ ఓ లేకుంటే వేరే ఏదైన పరీక్ష అప్పుడో ప్రెషర్ చాలా చాలా చాలా ఉంటుంది. దానికి అలవాటు కావాలంటే పదవ తరగతి నుండి పరీక్షలు ఉండాలి. అయినా పది అంటే 14-15 యేళ్ళ వయసు కద... అదేం చిన్న పిల్లలు కాదు. కష్ట నష్టాలు తెలుస్తాయి ఆ పాటికి. జనాభ తక్కువ ఉండింటే వెరే విషయం కాని మన దేశం లో అయితే పరీక్షలు లేని చదువులు కష్టమే.

జీడిపప్పు August 10, 2009 9:36 PM  

"ప్రతి ఒక్కరి జీవితం లో అసలు మరిచిపోలేని మరపురాని రోజులు ఏంటా అని తిరిగిచూస్తే సగానికి సగం పరీక్షలు రాసిన రోజులే అయ్యింటాయేమో."

so true!

The day i wrote final exam in MS will be one of the happiest days!

Anonymous,  August 11, 2009 3:16 PM  

well. not sure about cbse. I studied state syllabus and I still think that its the best. why do you think andhrites can survive anywhere and are praised for their math skills?

Anonymous,  August 11, 2009 3:19 PM  

probably I was not clear in my earlier response. I was trying to say that the education system shouldn't be reformed at least from syllabus perspective.

Shashank August 11, 2009 10:37 PM  

@ బుడుగు - కరెష్ట్. మళ్ళా జివితం లో exams గోల ఒదిలింది రా అనుకున్నా... అది తాత్కాలికమే అని తర్వత తర్వత అర్థం అయ్యింది.

@అజ్ఞాత - నేను CBSE నే. కాని మన syllabus కూడా బానే మార్చాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చాలి. (బుడుగోఇ మళ్ళా పద్య భాగం అన్నవంటే మీ ఊరొస్తా మీ ఇంటికొస్తా... బాలాయ్య సినిమాలు చూపిస్తా). primary / secondary education kante higher education mundu marchali. exams and syllabus .. the whole nine yards.

Kathi Mahesh Kumar August 11, 2009 10:56 PM  

మీరొకసారి National Curriculum Framework-2005 చదవాలి.

Shashank August 12, 2009 10:32 PM  

@ మహేష్ - పరీక్షలు తీసేయడం అనేది పొరబాటు. నేను ఎన్ని చదివినా దాని మీద నా అభిప్రాయం మారదు. అలా అని నేను మీరిచినది చదవను అని కాదు. చదువుతా.. కాని నాకంత టైం లేదు. ఏదైన వస్తువు బాగుందా లేదా అని టెస్ట్ చేసే తెలుసుకుంటారు. ఒక మందు పని చేస్తుందా లేదా అనే టెస్ట్ చేసే తెలుసుకుంటారు. బంగారం కూడా పరీక్ష చేసే కొంటారు. మన జీవితం లో ప్రతి ఒక్కటి పరీక్ష చేసే తీసుకుంటాం.. తయారు చేస్తారు. అలాంటిది చదువుకి పరీక్షలు తీసేయడం అనేది మాత్రం పరమ మూర్ఖత్వం. IMO.

Kathi Mahesh Kumar August 12, 2009 11:43 PM  

@శశాంక్: మీరు సమస్య మూలాన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు. పరీక్ష తీసివెయ్యడం జరగలేదు. కేవలం ఆ పరీక్షకు జీవితాన్ని నిర్దేశించే అధికారాన్ని తొలగించారు.

Shashank August 13, 2009 7:44 AM  

ఆ మాత్రం ప్రెషర్ లేకుంటే ఏం చదువ్తారండి? కోటి పరీక్షల్లో ఇదోటి అని ఉండిపోరా?

తెలుగోడు,  August 16, 2009 1:34 AM  

పరీక్షలో ఫెయిల్ అవడాన్ని, జీవితాన్ని నిర్దేశించడానికి లింకు పెట్టడం.. హాస్యాస్పదం. దీరూభాయ్ అంబాని ఏంచదివాడని, జీవితం లో అంత సాధించాడు. చెప్పుకుంటు పోతే, లెఖ్ఖ లేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. చదువు అనేది, విజ్ఞానాన్ని అందించాలి. అది జీవితాన్ని నిర్దేశించే మార్గదర్శి గా ఎప్పుడు తయారయ్యింది? ఎవరెవరికున్నా knowledge, qualifications & common sense తో, వారి జీవితం నిర్దేశింపబడాలి. ప్రతిదానికి exemptions బిచ్చమెత్తుకోవడం, బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.

కనీసార్హత లేకపోయినా, అందలాలు ఎక్కాలనే అధమస్థాయి ఆలోచనల నుండి బయటపడి, అర్హత సంపాదించే దిశగా ఆలోచించాలి, శ్రమించాలి. తాడు బొంగరం లేకుండా, ఓ 12 ఏళ్ళు గాలికి తిరిగొచ్చేసి, జీవితాన్ని నిర్దేశించాలి కాబట్టి, వాళ్ళకి ఏకంగా ఉద్యోగాలే ఇచ్చేద్దాం అంటే మరీ బావుంటుంది.

చదువనేది చిన్నప్పట్నుండే రావాలి. పూర్వం లా, ప్రతి ఏడు పబ్లిక్ అయితే better. అసలు 7th లో public తీసేసిన తర్వాతే, 10th లో ఫెయిల్ అయిన వాళ్ళ ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని ఓ విశ్లేషకుడి అభిప్రాయం. నిజమే అనుకుంటా. ఏం పీకకపోయినా, పాస్ అవుతూ వచ్చేవాడు, ఒక్కసారిగా ఫెయిల్ అంటే, అదీ టీనేజ్ లో.. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి, ఇలాంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉంది. అదే 1వ తరగతి నుండే అయితే, అలాంటి failures కు అలవాటు పడటమో, లేక, మరింత శ్రమించి, పాస్ అయ్యేలా prepare అవడం జరుగుతుంది.

ఒకటో తరగతి నుండి, రెండో తరగతి కి వెళ్ళడానికి, minimum qualification ఉండాలి. పరీక్షల ద్వారా, ఆ qualification ఉందా లేదా అనేది నిర్దారితం అవుతుంది. అది లేనప్పుడు అసలు రెండో తరగతే సుధ్ధ దండగ.

Kathi Mahesh Kumar August 16, 2009 2:19 AM  

ఇక్కడ పరీక్షలు తీసెయ్యటం లేదు. ఈ పరీక్షలకు "జీవితంలో ఉన్న ప్రాధాన్యతను" తగ్గిస్తున్నారు. అంతే! Evaluation would still take place. But student's lives are not going to be decided by this exam.

పదవతరగతిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిలవ్వడం వలన పూర్తిగా పైచదువులకు దూరమౌతున్న వారి సంఖ్య విపరీతంగా (కొన్ని లక్షల్లో) ఉంది. మిగతా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉండీ, పైచదువులు చదవగలిగే సత్తాఉండీ, కేవలం ఒక పరీక్షవలన అదీ బహుశా జీవితంలో ఎప్పుడూ మళ్ళీ చదవనక్కరలేని సబ్జెక్టువలన జీవితాల్ని చదువుకు దూరం చెయ్యడం అర్థరహితం. ఉదాహరణకు మ్యాధ్స్ లో పెయిలైన విధ్యార్థి 11th 12th లో వొకేషనల్ (టైపు షార్టుహ్యండు వగైరా)కోర్సులు చెయ్యాలన్నా కుదరదు. ఎంత అన్యాయమైన పరిస్థితి!

రెండు. కేంద్రప్రభుత్వం ప్రకారం పాఠశాల విద్య ఆరోతరగతి నుంచీ పన్నెండో తరగతి వరకూ. అంటే ఒకే స్కూల్లో అన్నమాట. అలాంటప్పుడు పదోతరగతిని ఒక మధ్యమెట్టుగా ఎందుకుచూడాలి? ఆరోతరగతి నుంచీ అదేస్కూల్లో చదువుతున్న విద్యార్థి శక్తిసామర్ధ్యాలు టీచర్లకు తెలుసు.దాన్నిబట్టి తనకు కోర్సులు రెకమండ్ చేసే సౌలభ్యం ఉంది.

బలవంతంగా పిల్లల్ని ఇంజనీరూ డాక్టరూ చేసేద్ధామని ఎమ్.పీ.సీలూ బై.పీ.సీలూ చేయించాల్సిన ఉత్సాహం మన ఆంధ్రాలో కొంచెం ఎక్కువ. బహుశా అందుకని మీకు ఈ ప్రతిపాదన కొంచెం చిత్రంగా ఉన్నా, జ్ఞానం కోసం పిల్లవాడి ఆనందం కోసం చదువు అనే ఆలోచన నేపధ్యంలో ఈ ప్రతిపాదన సరైనదే.పదోతరగతి మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థి తను చెయ్యగలిగింది, తనకు ఇష్టమైంది 11th,12th లో చెయ్యొచ్చు. అంతకన్నా pleasurable experience మరొకటుంటుందని నేననుకోను. ఒకసారి ఇలా తనదైన పట్టాలు విద్యార్థిపట్టాడంటే జీవితమొక సూపర్ ఎక్స్ప్రెస్సే...

పదవతరగతి వరకూ చదువు జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో చెప్పడానికి మార్గం మాత్రమే. ఆ process ఆనందకరంగానే ఉండాలి.లేకపోతే విధ్యార్థికి చదువంటే "బలవంతం" అవుతుందేతప్ప "ఇష్టం" కలగదు. "మనలాంటి దేశాలకు, ఒక విద్యార్థికి చదువు బ్రతుకు తెరువు చూపే ఒక ప్రధాన సాధనం." అనే మాటతో విభేధించకతప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం చర్చిస్తున్న context లో. పదవతరగతి చదువుతో ఎవరూ ప్రొఫెషనల్స్ అయిపోవడం లేదు. వేరే పనులు చేసుకోవడానికి తగ్గ వృత్తినైపుణ్యాల్ని ఎవరూ పొందడం లేదు.

ప్రాధమిక విద్య reading, writing,comprehension నేర్పిస్తే,పాఠశాల విద్య arithmetic,language proficiency,basic scientific inquiry, social skills నేర్పించాలి. కానీ మనం learning objectives కన్నా విషయపరిజ్ఞానం మీద దృష్టిపెట్టి పదోతరగతి అనే పరీక్షతో విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేస్తున్నాము.అది తప్పు అన్నదే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయానికి కారణం.

"ఎందులో ఆసక్తి ఉందో అది ఎన్నుకోవడానికి పదో తరగతి ఆటంకం కాదు." ఖచ్చితంగా ఆటంకమే. బోర్డుపరీక్ష ఉండటం వలన పదోతరగతి పాస్ అవ్వందే 11th,12th వెళ్ళటానికి వీలవ్వదు. ఇలా ఫిల్టర్ చేసి వేరే సబ్జెక్టుల్లో అత్యుత్తమంగా రాణించే అవకాశం ఉన్న చాలా మందిని ముందుకెళ్ళకుండా ఆపెయ్యడం సమాజానికి శ్రేయస్కరం కాదు. పదోతరగతి మ్యాథ్స్ లో ఫెయిలైన విద్యార్థి సైకాలజీలోనో,సోషియల్ సైన్సులోనూ,లిటరేచర్లోనో excel అయ్యేఅవకాశం లేకుండా చెయ్యడం అన్యాయం.

"పోరాట స్ఫూర్తి"; ఎక్కడ లేదు పోరాటం? ఎప్పుడు అంతమవుతుంది ఈ పోరాటం? ప్రతిమెట్టూ పోరాటమే. ఇప్పుడుకూడా పదోతరగతికి పరీక్షపెడతారు. మార్కులో గ్రేడులో ఇస్తారు. కేవలం జీవితాల్ని నిర్ణయించరు అంతే. వచ్చిన మార్కుల/గ్రేడుల ఆధారంగా 11th,12th వెళతారు.తమకు చేతనైన,తాము ఇష్టపడి జీవితాన్ని గడపగలిగిన చదువుని ఎంచుకుంటారు

తెలుగోడు,  August 16, 2009 4:23 AM  

Type & Shorthand కు అసలు ఇంగ్లీష్ మాత్రం తెలిస్తే చాలు. మ్యాథ్స్ అవసరం లేదు. B.com, B.A. తెలుగు మీడియం లో చదవాలనుకున్నవాడికి, english అవసరం లేదు అనుకోవడం అజ్ఞానం. 10th అయిన తర్వాత, వాడు బి.కాం. చేస్తాడా, Type & Shorthand చేస్తాడా అన్నది ఎవరికి తెలుస్తుంది? 10th వరకు అన్ని subjects గురించి minimum introduction ఇవ్వబడుతుంది. 10 తర్వాతే, తమకు కావలసిన career ను ఎంచుకుంటారు. 10 లో కూడా, వందకు వంద తెచ్చుకోవాలని రూల్ లేదే. కనీసార్హత, 35 తెచ్చుకోవాలి. so called shorthand, type కు అయినా, statements, balance sheets, etc. టైప్ చెయ్యాలంటెఏ, కనీసం కూడికలు, తీసివేతలు, etc. కనీస గణిత పరిజ్ఞానం ఉండాలి. కనీస విషయ పరిజ్ఞానం కూడా లేకుండా ముందుకెళ్ళాలనుకోవడం... shame. దాన్ని సమర్థించుకోవడానికి, ఎన్ని వాదనలు తెచ్చినా...

Kathi Mahesh Kumar August 16, 2009 5:14 AM  

What is 35 (pass) marks? Does it ensure minimum levels of learning or minimum standard of learning?

విద్యావ్యవస్థపై కనీస అవగాహనలేకుండా. కనీసం విద్య ఎందుకు అనే మౌళికమైన ప్రశ్నకు సమాధానం తెలీకుండా మీరు చేస్తున్న వాదనను మించిన వాదనలు నేషనల్ కరికులమ్ ప్రేంవర్క్ 2005 రాసే ముందు జరిగిపోయాయి.

కాబట్టి మీరు ఒకసారి ఆ పాలసీ పేపర్ చదవండి. అప్పటికీ ఈ నిర్ణయంతో అంగీకరించకపోతే మీ ఇష్టం. లేదూ ఇది ప్రభుత్వం యొక్క మూర్ఖ్హత్వం అని అప్పటికీ నమ్మితే ఒక ప్రజాప్రయోజనాల వాజ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చెయ్యండి.

తెలుగోడు,  August 16, 2009 9:16 AM  

"విద్య ఎందుకు" అనేది మనకు అవగాహన లేనప్పుడు, ఇంకెవర్నో అడిగో, చదివో తెలుసుకోవాలి. నాకా అవసరం లేదు. ఏ కారణంగానైనా, కనీసార్హత ఆధారంగా కాకుండా, మరో రకంగా అవకాశాలు ఇవ్వడం నేను సమర్థించను. నేను నా అభిప్రాయం చెబుతున్నా. మీరు ఏకీభవించకపోయినా, ఎవరికీ ఊడేది ఏమీ లేదు. పోతే, మీరు ఏమేం చదివి తెలుసుకోవాలో, ఏ ఏ వాజ్యాలు వెయ్యాలో నేను చెప్పను...coz, it is none of my business.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP