Friday, May 8, 2009

దిల్లీ 6- జోర్ సా ఝట్కా జోర్ సె లగా..

సినిమా మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తారు అనేదానికి మా బావగాడి ఉవాచ - ఎలాగో థియేటర్ వాడికి, నిర్మాత కి మనం చదివించాల్సింది చదివించేసాము, ఇంక మన తో ఆ దర్శకుడికి పెద్దగా అవసరం లేదు .. మన ఖర్మకొద్ది మిగితా సగం చూడచ్చు లేకుంటే బ్రతుకు జీవుడా అని పారిపోవచ్చు. ఇలా నాకు సినిమా మధ్యలో నుండి పారిపోవాలి అని ఇప్పటివరకు జెస్ట్ రెండే రెండు సార్లు అనిపించి లేచ్చి వచ్చాను. అల రావడం వలనే ఇంకా మతిస్థిమితంగా ఉన్నా అని ఎప్పుడూ అనిపిస్తూంటది. రజనీకాంత్ - మాధురి దీక్షీత్ "శంకర్", నాగ్ - "డాన్" లాంటి ఆస్కర్ లెవెల్ చిత్రాలనే అవలిలగా తట్టుకున్నా.. అలాంటిది రెండు సినిమాల మధ్యలో నుండి వాక్-ఔట్ చేశా.. అవి ఏంటో చెప్తే నన్ను బోలెడు మంది తిడతారు. అయిన పర్లేదు .. ఒకటి దర్శకేంద్రుని "పరదేశీ" (గుర్తుందా? అదేదో talent search పెట్టి నలుగురు జాతి రత్నాలని ఎన్నుకొని, ఒక ముష్టి కథ తో తీసిన ఘనమైన చిత్రం అది. చూసినోళ్ళకి సతసహస్ర వందనాలు. మీరు నాకంటే చాలా ఘనులు.). ఇంకొకటి .. చెప్పేస్తున్నా.. ఇదిగో మళ్ళ నామీద అరవకండి - హం ఆప్కె హై కౌన్. నా జీవితం మీద నాకే విరక్తి కలిగించిన చిత్రం. మూడు నెలల ముందు టికెట్ కొని మరీ దొబ్బించుకున్నా. సగం అయ్యేసరికి నా జుట్టు నెరిసిపోయింది.. నేను చార్మినార్ కట్టినట్టు, టీ లో సాంబార్ పోసుకొని బ్రెడ్ తో తిన్నట్టు ఇల రక రకాలుగా అనిపించింది. అందుకే లేచ్చొచేసా(ము).

ఇప్పుడివ్వన్ని ఎందుకు చెప్తున్నా అంటారా.. అబ్బే ఏమీ లేదు.. దిల్లి 6 చూసాక ఎందుకో ఇవ్వన్ని గుర్తొచ్చాయి నాకు. తాడు బొంగరం లేకుండా ఏదో అప్పట్లో ఆషికీ సినిమా తీసినట్టుగా ఉంది. మొదట్లో ఓహో ఇది మతసామరస్యం మీద మూవీ అనుకున్న.. తర్వత కాలా బందర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓహో ఇది satarical మూవీ అనుకున్న.. మధ్య మధ్యలో అంటే అసలు ఎందుకు వచ్చాయో ఎల వచ్చాయో అర్థం లేకుండా పాటలు వచ్చినప్పుడు ఓహో ఇది మ్యూజికల్ మూవీ అనుకున్న.. కాని ఇది ఏదీ కాదు. అన్ని అని చివరకి తేలింది.

ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది.. బహుశా రహమాన్ సంగీతం సమకూర్చాకా కథ రాశారేమో అని. ఎందుకంటే చాలా చోట్ల చాలా డిస్జాయింట్ గా ఉంటుంది. రెండేళ్ళ పిల్ల కి ఆ సంవత్సరం లో తిరిగిన ప్రదేశాల చిత్రపటాలు ఇచ్చి ఒక ఆల్బం లొ పెట్టమంటే ఎల ఇష్టం వచ్చినట్టూ పెడుతుందో ఊహించుకోండి. అదే దాదాపుగా మూడూ గంటలు సినిమా తీస్తే ఎల ఉంటుంది? సేం టు సేం. కథ పరంగా ఐతే ఒక కోతి వళ్ళ మనుషులు మతి ఎల కోల్పోతారో మత కలహాలు ఎల రేగుతాయో.. అదే ఒక కోతి వళ్ళ అని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. మనిషి కోతి నుండే పుట్టాడు కావున మనిషి కలహాలు కూడా కోతి వళ్ళనే అన్న నిజాన్ని నేను ఈ చిత్రం ద్వారా గ్రహించాను.

అభిషేక్ సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉంటాడు. బోలేడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు పోతారు. ఎందుకు అన్నరంటే డిక్కి లో తొంగోబెట్టేస్తా. అది అంతే. వాళ్ళకి డబ్బిచాడు కద నిర్మాత? అందుకే వాళ్ళు వస్తారు. పోతారు. నీకెందుకోయి? ఆ సోనల్ కపూర్ గురించి నేను చెప్పదల్చుకోలేదు. అనిల్ కపూర్ అమ్మయిగా పుట్టింటే ఎల ఉంటాడో అలనే ఉంది. బహుశా ఇంకొక ఐదేళ్ళ తర్వత ఏమైన మార్పు వస్తుందేమో పిల్ల లో చూడాలి. అప్పటి వరకు అయితే లైట్. ఆ మధ్యలో మీనాక్షి అని టబు తో యం.ఎఫ్.హుస్సేయిన్ తీసాడు. గుర్తుందా? భలే పాటలు. ఇది అంతే. ఐ.క్యూ ఒక 300 ఉంటే కాని అర్థం కాదేమో. నాకు అంత టాలెంట్ లేదు. మీకుందేమో చూడండి. ఈ సినిమా చూస్తే ప్లీజ్ ప్లీజ్ నాకు కథ చెప్పడం మరువకండి.

5 comments:

Unknown May 08, 2009 7:22 PM  

ha ha ha ha... naaku ardham kaala movie... nice blog...

Bhãskar Rãmarãju May 08, 2009 9:57 PM  

:)
నాకైతే సినిమా బాగనే నచ్చింది. పాటలు బాగున్నాయ్. అభిషేక్ నా ఫేవరైట్. అనిల్ కపూర్ కూతురు బాగా చేసింది.
పిక్చెరైజేషన్ బాగుంది. బ్యాక్ డ్రాప్ సంఘటనలు, ఆవు రోడ్డు మీద ఈనటం..మనకళ్ళముందు జరిగినట్టుగా ఉంది. ఓ పెద్ద కధేమీ లేదు. కాని కధనం బాగుంది.
నాకు నచ్చితే అందరికీ నచ్చాలని ఏమీలేదు లేండి. ఎవరి దృష్టి వారిది.

మీరు రాసిన విధానం బాగుంది...
మీ వారాంతాన్ని ఆనందించండి.

Shashank May 08, 2009 11:30 PM  

@శ్రీ చందన - అది మనలాంటి వాళ్ళ కోసం కాదులే. కనిష్ఠం డా|| ఏ.పీ.జే లెవెల్ అయ్యిండాలి. glad to hear someone other than me has also not understood the movie :) :)

@భాస్కర్ గారు - ధన్యవాదములు.
నేను సినిమా గురించి అదే చెప్పానండి.. రెండేళ్ళ పాపా కి ఫొటో ఆల్బం ఇచ్చి సమకూర్చమని అన్నట్టుగా అని.. అంత మాత్రానా ఫొటోలు బాలేనట్టూ కాదు కద. తాడూ బొంగరం లేనట్టూగా అనిపించింది. random గా రోజువారి జరిగే సంఘటనలని ఎంచుకొని మధ్యలో అద్భుతమైన పాటలు పెట్టినట్టూగా అన్నమాట.

Karthika May 09, 2009 1:55 AM  

hmmm movie chudaledu kaani trailors aithe baane unnayi :).Songs r gud anduloo sonam soooo cutee :).

I love rehna tu n masakali vere songs kuda bane unnayi :).

chusina vallu antha baledu ani 1st day ne chepparu so anduke nenu chudaledu aa movie :).

Shashank May 09, 2009 4:07 PM  

songs bAgunnAyi. vATi madhyalO movie nE.. adO type lO undi. masakalli song vinnaka adi chuste koncham vareity ga anipinchindi..

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP