అనుకోనిదా? కోరుకున్నదా?
తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే బాగున్ను.
దెబ్బకి మిగితా రాష్ట్రం వాళ్ళు కూడా అడగడం మొదలెట్టారు. పైనుండి మొదలుకొని చూస్తే:
1. బెంగాల్ లో గోర్ఖాల్యాండ్
2. బీహార్ + మధ్య ప్రదేశ్ + ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ప్రదేశాలు కలిపి బుందేల్ఖండ్
3. ఉత్తర్ ప్రదేశ్ కొన్ని భాగాలతో హరిత్ ప్రదేశ్
4. గుజరాత్ లో సౌరాష్ట్ర
5. మహరాష్ట్ర లో విధర్బా
6. కర్నాటక లో కూర్గ్
7. తమిళనాడు - ??? వీళ్ళకి వేరు దేశం కావాలేమో మరి.
ఇవి సాధించడం పిచ్చ వీజీ కద. కె సి ఆర్ చూపిన దారి ఉంది కద. ఆయా ప్రదేశాల ఏం.పీ లు ఓ పది రోజులు సలైన్ పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తే చాలు. ఇవ్వన్ని చాలా చాలా యేళ్ళ నుండి అడుగుతున్నవే. ఈ రోజేమి కొత్త కాదు. కాని తెలంగాణా ఇస్తాము అనడం వళ్ళ అన్ని మొదలయ్యాయి.
ఈ పరినామం కాని, ప్రతినిధుల రాజీనామాలు కాని అస్సలు ఊహించనిది కానేకాదు. రాష్ట్రాన్ని విభజిస్తాము అంటే మిగితావాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? It makes perfect sense to the way they reacted. They owe nothing to Telangana.. but everything to Visalandhra. కొందరు వ్రాశారు కేంద్రానికి మంచి షాక్ తగిలింది అని. కాని నాకు అనిపిస్తోంది ఇది వాళ్ళు కోరుకున్నదే అని. అటు మేము తెలంగాణా ఇచ్చేదానికి ఒప్పుకున్నాము కాని ప్రజలు ఒప్పుకోలేదు అని అనవచ్చు. అటు ఇచ్చినట్టు ఉంటుంది ఇటు ఇవ్వనట్టు ఉంటుంది. ఇచ్చారు అని తెలంగాణా ప్రజలు ఆనందిస్తారు ఇవ్వలేదని విశాలాంధ్ర ప్రజలు హర్షితారు. భలే భలే!! నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.
ఒక "మేధావి" అన్న మాటలు - ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ఇప్పుడు తెలంగాణా వస్తే దోచుకున్న సొమ్ము తెలంగాణాలోనే పెడతారట. అందుకే వేరు రాష్ట్రం కావాలి అట. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు - ఇప్పుడు కూడా దోచుకొని కోస్తాలో పెట్టుబడి పెట్టచు కద? తెలంగాణా కి వేరు "రూపాయలు" లేవు కద? కొత్తగా రాష్ట్రం వచ్చినా వాడేది "ఇండియన్ రుపీ" నే కద? తెలంగాణా వస్తే అన్నల రాజ్యం ఎక్కువతుందేమో ఎందుకైన మంచింది అని పూర్వము కంటే ఎక్కువ డబ్బులు వేరే చోట పెట్టుబడి పెట్టడని నమ్మకం ఏంటి? ఆ వేరే చోట వేరు రాష్ట్రం కూడా అవ్వచ్చు కద? ఏంటో ..
ఈ గోల వళ్ళ హైదరాబాదు లో కాని మిగితా రాష్ట్రం లో ఎవైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకున్నవాళ్ళు ఇగ చేయరేమో. దాని వళ్ళ తెలుగువారందరికి నష్టమే. అంత ఆలోచనే ఉంటే ఇదంత ఎందుకు జరుగుద్ది? ఇక ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. . కాని ఈ పరినామం మాత్రం ఊహించనిది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.
7 comments:
పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. @@@@@@@@@
ప్రత్యెక తెలంగాణాకు అఅనుకూలం అని తాము చేసిన తీర్మానాలను బాహాటంగా తామే ఉల్లంఘించి ...
నిర్ణయం అధిష్టానం చేతిలో పెట్టాం.. అధిష్టానం నిర్ణయమే శిరో దార్యం అన్న జిత్తులమారి మాటల్ని ముసుగుల్ని తొలగించి ఇంత పచ్చి అవకాశ వాదం ను , గోముఖ వ్యాఘ్రాల నిజ రూపాలను చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తోంది.
"నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.
" Well Said
@Shivaram,
తెలుగు మాట్లాడుతూ, తెలుగు మా భాషే అంటూ, తెలుగు తల్లి విగ్రహాన్ని ముక్కలు చేసేవాళ్లకంటే, పాఠశాలలో తెలుగుతల్లి పాట వద్దు అనే వాళ్లకంటే నీచాతి నీచులు ఎక్కడయినా, ఏ భాషవాళ్ల అయినా ఉంటారా?
ఇక సినపిలగాడు చెందమామ కావాలి, చెందమామం కావాలి అని గుక్కపట్టి ఏడుస్తుంటే, అలాగే తెచ్చి ఇస్తాము లేమ్మా అన్నట్లే అన్నరుకాని, నిజం గా కాదు అన్నది మీకు తెలియని నిజమా? ఎన్నికలు పూర్తి కాకముందే ysr మాటలు మర్చిపోయారా? ఆ లెక్క తప్పినందుకే రాజీనామాలు అని మీకు అర్ధంకావటం లేదా?
సెలైన్ బాటిల్ పెట్టుకొని నిరాహార దీక్ష చేసేవాడిని నమ్మే గొఱ్ఱెలకున్న తెలివితేటలు, మామూలు మనుషులకు ఉండవా?
కోమాలోకి పోతున్నడు అన్నవాడు ఓ గ్లాస్ నిమ్మరసం తగగానే గెంతుకుంటూ ఇంటికెల్తుంటే అభినవ శూరుడు అని పొగిడే గొఱ్ఱెలుకూడా లాజిక్లు మాట్లాడటమా?
తెలంగాణా పేరు చెప్పుకొని, ఆంధ్రా పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు గుంజుకొని, హెలికాప్టర్లో తిరిగేవాడికి, జై జై లు కొట్టే గొఱ్ఱెలుకూడా నీతి గురించి మాట్లాడతాయా?
ఇదేనేమో గొఱ్ఱెలు వేదాలు వల్లించటమంటే!!!
ఆంద్ర: అమ్మా నన్ను ఈ పిల్లను చేసుకోమంటున్నావు భవిష్యత్తులోనాతో సరిగా కాపురం చేస్తుందో లేదో.
ఒప్పందాలు: లేదు బాబు ఆ రోజున రజాకార్ల చేతి నుండి ఈ పిల్ల శీలాన్ని కాపాడటానికి ఎంతో సహాయం చేసావు.ఈమె నీ ఆదీనం లోనే హాయిగా ఉండగలదు.
*********************
తెలంగాణ: నాకు నిజామే బాగున్నాడు ,వాడు రేప్ చేస్తే నీకేంటి ,చేయకపోతే నీకేంటి నిజాం దగ్గర ఉన్నరోజుల్లో నాది స్వర్ణ యుగం.నాకు డైవోర్స్ కావాలి.
ఆద్రా: అదేంటీ పెద్దల సమక్షంలో అందరి లో నిన్ను నాదానిగా చేసుకున్నా,మనం విడీపోతే ఎన్ని సంస్యలు వస్తాయి.నీకు ఏం కావాలో చెప్పు,నీ ప్రొబ్లెంస్ చెప్పు.
తెలంగాణ: నాప్రోబ్లెం నీ తరుపు వాళ్ళే ,వాళ్ళు నా కట్టుబొట్టును తిడుతున్నారు,నా బాసను వెక్కిరిస్తున్నారు.నా బంధువులను గౌరవించడం లేదు.మీ తరుపు వారు దొంగలు,దగా కోర్లు,మన ఇంటినంతటినీ పాడు చేసేసారు.
ఆంధ్ర: లేని పోనివి ఊహించుకోకు మొన్న మా పెదనన్నా హైటెక్కు సారీ కొన్నపుడు ఊరుకున్నావు,నువ్వు నా భార్యవని విడిపోవని , నమ్ముకుని మావాళ్ళు వాళ్ళ నగలను నమ్మకంగా మనకప్పగిస్తె వాటిని పెట్టుబడి పెట్టి మన ఇల్లు బాగు చేసుకున్నాము.ఆ రోజున నా భందువులు అందరూ బాగానే అనిపించారు. ఈ రోజు వారిలో లోపాలు కనబడుతున్నాయా.ఆ రోజే చెప్పకపోయావా మీరూ వద్దు మీనగలూ వద్దు అని.
తెలంగాణ: అదినాకు తెలియదు ,నాకు నువ్వు ఇష్టం లేదు ,నేను తిరిగి నా స్వర్ణ యుగానికి వెళ్ళిపోతాను,నాకు అవమానం జరిగింది డైవోర్స్ ఇచ్చేయి.
ఆంద్రా: అయితే వాళ్ళ కష్టం తో, కూలుతున్న మన ఇంటిని మేడలు ,అంతస్తులు చేసి కులుకుతున్నావ్ కదా అది వాళ్ళకు బధ్రం గా ఇచ్చేసి వెళ్ళిపో.
తెలంగాణ:అది ఎలా కుదురుతుది,నీ బంధువులు వచ్చినా సరే నేను ప్రేమగా చూసుకుంటా.నను నమ్మి మీరందరూ పొండి.
ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ... Had it been true, none in rest of Andhra would have bothered. They poured all their money into Hyderabad.
@శివరాం - అంటే మరి మరి ఇప్పుడు కె సి ఆర్ ది అవకాసవాదం కాదు. తెలంగాణా ప్రజలని ఉద్దరించాలన్న ఉత్తమమైన ఉద్దేశం అంటారా?
@anon - ఆ రెండు వ్యాఖ్యలు ఒకరిదే అనిపిస్తోంది. బా చెప్పరు. రెండవది అదుర్స్...
@సుజాత - ఆ మాత్రం తెలివే ఉంటే... ఇంత దాక ఎందుకు వస్తది? ఏమంటారు?
ఎవడు ఇచ్చాడు. ఎవడు తీసుకున్నాడు. నువ్వు బతకడానికి ఇక్కడికి వచ్చి మా కష్టార్జితాన్ని దోఝుకొని మమ్మల్ని హీనంగా ఝూస్తుంటే ఎవడు కలిసి ఉంటడు. వాడూ మనిషే కదా! హైదరాబాద్‌లో ఎక్కడ ఝూసినా ఆంధ్ర పెట్టుబడి దారుల చేతిలో తెలంగాణ ప్రజలు పని చేస్తున్నారు. గవర్నమెంటు ఉద్యోగాల్లోనూ ఆంధ్రవాళ్లే. ఇక తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు చేయద్దా? అడ్డంగా మీరుంటే మేం ఎలా చేస్తాం. అయినా మీరు వద్దు మొర్రో అంటే సిగ్గు, శరం లేకుండ మా వెంట ఉంటారంటారు. మీకు పౌరుషం ఉంటే మీ బతుకు మీరు బతకండి. మమ్మల్ని పట్టుకొని వేలాడకండి.
రాజీనామా చేసే వళ్ళు ఒక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం తీసుకోవాలి. ఈ ఉద్యమాలు, లొల్లిలు రాజకీయ నాయకుల ప్రోద్భలంతో సృష్టించబడ్డవే. ప్రతిసారి ఎన్నికయ్యేది, రాజీనామా చేసేది పిల్లాటలా!
Post a Comment