Saturday, August 22, 2009

విశ్వ దర్శిని - sports edition

ఉసేన్ బోల్ట్ strikes again
Lightning Bolt గురించి దేవుడెరుగు ఉసేన్ బోల్ట్ గురించి ప్రపంచం అంతా చెప్తారు. పోయినేడు చైనా లో జరిగిన ఒలంపిక్స్ 100, 200 మీటర్ల పరుగు పందాళ్ళో ప్రపంచాన్ని ఆహ్లాదపరచి ప్రత్యర్థులని భయపెట్టి రెండు ప్రపంచ రికార్డ్లని స్థాపించాడు. 100 మీ పరుగులో 80 తర్వత కొంచం మెళ్ళాగా అయిపోయీ అప్పుడే celebrations మొదలెట్టాడంటే ఆలోచించండి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అని. అప్పుడు నెలకొలిపిన రికార్డు 9.69 సెకన్లు. గతవారం జెర్మనీ లో జరిగిన పరుపుపోటీళ్ళో మళ్ళీ తర రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకొని ఈ సారి 9.58 సె లో 100 మీ పరిగెత్తాడు. 100 meters in 9.58 secs!!!! ఒక కాలం లో 100 మీ లని 10 సే లో పరిగెట్టడం గొప్పగా ఉండేది. ఇప్పుడు ఈ 22 యేళ్ళ కుర్రాడు ఇంకొన్ని యేళ్ళవరకు ఎవ్వరికి అందకుండా పరిగెత్తి ఆ రికార్డ్లని దాచేటట్టు ఉన్నాడు. పనిలో పనిగా 200 మీ లని 19.19 సె లో ఛేదిచ్చేసాడు. ఆ రెండు పరుగుల వీడియోలు ఇక్కడ:





Where is Tiger?
ఈ ప్రశ్న నాతోబాటే ప్రపంచంలో చాలామంది అడిగింటారు. అసలు PGA ఆడుతున్నది టైగర్ వుడ్సేనా ఇంకెవరైన నా అని. ఐదో సారి గెలిచేటందుకు అన్ని సెట్ చేసుకొని ఉన్న టైగర్, చివరి రోజున యాంగ్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఇప్పటివరకు మేజర్స్ లో అంటే ఎనిమిది సార్లు టైగర్ చివరి రోజున ఆధిక్యం లో ఉంటే ఎప్పుడు ఓడిపోలేదు. ఈ సారి కూడా అంతేనేమో అని అందరు ఊహించారు. టైగర్ మీద నమ్మకమో యాంగ్ అంటే "ఎవరు?" అన్న ధైర్యమో తెలీదు కాని ఒక ఐరిష్ బుకీ మాత్రం ఆదివారం ముగిసే PGA tournament కి శుక్రవారం, టైగర్ 4 షాట్ల ఆధిక్యం లో ఉండగా, టైగర్ మీద పందెం కాసిన వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేసారు. ఆదివరం అది ఉల్టా అయ్యింది.. దెబ్బకి ఓ $2.12 మిల్లియన్లు నష్టం కోరితెచ్చుకున్నారు. ఆత్రమో ఆవేశమో ఓ ఐదు నిమిషాలు.. ఇక్కడ ఓ రోజు.. ఓపిక పట్టుకోవాలి అని ఊరికే కాదు అనేది. యాంగ్ టైగర్ ని ఓడించడం ఇది రేండో సారి. 2006 HSBC tournament లో ఒక్కసారి ఇంతకముందే ఓడించాడు. ఈ PGA గెలుపువళ్ళ మేజర్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చరిత్ర పుట్టాళ్ళో తన స్థానాన్ని చేజిక్కిచ్చుకున్నాడు.

యేయ్ యేయ్ ఇంగ్లండ్.
మన దేశాన్ని దోచుకొని ఇన్నేసి కలతల్ని రేపి విభజించి భ్రష్టుపట్టించి మన దారిద్ర్యానికి కారకులైన ఇంగ్లాండ్ ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఒక్క బుడిదలో తప్ప.. అదే అదే ఆషెస్ లో తప్ప. ఇంగ్లాండ్ మీద కోపం కంటే ఆసీస్ అంటే చిరాకు ఎక్కువ. చిరాకు చాలా చిన్న పదమేమో. కంపరం apt. అందుకని ఆసీస్ ని ఎవ్వరు ఓడించిన ఒక్క పాకిస్తాన్ తప్ప వాళ్ళకి నేను అభిమానిని. తప్పుబట్టకండి .. స్టీవ్ వా ఉన్నప్పుడు కొంచం బాగుండేది వాళ్ళ బిహేవియర్. ఈ పంటర్ చేత్లో వచ్చాక అదేదో god given right గా అతిగా చాలా చేసాడు. ఈ సారి ఓడిపోతే పీకేస్తారు పంటర్ ని. హమ్మయ్య ఈ పీడ విరగడైద్ది. షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, గిల్లి గట్ర ఉన్నప్పుడు నిజంగానే ఆసీస్ రాజుల్లా ఉండేవారు. ఇప్పుడు world XI లో చోటు సంపాదిచ్చుకునే ప్లేయరే లేడు. కాని పంటర్ పొగరు మాత్రం అలనే ఉంది. ఈ దెబ్బతో అతడి క్యాప్టన్సీ పొగరు రెండు హూష్ కాకి ఔతాయేమో అని చిన్ని చిన్ని ఆశ..

బ్రేడి ఈజ్ బ్యాక్ ..so is Favre.
2001 లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి దాక రోజంత క్రికెట్ చూస్తూ ఆనందంగా ఉండే నా జీవితం సడన్ గా ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా MLB, NBA చూడ్డం మొదలెట్టాను. కొద్ది రోజులు చూసాకా నాకు పరమ బోరింగ్ గా అనిపించింది. ఇలా ఐతే నాకు పిచ్చి ఎక్కుతుంది అని అనిపించేది. అప్పుడు చూసా NFL. అర్థం చేసుకునేదానికి ఓ సీజన్ పట్టింది కాని నాకు భలే నచ్చింది. అసలు క్రికెట్ కి మన ఊర్లో ఉన్నంత అభిమానం ఈ క్రీడకి ఉండడం అన్నింటికన్న నన్ను ఆకట్టుకున్న విషయం. దానికి తోడు MLB NBA లా కాకుండా ఒక్క రోజు.. ఒక్క గేం లో తేలిపోద్ది.. అది ఇంకా నచ్చింది నాకు. ఈ గేం ని అర్థం చేసుకునేదానికి నేను ఫాలో అయినా టీం పేట్రియట్స్. 2001 సూపర్ బోల్ గెలుచుకున్న టీం. అప్పటి నుండి నాకు పేట్రియట్స్ అన్నా టాం బ్రేడి అన్న అభిమానం. 2008 లో ఏడే ఏడు నిమిషాలు ఆడాడు. మళ్ళా ఆడగలడొ లేదో అని అనుమానం వచ్చింది. కాని ఈ యేడు ప్రీ సీజన్ గేం లో ఆడి న్యూ ఇంగ్లాండ్ వాళ్ళందరికి పేట్ర్యియాట్స్ ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. హమ్మయ్య.

అలనే నేను ఒక్కప్పుడు అభిమానించే ఇంకో QB బ్రెట్ ఫావ్ర్. గ్రీన్ బే కి ఆడినన్ని రోజులు బాగుండేవాడు.. ఇప్పుడు సంవత్సరానికి ఓ రెండు సార్లు రిటైర్ అయ్యి ఒక వేరే వేరే టీం లో చేరి తన అభిమానులని దూరం చేసుకుంటున్నాడు. బహూసా ఈ జన్మ లో రిటైర్ అయ్యి Hall of Fame కి వెళ్తే చాలా మంది మర్చిపోతారేమో. కాని అసలు ఆ మనిషి రిటైర్ ఔతాడా అన్నది కోటి రూపాయల ప్రశ్న.

4 comments:

హరే కృష్ణ August 22, 2009 1:18 PM  

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఏయ్ ఏయ్ ఇంగ్లాండ్..హ హ్హ
బావుంది keep going
పంటర్ కి బలిసింది బాగా Ian Jonathan Leonard Trott బాగా ఆడాడు కదా .first captain to lose ashes for two times in hundred years ఎంత బావుందో కదా hmm ఇంకా రెండు రోజులు వుంది గేమ్ ..హోప్ ఫర్ ది బెస్ట్
545 చేజ్ చేస్తారా

Shashank August 23, 2009 6:16 PM  

హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

రచ్చ గురు. వినాయక చవతి శుభాకాంక్షలు.. పంటర్ ఓడిపోయాడు. చికి చికి చాం చికి చాం చికి చాం చాం చికి చికి చికి చాం. జింగ్ టక జింక్ టక టకా టకా జింగ్ టకా..

హరే కృష్ణ August 24, 2009 12:28 PM  

Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare england won :) aus in 4th position in ICC test rankings hehehe

జీడిపప్పు August 24, 2009 10:12 PM  

Tom Brady వచ్చినా ఈసారి అంత నమ్మకం లేదు. పేట్రియట్స్ స్వర్ణయుగం అయిపోయింది అనుకుంటా.

జై హో ఇంగ్లండ్!!

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP