Tuesday, May 6, 2014

తెలుగు వీర లేవరా..

గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదేళ్ళగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఝాడించుకునే రోజు ఈ రోజే. మనకి రాజధాని లేకపోయినా పునర్ణిర్మించుకోగలమన్న నమక్కం మనకి ఉందన్న మాట దేశం మొత్తం వినిపించేలా తరలి రండి. వోటు వేయండి. రాష్ట్రాన్ని ఎవడబ్బ సొమ్మనో దోచుకున్న వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే వోటు వేయండి. Today is day we take our REVENGE on all the atrocities committed on us లోక్ సభలో మోదీ కి రాష్ట్రనికి బాబు ని తెద్దాం. నిలుచున్న మట్టిని కూడా కొట్టేసే దుర్మార్గులకి వద్దు.తెలుగు వీర లేవరా
దీక్ష బూని సాగరా
ఆంధ్ర రాష్ట్ర ప్రగతికోసం
నా-మో ని గెలిపించరా..


జై హింద్. జై జన్మభూమి. జై తెలుగునాడు.

Read more...

Tuesday, February 25, 2014

పాత రాష్ట్రం కొత్త పథం - 23. మన రాష్ట్రం లో విద్యుత్ కొరత అంతగా ఉండదు. కాని అవకాశం ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి పరచడం మంచిది కదా! అందులో క్రొత్త రాజధానికి విద్యుత్ చాలా అవసరం ఔతుంది. ఇవ్వన్నింటిని దృష్టి లో పేట్టుకొని శ్రీకాకులం లో అణు శక్తి విద్యుత్ ప్ల్యాంట్ కి శ్రీకారం చుట్టాలి. హైదరాబాదు కి కూడా విద్యుత్ శక్తి అవసరం పడుతుంది.. ఆ రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుండి విద్యుత్ అమ్మవచ్చు.

4. గోదావరి, కృష్ణమ్మల మీద ఆనకట్టలు నిర్మిస్తే చాలా ప్రమాదం మనకి. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలున్న చోత drip irrigation ని ప్రోత్సహించాలి. ఈ పద్ధతికి అనుకూలంగా అన్నదాతలకి రుణాలు సదుపాయాలు ఇవ్వాలి.

5.  కనీసం ఒక ఐదు - పది సంవత్సరాలు ట్యాక్సులు ఉండవు కనుక ఆంధ్ర లో head quarters పెట్టాలని అనుకునే కంపనీలు ఇక్కడి ప్రజలకు కూడా ఉద్యోగాలు సమకూర్చే విధంగా చేయాలి.

6. ఈ విభజన వల్ల అందరికంటే ఎక్కువగా నష్ఠపోయింది విద్యార్థులే.  అందునా పది - ఇంటర్ చదువుతున్న వారు ఎందుకంటే వీరికి ఇంక హైదరాబాదు లోని మంచి కళాశాలల్లో చేరాలేరు [JNTU Hyderabad, CBIT, Vasavi మున్నగునవి]. రాష్ట్ర పురోగతి వీరి మీదే ఆధారిపడి ఉంది కాబట్టి క్రొత్త / పాత కళాశాలలు ఆ లోటుని భర్తీ చేసేట్టు చూడాలి. అమేరికా, ఐరోపా, చైనా, జపాన్ లోని top universities తో ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాలల్లోని professors ని మన రాష్ట్రాంలో   [ఒక 1-2 సంవత్సరాలకి] చదువు నేర్పించమని అభ్యర్తించాలి. అలనే జాతీయ అంతర్జాతీయ కంపనీలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి కావాల్సిన research ని  చేసే సదుపాయాములని కలిగించాలి. ఇలా చేయగలిగితే పది - పదిహేను సంవత్సరములలో మన కళాశాలలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.


ఇవ్వన్ని చేయాలంటే ప్రథమంగా లంచగుండీ తనం తగ్గాలి. పోలీసు యాంత్రంగం సక్రమంగా ఉంటే మిగిలిన చోట్ల అదుపు చేసే ఆస్కారం ఉంటూంది. అందుకు పోలీసు వ్యవస్థకి కొన్ని అధిక, ఆధునీక సదుపాయాలు కలుగచేయాలి. మచ్చుక్కి - ఆర్మీ లాగా వస్తువులని చౌకగా అందజేయాలి. వారి కుటుంభ సభులకి కాలేజీల్లో కొంత reservation లాంతికి ఇవ్వాలి. ఇలాంటివి అన్నమాట.

------
నేను రాసినవి నాకు తోచిన కొన్ని అంశాలు మాత్రమే. ఒక్కసారి అనుకోవాలే కాని మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక స్వణాంధ్రగా ఒక హరితాంధ్రగా తీర్చిదిద్దగలం!

పై చెప్పినవి సులభం అని నేను అనడం లేదు భావించడమూ లేదు. కాని పోయినదాని గురించి బాధపడుతూ ఉండటం కంటే ఉన్నదాన్ని ఎలా అభ్యుదయ పరచాలో ఆలోచిస్తే ఉత్తమం అని నా అభిప్రాయం. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యం ఉన్నటులే శోకాల మడుగున దాగి శుఖమున్నదిలే...

Read more...

Wednesday, February 19, 2014

పాత రాష్ట్రం కొత్త పథం - 1


ఇప్పుడు ఇంక ఎలగో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చేసుకున్నాం కాబట్టి కొంచం ఊపిరి అందుకొని చేయాల్సిన కార్యక్రమాలనైన సక్రమంగా చేస్తే మంచిది అని నా అభిప్రాయం. అంటే.. ఇంక సమ్మెల్లు బందులు మానేసి జరిగినదాన్నే ఆలోచిస్తూ చింతిస్తూ అందరికి అసౌకర్యం కలగజేయకుండా ఇప్పుడు ఏమి చెయాలో ఆలోచిస్తే మనకే మంచిది. లోక్ సభ లో ప్యాస్ అయ్యాక ఇక రాజ్య సభలో ఎవరు ఆపుతారు? పోని లెండి.. అయ్యిందేదో అయ్యింది. చాలా మందికి ఈ బాధ ఉంది.. కాని ఇప్పుడు ఇక ఈ విషయం లో ఏమి చేయలేము అన్నది మత్రం వాస్తవం.

ఇంత ఉపోద్గాతం చాలు.

ఇప్పుడు మన ఆంధ్ర దేశాన్ని ఎలా మళ్ళీ అభివృది పథం లో నడపాలో ఆలోచించాలి. ఈ సారి జరిగినది ఇంకో సారి జరగకూడదు. అలనే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకే తాటి పై నిలబెట్టి అభివృది పరచాలి. అందుకు కొంచం (చాలానే) సమయం పడుతుంది... కాదనడం లేదు. కాని హైదరాబాదుని సొంతం చేసుకొని ఆ నగర అభ్యునతికి ఎలా పాటు పడ్డామో మరో సారి చేసే అద్రుష్టం దొరికింది అని భావించచ్చు. ముఖ్య మంత్రి ఎవరు అయినా కొన్ని కీలక పనులు చేబట్టటం మన అందరికి మంచిది. నాకంటే గొప్పగా అతిశయోక్తిగా ఆలోచిప్మగలిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు.. కాని ఇది నా బ్లాగు కనుక ఇక్కడ నాకు తోచిన కొన్ని ముఖ్యమైనవి వ్రాస్తున్నాను. అవధరించండి..

1. ప్రథమంగా, క్రొత్త రాజధాని యేదైనా, మిగిలిన నాలుగు ముఖ్య పట్టనాలని అత్యాధుకిన పద్ధతులతో కలపాలి. కర్నూలు, బెజవాడ, విశాఖ, తిరుపతి - ఈ నాలుగు మిగిలిన ముఖ్య పట్టనాలు (అని నా అభిప్రాయం.. కాదు ఇందులో బుచ్చిరెడ్డి పాలెం కూడా ఉండాలి అంటారా అది మీ ఇష్ఠం). ముందుగా ఈ నాలుగు నగరాలని 8 lane highways ద్వారా కలపాలి. అలనే అత్యాధునిక రైళ్ళ తో కూడా కలపాలి.. విశాఖ నుండి తిరుపతికి ఒక 5-6 గంట్టల్లో చేరేట్టు అని నా అభిప్రాయం. (జపాన్ joint venture కోసం చూస్తోంది) ఇలా ఈ నాలుగు నగరాలు + హైదరాబాదు ని కలపాలి. ఇదే విధం గా Golden Quadrilateral ద్వారా కలవని నగరాలకి కూడా అలాంటి రోడ్డు వేయాలి.

ఈ నాలుగు నగరాలు ఒక triangle లా ఔతాయి. క్రొత్త రాజధాని కూడా ఈ త్రికోణం లోనే ఉంటుంది కాబట్టీ అన్ని ముఖ్య నగరాలకి సౌకర్యాలు చాలా మెరుగౌతాయి!! ఇలా ఎందుకంటే..

2. విశాఖ లో steel factory, ship yard ఉంది. విశాఖ, బెజవాడ, తిరుపతి లో IT కి తగినట్టు అభివృద్ది పరచాలి. దానికి high speed fiber optic cables వేసి మద్రాసు లోని hub కి కలపాలి.  కర్నూలు లో defense industries, fabrication parks etc స్థాపించాలి. ఇలా చేయడం వలన మొత్తం రాష్ట్రం అభివృద్ది పడే ఆస్కారం ఉంటుంది. అదే సమయం లో కోస్తా కి ఆయువుపట్టు ఐన వ్యవసాయానికి కష్టం కలిగించదు.

(సశేషం)

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP