Wednesday, February 17, 2010

మై నేం ఈజ్ ఖ ఖ ఖ

పొరబాటున ఎప్పుడు చెడుచేసేవాడు మంచి చేస్తే ప్రపంచం లో వాడంత మంచి ఎవ్వరు ఉండరేమో అన్నట్టు చెప్పుకుంటాం. అదే సిద్ధాంతం దర్శకులకి కూడా వర్తిస్తుందేమో. ఎప్పుడు అతి వీర భయంకరమైన "ప్రేమ" కథలు తీసే వాడు సామాజిక సమస్య.. క్షమించాలి సామాన్యుడికి వచ్చిన సమస్య గురించి తీస్తే ఓహో.. ప్రజలంతా అసలు ఇలాంటి చిత్రం న భూతో నా భవిషత్! అని అనడం కొంచం విడ్డురం గా ఉంది. కాని ఏం చేస్తాం.. ఇప్పుడున్న దర్శకుల ప్రథిభ కి తార్కాణం అది.

మొన్నే ఆ సినెమా చూసా.. చూస్తూన్నంత సేపు ఎదో తేడాగా ఉందే అని అనిపించింది.. తర్వత అర్థం అయ్యింది ఎందుకు అలగా అని. ప్రతి సినెమాలో "కింగ్ ఖాన్" ఇదే రకం చేస్తాడు కద యాక్టింగ్ అని. ప్రతి సారి అంటే కాదు కాదు.. అప్పుడప్పుడు మంచి సినెమాలే చేసాడు - బాజీగర్, స్వదేశ్, చక్ దే లాంటివి - మిగితావన్ని ఒకేరకం కద యాక్టింగ్. అందులో అంటే నార్మల్ గానే అలా చేస్తాడు మరి ఈ సినెమా లో దానికి ఓ జబ్బు పేరు తగిలించారు. ఇంకే విచ్చలవిడిగా అదే రకం"యాక్టింగ్" చేసి పారేసాడు. పోనీ కాజోల్ ని అయినా చూద్దాం అంటే మధ్యలో అంటే పక్కనే కింగ్ ఖాన్ ఉంటాడు. ప్రతి సీన్ లో ఉన్నాడు. ఒక్కటి మాత్రం చాల బాగా చూపాడు.. 9/11 తర్వాత అమెరికా లో వచ్చిన మార్పులు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుళ్ళో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేము. ఆ సమయం లో ఇక్కడ ఉన్నవారు చాలా మందే ఉన్నారు కద.. వాళ్ళందరికి బాగా సుపరిచితమే అనుకుంటా. మా కాలేజి లో ఐతే మా మీద బాట్టళ్ళు వేశారు, రబ్బర్ తూటాలతో కాల్చారు, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని కనిపిస్తే అరిచేవాళ్ళు. చాలా యేళ్ళు ఎప్పుడు ప్లేన్ ఎక్కిన అధికంగా సెర్చ్ చేసేవాళ్ళు. ఆ ఒక్క విషయాన్ని కొంచం బానే చూపినట్టు అనిపించింది.

ఇంతకి కథ చెప్పలేదు కద... చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి. ఖాన్ జీవితాశయం అమేరికా రాష్ట్రపతి ని కలిసి నేను (అంటే అతడు) నిర్దోషి అని చెప్పడమే. దానికి పాపాం జార్జియా ని బలి ఇస్తాడు.. అంటే అంటే మరి మరి.. జార్జియా లో తుఫాను వస్టది అట.. అమేరికా లో ఎవ్వడు పట్టించుకోడట.. మన వీరో మాత్రం పొలో మని ఎక్కడో న్యూ మెక్సికో లోనో ఇంక ఎక్కడో ఉంటాడు పరిగెత్తుకుంటూ జార్జియా చేరి ఆ ఊరు ని ఉద్ధరిస్తాడు. అతడే కాదు అతన్ని మన దూరదర్షని లో, ఎన్.డి.టి.వీ లో చూపేసరికి తండోపతండాలుగ దేశిలు వచ్చేసి జార్జియా లోని ఆ గ్రామాన్ని మరో సిమ్హపురం (సింగపూర్) లా తీర్చిదిద్దుతారు. ఐనా మన దేశీల గురించి ఇంత కరెష్ట్ గా ఎలా చెప్పగలిగాడో ఏంటో "ఎదురుకొంప కొల్లేరు కాని నాకేమి పట్టిందని నిద్రలో మునిగున్నవాడ్ని" అన్నది కద మా జాతీయ గేయం. మనకేం కాలేదు కద. లైట్ తీస్కో బాసు అని గడిపేస్తాం. ఎక్కడో జన సంచారం లేని జార్జియా లో ఐతె మన వాళ్ళు చచ్చినా వెళ్ళరు. కరాఖండిగా చెప్పగలను. అసలు హరికేన్ అంటే తుఫాను వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటారో తెలిసినట్టూ లేదు పాపాం క.జో కి. నన్నడిగితే చెప్పేవాడ్ని కద.. ఒకానొక కాలం లో హరికేన్ లిల్లి వచ్చినప్పుడు నేను ఉన్నాను. సినెమాలో చుపించినంత చెత్తగా ఐతే ఎవ్వరు రాకుండా దిక్కులేకుండా లేము.

ఇదే సినెమా ఆంగ్లం లో తీసినట్టైతే అమేరికన్ వర్షన్ ఆఫ్ స్లండాగ్ మిల్లియనేర్ అయ్యేది. మరి అన్నేసి స్టిరియో టైపులు ఉన్నాయి ప్రతి ఫ్రేం లో. సివరాఖరికి చెప్పోచేదేంటంటే ఖాన్ + జోహర్ ఫ్యాన్స్ కి నచ్చదు.. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లా లేవు కాబట్టి సీరియస్ సినెమాలు చూసేవారికి నచ్చదు.. సీరియస్నెస్స్ ఎక్కడ లేదు కాబట్టి.. ఏదో కాలక్షేపం కోసం చూసే వాళ్ళకి నచ్చచ్చు ఏమో. చూసాక మీకు నచ్చితే చెప్పండి. ఇలాంటివి ఇంకొన్ని సినెమాలు ఉన్నాయి "శంకర్" లాంటివి..

Read more...

Monday, February 8, 2010

రణ్ - మీడియా రణరంగం

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రస్ఫుటంగా అనిపిస్తుంది.. గత రెండు నెలలుగా మన ఆంధ్ర దేశం లో జరిగిన అల్లకల్లోలాకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇలాంటి స్థిథి నెలకొన్నదానికి ఓ రకంగా పర్తికా రంగం దోహదపడింది. TV9, TV5, I-TV గట్ర గట్ర ఎంత సేపు ఎవరు ముందు చెప్పారా వార్తని ఎవరు ఎవరిని "ఓడించారా" అన్న విషయం మీదె ఎక్కువ మక్కువ చూపుతోంది.. అసలు వార్త కంటే. వై యెస్ ఆర్ ప్రయానించిన హెలీకాప్టర్ కనిపిస్తే ముందు ఆ వార్త చెప్పింది మేమే అంటు అంత దుఖం లో కూడా సొంత డబ్బా కొట్టుకోవడం మనం చూసాము. ఓ రాజకీయ నేత కి ఓ ప్రఖ్యాత చానెల్ అధినేతకి చాలా మంచి సంబంధాలు ఉండడం వలన రెండు రోజుల్లో ఆపేసిన నిరాహారదీక్ష ఎంత పెద్ద గందరగోలం సృష్టించిందో విధితమే.

ఒక కాలం లో బొఫొర్స్ ని బయటపెట్టి 'investigative journalism తో దేశానికి మేలు చేసిన పత్రికలు లేకపోలేదు. 75-77 లో ఎమర్జెన్సీ లో పత్రికాస్వేచ్చని నిర్బంధించిన ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ సంపాదకీయం స్థానాన్ని నల్లగా చేసి.. అటు తర్వత ఓ యేడాది పాటు అసలు పత్రికనే ప్రచురించకుండా అందులో పని చేసే అందరికి జీతాలు ఇచ్చిన పత్రికలూ ఉన్నాయి. అవన్ని గతం గతః ఎమో అనిపిస్తోంది ఇప్పుడు. ఎంతసేపు TRP రేటింగ్స్ ... అడ్డతిడ్డమైన అసహ్యకరణమైన నృత్యాలు గోరంత వార్తని కొండంత చేసి చూపే ప్రయత్నాలు. ప్రతి గంట ఎక్కడ నుండి వస్తాయి "బ్రేకింగ్ న్యూస్" ??? అందుకే వార్తలని సృస్టిస్తున్నారేమో. ఇలాంటి సమయాల్లో యే కొంచం అలజడి జరిగినా వీళ్ళకి పండాగే!! గొడవ ఆగిపోతే మళ్ళ చూపేదానికి వార్తలు విశేషాలు ఉండవు కద! ఎన్ని రోజులు గొడవలు జరిగితే అన్ని రోజులు పండగ.

ఈ వార్తా చాన్నెల్ల వ్యవహారం గురించే వర్మ తీసిన "రణ్". కొంచం కథా పరంగా బేలాగా ఉన్న కథనం మాత్రం నిజానికి దగ్గర్లో అనిపించింది. ఈ రోజు మన దేశం లో ఉన్న .. దేశం అనే కాదు ఇక్కడ అమేరికా లో కూడా అలానే తగలెడ్డాయి .. గోరంతని కొండంతగా చూపిస్తూ. సినెమా అంతా ఒక ఎత్తు.. అమితాబ్ చివర్లో 20 నిమిషాలు మీడియా ని కడిగేయడం ఒక ఎత్తు. అసలు ఆ సినెమా ని ఆయువుపట్టు అదే అనిపించింది. పైపెచ్చు మన తెలుగు వారికి బాగా అర్థం ఔతుంది.. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితుల ద్రుష్ట్యా.

నటనా పరంగా చూస్తే అమితాబ్ కొంచం కంట్రోల్డ్ గా చేసారు. ఆ చివరి క్లిమాక్స్ లో మాత్రం తన నటనా వైశిష్ట్యాన్ని చూపారు. తరువాత నాకు నచ్చిన వాడు సుదీప్. అతడు కన్నడ నటుడట. చాలా చాలా బాగా చేసాడు. కాని ఒక్కటే ఏంటంటే ప్రతి సీన్ లో ధూమపానం చేస్తూ ఉంటాడు. అదొక్కటే చిరాక్ గా ఉండింది. రితేష్ దేష్ముఖ్ సీరియస్ రోల్ చేసాడు. ఎప్పుడు నవ్వించేవాడు ఇందులో అంత సీరుయస్ గా చేయడం బాగుండింది. ఒక్క చోట అతని నిస్సహయత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.. భలే సీన్ అది. అదే సీన్ లో ఇంకొకడు మొనీష్ భేల్. వార్తని సృష్టించినా అడపాదడపా అబద్దాలు చెప్పినా ఆ మనకేమౌతుందిలే.. చూసేవాళ్ళు చూస్తారు అన్న భావన ఉన్న చానల్ అధిపతి. డబ్బే ప్రాధన్యాం గా మంచి రోల్. పరేష్ రావల్ గురించి చెప్పక్కరలేదు. గుల్ పనాగ్, సుచిత్ర బాగా చేసారు. ఈ సినెమాలో నాకు నచ్చిన ఇంకో ఆంశం ఏంటంటే ఏదైన వీడియో చూస్తుంటే చూసేవారి ముఖ కదలికల మీదే ఉంటుంది కమేరా.. వీడియో కంటే. వారి ఎక్స్ ప్రెషన్స్ ని బట్టి చెప్పచ్చు అది ఎంత షాకింగో ఏంటో అని. నాకు అది నచ్చింది.

చివరగా ఓ మాట - మీడియ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడచ్చు. తొక్కలే నాకెందుకు ఎవడు ఎటుపోతే అని అనుకుంటే గంటన్నర సమయం వృధ అని అనిపిస్తుంది. కామేడి ట్రాక్ పాటలు గట్ర ఏమీ లేదు. సింగల్ పాయింట్ అజెండ తో తీసిన చిత్రం. సీరీయస్ సినెమాలు చూసేవారికి నచ్చుతుంది.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP