Sunday, June 21, 2009

నేను మార్గదర్శి లో చేరా.. నేకు "కేసు" పెట్టా..

నేను మార్గదర్శి లో చేరుతా.. నేను కేసు పెడతా. ఎందుకు ఏమిటి అంటే ఒప్పుకోను ... అడిగే హక్కు మీకు లేదు. నా జాతిని బట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాకు అర్థం అయ్యింది. మీ మీద కూడా పెట్టేస్తా. మలక్ పేట్ రౌడి గారి మీద కేసు పెడుతున్న బుడుగు ఉరఫ్ జీడిపప్పు మీద నేను కేసు పెడుతున్నా. నా కంటే ముందు అలా కేసు పెడతా అని వ్రాసినందుకు. కేసు పెట్టడం నా జన్మ సిద్ధ అధికారం. దాన్ని నా నుండి ఎవ్వరు వేరు చేయలేరు.

నాకు అలా కేసు పెట్టాలనె ఆలోచన రాకమునుపే బుడుగు కి వచ్చింది. ఇది IPC సెక్షన్ 1116 క్రింద ఘోరాతి ఘోరమైన నేరం. దీన్ని శిక్షించకపోతే బుడుగు లాంటివాళ్ళు నా లాంటి మేధావుల్ని తొక్కేస్తారు. మాకు ఆలోచనలు రాకమునుపే కాపి కొట్టేస్తారు. ఇలాంటి "కిష్యోటకల్ని" ఒదిలితే దేశానికి చాలా నష్టం, కష్టం. అందుకే కేసు పెడుతున్నా. ఎందుకు ఏమిటీ అంటే అది అంతే. ఇది చెట్టరీత్య నేరం. అడిగినందుకు కూడా మీ మీద పెడతా. ఒక కేసు. ముందే హైదరాబాద్ లో ఈ మధ్యే సాఫ్ట్-వేర్ ఉద్యోగాలు పోయిన నా స్నేహితుల్ని అడిగి కనుకున్నా.. వాళ్ళు చాలా చాల కష్టపడి internet తీగలమీద పాకి స్తంబాలు ఎక్కి మరీ ఈ క్రింద చెప్పడే వ్యక్తుల IP లు కనుకున్నారు.



"మనవోన్మాది" "మానవద్వేషి" బుడుగు a.k.a జీడిపప్పు మీద పెడతా. యే సెక్షనో అర్థం కావడం లేదు. కొంచం ఎవరైన "న్యాయవాదుల్ని" సంప్రదించి చెప్పగలరు. బుడుగు IP, birth certificate వాళ్ళా ఊరి మునసబ్ నుండి తెచ్చిన లేఖ వాళ్ళా బడి హెడ్ మాస్టారు ఇచ్చిన 'అ-ప్రశంసా పత్రం" అన్ని సేకరిచ్చా నేను.

మీకు అలాంటివి ఇంకేమైన దొరికితే నన్ను సంప్రదించండి. నా ఈ-మేల్ ;dikkulenicourtlodava@gmail.com. అలనే బుడుగు ఉరఫ్ జీడిపప్పు ఫోటో కూడా సంపాదించా. (క్షమించాలి ఆ ఫోటో పెట్టలేకపోతున్నా. "unparliamentary / uncivilised గా ఉంటుందని) ఇంత చదువుకు కొని ఇన్నేసి చికేన్ లని తిని అన్నేసి సార్లు గాడ్ ఫాథర్ చూసినా కూడా జీడిపప్పు కి బుద్ధుని లా జ్ఞానం రాకపోవడం చింతనీయం.

పనిలో పని పేపర్లో పేపరు కేసులో కేసు అన్నట్టు మలక్ పేట్ రౌడి గారి మీద, రాఘవ మీద, నేను నిద్రపోతున్న సమయంలో నా బుర్రలోని ఆలోచనల్ని కాపి కొట్టిన ఏక లింగం గారి మీద, గూగల్ మీద నేను పెట్టాలనుకున్న కేసుని నా కంటే ముందే ఆలోచించిన విశ్వక్శేనుడి మీద, మాటి మాటికి కేసు కేసు అని భయపెట్టి నా లాంటి మేధవుల్ని కించపరుస్తున్న నాగప్రసాద్ మీద, ఇవ్వంటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్న శరత్ 'కాలాం" మీద కూడా ఓ పదో పాతికో కేసులు పడేస్తున్నా. వీళ్ళు హైదరాబాదులో కనిపిస్తే అప్పడ తప్పడి తాండ్రే.!!!! ఖబర్దార్!!! కమాన్ సూస్కుందాం. బస్తిమే సవాల్!!! ఎవరెవరు ఎన్నేసి కేసులు పెడతారో సూస్కుందాం.

నా కంటే ముందు మీకు ఏమైన ఆలోచన వస్తే జాగ్రత్త!!! ఇదే మీకు తుది హెచ్చరిక. నా కంటే ముందు ఆలోచిస్తే కేసు పడుద్ది.

ఇది చూసి కామెంట్ వేయని వాళ్ళకి / నా కంటే ముందే నా ఆలోచనల్ని కాపీ కొట్టే వాళ్ళకి ఇదే హెచ్చరిస్తున్నా: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

31 comments:

నాగప్రసాద్ June 21, 2009 9:37 AM  

LOL..!:)

ఇంకా మీరు కేసు పెట్టాల్సినవాళ్ళు చాలామంది ఉన్నారు.

మీకన్నా ముందుగా అయిడియా వచ్చి "కూడలి, జల్లెడ" లాంటి అగ్రిగేటర్లను తయారు చేసినవారి మీద.

ఇంకా మీకన్నా ముందుగా తెలుగుబ్లాగు ఓపెన్ చేసిన వారి మీద.

మీకన్నా ముందుగా తెలుగులో టైప్ చేసే software లను తయారు చేసిన వారి మీద.

ఇక చాలు ఆపేస్తున్నా!. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అయ్యేట్టుంది. :)

Shashank June 21, 2009 9:44 AM  

పేర్లని సేకరించండి. మా స్నేహితుల్కి చెప్పి తీగలమీద పాకిచ్చి IP కనుక్కుంటా. తర్వత ఏమైన ఒకటే పేపర్ కద.. పేర్లని జతపరిస్తే సరి. అన్నట్టు ఆది కవి నన్నయ మీద కూడా పెడుదాం అని ఆలోచిస్తున్నా. ఏమంటారు?

ఏక లింగం June 21, 2009 10:05 AM  

LOL..good one.

But ekalingam is ekalingam. Not Vishvak.

Sravya V June 21, 2009 10:13 AM  

మీరు కేసు వేయటానికి ఇంకొక అయిడియా - check who is using more than one ID to post comments :)

Anonymous,  June 21, 2009 10:39 AM  

Going forward it will be good asking people to write their community name, before writing comments. so that people will be more cautious and we can avoid plots. Apart from that we have to stop writing /reading/ visiting those blogs. It will save lot of time and energy.

జీడిపప్పు June 21, 2009 10:40 AM  

వార్నీ, నా పైన కూడా కేసు పెడతావా? నా పైన కేసు పెడితే నీ పైన, మీ టీం లీడ్ పైన, టీం మేనేజర్ పైన, నువ్వు సైట్ కొట్టే పిల్ల పైన కూడా కేసు పెడతా.

Malakpet Rowdy June 21, 2009 11:09 AM  

Four lil words -

YOU GUYS ARE HILARIOUS!!!!!


By the way, you are all publicizing my profile - Thanx :))

Shashank June 21, 2009 11:36 AM  

@ఏకలింగం - ఎవరన్నది ముఖ్యం కాదనయ్య కేసు వేసామా లేదా అన్నది ముఖ్యం.
@శ్రావ్యా - ఏంటీ ఐడియా వచ్చే ముందే మీకు వచ్చింది? మీ పేరు కూడా నా కేసు లిస్ట్ లో చేర్చేసా.. కాస్కోండి.
@anon- కూడలి / జెల్లెడ లో ఒక్కో జాతికి ఒక సెక్షన్ పెడదాం. ఏమంటారు?
@బుడుగు - నేను మీ తాలూకా జిల్లా రాష్ట్రం లో అందరి మీద పెడతా కేసు. ఇంకోసారి కేసు అంటే నీ IP నాకు తెలుసు.. హైదరబాద్ కి కాల్ చేస్తా. నిన్ను ఒదల బొమ్మాలీ..
@యే రౌడీ - నీకు ఇది పబ్లిసిటీ లా ఉందా? ఈ ఆలోచన నా కంటే ముందే వచ్చినందుకు..

శరత్ కాలమ్ June 21, 2009 11:45 AM  

@ అజ్ఞాత
అదే అభిప్రాయాన్ని, అట్రాసిటీ చట్టం మీద కొన్ని సందేహాలని కత్తి బ్లాగులో వ్యాఖ్యానించాను కానీ వారు అనుమతించలేదు.

బ్లాగర్లలో SC, ST వారు ఎవరయినా వుండి వారికి కులాభిమానం లేదా ఆత్మన్యూనత బాగా వుండి వుంటే ముందే చెప్పుకోండి మహాశయులారా! మీ బ్లాగు టైటిల్ లో లేదా ట్యాగ్ లైన్ లో అలా చెప్పొచ్చు. వారి పట్ల చాలా మర్యాదగా లేదా వారికి దూరంగా మిగతా వారు వుండటానికి వీలు వుంటుంది. అయా కులాలకి చెందిన వారు అయి మీలో విశాలభావాలు వుండి వుంటే మీకు ఈ సూచన వర్తించదు. మీకు అభినందనలు.

@ కత్తి
పైన వ్రాసింది మీ మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ప్రస్తుత పరిస్థుతుల వల్ల మా జాగ్రత్తల్లో మేము వుండాలి కదా. నాకు కులం, మతం లేవు. నా సెర్టిఫికేట్స్ లో కూడా లేవు. మీ విశాల భావాలు/ఉన్నతమయిన భావాలు చూసి మీకు కూడా కుల మత భావాలు లేవేమోనని అనుకున్నాను.

Anonymous,  June 21, 2009 11:51 AM  

సైలెంటుగా మద్ధత్తు తెలుపుతున్న అందరికీ నా లాల్ సలాం.
I did not see at least 5 members supporting this boy. other than
లవ్ రోస్ బాబా, విజతా అక్కయ మరియు పాక్షికం గా ఆశ్చర్యాని వ్యక్త పరచిన ధూం మిత్రుడు rao.
But yesterday on wards more than 5 fun posts on this subject and lot of comments,discussion.

Shashank June 21, 2009 12:03 PM  

@శరత్ మీ గురించే waiting. కులం అనేది నా కరికులం లోనే లేదు. నాద్ బ్రాడ్-కాస్ట్ అయినా కొన్ని బ్లాగుల్లో కమ్మెంటాలంటే నాకు భయం. మీ ఆలోచన బాగుంది. IMO. మాళ్ళా మిమ్మల్ని support చేసినందుకు నన్ను మతోన్మాది అని అంటారేమో. అయినా పర్లేదు..అంటే ఉంది కద కేసు మనకి అండగా.

@anon సత్య ప్రమాణకంగా ముక్క అర్థం కాలేదు నాకు.

Anonymous,  June 21, 2009 12:11 PM  

telugu people who are writing blogs across the globe. They may not know current IPC section and cyber laws. we will write for sharing some of our experiences not for doing saahitya seva. That is not our job like poddu, pustakam, eemaaata people. Going forward we should make mandatory to mention community name before writing any comments so that we will not hurt their feelings. I don't know how many people read/know SC/ST attrocity rules and regulation. we will write blogs for fun not to face legal actions. Why should we read those tapaas in his blog and unncessarily writing comments. Instead it would better avoiding them visiting these blogs.
Because these people are all from hyderabad we don't know right now what is local telugu people psychology though we are from AP but many people left AP long back.
It seems these local people have some personal rapport also. I have avoided visiting Mrs. Sujata, Bolloju baaba's blogs.

Anonymous,  June 21, 2009 12:48 PM  

సుత్తికి కులాభిమానం ఉంది అని ఎందుకనుకొంటున్నారు. కేవలం కులాన్ని తనకు కావాల్సివచ్చినప్పుడు "మాత్రమే" అప్పుడప్పుడు వాడుకొంటారుకాని :))

ఇక ప్రతి బ్లాగర్ (పుస్తకం లాంటి వాళ్లలాగా, అక్కడ కామేంట్ వేసినిన వాళ్ల IP అడ్డ్రెస్స్ లు, బయటకు చెప్పుతారో, లేక చెప్పరో అన్న వాళ్ల పాలసీ disclaimar లో పెట్టుకోవటం చేస్తే మంచిదేమో. పుస్తకం వాళ్లు, అలాంటిది ఎదో చెప్పి IP ఇస్తే బాగుండేది ఎమో, అయినా ఆ (తొట్టి) గాంగ్ నుండి కాస్త వెన్నుముక ఉన్న అలోచనను, ఆశించటం తప్పేనేమో!)

ఇక శరత్ అన్నట్లు, కులాన్ని వాళ్ల వాళ్ల కు లాభం వచ్చినప్పుడు వాడుకొంటాం అన్న వాళ్ల (బ్లాగ్ లోకం లోని వాళ్లు) పాలసీ లను కూడా జనాలకు చెప్తే, జనాలు వాళ్ల జగ్రత్తలలో వాళ్లు ఉంటారు కదా!!


బ్లాగ్లలో కులాభిమానం ఉంది అంటున్న ప్రోగ్రెస్సివ్ (పిచ్చి) బాబాలు, కులాన్ని వాడకుండానే శరత్ లాగానో, సమరం లాగానో చదువుకొన్నరా?, చదువుకు కులం, ఉద్యోగానికి కులం, చివరాఖరకు ఇందిరమ్మ ఇళ్లకు, మరుగు దొడ్లకు కులం!!. బ్లాగ్ లలో మాత్రం కులం ఉండకూడదు అన్న కోరికలు. కాకపోతే ఆ కులాని అడ్డం పెట్టుకొని కేసులు కు మాత్రం రేడీ. అలాంటి కేసులు పెట్టేవాళ్లకు వత్తాసు కు రెడీ. ఎంత చదువుకొన్నా బుద్దులు మాత్రం పెరగవ్ :(


DISCLAIMR. ఇది సెంట్రల్ యునివెర్సిటీ లో రెసెర్వేషన్ తో చదువుకొన్న, "కత్తి/సుత్తి" లాంటి ఇంటి పేర్లు ఉన్న వాళ్లను, భారతదేశ వివాహ వ్యవస్త దగ్గరనుండి, రాముడి వరకూ విమర్శిస్తూ, మాయావతికి, మంద క్రిష్ణ లకు జై కొట్టే వాళ్లను కించపరచాలని కాదు. కావాలంటే (కుతి ఎక్కువయితే) నా మీద కూడా s.c./s.T కేసు పెట్టుకోవచ్చు (సారీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ను ఉపయోగించుకోవచ్చు)

Kathi Mahesh Kumar June 21, 2009 12:52 PM  

@శరత్: కులం నా సామాజిక అస్తిత్వం. నేను అడిగి అందులోకి రాలేదు. పుట్టానుకాబట్టి ఆ కులానికి చెందాను. నా వ్యక్తిత్వంలో కులం ఒక చిన్న భాగం. ముఖ్యంగా వివక్ష నేపధ్యంలో అదొక అవసరం.

నా వ్యక్తిగత సంబంధాలు కులం ప్రాతిపదికన జరగవు. మనుషుల వ్యక్తిత్వాల్ని బట్టి మాత్రమే నేను సంబంధాల్ని నెరుపుతాను.

ఇక్కడ సమస్య నేను కాదు. నా మతవిమర్శను ప్రాతిపదికగా చేసుకుని నన్ను వేరే మతానికో లేక "కేవలం" దళితుడ్ని కాబట్టి ఆ పనిచేస్తున్ననో అనే ఆభిజాత్యాన్ని నా అభిప్రాయాలకే కాకుండా వ్యక్తిగా నాకే ఆపాదించి వివక్షాపూర్వకంగా వ్యవహరిస్తున్న కొందరి మీద నా ప్రతిస్పందన ఇది.

ఈ దాడులు దాదాపు ఆరు నెలలుగా జరుగుతున్నా నేను ఉపేక్షించాను. ఇప్పుడు తప్పటం లేదు.

మీకు అన్ని విషయాల్లో హాస్యం,entertainment చూసే గుణముంది. అది మీకు మంచిదే కానీ నా పోరాటానికి కాదు. అందుకే మీ వ్యాఖ్యను అనుమతించలేదు. ఈ విషయంపై నాతో మీరు చర్చించాలంటే మీదగ్గర నా మెయిల్ ఉంది. దాన్ని వాడండి.

జీడిపప్పు June 21, 2009 1:05 PM  

మహేష్ గారూ, మీ "ముసుగుతనాన్ని" గురించి నా బ్లాగులో నేను వేసిన పోస్టు లింక్ మీ బ్లాగులో వేస్తే మీరు దాన్ని ఆమోదించలేదు.. ఎందుకో కారణం చెబుతారా లేక మీ పైన అట్రాసిటీ కేసు వెయ్యమంటారా :)

ముసుగువీరుడి అసలు రూపం

పునర్వసు June 21, 2009 1:46 PM  

మానాన్న సంపాదించిన ఆస్తి కావాలిగాని, ఆయన చేసిన అప్పుతో నాకు సంబందం లేదు అన్నాడట వెనకటికెవరో.

రాఘవ June 21, 2009 1:47 PM  

నా మీద కేసా.. ఈ రొజు పొద్దున్న నుండి కూడలి ఓపెన్ చేయకుండా బుద్ధిగా లిండా గుడ్మన్ బుక్కు చదువుతు సైలెంట్ గా ఉంటే నా మీద కేసా ఐతే కాస్కొండి మరో ప్రపంచ పొరాటం start.

శరత్ కాలమ్ June 21, 2009 2:10 PM  

@కత్తి
నాలాగే మీరూ వుండాలి అని కాదు గానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెబుతున్నాను.
నేనూ ఒక కులంలో పుట్టాను. మా నాన్న గారు విశాల భావాలు కల వ్యక్తి కాబట్టి నాకూ అవి నేర్పించి నా సెర్టిఫికేట్స్ లో కులం, మతం అన్నచోట 'లేదు' అని వ్రాయించారు. మా పిల్లల సెర్టిఫికేట్స్ లో కూడా లేదు అని పెట్టించాను. మీ పిల్లలు కూడా మీలా దళితులా లేక మీ విశాల భావాలను చాటుకుంటూ కులం తీసి వేయించారా?

ఇంకో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే మా అమ్మకి అగ్రవర్ణ దురహంకారం వుండేది, దళితుడయిన నా క్లోజ్ ఫ్రెండు మా ఇంటికి వస్తే అవమానపరిచేది. నన్ను గుళ్ళు గోపురాలకు, బాబాల వద్దకు తిప్పుతూ ఆస్తిక, కుల,మత భావలు నూరిపోసేది. మా నాన్న గారేమో నాస్తిక, హేతువాద సభలకు తీసుకెళ్ళి విశాల భావాలు తలకెక్కించేవారు. అలా అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోయి చివరకు పదేళ్ల వయసుకో, పన్నెండేళ్ళ వయసుకో నాన్న గారి భావాలే మంచివి అనిపించి అటువైపు సెటిల్ అయ్యాను. మా అమ్మగారు కూడా ఇప్పుడు చాలా మారారు - కుల మత విద్వేషం ఇప్పుడు లేవు.

Anonymous,  June 21, 2009 2:44 PM  

ఎమయా శరతూ, మరీ వయసు వచ్చే కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతుంది, అంటే ఏమయినా అనుకొంటావు కానీ, " మీ పిల్లలు కూడా మీలా దళితులా లేక మీ విశాల భావాలను చాటుకుంటూ కులం తీసి వేయించారా? " లాంటి లాజికల్ ప్రశ్నలు వేయకుడదు అని మీకు తెలియదా? మీ మీద ఇది చాలదా ఇంకో S.C./S.T. కేసు పెడతానికి. :))

మనలను ఎవరైనా ఎమైనా అంటే తప్పు, కాకపోతే మన బ్లాగ్లో, వేరే ఎవరినయినా తిడుతూ కామెంటేస్తే కమ్మన. మనం అనామకుల పేరుతో "జియో పొలిటికల్", తొక్కలో పొలిటికల్ అంటూ కామెంట్లు వేస్తే మన అభిప్రాయం చెప్పటం, ఎవరైనా మనలను అంటే మాత్రం, అది అట్రాసిటీ. ఆమాత్రం తెలియని శరత్ మీద కూడా కేసు పెట్టాలి అద్యక్షా :))

పానీపూరి123 June 21, 2009 3:09 PM  

మరి కేసు పెట్టుకోవడానికి మంచి లాయరు/అటార్నీ లకు "జీడిపప్పు" ప్యాకెట్లు ఎవరుపంపిస్తారు :-ఫ్

Unknown June 21, 2009 3:15 PM  

LOL...:)

కులం/మతం 'లేదు' అని రాయడమా?!! :O అసలు ఈ దుమారం రేగిందే రిజర్వేషన్ కి సంబంధించిన వ్యాఖ్య తో.... ఆసక్తికరమైన ప్రశ్న.. !! ఊరికే వచ్చే అవకాశాల్ని వదులుకోవాలి అంటే విశాల భావాలు చేతల్లో చూపించాలి....

Shashank June 21, 2009 6:12 PM  

ఏం విశాలా భావాలో ఏంటో.. అసలు ఇన్నేసి కులాలు ఉన్నాయని అమెరికా కి వచ్చేదాకా నాకు తెలీదు. తెలిసి దాని వళ్ళ పెంట తప్ప ఏమి జరగలేదు..
@శరత్ - కులం కాలం అంటున్నారు.. నాకున్న యే సర్టిఫికేత్ లోను అది లేదు. కేవలం మతం - హిందూ అని ఉంది. అంతే. అంటే నేను కులం కాలం నింపినా ఒరిగేది ఏమీ లేదు. కనిష్టం లేడిస్ కోటా లో కూడా సీటు రాదని తెలిసి అనవసరమైన విషయాల్ని బహిర్గతం చేయడం ఎందుకు అని లైట్ తీసుకున్నా.

@పునర్వసు - హ హ హ. కరెస్ట్.
@రాఘవ - నువ్వు ఏం చదివితే నాకేంటి.. నేను రాసింది చదవలేదు కాబట్టే కేసు.
@పాని పూరి - మన జీడిపప్పు ని ఇచ్చేద్దాం వాళ్ళు వాళ్ళూ చూసుకుంటారు.

Shashank June 21, 2009 6:23 PM  

asalu ekkada modalettalO ani AlOchistunna vAllu

ఇదిగో ఇక్కద మొదలెట్టు

http://parnashaala.blogspot.com/2009/06/blog-post_20.html తర్వాత
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_1488.html తర్వాత
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_20.html?showComment=1245502506561చ్7407553763679280194

migitAdi buDugu blAg lO http://jeedipappu.blogspot.com/2009/06/blog-post_20.html

chadavandi. migitAdi mIkE artham autundi.

శరత్ కాలమ్ June 21, 2009 10:19 PM  

@శశాంక్,
నా చిన్నప్పుడు జరిగిన విషయాలు కాబట్టి అంత స్పష్టంగా గుర్తుకులేవు కానీ మా కులమత ప్రస్థావనలు ఎప్పుడు వచ్చినా, ఏ రకంగా వచ్చినా, ఏ ఫారం లో అడిగినా, ఎవరు అడిగినా 'లేదు' అనే మా జవాబు. తన పేరులో వున్న కులం అందరికీ తెలియడం భావాల పరంగా ఇష్టం లేక మా నాన్న గారు వీలయినంత వరకు కేవలం ఇంటిపేరుతోనే వ్యవహరించేవారు - చాలామందికి మా నాన్న గారి అసలు పేరు తెలియదు.

Anonymous,  June 22, 2009 1:33 AM  

హిందూలకి విశాల భావాలు ఉంటాయి కాబట్టే హిందూయిజాన్ని తిట్టినా వారి పాపనికి వారే పోతారని ఊరుకుంటారు. అదే మరొక మతమేదైనా అయితే () పిసికి చంపుతారు. ఇదంతా రిజర్వేషన్ ముసుగులో తెలివైన వాళ్ళని ఆడిపోసుకోవడమే. అవునూ ఒమెరికాలో రిజర్వేషన్ పెట్టనందుకు ఒబామా గారిమీద అదేదో అట్రాసిటీ కేసు పెట్టొచ్చా గురూ? అహ తెలియక అడుగుతున్నాను.

Anonymous,  June 22, 2009 2:59 AM  

ఏమి ఈ వైపరీత్యము నీ బ్లాగ్ లో మోడరేటర్ నువ్వేనా అసలు ఎవరో కామెంట్స్ రాస్తే వాళ్ళకి నీతో పాటు వేరే వాళ్ళు కూడా రిప్లై ఇస్తున్నారు.. అంతా బ్లాగు కాలం నాయనా ..

Anonymous,  June 22, 2009 2:59 AM  

@Katti

If you have issue with few people, you should fight directly with them, don't hurt others feelings. what do you have the right to do so, don't you feel ashamed of yourself doing this kind of cheap tricks. You guys doing this kind of Blackmailing in HCU for many years.... So cheap behavior.... Shame of you guys Educated illiterates...

చంద్రముఖ,  June 22, 2009 4:06 AM  

పానీపూరి123 గారు, మీ కామెంట్ 'జీడిపప్పు' గురించే ఉంటున్నాయి ఒకట్రెండు చోట్ల !

మీ కామెంట్ చూడగానే ఫక్కున నవ్వొస్తోంది ! ఈ మధ్య ఇంతగా పగలబడి నవ్వలేదు ! మీ హాస్య చతురతకి నా థాంక్సులు !

ఇకపోతే, మీకు రిప్లై రాయకుండా ఉండలేక, ఇదిగోండి : జీడిపప్పు పాకెట్స్, పానీపూరీ పంపే వాళ్ళే పంపిస్తారు ! :-P :-)

అయినా పానిపూరిని ఇష్టపడని వాళ్ళెవరు చెప్పండి ? జీడిపప్పోక్కటే సరిపోతుందా లాయర్లకి ? భలే వారే :-P

p.s: ( జీడిపప్పు గారి లాగే , మీరూ తిండి పర్దార్థం పేరెట్టుకుని, ఆయన్ని కామెడీ చేయటం మాంచి కామెడీగా ఉంది ! :-P )

ఏక లింగం June 22, 2009 7:19 AM  

see my new post
http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

Shashank June 22, 2009 12:19 PM  

@Sarat - chala thanks andi. kotta tapa padindi parnasala lo. chadiva.. reply kotte time leedu. scheduled for evenign. :)

btw naakante mundu meeku aalochana vachinanduku.. case vestunna.

ద్రోహి మహేశ్ June 22, 2009 1:12 PM  

"ప్రొద్దున్నే వచ్చి అడ్డా మీద కూర్చోవాలి.
ప్రతిదానికి కారడ్డం మాటలు మాట్లాడాలి.
దేనినయినా అడ్డంగా వాదించాలి.
అవసరం ఉన్నాలేకున్న అడ్దుపడిపోయి వాళ్ల బ్లాగుల్లో కామెంట్స్ పెట్టాలి.
నోటికొచ్చిన అడ్డమయిన కారు కూతలన్నీ కూయాలి.
ఎక్కడవీలుంటే అక్కడ మన టపాలకు అడ్డగోలు ప్రచారం కలిపించు కోవాలి.
మన నోటికొచ్చింది అడ్డదిడ్డంగా రాసేయాలి."

వీటికి ఇంకొన్ని కలపాలి:

టపా రాయంగానే ఆడాళ్లందరికీ ఆ లంకెతో ఒక మెయిలు కొట్టాలి. వీడితో నస ఎందుకని వాళ్ళు చచ్చినట్టు ఒక "వ్యాఖ్య" పెడతారు. కూడలి లో వచ్చుద్ది, ఆడాళ్ళు రాసినారు కదా అని సొల్లు కార్చుకుంటూ క్రింద మగాళ్ళు పెడతారు ఇంకో వ్యాఖ్య

ఎవరన్నా జీటాల్క్ లో (జీటాక్ అని చదవండి - "ల" స్సైలెంట్ ఇక్కడ) కనిపిస్తే అర్జెంటుగా లింకిచ్చ, ఎలా ఉందో చెప్పమనాలి. ఖర్మకాలి వాడు చెప్పాడో, అక్కడ కామెంట్ రాయమనాలి

కులం అని ఎవడన్నా పొరబాట్న రాసాడో అక్కడికెళ్ళి కులం పై తమ గ్నానాన్ని కుమ్మరించాలి. బాపనోళ్ళ మీద కుతి తీర్చుకోవాలి. పన్లో పని గా మీరింతకు ముందు రాసిన మీ బటపాకొక లంకేసుకోవాలి.

.............
............
.............
..............
.................

అప్పుడప్పుడూ జనాన్ని కేసు పెడతా అని బెదిరిస్తూ ఉండాలి.

--- ఒక కత్తిమార్కు భావజాల ద్వేషి

కత్తి నీ చెంచా/చెంచీలతో సిగపట్లు పడకుండా నీకో ఫేవర్ చేస్తా

నామాట:: కత్తి మహేశ్ కుమార్, నీవు ఏ సమాజపు మెజారిటీ ప్రజలు మౌనంగా భరిస్తే ఇప్పుడు ఇంట్లో పాప్కార్న్ తింటూ లాప్టాప్ మీద బ్లాగుల్లో హక్కులకోసం "ఉద్యమిస్తున్నావో", ఏ సమాజం లో హక్కులను సాధించుకోవడం మాత్రమే తెలిసి విధులను మరచి సంచరిస్తున్నావో ఆ సమాజం మొత్తం అసహ్యించుకోదగ్గ "ద్రోహివి".

నీపేరు రాసి, నీ బ్లాగుకు లంకె కూడా ఇస్తున్నా. ఇప్పుడు ఏం ఈక్కుంటావో ఈక్కో. నల్గొండలో మా తాతగారింట్లో కూర్చుని రాసిన ఈ కామెంట్, గూగుల్ వారి ప్రాక్సీ ద్వారా డెలివర్ చెయ్యబడిన ఈ కామెంట్ యొక్క ఐపీ వివరాలు క్రింద చూడు. గూగుల్ కీ, నల్గొండ పోలీసులకూ చెప్పి ఏం ఈకుతావో ఈకు.

బ్లాగు ఓనర్ గారు ఈ వ్యాఖ్యను అనుమతించండి. దీని పర్యవాానాలకు సంపూర్ణ బాధ్యత నేను వహిస్తాను అని మాటిస్తున్నా


My IP address [?]: 208.185.17.7 Copy [Whois] [Reverse IP]
My IP country code: US
My IP address country: ip address flag United States
My IP address state: New York
My IP address city: White Plains
My IP postcode: 10601
My IP address latitude: 41.0291
My IP address longitude: -73.7580
My ISP [?]: ABOVENET COMMUNICATIONS
My Proxy: None / Highly Anonymous [Proxychecker]
Organization: ABOVENET COMMUNICATIONS
Host of my IP: [?]: 208.185.17.7.escalate.com [Whois] [Trace]
Local time in United States: 2009-06-22 12:44

More about my IP and my system:
My Speed: Cable/DSL [Speedtest]
My Browser [?]: Mozilla Firefox 3.0
My Operating System [?]: WinXP WinXP
Referer: Unknown

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP