"పులి" నిరాహార దీక్ష జయప్రదం చేయండి!!!
జై తెలంగాణా. జై జై తెలుగు తల్లి.. అర్రెరె మరిచా.. తెలంగాణా తల్లి కద. మరిచే పోయా. ఇంతకి పాపాం ఆ తెలుగు తల్లిని విభజించి తెలంగాణా తల్లి అని మిగితా వాళ్ళ తల్లి అని చేసారు.. ఇప్పుడు ఏక్కడుందో ఏంటో ఆ తల్లి. ఎంతో మంది వారి వారి స్వార్థం.. కేవలం pure unadultrated 100% సుద్దమైన స్వార్థం కోసం తెలంగాణా ఉద్యమాన్ని ఆ సెంటిమెంట్ ని లేవదీసారు. ఆ నాడు చెన్నా రెడ్డి ఐతే ఈ రోజు కె సి ఆర్. రేపు మరొకడు. ఇలా మాకు తెలంగాణా కావాలి కావాలి అని అరిచి రబస చేస్తున్న యే ఒక్కడు నిజంగానే తెలంగాణా అంటూ వస్తే ఎలా అభివృద్ధి పరుస్తారో చెప్పిన ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు మళ్ళా కె సి ఆర్ రూపొందించిన "ప్రణాలిక" ని తె రా స మానిఫెస్టొ ని చూపించేరు!!! అందులో తెలంగాణాని సంపాదించేదానికి ఏం చేస్తారో ఉంది .. ఎలా అభివృద్ధి చేస్తారో లేదు. అంత దూరం ఆలోచించలెదేమో మరి మేధవులు...
బొంబాయి లో మహరాష్ట్రేతరులు ఉండకూడదు అని ఒక మలపత్రాష్టుడు ఓ తొక్కలో ఉద్యమం లేవనెత్తాడూ ఓ నలభై యేళ్ళ క్రితం. ఇప్పుడు అతడి చుట్టం అదే అంటున్నాడు మళ్ళా. ఈ లోపు పాపం అన్యం పున్యం ఎరుగని సచిన్ ని కూడా ఈ పరమ కంపులోకి లాగారు. నాకు తెలీక అడుగుతాను బొంబాయి.. ఇటు హైదరబాదు ఎవడబ్బ జాగీరు అని ఇల అంటున్నారు వీళ్ళు ? అసలు ఈ భూమి అంటే మన ధరణి ఆవిర్భవించినప్పటి నుండి కె సి ఆర్ వాళ్ళు కానివండి అటు మ.న.ని.సే వాళ్ళు కాని ఉన్నరా ఇక్కడే? అల కాదు అంటే వాళ్ళు ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళే. జాతి మీద విభజించుకున్నాం.. తర్వత భాషల మీద.. ఇప్పుడు మాండలీకల మీదా? అంతే లేండి.. every country has leaders it deserves. మనకి కె సి ఆర్, రాజ్ థాకరె నే కరెక్ట్ ఏమో. వీళ్ళని నాయకులు అని అనడం లేదు... ఎంతో మంది జీవితాలతో ఆడుకుంతున్నారు వీళ్ళు. ఆ పాపం ఊరికే పోదు.
దానికి మళ్ళా ఓ నిరాహార దీక్ష.. అదో నాటకం. కాని కాని ఇక్కడే అసలు twist ఉంది. కె సి ఆర్ ఒక్కడేనా నిరాహార దీక్ష చేసేది? ఆ మాత్రం దీక్ష మేమూ చేయగలం అని మనలో ఒకడు ముందుకు వచ్చాడు. అతన్ని మనం అందరం ఉత్సాహ పరచాలి. ముందుకు తోసి.. అదే ముందుంచి వెనకనుండి మనం మన support ఇవ్వాళ్ళి. కె సి ఆర్ లా మధ్యలో విరమించనీయకూడదు. ఎంతో కష్ట సాధ్యమైన అతడి గమ్యాన్ని చేరేదాకా నిరహారదీక్ష చేసేట్టు మనమే చేయాలి. అందునా తోటి కె బ్లా స సభ్యులు ముందుగా మనం మనం మాట్లాడుకోని పులిరాజు ఎటువంటి మంతనాలు జరపకుండ జాగ్రత్త పడాలి. నీమ్మ రసం, చారు, ఇడ్లి, విస్కీ ఇలంటివి ఏది అతనికి ఇవ్వకూడదు... at least గమ్యం చేరే వరకు.
గమ్యం ఏంటి అన్నది ఇంకా ఆలోచిస్తున్నాము. అంత వరకు సమయం ఎందుకులే వృధ చేసేది అని రేపటి నుండే మన పులిరాజుని బరిలోకి దింపే పనిలో ఉన్నాము. రేపటి నుండి అభినవ పొట్టి శ్రీరాములు .. ఉరఫ్ పులిరాజు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించబోతున్నారు. అందరి ఈ మహోనత్త ఉద్యమానికి ఆహ్వానితులే. అందరు పాలు పెరుగు పూరి కూర పంచుకుందాం.. మన పులిరాజుని మాడగొడదాం.. అదే పులిరాజు ఆకాంక్షని తీరుద్దాం. మీరందరు తప్పకుండా వస్తారనే ఆశిస్తూ.... జై పులిరాజు. జై జై పులిరాజు.
7 comments:
:)
పులిరాజుకు కాపలా కాయటానికి మలక్ ను మాత్రం పెట్టెద్దు, వాళ్లిద్దరూ వర్గ శత్రువులు(అంటే ఎమిటో అడగొద్దు).
పులిరాజుకు కాపలాగా నాదెండ్ల (లండన్లో జూనియర్ డాక్టొరు, రెడీ గా ఉన్నాడని అభిఙ్నవర్గాల భొగట్టా)
Crockett bastard
ప్రొద్దున్న సెలైన్ మద్యాహ్నం ఫ్రూట్ జ్యూస్ రాత్రికి మళ్ళీ ఒక సెలైన్ వెనుక జే జేలు కొడుతూ నలుగురు మనుషులు ఉంటే మా వూర్లో మూడు ఏళ్ల పిల్లాడుకూడా నెలకు రెండు దీక్షలు చేసేస్తాడు వీజీగా
హమ్మ హమ్మ అందరూ కలిసి నన్ను తోసేద్దామనే, ఇలాగయినా నా పీడ వదిలించుకుందామనే!! కాస్త బ్యుజీగా వున్నాను. మళ్ళీ మీ సంగతి చెబుతానుండండి.
హారం లో మీ బ్లాగు రావడం లేనట్లుంది. అందుకే మీ కామెంటు చూసేంతవరకూ మీరు ఇది వ్రాసినట్లు తెలియదు. ఇక అప్పుడప్పుడయినా కూడలి చూడాలి.
chala baga chepparu!! Jai Tel*** Thalli....
@anon1 - డాక్టర్ నాదేండ్ల నే కరెష్ట్!!
@anon2 - అర్థం కాలేదండి. కొంచం విడమరిస్తే బాగున్ను..
@anon3 - మీకెందుకు.. మీరు మొదలెట్టండి... తర్వాత సంగతి తర్వాత..
శరత్ - కుట్ర లేదు కుతంత్రం లేదు. ఏదో నీ నుండి ఇలా కొద్ది రోజులైన విముక్తి దొరుకుద్దేమో అని.. పిచ్చి జనలు ఆశ పడుతున్నాము అంతే...
Post a Comment