Tuesday, November 17, 2009

ఒక గోడ - ఒక సామ్రాజ్యం - ఒక రాష్ట్రం.

ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో కాలుపెట్టడమే. అంతక ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచక్క అన్నింటిని రేషన్ చేసి నెట్టుకొని వస్తున్న యూనియన్ ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన తర్వత ఏది సరిగ్గా చేయలేకపోయింది.

ఐనా ఆఫ్ఘన్ లో వాళ్ళంతటవాళ్ళే వెళ్ళలేదు కద.. అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీళ్ళు పాపాం వెళ్ళారు. 79 లో. కనిపించిన చిన్న చిన్న గుడిసెలు సైతం సైతాన్నుల్లాగా పేల్చేసారు. ఇసుకని గుప్పెట్లో బంధించే ప్రయత్నం లానే ఇది విఫలమైంది. కాని దాని ప్రకంపణలు క్రెంలిన్ లో కనిపించాయి. రేషన్ చేసి అన్నింటికి కోట (quota) లెక్కన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం ఇంక ఏమీ చేయలేకపోయింది. చేసేదానికి డబ్బు లేకుండా పోయింది. ఒక్కసారి ఈస్ట్ జెర్మని వెస్ట్ లో చేరిపోయాక యూనియన్ లోని మిగితా దేశాలు కూడా స్వతంత్రం అడిగాయి. ఇంక ఇవ్వకతప్పలేదు కద... Nov 09, 1989 బెర్లిన్ వాల్ ని కూలద్రోసారు. సోవియట్ యూనియన్ ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకగలిగింది... అది విరిగి 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. ప్రపంచం లో అతి పెద్ద కమ్యునిస్ట్ దేశం గా రష్యా పోయి చైనా అయ్యింది. మన దేశం కూడా అదే సమయం లో సోషలిస్ట్ / కమ్యునిస్ట్ ఛాయలనుండి సురక్షితంగా బయటపడింది... శ్రీ పీ.వీ మేధస్సు తో.

ఒక్క రాష్ట్రం తప్ప. మన దేశం లో ఆ ఒక రాష్ట్రం లో గత 30 సంవత్సరాల నుండి ఒకటే పార్టి పరిపాలిస్తోంది కద.. పాపం ఒక్కప్పుడు చాలా విషయాల్లో ముందంజ లో ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు టిక్కు టిక్కు అంటూ నెట్టుకొస్తోంది. అంటే కమ్యునిస్టేతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అది నిజం కాదు.. బీహర్, ఉత్తర ప్రదేశ్ వాటికి ఉదాహరణలు.. కాని నకు కమ్యునిస్ట్లన్న ఫెమినిస్ట్లన్న పడరు. కమ్యూనిస్ట్లు చైనా తో యుద్ధం అప్పుడు చైనా కి సపొర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళని దేశం నుండి బహిష్కరించేదానికి. ప్రగతికి అడ్డంకులు.. అందుకే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. ఏం సాధించారో ముఫై యేళ్ళళ్ళో నాకైతే తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు.. సరిగ్గ పని చేసేవాళ్ళు లేరు .. పెద్దగ ఒరిగింది కూడా లేదు. ఒకప్పుడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండినది ఇప్పుడు బీహార్ కంటే కొంచం మెరుగ్గా ఉంది అట. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల్లో అస్సెంబ్లీ ఉప ఎనికల్లో కొంచం వెనుకపడింది సి.పి.ఎం. చూద్దం ఈ సారి ఎన్నికల్లో గెలుస్తుందో లేక చివరికి బెంగాల్ కి కూడా మంచి రోజులు వస్తయో లేదో అని.

క్యాపిటలిజం గొప్పది అనో సర్వరోగ నివారణి అనో నేను అనడం లేదు. అనేంత తెలివి కూడా నాకు లేదు. కాని కమ్యునిస్ట్ కంటే యే రోజైన క్యాపిటలిస్ట్ సొసైటి బెటెర్ అని నా అభిప్రాయం. వాక్ స్వాతంత్రం కదిలే స్వాతంత్రం నాకు చాలా ముఖ్యం. ఒక్క మాట ఎవరినైన అంటే రాత్రి ఎవడొచ్చి తలుపు కొడతాడో ఎక్కడ క్యాంపుల్లో పడేస్తారో అని భయపడాల్సిన అవసరం ఉండదు. డెమాక్రసి అలాంటిది. కమ్యూనిస్ట్ అంటే ఒక మాట చెప్పాలి - పని ఎవడి శక్తి కొలది వాళ్ళు చేయాలి పరిహారం మాత్రం అందరికీ సరిపోయేంతే అనే ముష్ఠి భావన మీద బేసైన ఎటువంటి "ఆలోచన" ఐనా నాకు చిరాకే. నేను చేసే పనికి తగినంత పరిహారం నాకు కావాలి. నేను 12 గంటలు కొట్టించుకొనీ.. నా పక్కనోడు ఓ గంట చేసి ఇద్దరికి ఒకటే జీతం అంటే లాగి కొట్టలనిపిస్తుందా లేదా? ఎమైన అంటే ప్రపంచం బాగు కోసం అని అనడం ఇంకో పెద్ద బూతు. నాకు పని చేయాలి అని అనిపిస్తే కద నేను, నా ఇల్లు, నా ఊరూ నా దేశం నా ప్రపంచం బాగుపడేది? అసలు నేను ఎంత కొట్టించుకున్నా నాకు మిగిలేది చిప్పే అంటే నేనెందుకు పని చేయాలి? ఎందుకు చేస్తా? ఈ చిన్న ముక్క బుద్ధి లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎలా నెగ్గిందో నాకు ఐతే అర్థం కాదు. ఏదైతేనేమి ఇంకో ఇరవై సంవత్సరాల్లో . బెంగల్ వాళ్ళకి బుద్ధి రాకపోద్దా..మన దేశం మారకపోద్దా. చూద్దాం. ఆశిద్దాం.

గమనిక: ఇది నా బ్లాగు. నాకు నచ్చని వాటి గురించి నచ్చిన వాటి గురించి రాస్తాను. కార్ల్ మార్క్స్ దేవుడు లెనిన్ ఇంకో దేవుడు. స్టాలిన్ మావో లు దేవుని ప్రతిరూపాలు గట్ర గట్ర అని అనాలనుకుంటే దారి అటు --> ఇక్కడ కాదు. నా దృష్టి లో లాలూ ములయం మాయవతి కంటే తక్కువ పింకోలు .. వాళ్ళని చూస్తే at least చెప్పచ్చు దేనికి పనికిరారు అని.. వీళ్ళు అల కాదు. మరోసారి చెప్తున్న ఈ టప కమ్యునిస్ట్ టప లాంటిది.. వ్యతిరేకిస్తే కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పడేసి కుర్చి కి కట్టేసి వివాహ్ సినెమా చూపిస్తా. కేసు బోనస్!! ఖబర్దార్!.

9 comments:

మంచు November 17, 2009 9:32 PM  

100% agree.. బెంగాల్ గురించి ఇంకొంత సమాచారం. నా వుద్దెస్యం లొ బెంగాల్ కి బిహార్ కి పెద్ద తేడా లేదు.. బెంగాల్ లొ గ్రామం లొ 10% వాళ్ళకి వొటర్ లిస్ట్ లొ పేర్లు వుండవు.
ఎప్పటికీ వొట్ హక్కు రాదు . రిగ్గింగ్ సర్వ సాధారణం .. రాజకీయ హత్యలు , బెదింపులు అక్కద యధెచ్చగా జరిగిపొతుంటాయి.. మన మీడియా కి మాత్రం అక్కడ విషయాలు రాసే దమ్ము లేదు.. ఎంతసేపు గుజరాత్ మీద పడి ఎడుస్తుంటాయి.. వెస్ట్ బెంగాల్ లొ కొల్ కటా కాకుండా ఇంకొ నగరం చెప్పండి .. అంటే మన రాజమండ్రి అంత వుండే ఊరు..

ఇంకొ విషయం.. మన ఇండియా లొ కామీలకి మిగతా కామీలకి తేడా వుంది.. ఉదాహరణ కి కామీలు రెజర్వెషన్ కి వ్యతిరెకం.. సమ సమాజం , కుల విచక్షణ అంటూ ఇక్కడ పిచ్చ వాగుడు వాగుతారు కానీ.. తూర్పు యురొపియన్ దెశాల్లొ ఎంత అణగదొక్కబడిన జాతులకయినా వాళ్ళు రెజర్వెషన్ ఇవ్వరు.. సబ్సిడిలు ఇవ్వరు.. " ఆకలేసినవాడికి చేపను ఇవ్వడం కాదు.. చేపని పట్టివ్వడం నేర్పించాలి " అని కొట్ విన్నారా.. అది కమ్యునిస్ట్ నాయకుడు చెప్పిందే.. ఇక్కడ అంతా రివర్సు..

మంచు November 17, 2009 9:35 PM  

మీరు చేతిలొ ఒక కర్ర పట్టుకుని వెళ్ళుతున్నారు.. సడన్ గా మీకు 'ఒక పాము , ఒక కామీ' కనిపించారు.. ముందేవరిని కొడతారు.. ?

Shashank November 17, 2009 10:02 PM  

మంచి పల్లకి గారు - బా చెప్పారు. బెంగాల్ లో ఇంకో నగరమా... ప్చ్.. జమ్షెడ్నగర్ అక్కడే కద ఉండేది? ఇంకోటి ఖరగ్పూర్. బా చెప్పానా? పాము కమ్యు అంటే మరి మరి ఆలోచనే లేదు.. కమ్యూ నే..

మంచు November 17, 2009 11:30 PM  

జెమ్షెడ్పూర్ (టాటా నగర్) జార్ఖండ్ లొ వుంది.. ఇంతకు ముందు బీహార్ లొ వుండేది.. ఖరగ్పూర్.. పొడవయిన రైల్వే ప్లాట్ఫాం తప్ప ఆ ఊళ్ళో ఇంకేమి లేదు... నేను చదివింది అక్కడే..

సొ ఇప్పుడు అర్ధం అయ్యిందా ఎవరు ఎక్కువ డేంజరొ..

Sravya V November 18, 2009 10:21 AM  

మీ పోస్టు బాగుంది "గమనిక" చాల చాల బాగుంది :)
@మంచు పల్లకీ :)

Veena,  November 18, 2009 1:24 PM  

baagundi (vivah cinema bhayam tho chepthunna anthe hahaha)

Shashank November 18, 2009 3:27 PM  

@శ్రావ్యా - థంక్స్ అండి. :) ఆ మాత్రం గమనిక పెట్టకపోతే కమ్యులు కుమ్మేస్తారని ముందే హెచ్చరిక వచ్చింది.. అందుకే అలా....

@అక్క - నీకు తప్పదు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఫ్రీ ఫ్రీ ఫ్రీ వివాహ్, తర్వత ఏక్ వివాహ్ ఐసి భి, తర్వత హం ఆప్కె హైన్ కౌన్... రచ్చ.. మొన్నే సూపర్ గ్లూ కొన్నా..

karthik November 23, 2009 2:41 AM  

super post boss!!
I dont know how i missed your blog till now :(

anyway keep looking at pra.pi.sa.sa.

http://onlyforpraveen.wordpress.com

-Karthik

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP