ఎకానమి -1: ఇంకా జరగాల్సింది ఉంది.
అంటే ఎకానమి గురించి చెబుతున్నా. అసలు సమస్యని మూడు భాగాలుగా విభజిస్తే అందులో sub prime ఒక్క భాగము మాత్రమే. మిగిలిన రెండు Alt A, ARM మరియు credit cards గా భావించచ్చు. ఇంకా ఒక్కటే అయ్యింది.. రెండు మిగిలి ఉన్నాయి అనిపిస్తోంది. Alt A గురించి చాలా తక్కువ మంది వినిఉంటారు. ఎందుకంటే ఇది సుబ్-ప్రైం అంత సత్తా లేకపోయినా ఎదో దానికి చేతనైనంత పంజా విసురుతుంది. Alt A అనగా Alternate prime -A అని అర్థం. ఇవి అటు sub prime కి ఇటు రెగులర్ ప్రైం లోన్లకి మధ్యలోనివి. క్రెడిట్ క్రైసిస్ లేకపోయింటే వీటితో ఇంత కష్టం నష్టం వచ్చేవి కాదు.. ఎందుకంటె జన్మతః ఇవి high risk కావు. కానీ సుబ్-ప్రైం వళ్ళ కలిగిన ఈ క్రైసిస్ ములాన వీటి మీద కూడా ప్రభావం పడి... ఇప్పుడు ఈ Alt A లోన్లు గురి తప్పుతున్నాయి. ఈ లోన్ల మీద san francisco chronicle కథనం ఇక్కడ వుంది.
ఇళ్ళాకి సుబ్-ప్రైం లాగానే కార్పొరేట్ రంగానికి కూడా మార్టగేజ్లు ఉంటాయి. ఎకానమి అంతగా బాగోలేకపోవడం వలన గత యేడాది కంపనీలు అంతగా (అంటే మిగిలున్న కంపనీలు) లాభం పొందలేదు. అందువలన వాళ్ళు కార్పొరేట్ లోన్లు కట్టడం తగ్గాయి... వాటి ప్రభావం ప్రతి బ్యాంక్ మీద మళ్ళి పడుతుంది. sub prime part 2 అన్నమాట!! వీటితోబాటు ARM resets కూడా జరగనున్నాయి. ఈ సంవత్సరం రెండవ భాగం లో ఇవి జరగనున్నాయి. ముందే ఉద్యోగాలు లేక డబ్బు సరిపోక అంతంత మాత్రం లో ఉంటున్న వాళ్ళ నెత్తి మీద సిమెట్ట తో కొట్టీనట్టే. ARM అనగా Adjustable Rate Mortagage - అమేరికా లో ఇంటికోసం అప్పు తీసుకునేటప్పుడు ఈ వింత సదుపాయం కూడా ఉంటూంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళు అప్పు తీసుకున్న వడ్డి కి బదులుగా తక్కువ రేట్ తో కట్టచ్చు.. (అలా తగ్గించినట్టుగా అనిపించే డబ్బు "అసలు" లో చేరుతుంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళూ ఇలా ARM తీసుకున్నవాళ్ళు ఇంటి అప్పులో నయ పైసా కూడా తీర్చలేదన్నమాట!! వీటీ మీద pbs లోనూ cbs లోనూ ప్రసారాలు వచ్చాయి. కవాలంటే ఆ లంకెలు ఇక్కడ పెడతా.)
ఈ atl a, arm reset చాలా చిన్నవిగా అనిపిస్తాయి అసలు సిసలైన నాటు బాంబుతో పోలిస్తే.. అదే credit card క్రైసిస్. దాని గురించి, మన బీ.యస్.యీ ఎందుకు పైకి వెళ్తోందో, మన దేశం ఎందుకు కొంచం మెరుగ్గా ఉండచ్చొ ఇవ్వన్ని మరో టపాలో. అంత వరకు happy stock picking...
3 comments:
శశాంక్,
చాలా బాగా వ్రాశారు. సరళంగా కూడా వుంది. మీరన్నట్టే Creditcards తరువాత ARM ఈ రెండు చేయ్యబోయే నష్టం ఎక్కువనుకుంటాను. Alt-A విషయంలో నాకెందుకో అంత రిస్కు లేదనిపిస్తోంది. తరువాతి టపా కోసం చూస్తుంటాను.
థాంక్స్ గురు. alt a గురించి కొంచం చదివాను అది చూసే ఇల రాసాను. ఇంకొంచం research చేసి మరో టపలో వ్రాస్త.
Good start CD. ఇంకా విపులంగా వ్రాయి మిగిలిన టపాల్లో
Post a Comment