కుడి ఏడమైతే..
పొరబాటు ఉందోయి. పెద్ద పొరబాటు. ప్రొదున్న ఉద్యోగానికి వేళ్ళేటప్పుడు ఆ తొందరలో ఆ చిరాకు లో కుడు ఏడమ చాలా పెద్ద తేడా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అమేరికా లో ట్రాఫిక్ కొంచం మన దేశం కంటే పద్ధాతిగా ఉంటుంది.. అందుకే ఎడమ లో ఉండే సివరాఖరి బిట్టు ని కొంచం వేగం గా వేళ్ళే వాళ్ళకి కేటాయించారు. హైదరాబాదు లో అయ్యింటే యే సందుల్లోనో పాకల మధ్యలో నుండో ఆర్.టీ.సీ బస్సు కింద నుండో పైనుండో డేక్కుంటూ పాక్కుంటూ రద్ది నీ దాటచ్చు. (ఇది ఒక 10+ సంవత్సరాలు హైదరబాదు రద్దిలో నడిపీ నడిపీ తెలుస్కున్న కిటుకుల వలన.) వన్-వే లో వెళ్తూ పోలీసు పట్టుకుంటే సుధాకర్ సుధాకర్.. ఇదిగో జేస్ట్ ఇప్పుడే చాలా రోజుల తర్వత హైదరబాదు కి వచ్చాను అనో లేకుంటే సార్ చదువుకునే పిల్లలం సార్ మా కాడ ఏముంటది చాయి కి చిల్లర తప్ప అనో బుకాయించి తప్పించుకోవచ్చు రద్ది నీ పోలీసు ని. కాని ఈ అమేరికా లో ఇది చాలా కష్టం. పద్ధతి కొంచం ఎక్కువ. చస్..
ప్రొదున 20 మైళ్ళ దూరం ఉండే ఆఫీసుకి బయలదేరా. మామూలుగా అయితే అంటే జనసంచారం మహేష్ బాబు-త్రివిక్రం-అనుష్కాపాప కొత్త చిత్రం విడుదల రోజు లా కాకుండా "ఈ అబ్బయి చాలా మంచోడు" సినెమా హీరో కొత్త చిత్రం విడుదల రోజు లా ఉంటే 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. కాని ఈ రోజు పెద్ద తుఫాను వచ్చినట్టు వార్తల్లో చూడ్డం మరిచా. తుఫాను అంటే అదేదో కట్రినా నో మొన్నామధ్యలో బాంగ్లదేశం లో వచ్చినా నగీనా (పేరు ఇలాంటిదే ఎదో ఉండాలి మరిచా) లాంటిది కాదు సుమీ.. మే లో మద్రాస్ లో పడే వానా లాంటిది అన్నమాట.. దానికి ఎదురుగా సునామి వచ్చినట్టు జనాలు మెల్లిగా అతి మెల్లిగా మరీ మెల్లిగా అతివీరభయంకర మెల్లిగా వేళ్ళడం మొదలెట్టారు. సివరాఖరి "వేగ లేను" లో కూడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాశం తో 55 స్పేడు లిమిట్ లో 35 లో వెళ్ళడం మొదలెట్టారు. అలా నా 30 నిమిషాల ప్రయాణం ఒక గంటన్నర కి చేరింది. అ వెళ్ళే 35 యెం.పీ.ఎచ్. ఆ మూల కుడి వైపు వెళ్ళచ్చు కద? అదేదో 90 లో నడుపుతున్నట్టు నా లేను పట్టేయడం అవసరమా?
ముందే వర్షం వళ్ళ చిరాకు, దానికి తోడు ఈ స్పీడు మనుషులు నాకు బీ.పీ భయంకరంగా పెరుగుతునుది. road rage అనేది ఎందువళ్ళ వచ్చిందో మా ఊర్లో 66-495 మీద ఒక నెల నడిపితే అర్థమైపోతుంది. నేను అదేదో గొప్పగా నడుపుతా అని చెప్పడం లేదు.. కాని 55 జోను లో ఓ 70-75 కొడతా.. 35 లో ఓ 45-50. పాము లాగా మధ్యలో అటూ ఇటూ వెళ్తా. ఏం చేయను? అటు ఫాస్టు లేను లోను ఇటు స్లో లేను లోనూ ఒకటే వేగం లో వెళ్తే నా లాంటి వళ్ళు మరి ఎక్కడ నడపాలి బండి ని?
అందుచేత నేను చెప్పోచ్చేది ఏంటంటే - మీరు ఎడమ లేను లో 55 లో 50 లో వెళ్తూంటే నేను కట్ చేస్తే ఏమి అనుకోకండి. tailgate చేస్తే కూడా ఏమి అనుకోకండి. అప్పుడప్పుడు మెంటల్ ఎక్కువై హార్ను చేస్తే కూడా ఏమీ అనుకోకండి. వీళైతే నాకంటే వేగంగా వెళ్ళండి. come on.. you can do it. Let's make this world a faster place to live in...
5 comments:
కాకా!! నమస్తే!! ఎప్పటికెంచో ఈడ సలాం ఆలేకుం చెప్దాం అంకుంటున్న, మరుస్తున్న. ఇగ ఒస్తనే ఉంట, కమెంటుతనే ఉంట :)
బండల్ ఎస్తనే బో మాకి కిరికిరి!!
మీరెక్కడ వుంటారో చెపితే ఆ దారిలో మేముంటే పక్కకు తప్పుకుని దారిస్తాము.సరేనా సారూ.
@ కాకా రచ్చ. నీవు కూడా బ్లాగింగు మొదలెటినట్టుందే. గుడ్డు గుడ్డు. ఇంకే.. కుమ్మేయి చెప్త.
@ రాధిక గారు - ఎందెందు వెదకిన అందందే గలను. బా చెప్పను కద. నేను ఉండేది రాజధాని లో. సో మీరు ఇటు వచ్చినపుడు కొంచం చూసుకొని నడపండి కారు. ముందే నాకు బీ.పీ ఎక్కువ.
చూసి బండి తోలకపోతే కాపాంటీ టికెట్టిస్తుంది
hehehe gudgud :)
Inka entha late aithe antha happy nenu :)
Post a Comment