నేను నా లాప్ టాప్...
మొన్న శుక్రవారం మా ఇంట్లో ఓ భయమకరమైన బాంబ్ పేలింది. ఈ మధ్యలో మన నగరాల్లో పేలుతున్న రకం కాదు. ఇది నా జీవితానికి సంబంధించినది. నేను ముద్దులార చూసుకుంటున్న నా లాప్ టాప్ చచ్చింది. గత నెల రోజుల నుండి నేను అహర్నిశలు చేసిన పని మొత్తం ఢమాల్ అయ్యింది. నాకేమో ఏం చేయాలో తెలీలేదు. ఈ వారాంతం మాకో డెలివరీ ఉంది. ఇప్పుడు ఇల అయితే కనిష్టం ఒక వారం ఎక్కువ ఔతుంది.. మాకు అంత సమయం లేదు. ఇంక చూడాలి నా పరిస్థితి.
అప్పుడు సమయం ఏమో రాత్రి 9 అవ్వబోతోంది. ఇంక షాపులు కూడా ఉండదు. వెంట్టనే వెళ్ళాం ఓ రెండు షాపులకి. కాని ఎక్కడా నాకు డాకింగ్ స్టేషన్ దొరకలేదు. నా లాప్ టాప్ మొదలు పెడితే బూటింగ్ శబ్ధం వస్తోంది కాని ఏమి కనిపించడం లేదు. అందుకే ఇది మానిటర్ గొడవేమో అనుకున్నా. మా బాస్ కి ఒక ఫోన్ కొట్టా బాబు కలెక్షన్ నిల్లు బాలు నా బ్రతుకు బస్టాండు పాలు అని. ఆ పిడుగు లాంటి వార్త విన్న వెంట్టానే రాయిలా గట్టిగా ఉండే మనిషి ఏక ధాటిగా "పరదేశీ", "వివాహ్", "హం సాత్ సాత్ హైన్" వరుసగా చూసిన వాడిలా ఢీలా పడిపోయాడు. ఇంక ఇల అయితే చేసిన పనే మళ్ళా చేయాల్సొస్తదా అని మా పాత కంపనీ లో పని చేసే స్నేహితుడి వెంటబడి పాపాం వాడు నిద్ర పోతున్నా లేపి ఆపీసు కి తీస్కెళ్ళి డేటా మొత్తం కాపీ చేయించా. దాని వళ్ళ కొంచం ఊరట కలిగింది. తీరా ఇంటికి వచ్చి మరోమారు మొదలెట్టేప్రయత్నం చేస్తే నా లాప్ టాప్ ఆన్ అయ్యింది. యాహూ అనుకొని అటు ఇటు కొంత సేపు గెంతా. మిగిలిన డేటా అంతా కాపీ చేసుకున్నా. ఇది శుక్రవారాం.
నా లాప్ టాప్ కి నా గురించి ఎంత క్షుణ్ణాం గా తెలుసంటే టంచన్ గా అది సోమవారం ప్రొదున్న మళ్ళా పని చేయడం ఆపేసింది. రెండు రోజులు పని చేసింది కద అన్న ఆనందం కాస్త ఈ రోజు ప్రొదున్నకి తీరిపోయింది. దాంతో మధ్యానం వరకు ఒక డాకింగ్ స్టేషన్ కోసం తిరగని చోటు లేదు ట్రై చేయని పోర్టు లేదు. విధి ఆడిన వింత నాటకం లో నా లాప్ టాప్ ఇంక పని చేయడం పూర్తిగా మానేసింది. డెల్ల్ వాడికి కాల్ చేస్తే వాడేమో ఇంకే ఎత్తి చెత్త కుప్ప లో పడేయి అన్నాడు. అంటే ఇంచు మించు గా ఇదే రకం గా అన్నాడు. మళ్ళా కాంగ్రెస్స్ గెలిచినంత బాధేసింది. అదే చెప్పా వాడికి.. పాపాం మేగాస్టార్ ఫ్యాన్ అనుకుంటా ఇంకో ఉపాయం చెప్పాడు. తల్లిరేకు - అంటే మదర్ బోర్డ్ మారిస్తే బాగుపడచ్చు అని. ఇంక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి ఒక మదర్ బోర్డ్ కొరకు దరఖాస్తు పెట్టా. అది రేపు వస్తుంది. తర్వత మళ్ళా ఎక్స్.పి మొదలు అన్ని పెట్టుకోవాలి. ప్చ్.. అది ఈ రోజు నా దుస్థితి. ఇంక రేపు లాప్ టాప్ తెరిచి కొత్త మదర్ బోర్డ్ పెట్టి అన్ని సక్రమంగా సాగితే దాని నుండి ఇంకో టపా వేస్తా. లేకుంటే అనుకునదొక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుకుంటూ కనిపిస్తా...
నేను లేను కద అని వందలకొద్ది టపాలు వేయకండి. ఓ పది అంటే తట్టుకోగలను.
23 comments:
yekadhati gaa paradesi, vivah... hahahaaa
malli congress gelichinattu hahahaaa
nuvvinthaka mundu postullo cheppinattu kastaalu manaki kaaka manchu brothers ki vasthayaa :)
aa davilag copyrights naavi kaadu (mana ammu vi) just copy kotte rights naavi.
yEm cheppamanTAv lE nA sinemA kashTAlu. ganTa nunDi manuals vetukutunna ela replace chEyAlA ani. vijayamO nA laptop ki vIraswaragamO chUddAm.
ఎల్లో వీణా వాజ్జప్!!
@ CD - అయినా ఎవడన్నా ఆఫీసు వర్క్ personal ల్యాప్‌టాప్లో పెట్టుకుంటారా? నా ల్యాప్‌టాప్ ఇప్పుడే బాల్చీ తన్నేసినా ఏమీ ఫరక్ పడదు పని విషయంలో :smoke:
talli reku..keka
intha badha lo kuda twists petti baga raasav..neeku abhinandanalu
reku maarchka malli raayali maakosam
మీకోసం నేను రెండురోజులకు ఒకసారి లేదా మూడురోజులకి ఒకసారి టపా వ్రాస్తాను. ఇంతకంటే త్యాగం ఏం చెయ్యగలం మీకోసం.
:) thanks
@ బుడుగు - బానే ఉన్నావా? నట కీచక విషాల్ నటించిన పిస్తా చూసావా? పర్సనల్ లాప్ టాప్ ఏంటి? ఇది ఆఫీసు లాప్ టాప్. ఆఫీసు ఉండగ మనకి లాప్ టాప్ యేల దండగా అని కొనలేదు పర్సనల్ కి. ;-)
మళ్ళా ఆఫీసు ది అయితే నువ్వెందుకు మారుస్తావ్ లాంటి ప్రశ్నలేస్తే చెట్టుకి కట్టేసి యే యే దేశాలు తిరిగాడొ మొదలెడుతా. తర్వత నీ ఇష్టం.
@ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే - ఏదో మీ అభిమానం. మన దేశం తో పోలిస్తే నా కష్టాలు చాలా చిన్నగా అనిపించి ....
@అమ్మా - ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు. చెలరేగిపోతా. :)
ohhh ...
daniki virakthi vachi untundii nee meeda+nuvvu use chesse dani meeda hehehe :).
nenu evaro cheppuko chuddam???
guess guess
@ పింకీ ? అయినా అంత గెస్సింగ్ టాలెంటే ఉంటే కౌన్ బనేగా కరోడ్పతి లో కొన్ని కోట్లు గెలుచుకునేవాడ్ని కద. నువ్వే చెప్పు .. నువ్వు ఎవరో నేను ఎవరో అని. :-)
one week back nenu kooda ilanti experience face chesanamdi. thinkpad meeda vipareetamaina nammakam tho, neellalo tadipesa :D consequences meeda oka blog tvaralo raddamanukuntunna :)
guru adi thinkpad swimpad kaadu. aa vishyam late ga ayina telusukunnav. :-D
naadi dell d610. refurbished. vaddu ra nayana kottadi konu xp neenu instal chesukunta ani saikumar voice range lo cheppa maa vaadiki. vinaleedu. em chestam.
hmmm rite ritee nenee hehehe :).
Nenu chebtha nenu chebtha nuvvu evaro nenu evaro ani :).
nuvvu waste nenu great heheh:).
idi time kalasi raka povadamu basu.
laptop nade kada ani ekamga office ne andulo imadchu tanante..yela?tanokati talanchite daivam okati...ane nanudu vine untavu.hayiga musugu tanni gurrapettu,leda kalukalina pilli la
danni chankana pettukuni shopula chuttu turugu.
Paapam chaala kashtaallo unnattu unnaav.
ippudu nenu evaro cheppuko chuddhaam???
guess guess
mee laptop naa laptop ki chelli anukunta!!!
@ attha - idi time kalisi rAkapOvaDam kAdu motherboard sarigga lEkapOvaDam. :(
@anon - :scratch: :Scratch: nope..evaro gurtu pattalEkapOtunna.
@swats - Em chEstAm anDi. nA dikkumAlina laptop ki oka akka undani AnandinchaDam tappa.
oke raashtram gala vaallam, nanne gurthu pattaleka pothunnaava? :( cha..!
telvad saar.. :(
nee yenkamma... nenehe... Haneesha ni :D
కి కి కి కి కి కి
హి హి హి హి హి
సారి కాక, ఆపుకోలేకపొయ్న
:comfort:
@hanee - elkam elkam. :hug:
@Irfan - chus..
శశాంక్ అనుకోకుండా రెండు పోస్ట్ లు రాసేసా...ఇప్పుడు నీ లాప్ టాప్ పరిస్థితి ఎలా వుంది
Shashi,
You need to get a Macbook. and do a dual boot with XP or what ever and you shouldn't have to worry about it for the next 4-5 years. hows that for peace of mind.
-H
Post a Comment