ఎందరో మహానుభావులు - మహాకవి శ్రీ శ్రీ
అతని కావ్యం ఉద్వేగం, అతని పేరు ఒక ప్రభంజనం, అతని మాటల చాయ ఒక అగ్ని పర్వతం. ఆంధ్ర దేశం లో అతను తెలియని వాడంటూ లేడంటే అది అతిసయోక్తి కాదేమో! ప్రపంచం లో ఎక్కడవున్నా ఒక తెలుగు వాడి హృదయంలో ఎన్నటికీ నివాశం ఏర్పర్చుకున్న ఆ "ఆవేశం" పేరు శ్రీ శ్రీ.
నేను సైతం అంటూ సకల జీవకోటి తో కదం కలిపిన మహానుభావుడు. ఆయన తన ఆలోచనలని ప్రపంచానికి అందించడానికి ఎన్నుకున్న పద్దతి మాటలే. కాని ఆయన ఆలోచనా సరళికి మాటలు సరిపోవేమో అని అనిపిస్తాయి. ప్రతి కవితలో ప్రతి పదం లో ఆవేశం ఉద్వేగం ఆర్తనాదం వినిపిస్తాయి. ఆ భావాలని ఆ అక్షర సంకెళ్ళు నిభందించేసాయేమొ అని అనిపిస్తుంది. "మనదీ ఒక బ్రతుకేనా .." అన్న ఆవేదన ఎందుకు నన్ను ఈ అక్షరాళ్ళోనే బంధించేసావు? అని ఎదురుప్రశ్న వేసినట్టనిపిస్తుంది.
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!
ప్రపంచం విధానాన్ని కేవలం ఆరు వాక్యాల్లోనే తెలియజేయగలిగిన అసమాన ప్రతిభావంతుడు ఆయన. ఇది జీవిత సత్యం కాదని ఎవ్వరు అనరేమో! ఆయన తరనికే కాకుండా భావితరలకి - తెలుగు భాష ఉన్నంతవరకు - ఈ మహకవి గురించి చెప్పుకుంటూనే ఉంటారని అనడం లో ఎటువంటి సందేహం లేదు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించి, నేను సైతం అంటూ జయభేరిని మ్రోగించాడు అన్నారు ఆచార్య చెలం గారు. ఇంత కంటే గొప్పగా శ్రీ శ్రీ గురించి చెప్పడం సాధ్యం కాదనిపిస్తుంది.
నేను అనేవాడిని మనుషుల్లో ఒక్కడిని, అందరికోసం మనం మన కోసం అందరు అన్న శ్రీ శ్రీ నినాదం ఈ కాలం లో చాలా చాలా సబబుగా అనిపిస్తుంది. మా అమ్మ నాకు ఇచిన్న ఏకైక పుస్తకం "మహాప్రస్థానం". జీవితం గురించి నువ్వు అందులో ఎల ఉండాలో అన్నవిషయం గురించి ఇంతకంటే నేను చెప్పను అన్న మా అమ్మ మాటలు ఈ పుస్తక ప్రతి అక్షరం లో వినిపిస్తుంది.
ఎందరో మహనుభావులు అందరికీ సతసహస్ర వందనాలు..
ఈ శిర్షికలో నన్ను ప్రభావితం చేసిన కొంతమంది మహనీయుల గురించి వ్రాయదలిచాను. అందున ఒక భాగమే ఈ టప.
0 comments:
Post a Comment