Wednesday, March 25, 2009

నిశివర్ణోశ్నోదకము..

ఈ అలవాటు ఎప్పటిదో ఎక్కడదిదో తెలీదుకాని.. ప్రొదున్నే ఓ కప్పు నిశివర్ణోశ్నోదకము.. అదే ఆంగ్లములో కాఫీ పడకపోతే (..దిండుపోతే దుప్పట్టిపోతే కాదు.. రోడ్డు మీదో రోకటి మీదో కూడా కాదు .. కడుపులో పడకపోతే) రోజంతా అదోమాదిరిగా - ప్రొదుట్టే MS సుప్రభాతం బదులు 'ఇప్పటికింకా నా వయస్సు ..' వింటూ లేచినంత వెరైటీగా ఉంటుంది. రత్రే డికాక్షన్ కి వేసి పడుకుంటా.. కాని నిన్న మరిచ.. ప్రొదున్న లేచి చూస్తే ఇంట్లో కాఫీ కి పొడి లేదు. పోనీ కాఫీ కాయలు (కాఫీ బీన్సు) అయినా ఉంటే నమిలేద్దాం అనుకున్న... అవి కూడా లేవు. ఏం చేయాలో బోధపడలేదు .. కాఫీ తాగితేనే నా బుర్ర పని మొదలెట్టేదానికి ఓ అరగంట పైనే పడుతుంది.. ఇంక కాఫీ లేకపోతే అంతే సంగతి.

దేవదాసు పక్కనే లేని కుక్కలా .. జారిపడేదానికి మనిషిలేని అరటితొక్కలా.. కఫీ లేని నా జీవితం ఒక్కట్టే అని అనిపించింది. ఏదో ఒక ద్రవం అని .windexO phenylO కోసం వెతుకుతూ పిచ్చి కేకలు పేడుతున్న నన్ను మా ఆవిడ తను ఊరెళ్ళి వస్తే నా చేష్టల్లాగా అనిపించాయి. ఇల కుదరదని పక్కనే ఉన్న కొట్టుకెళ్ళి తనే పొడి తెచి కాఫీ పెట్టిచింది. ఆఫీసు కి వెళ్ళకా రాసే ఫార్ లూపులు ఎప్పుడైనా రాయచ్చులే అని అసలు ఈ కాఫీ యొక్క పుట్టుపూర్వత్రాలు గురించి ఆరాతీసా కొద్ది గంటలు. అప్పుడు తెలిసింది..

నిశివర్నోశ్ణోదకోత్పత్తి -
శూతమహాముని అలా నడుచుకుంటూ వెళ్తూంటే హరప్పా మొహెంజదారోలోని ఆడ-లేడీస్ ఆయన్ని ఆపి ఇలా అడిగారు - 'స్వామీ మేము ప్రొదుట్టే లేచి ఈ-మేల్ చూసుకున్నాక కూడా ఈ మగజాతి లేవదు. ఇలా అయితే ఇళ్ళు చిమ్మి ముగ్గెట్టి బిందెలతో నీళ్ళుతెచి మాకు టిఫినీలు చేసేదిక్కు ఉండదు. వీళ్ళని ఉదయాన్నే లేపే ఏదైనా ఉపాయం చెప్పండి?' అందుకు ఆ మాహాముని ఇలా అన్నరు - 'పూర్వము నిశివర్ణన అనే ఒక పట్టణం లో మీలాంటి ఒక బాధితురాలు ఉండేది. వాళ్ళ ఆయన కూడా మీ వాళ్ళ లాగా ఉదయాన్నే అంటే అదే పదకొండు - పన్నెండు కు లేచేవాడు. ఇలా ఐతే ఇంటిపనులు అలానే ఆగిపోతాయి వంటా వార్పు .. పిల్లల స్కూలూ గట్రా కి ఆలస్యం ఔతుంది అని గ్రహించిన ఆ నిశివర్ణన ఈ విషయం మీద ఈశ్వరుని కొరకు తపస్సు చేసింది. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమడుగగా నిశివర్ణన తన బాధని తెలిపింది. అప్పుడు ఆ పరమేశ్వరుడి ఒక ఉదకము గురించి తెలిపి అది ఎలా చేయాలో కూడా చెప్పి, ఉదయన్నే ఈ ఉదకము సేవించేట్టూ ఒక వ్యసనం చేసి మాయమయ్యడు. అలా అప్పటి నుండి ఆ నిశివర్ణన తూ.చా తప్పకుండా ఉదయాన్నే లేచీ ఆ ఉదకమును తయారు చేసి తన భర్త కి ఇచ్చి పనులు చేయించుకునేదీ.
అందుకే ఆ ఉదకముని నిశివర్ణోశ్నోదకము అని అంటారు అని చెప్పి అది ఎల చేయాలో కూడా వివరంగా చెప్పి తన ఉదయ వ్యాహ్యాళి కి వెళ్ళారు శూతమహాముని.

అది మొదలు ఇన్ని వేళ సంవత్సరాలు ప్రొదుట్టే లేచి కాఫీ పెడుతున్న మన ఆడ-లేడీస్ కోసం ఈ పాట అంకితం

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

పాలు కాచింది కాఫీ కోసం...

11 comments:

జీడిపప్పు March 26, 2009 12:03 AM  

"లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
పాలు కాచింది కాఫీ కోసం... "

హ హ్హ హ్హా బాగుంది బాగుంది.
అప్పడాల కర్ర తీసింది నీకోసం! :)

bharath March 27, 2009 10:18 AM  

[ఒళ్ళు ]
ఎలా గుంది ఎలాగుంది అబ్బాయా
వేడి గుందా చల్లగుందా అబ్బాయా
అని అడుగుతారేమో సార్ ఆడ లేడిస్
konchem jaagratha
baagundi story
jayabharath

Shashank March 27, 2009 11:46 AM  

@బుడుగు - హి హి హి...

@జయభారత్ - ఈ విప్లవాన్ని ఆపలేరు ఎవ్వరు. ప్లాస్టిక్ గొడుగుతో తుఫాన్ని ఆపలేరు. ;-)

sravya geethika March 29, 2009 1:52 AM  

naaku blogging kothha sahaya padagalaru mariyu nisivarnosnadakam nisivarnana ane charcter ni srustinchi chesina prayogam baagane nenu pelli ayipoyaka follow ayipothanoch :)

Shashank April 06, 2009 8:27 AM  

@ శ్రావ్యా గారు.. follow అయ్యేదానికే పెళ్ళి కి కమిట్ అవ్వకండి. ;-) పెళ్ళయ్యాక మీరు మరో నిశివర్ణన అవ్వాలని ఆశిస్తూ..

sravya geethika April 06, 2009 8:39 AM  

hmmm shasank gaaru nenu inka chinna pillani btech 1st year last lo unnanu next month ki second year ki vasthanu appude pellenti nenu kooda eppudo avthadi kadha daani gurinchi matladanu :P

Shashank April 11, 2009 9:41 AM  

arerre.. ayite inkA chAlA chAlA rOjulundi. tension leedu lE. bAgA chaduvukO... alanE inkA bAgA enjoi chEskO.

Karthika April 11, 2009 2:55 PM  

Hehehe manchi coffee post :).

జ్యోతి July 25, 2009 9:58 AM  

అంతా బానే ఉంది. ఈ కాలంలో ఏ భార్యామణి ఇలా కాపీ చేసిస్తుంది అంటారు. మీ సంగతేంటి మరి..:)

పరిమళం July 26, 2009 5:40 AM  

నిశివర్ణోశ్నోదకము :) ఓకప్పు నాక్కూడా ...

Shashank July 26, 2009 8:39 AM  

జ్యోతి గారు - మా ఆవిడని కాఫీ అంటే పోరా అంటది. పెళ్ళైన కొత్తలో ఓ వారం పెట్టించింది అనుకుంటా తర్వతా లేదు. :) తను తాగదు ఎలాగో నేనే ముందు లేస్తా కాబట్టి నా కాఫి నాదే.

పరిమళం గారు - Rs 3 ఇవ్వండి ఐతే అటు పంపుతా ఫిల్టర్ కాపీ..

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP