Wednesday, April 22, 2009

విశ్వ దర్శిని - ఈ వారం నేను చదివిన వార్తలు.

అంటే కేవలం ఇవే కావనుకోండి. రోజు చదివే వార్తల్లో ఇవి కొంచం మంచిగా,వరైటీగా అనిపించాయి. ఇంక ఆలస్యం యేలా?

అంటార్టికా లో ఒక చోట, భూమికి 400 మీ కింద, గాలి కూడా లేని ప్రదేశం లో కొన్ని లక్షల సంవత్సరాల నుండి కొన్ని microbes జీవిస్తున్నాయి అట. ఈ క్రిమికీటకాలు మన ప్రాణ వాయువికి బదులుగా సల్ఫర్ ని, ఇనుము ని "పీల్చుకుంటాయట". ఇన్ని సంవత్సరాలు నిపుణులు అంతరిక్షం లో మన భూమి లాంటి గ్రహాల కోసం వెతుకేవాళ్ళు. అంటే నీరు, గాలి, వెలుతురు - ఇవి జీవనానికి అత్యంత ఆవశక్యమైనవని ఇన్నేళ్ళు నమ్మారు.. కాని అసలు ఇవేమి లేకుండా కేవలం సల్ఫర్ మీద బ్రతికే ఇలాంటి జీవులని చూసాక ఆ అభిప్రాయం మార్చుకోక తప్పదు. మార్స్ యొక్క ఎరుపు దీనివళ్ళేనేమో! ఏది ఏమైన వీటిని కన్నుకోవడం వలన ఈ అంతరిక్షం లో మనమ్మొక్కరమే లేము అన్నది వాస్తవమ్మే రోజు దగ్గర్లో ఉన్నట్టే ఉంది.

జావా ని కనుక్కొని ఎన్నో లక్షల ప్రోగ్రామర్లకి ఆరాధ్యంగా నిలిచిన SUN Microsystems ని Oracle కొనుక్కునే యత్నం చేస్తోంది. గత యేడది సన్ MySql ని ఒక్క బిల్లియన్ డాల్లర్లకి కొనుకున్నది. ఓరకల్ కి mysql కొంచం గట్టి పోటినిచ్చేది. ఆ మధ్యకాలం లో ఓరకల్ BEA ని కూడా కొన్నుకోవడం తో అటు middleware సాఫ్ట్వేర్ ని ఇటు database ని గట్టిపరుచుకుంది. జావా ని కొన్నుకోవడం తో అన్ని ఓరకల్ గుప్పెట్లోకి వచ్చినట్టే. దీని వల్ల జావా, mysql పై ప్రభావం ఎల ఉంటుందో మరి.

ఆ మధ్యలో డెరివేటివ్ల గురించి రాసాను. వాటి మీద ఇంకొన్ని వార్తలు. ఒక వార్త ప్రకారం, ఈ డెరివేటివ్ మార్కెట్ మొత్తం "విలువ" 64 ట్రిల్లియన్ డాల్లర్లట!! మన ప్రపంచ జీ.డీ.పీ విలువ కేవలం 56 ట్రిల్లియన్లు మాత్రమే. దీన్ని బట్టి అంచనా వేయచ్చు అసలు ఈ డెర్వేటివ్లని వారెన్ బఫ్ఫెట్ ఎందుకు financial weapons of mass destruction అని అన్నారో.

1963 నుండి 1998 వరకు వచ్చిన భూకంపలన్నంటిని ఒక చిత్రపటం పై వేస్తే ఇల ఉంటుంది. ప్రతి యొక్క tectonic plate ని చక్కగ గుర్తుపట్టచు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వత మన భారతఖండం యురేశియా ప్లేటు కిందికి వెళ్ళిపోతుంది.

మొన్సాంటో ని జెర్మనీ బహిష్కరించింది అట. ప్రపంచంలోకల్ల అతి నీచమైన కంపనీల్లో ఈ మొన్సాంటో ఒకటి. వాళ్ళు చేసే చెండాలపు పనుల గురించి చెప్పలంటే దానికే ఒక టపా రాయాలి. మరికొన్ని వార్తల్తో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.

4 comments:

Krishna April 22, 2009 1:34 PM  

సల్ఫర్ పీల్చుకుని బతికే జీవాలా ?? చాలా వింత గా ఉంది..బాగుంది. అయితే ప్లయింగు సాసర్లు అంతరిక్ష జీవాలు నిజమే నన్న మాట

Shashank April 22, 2009 6:39 PM  

నిజమే అయ్యిండచ్చు. ఎక్కడో చదివా -the extraterrestrial intelligence could be so advanced, that it would look like us trying to teach an ant to use a cell phone. అది విన్నప్పుడు నిజమే అనిపించింది.

జీడిపప్పు April 22, 2009 10:52 PM  

IBM, Oracle దగ్గర కుప్పలుతెప్పలుగా డబ్బు ఉంది. recession పుణ్యమా అని తక్కువ బేరానికే కంపెనీలను ఎడాపెడా కొనేస్తున్నాయి. M$ ఏమీ కొనడం లేదనుకుంటా ఈ మధ్య.

sreechandana April 24, 2009 12:37 PM  

nice blog shashank.. btw 1116 USD ante chaala ekkuvemo kada... Inaa present nenu kudaa bench ee ;) thks for visitng my blog.. keep visiting

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP