Thursday, May 7, 2009

ప్రేమ కథ - 2

ఇలా ఉన్న సమయం లో నేను ఏదో ఇంకొక అమ్మాయిని లైన్ లో పెట్టే సమయం లో నా కష్టాలు అలా అప్పుడప్పుడు ఈ అమ్మాయి (అంటే నా కథ లో వీరోయిన్) తో యాహూ చాట్ లో మాట్లాడేవాడ్ని. అల మా మధ్యలో సఖత్వం పెరిగింది. తనకి నా ఇంతక ముందు ప్రేం కహాని తెలీడం వలన వాళ్ళ ఇంట్లో నా గురించి అడిగినా కుదరదు అని చెప్పేసింది. కాని ఆ టైం కి నేను మళ్ళి ఏకాఇకినే అని తెలేదు తనకి. అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళు మా ఇంటికి సంబంధం తెచ్చినప్పుడు .. ఆ విషయం తనకి తెలిసి టాస్ పూస్ అని ఎగిరింది అట. ఇది చాలా natural reaction అనే అనిపించింది నాకు.
ఇది ఇలా ఉండాగా.. నా ప్రేం కహాని అంతలో ముగుసింది as usual. రెండు వారాలు అప్పుడప్పుదు ఒక నెల కంటే ఎక్కువ యే అమ్మయీతో నేను మాట్లాడలేదు.. నాకు వాళ్ళు బోరు కొట్టేవాళ్ళు.. అలనే వాళ్ళకీ నేను అలనే అనిపించేవాడ్నేమో. ఎదో అలా మా నాన్నా ఫోను బిల్లు పెంచేదానికి తప్ప నా ఎక్స్-గరళ్ ఫ్రెండ్స్ వళ్ళ నాకంటూ ఎప్పుడు ఖర్చు ఉండేది కాదు. (అమ్మయిలని పటాయించాలి అనుకుంటున్న కుర్రాల్లారా.. ఈ విషయం మీకు చాలా చాలా చాలా యింపార్టంట్. మన జేబు మీద భారం పడితే లైట్ తీసుకోండి. అమ్మయిలూ మాలో ఇలాంటి పీనాసి కుర్రాల్లు కూడా ఉంటారు. మీతో ఖర్చు పెట్టిసూ.. గుర్తెట్టూకోండి.. దయతలచి మాకు అప్పులు ఇవ్వండి). సరే ఇలా చాట్ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ.. నాకు ఈ అమ్మయి నచ్చడం మొదలైంది. మా అమ్మ కి చెప్పా.. ఇదిగో అమ్మ నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మయి నాకు నచ్చింది. నీకేమైన అభ్యంతరమా అని. నీకూ అమ్మయికి ఏమీ ప్రాబ్లం లేకపోతే మాకేమి అభ్యంతరమ లేదు రా అని. సరే ముందే తెలుసుకుంటే మంచింది అని వాళ్ళ అమ్మ ని అడిగేసా.. ఆంటీ మీకేమైన అభ్యంతరమా అని. మాదేముంది చేసుకునేది అది.. దాని ఇష్టం అన్నారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోయేదానికి డిసైడ్ అయ్యాను.
ఇలా నేను ముందే వాళ్ళ అమ్మ పర్మిషన్ గట్ర తీసుకున్న అని తెలీదు మన వీరోయిన్ కి. అందుకే ఫోనే చేసినప్పుడు ఫ్రెండ్షిప్ కొద్ది మాట్లాడేది. అల కొన్ని కార్డ్ల తర్వాతా అంటే రెలైయన్స్ షేర్లు నా ఫోను బిల్లు వళ్ళ పెరిగాకా అప్పుడు చెప్పా.. నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే ఇంకిష్టం అని.. నీ గతం అంత తెలిసిన నాకే లైన్ వేస్తావా అని ఎగిరింది. ఏం చేస్తాం.. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇదే లాస్ట్ ఒప్పేసుకో అన్న.. బ్రతిమలాడా.. అడ్డుకున్నా. కాని చెక్కు చెదరని ఆత్మవిశ్వాశం తో గెట్ ఆవుట్ టైప్ లో అన్నది. ఇది మనకి మామూలే కద అని పెద్దగా పట్టించుకోలేదు. ఓ వారం అంటే ఓ రెండు రోజులు గాప్ ఇచ్చి మళ్ళి ఫోన్ చేయడం మొదలెట్టా. ఇలా మరి కొద్ది రోజులు గడిచాక చెప్పింది.. వాళ్ళ అమ్మ వాళ్ళాకి ఏం అభ్యంతరం లేకపోతె తను అప్పుడు ఆలోచిస్తా అని. ఇంక పూజారిని బుట్టలో వేసుకోవలి అని బాగా ఆలోచించి ఒక పకడ్బంది ప్ల్యాన్ వేసా. ముందు మా అత్తగారిని బుట్టలో వేసుకున్న. రాముడి కంటే మంచి బాలుడు కావడం వలన సులువుగా అయ్యింది. తర్వత మా మామాగారితో మాట్లాడి. సుధీర్గ చర్చానంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇగ మిగిలింది వీరోయినే. అప్పుడే ఒప్పుకుంటే ఇంత కథ ఎందుకు ఉంటది? వాళ్ళ అమ్మ వాళ్ళు అల అన్న.. తనకి ఇంకా నమ్మకం కుదరలేదు. వాళ్ళా పిన్ని తో, అక్క తో, బావా తో, వాళ్ళ జిల్లా లో ఉన్న వాళ్ళందరితో, బాలాయ్య తో మాట్లాడి వాళ్ళొప్పుకుంటేనే అని షరత్తు పెట్టిండి. ఇలా దాదాపుగా ఒక పది రౌండ్ల ఇంటర్వ్యూలు అయ్యాయి.. (నిజమండి బాబు.. నాకు ముందే ఇంటర్వ్యూ అంటే చచ్చేంత భయం.. అలాంటిది పది రౌండ్లు అంటే ఆలోచించండి) నామీద నాకే ఆశ్చర్యం వేసింది. అసలు నేను నేనేనా అని డౌట్ కూడా వచ్చింది. నాకు ఇంత ఓపిక ఎక్కడిదో ఇంకా మా అమ్మ కి చిన్నప్పటి నుండి నేను తెలిసిన వాళ్ళకి ఆశ్చర్యం. కళ్యానం వచ్చినా ఇంకేదో వచ్చినా ఆగదు అంటారు కద.. అల ఏదో అయ్యింటది అని ఫిక్స్ అయిపోయారంతా. ఇలా అందరు నేను ఉత్తముడిని నా భూతో న భవిషత్ ఇరగ కత్తి అని పరి పరి విధములుగా పాస్ చేయడం వలన తను కూడా సరెలే పపం వీడు ఇంతలా ఇనేళ్ళగా వెంట పడి కష్ట పడుతున్నాడు కద అని ఆలోచించి. నిన్ను ఒక్క సారి చూడాలి.. చూసి చాలా రోజులైంది కద అని అన్నది. అల తను అన్నదో లేదో ఇలా నేను టికెట్ ఎట్టుకొని రెడీ అయిపోయా.
ఇదే ఫైనల్ ఫేస్ టు ఫేస్. మా ఆవిడ నన్ను అడిగిన ఏకైక క్వెస్చన్ నీకు వంట వచ్చా? చదువుకునే రోజుల్లో నాకు బ్రహ్మం (చిత్రం భలరే విచిత్రం గుర్తుందా?) అని అంటారని చెప్పాను. ఇలా ఇంకొన్ని ప్ర-జలు నడిచాయి. నాకు గుర్తుండి నేను అడిగిన ఒకటే ఒక్క ప్రశ్న నువ్వు క్రికెట్ చూస్తావా అని. తను ఓ యెస్ అన్నది. ఇంకే సీన్ కట్ చేస్తే రెండొ రోజు నిశ్చితార్థం.. అజహర్ టెస్ట్ లో అత్యధిక స్కోరు లా 199 రోజులు తర్వత లగ్గం. ఏ 199 రోజుల్లో నా ఫోను బిల్లు అక్షరాలా వెయ్యి డాలర్లు.. అది వేరే విషయం అనుకోండి.
ఇప్పుడు ఎవరైన మమ్మల్ని మీది ప్రేమ వివహమ పెద్దలు కుదిర్చినదా అంటే నేను చెప్పేది (ఇల చెప్పి చెప్పి మా ఆవిడని ఆల్మోస్ట్ కన్విన్స్ చేసేసా ఇదే నిజం అని) - నేను బుద్ధిగా చదువుకొని శ్రద్ధాగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే తనే నా వెంట పడి 18 నెలలు నిరంతరం వేధించి సాధించుకుంది అని. :-)

8 comments:

జీడిపప్పు May 07, 2009 10:35 PM  

కథ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కొట్టేశావు.. ట్విస్ట్ లేదు!
ఫినిషింగ్ టచ్ బాగుంది :pouce:

Too many typos!!

Karthika May 08, 2009 12:18 AM  

Ayya babboyyi mundu post kante inka peddadi idi :).Neelo improvement nadavadam kaadu ekanga parigetestundii hehehe :).

Niceeee mothaniki happy ending kadaa :).

Shashank May 08, 2009 7:13 AM  

dinne rendu postla ga cheddam ante antha story leedu.. + baddakam. anduke..

toyota showroom lo tires maarustunnappudu raatri 10 ki ilaneuntadi typolu.. adjust guru.. nuvve kada cheppav.. bhaavam mukhyam vattulu kaavu ani.. :-D

@pinki.. :-D edo nee abhimaanam.

నేస్తం May 08, 2009 10:13 AM  

నాకో విషయం తెలిసింది మీ ముగ్గురూ ఫ్రెండ్స్ అన్నమాటా :) మొత్తానికి ప్రేమ కధ సుఖాంతం అన్నమాట ఇంతకూ వంట ఎవరు చేస్తున్నారు ఇంట్లో చెప్పనే లేదు

Shashank May 08, 2009 4:15 PM  

నేస్తం - నాకు జీడిపప్పు చాలా యేళ్ళ నుండి పరిచయం. పింకి మంచి స్నేహితురాలు. :) మీరు ఎంతైన భలే షార్ప్. ఇట్టే పసిగట్టేస్తారు ఎలాంటి విషయమైనా..
ఇంట్లో వంటా? స్పెషల్స్ - అంటే పాలక్ పన్నీర్, హైదరబాది బిర్యాణి, బగర బైంగన్ గట్ర లాంటివి నేను చేస్తా.. రోజువారి వంట ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు చేస్తాం. నాకు తిక్క గా ఉంటే మాత్రం నేనే చేస్తా.. వండితే నాకున్న చిరాకు పోతుంది.. kinda my stress reliever

వేణూశ్రీకాంత్ May 08, 2009 8:31 PM  

:) కధ బాగుంది...
వండితే చిరాకు పోతుంది !! good to know my friend :) ఇంతకాలం నేనొక్కడినే ఇలా వంట చేస్తూ రిలాక్స్ అవుతాను అనుకుంటున్నాను. పాటలు పెట్టుకుని వంట చేసుకోడం నాకు కూడా మంచి స్ట్రెస్ రిలీవర్. అప్పుడప్పుడూ కూరగాయల మీద నా ప్రతాపం చూపిస్తూ రిలీఫ్ పొందుతున్నానేమో ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా అని అనుమానం కూడా వస్తూంటుంది :-)

Shashank May 08, 2009 11:40 PM  

వేణు - వెర్రి వెయ్యివిధాలు.. అందులో మనదీ ఒకటి. ఉత్తమమైన stress reliever కదు!! ఎవ్వరి మీద అరిచే పని లేదు... తిట్టుకోడాలు కొట్టుకోడాలు లేదు.. ఎదో హాయిగా ఓ నాలుగు రకాల వంటలు చేసుకొని ప్రశాంతంగా తినడమే. నాకు ఇంకో పిచ్చి కూడా ఉందండోయి.. ఎంత చిరాకు ఉంటే అంతే proportional గా వండే టైం మారుతుంది. కొన్ని గంటల తరబడి చేసే వంటలు ఈ కోవకి చెందినవి. :)

రక్తకన్నీర్ నాగభూషణం గారి పాట గుర్తు తెచ్చుకోండి - అయ్యో బుచ్చిబాబు అయ్యయో చిట్టిబాబు ఈ ప్రపంచమే తిక మక.. మక తిక.. ముఖ ముఖానికి రకరకాలుగ రంగులు పూసిన తికమక..

Veena,  May 28, 2009 9:30 PM  

story baagundi, BTech allari ni baaga tone down chesinattunnav :wink:

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP