ఆదాబ్ హైదరాబాద్
హైదరాబాదు... ఆ పేరు వినగానే ఎదలోతుల్లో నిక్షిప్తమైన ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు అలా వరదలొచ్చిన గోదావరిలా గండిపేట్ కట్టకమునుపు మూసీ నదిలా తన్నుకుంటూ బాదుకుంటూ వస్తాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సొంత ఊరు గుర్తొస్తే ఇలానే ఉంటుంది అనుకుంటా. పుట్టి పెరిగి తిని గల్లి గల్లి (మించు ఇంచుగా) తిరిగిన నా సొంత ఊరూ కాబట్టి హైదరబాదు అంటే కొంచం... చాలా ఎక్కువ ఆప్యాయత. నేను మా ఇంటిని వదిలి వెళ్ళడానికి బాధ పడలేదు.. నా సిటీ ని వదిలి వచ్చెనందుకు బాధ పడతా. ఇప్పటికీ అంతే. ఊరుని మిస్స్ అవ్వమ్ము అక్కడ మన స్నేహితలని మిస్స్ అవుతాము అని మొదట్లో చాలా మంది చెప్తే .. ఓహో బహుశా ఇది నిజమేమో అనుకున్న. కాని కాదని తర్వత తర్వత తెలుసుకున్నా. ఇప్పటికీ ఐ మిస్స్ మై సిటి.
ప్రొదున్న నానా దగ్గర "చదువుకో" అనో, "ఇంత టైం అయినా లేవడు" (అప్పుడు టైం ఉదయం 6:15) అనో తిట్లు తప్పించుకోవడం కోసం, 6 కే లేచి ఓస్మానియా లో జాగ్గింగ్ చేయడం మిస్స్ ఔతా. హిల్టన్ దగ్గర బండి పెట్టేసి అక్కడ నుండి ఆర్ట్స్ భవనం వరకు వెళ్ళి తిరిగి జాగ్గింగ్ చేస్తూ వచ్చి చేసిన వ్యాయామం కి సరిపడ చాయి, ఓస్మానియా బిస్కెట్లు తిని తాపిగ యే 8 కో అల ఇంటికి రావడం మిస్స్ ఔతా. ఆంధ్ర యువతి మండలి, శివం రోడ్డు పై ఆ సమయానికే ఉండే "అందాలని" చూడ్డం మిస్స్ ఔతా (ఇది ఇంక ఇప్పుడు సాధ్యం కాదేమో.. but still... ;-) )
హిల్టన్ లో ఖాతా, గంగా హాస్టల్ ఎదురుగా సత్తర్ డబ్బా దగ్గర ఖాతా, మా కాలేజి క్యాంటీన్ లో ఖాతా, బస్స్ స్టాప్ దగ్గర యాదవ్ డబ్బా లో ఖాతా - అబ్బో ఇంకా దిల్షుక్ నగర్ లో ఒకటి రెండు చోట్ల ఖాతా ఇలా ప్రతి నెల 20-22 కి మొదలైయ్యేది. మళ్ళా నానా పాకెట్ మనీ ఇచ్చాకో మరి ఎక్కువగా విసిగిస్తే ఒక టెక్స్ట్ బుక్కు అమ్మాకో తీర్చడం. తార్నాకా జంక్షన్ దాటాక ఒక అమ్మయిల కాలేజి (పేరు గుర్తు రావడం లేదు) ముందు ఉన్న పానీ పూరి డబ్బ, సికందరాబాద్ లో స్వప్నలోక్ ముందు ఉన్న పాని పూరి డబ్బ, తిలక్ నగర్ లో ఒక పాని పూరి డబ్బ లో తినడం. ఒక సారి (అంటే ఇది రెండు రూపైయిలకి ఐదు పాని పూరి రోజులు) నేను మా నాగ్ గాడు కలిసి తిలక్ నగర్ లోని బండి (అది షాపు అనుకోండి) వాడి దగ్గర 26 రూపైయిల పానీ పూరి తిన్నాం!! ఇంటికి వెళ్ళాక అమ్మ పెట్టిన టిఫినూ తిన్నాం అనుకోండి అది వేరే విషయం. లకిడి-కా-పూల్ లోని ధనలక్ష్మీ మెస్స్ లో 23 ఫుల్ మీల్స్ ఉండేది. అక్కడికి వెల్తే మరి ఒక గంట గంటన్నర తినేవాళ్ళం.
ఇక్కడ ఒక సంఘటన - మెహదీపట్నం లో స్వాతి టిఫిన్స్ అని ఉంది. అక్కడ ఐదు రూపాయిలకి ప్లేట్ ఇడ్లీ ఉండేది. మేము అంటే ఒక 8 మంది వెళ్ళాం, ప్లేట్ ఇడ్లి కి 2-3 సాంబార్, 2-3 చట్నీ లాగించాం.. మరి వాడేమనుకున్నాడో ఎమో మరో సారి వెళ్తే ఎకెస్ట్రా సాంబార్ కి 1 రుపాయి అని పెట్టాడు. ఇలా అయితే మేము దివాలా ఐపోతాము అని, సగం ఖాలి అయిన సాంబార్ గిన్నే తీసుకు వెళ్ళేవాళ్ళం .. అప్పుడు దానికి వాడు చార్జి చేయలేడు కద. పాపాం ఒక వారం తర్వత ఆ ఎక్స్ట్రా చార్జీ తీసేసాడు. ఇలా ఎన్నో ఎన్నో విషయాలు గుర్స్తోస్తాయి.
కొయి లౌటా దె మెరె భీతే హుయే దిన్...
మళ్ళి కలిసే వరకు - ఆదాబ్ హైదరాబాద్.
3 comments:
Me post lo rasina places loo naku baaga nachinavi in Hyd are
Gandipet and Osmania Campus.
Meeru Osmania lo chadivaraa?I LOve tht campus main ga ladies hostel opposite road n tress bale untundi akkada :).
కాదమ్మ.. మాది వాసవి. ఓస్మానియా మా అడ్డ. అంటే మా ఇంటి పక్కనే.. సో almost whole life అక్కడే గడిపా. ఆ లేడీస్ హాస్టల్ ముందు వీధిలో ఇప్పటి సంగతి తెలేదు కాని మా రోజుల్లో evenings చాలా మంది లవర్స్ అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. చుస్...
Ohhh Vasavi naa... ok ok.
Hostel mundu ante alage untundi le :)
Post a Comment