Wednesday, March 18, 2009

ఇంక కొంత కాలమేనా ?

ఈ మధ్యలో చాలా చోట్ల వింటున్నాము H1 B వీసా లు ఉన్న వారు పరి పరి కష్టాలు పడుతున్నారు అని. మొన్న బుడుగు కూడా ఈ విషయం మీద ఒక టపా వ్రాసాడు. మా స్నేహితుడు ఒకడు H1 extension కి query పడింది అట. ఇంకో సంవత్సరం అతడు చేస్తున్న ఉద్యోగం ఉన్నట్టు విజ్ఙాపన పత్రం పంపమని అన్నరట. పాపాం వాడి ఉద్యోగం ఇంకొక రెండు నెలల్లో అయిపోతోంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు.

చూస్తూంటే ఇక్కడ ఈ సంవత్సరం కూడా గడవడం కష్టం అనిపిస్తోంది H1 మీద ఉన్న వాళ్ళకి. TARP సొమ్ము ముట్టినవాళ్ళు H1లని ఎలగూ తాకడంలేదు.. మిగిలినవాళ్ళు ఆదరించినా extension ఒస్తుందో లేదో తెలియకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఉద్యోగాలు ఇస్తారు? పొమ్మనలేక పొగబెడుతున్నట్టు అనిపిస్తోంది.

కొత్తగా Green Card కోసం అభ్యర్థన పెట్టిన వాళ్ళ సంగతి ఏంటో కూడా బోధపడ్డం లేదు. labour అయినా clear ఔతుందో లేదో తెలియదు. అది ఇవ్వకపోతే ఇంక ఈ దేశం లో ఉండే సమస్యే లేదు. యేం చేస్తం..అన్ని రోజులు మనవి కావు కద అని అనుకోవడమే. ఆర్థిక వ్యావస్థ (economy) పరిస్థితి అంతగా ఏమి బాగోలేదు. ఈ రోజు ఫెడ్ ఇంకొక ట్రిల్లియన్ డాల్లర్లు దింపింది కాని అది కేవలం band aid లాగా అనిపిస్తుంది. ఇంకా market లో చాలా "పెంట" ఉంది. అదంతా పోవాలి అంటే ఇంకెన్ని TARPలు కావాలో. (ఈ విషయం మీద కొంచం విశ్లేషణ అవసరం.. అది ఇంకొక రోజు) ఒక్కట్టి మాత్రం సత్యం.. ఈ market stabilize అయ్యెపాటికి ప్రపంచ రూపురేఖలు మారిపోయింటాయి.

ఆ మారినా రూపురేఖల్లో ఎక్కడో H1 లు ఉంటారనిపిస్తోంది. ఇంక అమెరికా లో మా కొట్టు కట్టేసే సమయం ఆశన్నమైందనిపిస్తోంది.

7 comments:

జీడిపప్పు March 18, 2009 8:45 PM  

ఉన్నవాళ్ళకు కష్టమే, కొత్తవాళ్ళకు నరకమే!!

anveshi March 18, 2009 10:41 PM  

raani vallaki idioka swargame

Shashank March 19, 2009 8:12 AM  

@బుడుగు - కొత్త వాళ్ళాని అసలు రానిస్తున్నారా?

@అన్వేశి - రావద్దు రావద్దు అంటే వింటారా?

Anonymous,  March 19, 2009 8:38 AM  

ఇంకో పదేళ్ళ దాకా మర్చిపోండి అమెరికాని, మఱియు ఇంగ్లీషు మాట్లాడే అన్ని దేశాల్ని.

అదిసరే !

Economy = ఆర్థికత/ ఆర్థిక వ్యవస్థ

జీడిపప్పు March 19, 2009 9:01 AM  
This comment has been removed by the author.
జీడిపప్పు March 19, 2009 9:02 AM  

>> @బుడుగు - కొత్త వాళ్ళాని అసలు రానిస్తున్నారా?
65,000 కోటా తీసెయ్యలేదు అంటే కొత్త వీసాలు ఇస్తారనే అనుకుంటున్నా. ఒబామాకు ఇది మంచి చాన్స్. ఈ ఏడాది H1 B పూర్తిగా రద్దు చేసేస్తే, ఇక్కడ మంచి పేరు వస్తుంది. ఎవరికీ నష్టం ఉండదు.

Shashank March 19, 2009 11:10 AM  

@తాడేపల్లి గారు - తచ్చు అప్పు.. ఏదో ఆలోచిస్తూ రాసా... ధన్యవాదములు సరి చేసినందుకు. :)
మీరనట్టు పదేళ్ళు మర్చిపోవచ్చు.. జపాన్ లో లాగా ఇది the lost decade అయ్యేట్టేఉంది.

@బుడుగు - వీసాలు ఇస్తున్నారు కాని ఒచ్చిన వాళ్ళని రానిస్తున్నారా అని

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP