మరో T20 ప్రపంచ కప్.
టెన్నిస్, చెస్, జిమ్నాస్టిక్స్ చివరకి ఫుట్ బాల్ లో కూడా అమ్మయిలు వాళ్ళ సత్తా చూపించారు. తదణుగునంగా ఆ ఆటలని అమ్మయిలూ ఆడుతున్నప్పుడు ప్రజాధారన చాలానే ఉంటోంది. మన జాతియా క్రీడ అయిన హాకీ లో కూడా అమ్మయిలు చాలా ముందంజలో ఉన్నారు. చాలా స్వర్ణ పతకాలు సంపాదించారు కొన్ని కప్పులు కూడా చేజిక్కిచుకున్నారు. అప్పుడప్పుడైనా వీళ్ళని మన పత్రికలు / టి.వీ చానల్ వాళ్ళు చూపిస్తారు చదివి మనం ఆనందిస్తాం.
ఈ రోజుల్లో T20 క్రికెట్ చాలా చాలా జరుగుతోంది. మొన్ననే IPL2 ముగిసింది.. వెన్వెంటనే T20 World Cup మొదలైంది. చాలా మంది ఆ మ్యాచస్ ని చూస్తూ లేక చదువుతూ ఉంటారనే భావిస్తున్నాను. వీరు భుజం నెప్పితో ఇంటికి వచ్చేస్తున్నాడని, వీరు కి ధోని కి మధ్యలో ఎదో జరిగింది అని మనం ప్రతి రోజు చూస్తున్నాం. కాని అదే సమయం లో ఇంకొక World Cup మొదలైంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అదే women T20 World Championships. ఈ రోజు నుండే అది ప్రారంభమైంది. అబ్బాయిల కప్ లా కాకుండా కేవలం 8 టీంలతో మొదలైంది.
ఇదే మొట్టమొదటి women's T20 ప్రపంచ కప్. తొమ్మిది రోజుళ్ళో అయిపోతుంది. ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియూ దక్షిన ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంటభరితం గా చివరి ఓవర్ దాకా సాగింది. పోయినేడు జరిగిన ODI ప్రపంచ కప్ ని చేజిక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ సారి కూడా అందరికి గట్టి పోటి ని ఇచ్చి ఈ కప్ కూడా పొందే ప్రయత్నం లో ఉంది. ఇంగ్లిష్ జట్టు చాలా మట్టుకు వాళ్ళ క్యప్టన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. తను చాలా మంచి ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా జట్టు కి సారాధ్యం వహిస్తున్న కారెన్ కి ఇదే చివరి ప్రపంచ కప్. ODI కప్ ని ఆస్ట్రేలియా గెలుచుకున్నది ఈవిడ క్యాప్టన్సి లోనే.
వీళ్ళ ప్రపంచం లో పవర్ హౌజుల్లో ఒకటిగా అభివర్ణించే జట్టు మన దేశానిది. మెర్క్యూరియల్ అని ఇంకొక పేరు కూడా ఉంది మన జట్టు కి. పోయినేడు జరిగిన ప్రపంచ కప్ లో మూడో స్థానం లో నిలిచాము. అప్పటి జట్టుకి ఇప్పటి ఈ T20 జట్టుకి పెద్దగా మార్పులు లేకపోయినా మన క్యాప్టైన్ మాత్రం మారింది. ఇప్పుడు ఝులన్ గోస్వామి కి ఇచ్చారు ఆ పదవి. తను మంచి ఫాస్ట్ బోలర్. చక్కని యాక్షన్ తో 120kph వేగం తో వేస్తుంది. మన బ్యాటింగ్ ప్రత్యేకించి అంజుం చోప్రా, మిథాలి రాజ్ ల మీద ఆధరపడి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా యేళ్ళ నుండి క్రికెట్ అన్ని ఫార్మాట్ల్లల్లో వారి నైపుణ్యం చూపారు. అలనే బోలింగ్ మన క్యాప్టన్ ఝులన్, చిచ్చుర పిడుగు అమితా షర్మా (మన వైస్-క్యాప్టన్), హైదరాబాద్ కి చెందిన గౌహెర్ సుల్తానా మీద ఆధరపడి ఉంటుంది. వీళ్ళందరు చాలా చాలా చక్కని ఫీల్డర్స్ కూడాను. వీళ్ళే కాదు మిగితా జట్టుళ్ళోని వారు కూడాను!! మెన్స్ క్రికెట్ కి ఏ మాత్రం తీసిపోకుండా వీళ్ళు ఆడతారు. కాని తగిన గుర్తింపుకి నోచుకోకుండా ఉన్నారు.
ఈ యేడు ఇప్పుడు జరుగుతున్న T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో మెన్స్ కప్ తో బాటే కొనసాగుతుంది. అదే గ్రండ్లల్లో వీళ్ళు ఆడుతున్నారు. మన దేశం గెలుస్తుంది అన్న ఆశ ఎక్కువగా లేదు నాకు... ఎందుకంటే మన వాళ్ళా కంటే న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులు బాగున్నాయి. ఈ ఫార్మాట్ లో మన వాళ్ళ కంటే ఎక్కువా ఆడారు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఉండి. చూడాలి ఎవరు గెలుస్తారో అని. ఎవ్వరు గెలిచినా, మహిళా క్రికెట్ లో ఇదో కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. may the best team win, and may the best team be INDIA.
6 comments:
మన వాళ్ళు దారుణంగా ఓడిపోయారు ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ ఆసలు గల్లంతు..Mens cricket చూడాలి ఏం చేస్తారో
దీనికి కారణం నా దృష్టి లో మహిళా క్రికెట్ కు తగినంత ప్రోత్సాహం వుండక పోవడమే. పురుషుల క్రికెట్ కైతే లెక్క లేని స్పాన్సర్లు .. మరి మహిళా క్రికెట్ కు వస్తే ఎవరు కనీసం పట్టించుకోనైన పట్టించుకోరు.. ఈ పరిస్థితే మన మహిళా క్రికెటర్లు వెనుకబడటానికి మూల కారణం అని నా అభిప్రాయం.
హరే కృష్ణ - ఇంగ్లాండ్ చాలా మంచి టిం. అది కాకూండా మన వాళ్ళాకి ఈ ఫార్మాట్ లో పెద్దగా అనుభవం లేదు. చూద్దాం.
కథాసాగర్ గారు - మన దేశం లో మహిళా క్రికెట్ అనే కాదండి అసలు క్రికెట్ తప్ప వేరే యే ఆట కి ప్రోత్సాహం ఉండదు. BCCI అయినా వీళ్ళాని ప్రోత్సహిస్తే ఎమైన బాగుపడుతుందేమో చూడాలి.
Manchi topic cover chesav...
Post a Comment