నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. భాగ్యనగర ప్రజా పార్టీ డిమాండ్!!
మొన్న ఆ మధ్య ఎక్కడో చదివా "ఆంద్ర బ్యాంక్" పేరు కొట్టేసి "తెలంగాణా బ్యాంక్" అని రాసారని. అసలు అలా రాయడం లో ఎమైన బుద్ది ఉందా అని నా అనుమానం. ఆ సాతవాహనుడి కాలం కంటే పూర్వమే మన ప్రదేశానికి "ఆంధ్ర" అని పేరుండేది. అశోకుని చరిత్రలో కూడా మన ప్రదేశాన్ని "ఆంద్రా" అనే ఉంది. మన రాష్ట్రం లోని మూడు పెద్ద ప్రదేశాల్లో ఒకటి రాయలసీమ. ఆ మాటకి వస్తే ఓ ఐదొందల యేళ్ళ క్రితం అసలు ప్రస్తుత రాయలసీమ కి ఆ పేరే లేదు. రాయలవారు పరిపాలించేదాకా ఆ సీమ కి పేరే లేదు. (ఉండింటే నాకు తెలీదు). నా ఉద్దేశం ఏంటంటే "ఆంధ్రులు" అంటే కేవలం కోస్తా జిల్లా వారే కాదు అని.
అది అలా ఉండగా.. ఇన్ని యేళ్ళు తెలంగాణా రాకపోవడానికి కారణం.. ఇకపై కూడా అదే వర్తించచ్చు కూడా.. ఒక్కటే.. హైదరాబాదు. అసలంటు 'నా' నగరం తెలంగాణా లో లేకపోయింటే 1969 తెలంగాణా ఉద్యమం అప్పుడే వచ్చేసేది. సపోస్ పర్ సపోస్ మన రాజధాని హైదరాబాదు కాకుండా యే కర్నూలో, బెజవాడో, పలమనేరో అయ్యింటే ఇంత జరిగేది కాదు. ఇది లోక విధితమైన మాటే కద! మా ఊరే లేకుంటే ఇప్పటికి మరో చత్తిస్ ఘడ్ లా, ఉత్తరాంచల్ లా తెలంగాణా కూడా మరో రాష్ట్రం అయ్యిండేది. అందుకే నేను మా పార్టీ బాగా ఆలోచించి.. చించి చించి చించి.. ఆంధ్ర పటాన్ని ఇంకాస్త చించితే అప్పుడే వచ్చింది ఈ ఆలోచన.. తెలంగాణా రావడానికి అడ్డుగా ఉన్నా నా ఊరుని పీకేయండి. నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. ఇదే మా డిమాండ్!
శరత్ లాంటి వాళ్ళ మాటలు వినకండి. అతడు హైదరాబాదు-ద్రోహి. నలగొండ "పులి" ఎమో కాని మా ఊరుకి మాత్రం అన్యాయం తలబెడుతున్నాడు. he has lost all my respect. అసలు ఎవరిని అడిగి ఇలా హైదరాబాదుని వేరు చేయద్దు అని అంటున్నాడు? అసలు మా ఊర్లో ఎప్పుడైన ఉన్నాడా? ఉంటే ఇంటి నంబరు, ఫోను నంబరు, రెజిస్ట్రాషన్ అన్ని చూపించమని డిమాండ్ చేస్తున్నా!!
అలనే మిగితా విషయాలకి వస్తే. మా రాష్ట్రం లో నివసించేదానికి కొన్ని నిబంధనలు పెట్టాము. వాటిలో కొన్ని:
* గ్రేటర్ హైదరాబాదు ఇప్పుడున్న విస్తారానికి ఇంకో ఐదో పదో కిలోమీటర్లు అన్ని వైపులా జోడిచి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి.
* భాగ్యనరానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise). మిగితా పోస్టులకి కె.బ్లా.స వారు తువాల్లు వేసుకోవచ్చు.
* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం చొంచెస్సిఒన్ ఇస్తాము.
* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "మహా భాగ్యనగరం" లో చోటు లేదు.
* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ గట్రా కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కడితే సరి. అది వేరే విషయం.
* ఓస్మానియా లోని సత్తర్ డబ్బా ని national monument గా డిక్లార్ చేయాలి.
మా రాష్ట్రాన్ని మేము దక్కించుకుంటాం. ఎలాగో మన శరత్ నిరాహార దీక్ష చేస్తనే ఉన్నాడు. అతని డిమాండ్లతో బాటే ఇది చేర్చే ప్రయత్నం చేస్తున్నా.
జై తెలుగు తల్లి.
జై హైదరబాదు.
జై హైదరబాదు నూతన ముఖ మంత్రి (అంటే నేనే!!)...
సవరణ - ఇందాక నేను "తిట్టేటప్పుడు" శరత్ ఓ టపా రాసేసాడు. పార్టీ లో సిద్ధాంతకర్త పదవి ఇస్తా అంటే ప్లేట్ ఫిరయించి ఇప్పుడు "జై హైదరాబాదు" అంటున్నాడు. అందుములాంగా అతడిని హైదరాబాదు-ద్రోహుల ఖాతా నుండి సగౌరవంగా తొలగించడమైనది. బ్రదర్ welcome to "my" state.
గమనిక: ఇది తెలంగాణా వాదననో వాదులనో కించపరిస్తూ వ్రాసినది కానే కాదు. మీరు అనవసరంగా అపోహలు పెట్టుకోకండి. ఎదో శరత్ టపా చూసి ఉత్తేజితుడనై రాసినది అంతే. రాజకీయ రంగులు పులుముకొని చూడకండి. చూస్తే అది మీ ఇష్టం. నాకు తెలంగాణా, కోస్తా, రాయలసీమ, కర్నాటక కంటే భారతదేశం ముఖ్యం. తర్వాత నా ఊరు ముఖ్యం. నా భాగ్యనగరం యే ఒక్కరి వళ్ళో ఇంత అభివృద్ధి చెందలేదు.. ఎంతో మంది తెలుగు వారు, వెరే రాష్ట్రాల వారు అందరి సమిష్టగా కృషి చేస్తేనే ఈ మాత్రం ఉంది.
8 comments:
హహహ. బావుంది. నాలుగో పాయింట్ మటుకు హైలైట్. నాకు మండుతుంది ఎవరైనా హైడ్రాబాడ్ అంటే. అరే, ఈ దేశంలో ఎవరైనా తెల్లోళ్ళు అన్నారంటే అర్థం ఉంది కానీ అక్కడ పుట్టి అక్కడ పెరిగినవాళ్ళు హైడ్రాబాడ్, గొడావరి అంటుంటే అలాంటివాళ్ళని చాకలి వాళ్ళు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతకాలనిపిస్తుంది.
నేన్ భీ హైద్రాబాద్ జిందాబాద్.
మాకి కిర్కిరి. (అంటే అర్ధం తెలియదు)
ఇదేమన్నా బూతుపదమా? ఏదో హైద్బాద్ సినిమా నుండి నేర్చుకున్నా.
వస్తా, మల్లొస్తా.
ఇటేపు రమ్మంటే ...ఇళ్ళంతా నాదే అన్నడంట.. నీలాంటోడు..
ఇడుపుల పాయని మూడు భాగాలుగా చేసి అక్కడికి అందరి రాజధానులని తరలిస్తే సరి
ముఖ్యమంత్రి పోస్టు మీరు తీసేసుకుంటే, నాకేంటి? అహ నాకేంటి అనడుగుతున్నా?
>>"ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి."
మీకొచ్చే ఈ ఆదాయంలో నావాటా ఎంత?
కె.బ్లా.స. అధ్యక్ష పదవినే తూచ్...అని పక్కన పడేశా. ముఖ్యమంత్రి పదవి నాకో లెక్క కాదు. నాక్కావలసింది వాటాలు అంతే.. :) :) :)
లేకుంటే, ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న మలక్‌కో, ఏకలింగం గారికో సపోర్ట్ చేస్తా. :)
అన్నోయ్, పాపం ఆయనేవడో మధుకరో, దినకరో నంట, విలేఖరంట, తార్నాక వీరుడంట, అవసరమయితే l b nagar ఉద్యమం లేపుతానంటున్నడు, మన హైదరాబాద్ ఉద్యం మీద కోవర్ట్గా పని చేసి, శరత్ పెస్లిప్లు, జెంటిల్ మెన్ క్లబ్ రెసెప్ట్ లు అడుగుతుంటే శరత్ బ్లాగ్లో,
ఆయనకో ఇంఫర్మేషన్ మంత్రి పదవి అని ప్రామిస్ చేసి వచ్చా, ముందు మన హైదరాబాద్ రాష్ట్రం వచ్చేవరకూ మీడియాలో, కుక్కలాగా కవరేజ్ ఇస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి, ప్రస్తుతానికి ఇంఫర్మేషన్ మంత్రి కి ఇంకేవ్వరూ తువ్వాలేయకండే!!!
జై హైదరాబాద్ స్టెట్, జై జై హైదరాబాద్ స్టెట్
@పద్మ - బా చెప్పారండి. నాకు ఎవరైన హైడ్రాబాడ్ అంటే పరమ చిరాకు. వాళ్ళు ఎవరు ఎంటి అని చూడకుండ కరెక్ట్ చేస్తూ ఉంటా. ఇంకొంతమంది ఉన్నాము లేండి.. అందరు అదే బాపతి.
@ పులి- మాక్కి కిరికిరి అంటే మాక్కి కిరికిరి అని అర్థం.
@జమున - మరే. నా ఇళ్ళు నా ఇట్టం.. కద?
@ నాలో నేను - మరి అప్పుడైన మా ప్రియతమ నాయకుడు జగన్ ముఖమంత్రి ఔతాడా? దానికీ హై కమండ్ ని అడగాలా?
@ నాగప్రసాద్ - మనం మనం తర్వాత చూసుకుందాం. అంత ఆస్తి నేనుక్కడినే ఏం చేసుకుంటా? మీకు ఓ 200-300 ఎకరాలు ఇస్తాలేండి. డీల్ ఓకే నా? ముఖ్యమంత్రి పోస్ట్ నాది. ఏకలింగం, రౌడి ని సెట్ చేసేసా ఎప్పుడో...
@anon - ఇంకే. తార్నాకా ఐతే ఇగ ఇంటి కాడనే. సెట్ చేసేయి నువ్వు ముందు. ప్రామిస్సే కద.. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వు. ముఖ్యమంత్రి పదవి తప్ప ఏదైన "అడ్జెస్ట్" చేయచ్చు... ఐనా l b nagar లో ఎముందని ఉద్యమం లేపుతాడట?
హమ్మ, హమ్మ ఎంత అవమానం, ఎంత అవమానం! ఎల్ బి నగర్ లో ఏం వుందని అడుగుతున్నారా! తెలిసే అడుగుతున్నారా! మా ఇల్లు వుంది. అందుకే మధుకర్ అలా ప్రపోజ్ చేసాడోచ్.
Post a Comment