ఇళ్ళా? ఉద్యోగమా?
కొంత కాలం కిందట .. ఈ మధ్యలో వరకు కూడా అనుకోండి కొన్ని ఇళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న మొలిచేది.. తల్లా? పెళ్ళామా? అని. ఆ ప్రశ్న ఎంత మూర్ఖంగా ఉన్నా..ఈ మధ్య కాలం లో అసలు ఈ ప్రశ్న కి సమయమే లేకుండాపోయింది. శుభం అనుకునే లోపే ఇళ్ళా? ఉద్యోగమా? అన్న ప్రశ్న మొదలైంది. ఇది మూర్ఖమైన ప్రశ్న కాకున్నా చాలా మంది జీవితాల్లో చాలా ఇళ్ళాల్లో జరిగే నిరంతర పోరాటమే అని అనుకోవచ్చు. (చాలా ఇళ్ళాల్లో అన్నదానికి నా కాడ statistics గాని సర్వేలు కాని లేవు.. జీవితంలో చూసిన దాన్ని బట్టి నేను ownగా సొంతంగా personalగా ఊహించుకున్న సంఖ్య మాత్రమే!!).
ఉద్యోగం నుండి బయటకి వచ్చాకా అంటే జెస్ట్ ఆ డోర్ నుండి బయటకి వచ్చాక యే కంపనీ నీది అంటే బ్రహ్మానందం చూపులు చూసే వాళ్ళని నేను ఎరుగుదును. అందులో ఒక కాలం లో నేను ఉన్నా. ఠంచన్ గా ఐదో ఆరో అయితే మళ్ళా అసలు వర్క్ గురించి గుర్తుండేది కాదు నాకు. ఆ రోజు రాసిన for లూపులు కూడా మర్చిపోయేవాడ్ని. అల అయ్యేదానికి కొన్ని యేళ్ళు పట్టింది. అది వేరే విషయం. ఇప్పుడు కూడా నేను మించు ఇంచు గా అదే టైప్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు.. ఇంకో పది రోజుల్లో ఒక పెద్ద డెలివరి ఉంది మాకు.. సో అది అయ్యకా మళ్ళా ఐదైతే అన్ని మర్చిపోతా. అంత వరకు మాత్రం రోజుకి ఒక 12 గంటలు తప్పడం లేదు. అలా సంవత్సరానికో ఆర్నెల్లకో చేసేవాళ్ళని చూసాను. కాని నిత్యం నిరంతరం పెతీ రోజు అలా ఉద్యోగమే జీవితం అనుకుంటు ఉండేవాళ్ళూ ఉన్నారు.
ఎవరైన ఉద్యోగమ? ఫామిలీ ఆ? అని అడిగితే క్షణం పట్టదు తేల్చుకునేదానికి. కాని అలా 12 గంటలు ఇంట్లో కూడా మాట మాట్లాడకుండా ఎదో జాతిని ఉద్దరించే పని చేస్తున్నట్టుగా చేసేవాళ్ళ priority మీద నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళూ ఎట్లా భరిస్తున్నారా అని. ఆ స్టేట్మెంట్ కొంచం ఎక్కువే అయినా అందులో ఓ యాభై సాతం నిజం లేకపోలేదు. వీళ్ళు ఇంట్లో ఉన్నా వర్క్ లో ఉన్నా పెద్దగా తేడా పడదు.. జెస్ట్ ఎదో ఇంట్లో ఉంటే మన ముందు ఉన్నరాన్న ఆనందం తప్ప. కాని అదీ క్షణికమే. వర్క్ చేసేటప్పుడు శబ్ధం వచ్చినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే.. ఆ భాగ్యానికి ఇంటికి రావడం ఎందుకో? అని కూడా అనిపిస్తుంది. జివః కో రుచి అని తెలుసు... వెర్రి వెయ్యి విధాలు అని కూడా తెలుసు కాని ఇంత వర్క్ వెర్రా?
నేనేదో ఉత్తముడిని అని చెప్పడం లేదు..కాని at least i have my priorities right. క్రికెట్, NFL, ఫుడ్, సినిమాలు, ఫ్యామిలి, ................................................ వర్క్. in that order. సెప్టెంబర్ నుండి మొదటి రెండు కొంచం అటూ ఇటూ ఔతాయి. కాని ఆర్డర్ మాత్రం పెద్దగా మారలేదు చాలా ఏళ్ళగా. ఈ ఎకానమి లో ఆ మాత్రం పని చేయకపోతే కష్టం అని అనకండి.. ఎందుకంటే వీళ్ళు ఎకానమి ఎలా ఉన్నా మారరు కాబట్టి. అయినా పక్కనోడికి చెప్పేంత నాకు లేదు. నేను నూరుశాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా అంతే. ఉద్యోగాలు మారుతాయి (ఇది చాలా మందికి. కొంత మంది అలా ఒక్క సారి చేరితే గవర్నమేంట్ మారినా.. బాలయ్య మారిన.. చివరికి కె.చంద్రశేఖర్ రావ్ మారినా .. అదే ఉద్యోగం లో ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇష్టం. స్వభిప్రాయం. choice. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మిగితా వాళ్ళా గురించి అంటున్నా).. కాని ఫ్యామిలి మారదు. జావా కాకపోతే డాట్ నెట్ .. కాని ఫ్యామిలి కి ప్రత్యామ్న్యానం లేదు కదా!! అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ఎవరికి చెప్పాలని చూస్తున్నా నేనూ? నా వెర్రి కాకపోతే..
6 comments:
బావుంది శశాంక్ .. బాగా రాసావ్
mee priorities lo blog ni cherchadam marchipoyaru :P...good...
ee madhya oka quote chadivanu..
If u wanna see change show it in you first ani...correct words kadu meaning intey...
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
నెనర్లు. :) ఉన్నమాటే కద..
@శిరిషా : బ్లాగు అన్నింటిలో ఉంది కద.. క్రికేత్ అన్నా సినిమా అన్నా బ్లాగు లో రాసేదే కదా. "If u wanna see change show it in you first ani" మంచి కోట్.
:):) ఎవరిగురించి రాసావు సోదరా? కొన్ని స్టేట్మెంట్స్ చదువుతుంటే "ముచ్చటేస్తోంది" (ట్రే.మా)
నేను నూరుశాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా అంతే.
విన్నాం!! విన్నాం!! (శుభలేఖ లో సత్యనారాయణ స్టైల్లో)
ఉద్యోగాలు మారుతాయి (ఇది చాలా మందికి. కొంత మంది అలా ఒక్క సారి చేరితే గవర్నమేంట్ మారినా.. బాలయ్య మారిన.. చివరికి కె.చంద్రశేఖర్ రావ్ మారినా .. అదే ఉద్యోగం లో ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇష్టం. స్వభిప్రాయం. choice. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మిగితా వాళ్ళా గురించి అంటున్నా).. కాని ఫ్యామిలి మారదు.
కెవ్వు.
జావా కాకపోతే డాట్ నెట్ .. కాని ఫ్యామిలి కి ప్రత్యామ్న్యానం లేదు కదా!!
కేక
అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ఎవరికి చెప్పాలని చూస్తున్నా నేనూ? నా వెర్రి కాకపోతే..
నిజమే!! ఇనేవోడే ఇంటాడ్లే, నుచెప్పేది చెప్పావ్!...
"ముచ్చటేస్తోందా? " - ట్రే.మా నా? కేసు పడ్డుద్ది. :-) ఇనేవాడి కోసం కాదు నేను చెప్పింది.. విననివాడి కోసం. :p ఎదో నా వంతు కృషి అంతే. సరే.. ఈ వారం ఒదిలేయి మళ్ళొస్తా.
'How to Get Control of Your Time and Your Life' అనే పుస్తకం చదువుతున్నా అపుడపుడు. అందులో కొన్ని పాయింట్లు చాలా బాగున్నాయి. తొందర్లో ఓ రెండు మూడు పోస్టుల్లో వివరాలు అందిస్తా.. They may help you!
Post a Comment