Saturday, July 25, 2009

kavya's dairy - కావ్యము కాని డైరీ

కొన్ని సినిమాలు చూస్తే అంటే ఓ పది క్షణాలు చూస్తే చెప్పేయచ్చు ఎలా ఉంటాయో అని.. ఎవరో అన్నట్టు అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక్క మెతుకు చాలు టైప్ అన్నమాట. అలా అని మొత్తం సినిమా చూడకపోతే తీసినోడు ఫీల్ ఔతాడు కద.. అందుకే మొత్తం చూస్తా నేను. సినిమా అయ్యాక పేర్లు వస్తాయి కద.. అప్పటి వరకు చూస్తా. ఇలానే మొన్నా ఓ సినిమా చూసా.. ఓ ఐదు నిమిషాలు చూసేపాటికి స్టోరీ చాలా మటుకు అర్థం అయిపోయింది.. కాని పుట్టుకతో వచ్చిన బుద్ధి కద సోఫా లో పడుకొని మిగితా చూసా.

అదే కావ్యాస్ డైరీ. ఇప్పటికి ఇలాంటివి ఓ వందో వెయ్యో వచ్చింటాయి .. సతకోటిలో ఇదోటి అంతే. పెద్దగా గుర్తుండే సన్నివేశాలు కాని డైలాగులు కాని సీన్ కాని అసలు ఏమి గుర్తుండదు ఓ రోజు తర్వత. అంత గ్రేట్ మూవీ ఇది. యే సన్నివేశం చూసినా ఇంతక మునుపే చూసిన ఫీలింగ్ కూడా ఉంటది. అది బోనస్. ఏం జరగబోతోందో అని ఇంతకముందు ఓ రెండు మూడు సినిమాలు చూసిన పెతీ ఒక్కరు చెప్పగలరు. ఇంక అసలు కథ (నాకు గుర్తున్నంత వరకు) - ఓ ఇల్లు, ఓ ఫామిలి అంటే కరెష్ట్ గా ఓ అమ్మా ఓ నాన్న ఓ చంటిది ఓ బుడ్డోడు వాళ్ళకి ఓ కుక్క. పెద్ద ఇల్లు. ఇందులో ఎగెస్ట్రా ఏంటంటే మంజుల కి ఓ గ్రీన్ హౌస్ ఉంటది. ఓ తోటమాలి .. అదే రాజేష్. రోల్ పెద్దగా లేదు అతనికి .. అలా ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తాడు అంతే.

స్క్రీన్ మొత్తం చార్మే ఉంటది.. ఎంట్రీ ఇచ్చాకా. మంత్రా తర్వత ఇలాంటి కారెక్టర్లకే పరిమితం అయిపోయినట్టు ఉంది చార్మి. అనుకోకుండా ఒక రోజు లో కొంచం నార్మల్ గానే ఉండేది తర్వత ఏమైయిందో ఏమో కాని ఆవిరి కుడుము లా తయారయ్యింది.. కొంచం ఏంటీ బానే తగ్గాలి. అసలు మెడ కనిపించడం లేదు. పోనీ మనమేమైన సావిత్రా అంటే అది కాదు కద.. క్లోస్ అప్ లో ఐతే చూసి జడుసుకున్నా. మా నటశేఖర నటకిరీటి నటచక్రవర్తి నటసామ్రాట్ నటరాజ సూపర్ స్టార్ గారి అమ్మాయి ఐతే ఈ రోల్ కి చాలా బాగా స్యూట్ అయ్యింది. అచ్చు మా సూపర్ స్టార్ ని చూసినట్టే ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు దివ్య ఏమో తర్వత ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అన్నది.. నాకు అర్థం కాలే నేను చూడని మూవీ తనెప్పుడు చూసిందా అని.. అప్పుడు చెప్పింది ఇది "hand that rocks the cradle" అని చిత్రం కాపీ అట. ఈ చిత్రం లైఫ్ టైం లో ఎప్పుడో వస్తే చూసిందట. లైఫ్ టైం కూడా చూస్తావా అని పరమవిపరీతల్టిమేట్ ఎక్స్ ప్రెషన్ ఒకటి పెట్టి మరో సినిమా చూడ్డం మొదలెట్టా..

<దీనితోబాటే చూసిన ఇంకో రెండు సినిమాల రివ్యూ రాద్దాం అనుకున్నా.. కాని అస్సలు టైం లేదు. మా బాసు రెండు నెలలు పట్టే పనిని ఒక్క వారం లో చేస్తాం అని క్లైంట్ కి చెప్పొచ్చాడట. థూ నా బ్రతుకు అని పని చేస్తున్నా(ము). దాని గురించి మళ్ళా చెప్తా లే..>

Read more...

Monday, July 13, 2009

Beat in my heart..

దాదాపుగ ఒక పదైయేళ్ళ (అంటే పదిహేనేళ్ళన్నమాట) క్రితం ఒక అద్భుతమైన చిత్రం వచ్చింది. చాలా మంది మదిలో ఎదలో మెదడులో అంతక ముందే ఉన్న ఆలోచనలకి ప్రరిబింబం గా నిలచింది. తేజా "చిత్రం" అంత కాకపోయిన కొంచం చెడగొట్టింది అనే అనాలి. 'క్లాసు రూముల్లో తప్పస్సు చేయుట వేస్టు రా గురూ..' అని మాకున్న లక్ష సాకులు సరిపోదనట్టు ఇంకో గ్రేట్ సాకు ని చూపించింది. సరే ఎలాగూ క్లాస్ ఎగ్గొట్టాం కదా ఏం చేద్దామా తర్వతా అంటే దానికీ ఒక దారి చూపించింది.. ' బీట్ ఇన్ మై హార్ట్ ..' అని.

అసలు ఆ పాట విన్న మొదటిసారి ఇంచు మించు గా పిచ్చెక్కింది. ఆ ఊపూ ఆ బీటు.. దానికి తగ్గట్టుగానే సినిమా చూస్తే ఆ పాట picturization.. అది మా ఇంటర్ రోజులు. ఇంటర్ అంటే పెద్దగ లైఫ్ లో దేనికి టైం ఉండదు (ఇప్పటి సంగతి తెలీదు మా రోజుల్లో ఐతే ఇంటర్ లో మాకు లైఫే ఉండేది కాదు).. ఒహో ఇంజనీరింగ్ చేరితే ఇలా ఎంచక్క బైకుల మీద అమ్మయిని వెనకేసుకొని జాం చక్ అని రోడ్లెంబడి తిరగచ్చేమో అని తెగ చదివేసాం "సాంకేతిక వ్యవసాయ వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష" కి .. అదే ఎంసెట్ కి. ఎదో కొద్దో గొప్పో ర్యాంక్ రావడం తో సిటి లోనే కాలేజి లో చేరాం. రోజు అంతంత దూరం సిటి బస్సుల్లో వేలాడ్డం, ఇంటి ముందరే రన్నింగు బస్సు దిగడం... ఇలా ఉండేది. మా నాన్న ఓ రోజు "ఒరేయ్ నీకు కంప్యూటర్ కావాలా? బైకు కావాలా?" అని అడిగారు.. ఈ మాట కోసం ఒక రెండేళ్ళ నుండి కాచుకున్నా కద.. వెంట్టనే బైక్ అని చెప్పా. నాన్న అంత చట్టుకున్న చెప్పినందుకు ఆశ్చర్య పడి కొంచం నిరాశ పడి వీడి జన్మలో మారడు అని బాధపడి కొనిచ్చారు. ఇంకే.. ఇంటర్ నుండి దాచుకున్న నా లిస్ట్ బయటకి తీసి "ఇంజినీరింగ్" పక్కన, "బైక్" పక్కన "చెక్" మార్క్ పెట్టా. ఇంక కావాల్సింది కాలేజి బంక్ కొట్టడం - ఇది చాలా కష్టమైన పని (ఎప్పుడు చేయలేదు కాబట్టే), ఇంక ఒక గరల్ ఫ్రెండ్ ని పటాయించడం - అన్నేసి సినిమాలు చూసి ఇదెంత పని చిటికెలో ఐపోద్ది అని అనుకున్నా. ప్చ్...

క్లాసు రూముల్లో తప్పస్సు వేస్టని బైకుల మీద రోడ్లెంబడి తిరిగాము. సినిమ రెలీస్ అంటే అక్కడ ప్రత్యక్షమైపోయేవాళ్ళం. అలనే ఓ సారి అమరావతి లో 'గణేష్' విడుదలా అంటే మా వాడు ముందే వెంకీ ఫ్యాన్ .. లంచం ఇచ్చి నన్ను తీసుకొని వేళ్ళాడు. అక్కడేమో భయంకరమైన జనం. మరి మొదటి రోజు మొదటి ఆట అంటే ఆ మాత్రం ఉండాలి కద.. సరే అని క్యూ లో నిలబడ్డాం. మా గోల తట్టుకోలేక పోలీసులు లాఠీ అన్నారు. అది తప్పించుకునే ప్రయత్నం లో కాలి మీద ఓ వాత కూడా పడ్డది. సినిమా వద్దు ఏమి వద్దురా నాయాన అని .. మా ఆస్థాన థియేటర్ "శ్రీ రమణ" లో చూసాం.. అలా కాలాం సాగిపోతోంది. సీన్ కట్ చేస్తే ఇంజినీరింగ్ రెండో సంవత్సరం సగం అయిపోయింది.. కాని "నాకో గరల్ ఫ్రెండ్ కావాలి" అన్న కోరిక మాత్రం అలనే మిగిలిపోయింది. లేట్ గా అయినా లేటెస్ట్ గా అప్పుడర్థమైంది.. బంక్ కొట్టడం కాదు కష్ఠమైనది అని. సినెమాల్లో చూపిచినట్టుగా చేస్తే అమ్మయిలు పడ్డం కాదు చెప్పుదెబ్బలు పడతాయి అని. అయినా మానుతామా? ఎన్నోయేళ్ళ కోరిక కదా.. మా కాలేజి కాకుంటే పక్క కాలేజి లేకుంటే st. anns ఎక్కడ ట్రై చేసినా ఫలితం సున్నానే.

ఆలా చూస్తున్నే ఇంజినీరింగ్ అయిపోయింది.. సరే అమేరికా కి వస్తున్నాం ఇక్కడైనా అద్రుష్టం వరించకపోద్దా అని ఆశతో ఉన్నా. తీరా ఇక్కడ చూస్తే మా కాలేజి లో అబ్బాయిలు: అమ్మాయిల ratio 100:1 లా ఉండేది. ఖండాంతరాలు దాటొచ్చినా ఇంకా ఆంధ్రా అమ్మయిలేనా అని విదేశిలని పటాయించుదాం అని అనుకొని సైకాలజి కోర్స్ ఒకటి తీసుకున్నా మా సీనియర్ల అడుగుజాడల్లో. వారం వెళ్ళేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. తాజ్ మహల్ కట్టింది నేనే అని నా పేరు టిప్పూ సుల్తాన్ అని నేను క్రీ.పూ. 200 సంవత్సరం లో పుట్టానని ఇలా కొన్ని నిజాలు తెలిసే సరికి ఎందుకొచ్చిన కొచ్చిన్ అని మానేసా. ఇలా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నా చిరకాలా కోరిక మాత్రం అలనే ' హీట్ ఇన్ మై థాట్ ' అని వెంటాడుతునే ఉంది.

తర్వత తర్వత బోధి చెట్టుక్రింద కూర్చున్న బుద్ధుని లా నాకూ జ్ఞానోదయం అయ్యిన తర్వాత తెలుసుకున్నా... అలా ఆ రోజ్జుల్లో అలా తిరిగింటే మా ఆవిడ నా బెండు తీసేదని. ఒకందుకు అదే మంచిదైంది అని. మా నిశ్చితార్థం అయ్యాక .. అంటే అపటికే నా బండి 3000 కి ఎవరికో అమ్మేసారు మా ఇంట్లో.. అది అంత పెట్టి కొన్నవాడు ఎవాడో అని ఆశ్చర్యపడ్డా అది వేరే విషయం... మా ఆవిడ ని వాళ్ళ ఆపీసు నుండి పిక్ చేసుకొని లంచ్ కి వెళ్ళి మళ్ళా డ్రాప్ చేద్దాం అని ఓ గ్రేట్ ప్లాన్ వేసా. మా శ్రీ గాడి బండేసుకొని అంత దూరం మే ఎండ్డాళ్ళో వెళ్ళి పిక్ చేసుకొని లంచ్ చేసి 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ ఎంచక్కా డ్రాప్ చేస్తున్న సమయంలో ఢామాల్ అని పెద్ద సౌండ్ తో ఆ ముష్టి టైర్ పగిలింది. ఆహా నా రాజా ఏం టైమింగో అని మా ఆవిడని ఆటో ఎక్కించి ఓ రెండు కిలోమీటర్లు తోసుకొని టైర్ మార్చుకొని ఇల్లు చేరా. మొదటిసారి నా ఖ్వాయిష్ తీరేపాటికి ఇలా అయ్యింది అని బాధేసినా.. ఈ సారి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు శ్రీ గాడి బండి బదులు ఇంకో కొత్త బైక్ ఉంది.. దాని మీద వెళ్తా.. 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ...

Read more...

Thursday, July 9, 2009

పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్..

ఏంటో.. కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు నాకేమైన తెలుసా అని. అంటే ఏ ఒక్క ఫీల్డ్ లో అయినా కొంచం కొద్దో గొప్పో జ్ఞానం ఉంది అంటే అది ఈ సాఫ్ట్ వేర్ రంగం లోనే.. కాని ఇది ఓ మహా సముద్రం లా అనిపిస్తుంది. అది నిజమే.. కాని కొత్తగా ఏదైనా వస్తే అది ఎలా పని చేస్తుందో ఎందుకు పని చేస్తుందో అని వెంట్టనే అర్థం ఔతుంది. అదో ఆనందం. తుత్తి. నాలాగే చాలా మంది ఉంటారని నా అభిప్రాయం. మచ్చుక్కి.. గూగల్ వారి "క్రోం" వచ్చినప్పుడు దాన్ని దింపుకొని వాడి -ఓస్ ఇంతేనా. మంటనక్క (ఫైర్ ఫాక్స్) తో పోలిస్తే కొన్ని లేవు కొన్ని మంచిగా ఉంది అని తెలిసే వరకు జీవితం లో అదేదో కోల్పోయినట్టు ఉండడం సహజం. అది మన నైజం.

దీనికి విభిన్నంగా ఒక కొత్త (అంటే కొత్తదేమి కాదు.. ఓ రెండేళ్ళు అయ్యిందనుకుంట) టెక్నాలజి వచ్చి అది అంటుబట్టకుండా ఉంది అంటే అది - ట్విట్టర్. అది మొదలైనప్పుడు ప్రతిసారి లాగే ఓ యకౌంట్ తెరిచా. అదేంటో అని కొంచం వాడాను కాని అంతు బట్టలేదు. అసలు ఎందుకు వాడతారో అర్థం కాలేదు. ప్రతి క్షణం నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు లేరు. ఉండరని నా నమ్మకం. ఆశ కూడా.. నమ్మకం కంటే ఆశే ఎక్కువ. :p నిజంగా ఉన్నరంటే వాళ్ళ కంటే పని లేని వాళ్ళు.. అంటే కే.సీ.ఆర్ టైప్ అన్నమాట.. భూ ప్రపంచకం ఓల్ మొత్తం మీద ఎవ్వరు ఉండరు. అయినా సరే బోలెడు మంది ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఉంటారు. మచ్చుక్కి CNN పొరబాటున పెడితే చాలు. ప్రతి ఒక్కడు న్యూస్ బదులు ట్విట్టర్ చూడండి అంటు తెగ గోల చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో అంత గొప్ప గా నాకేమి కనిపించలేదు. బహుశా కనిపించదు కూడా. well this is just my own సొంత personal opinion. కాదు కూడాదు అని ఎవరైన అంటే కేసు పడుద్ది (TM).

నాకనిపించేది ఏంటంటే గూగల్ పెరుగుదల చూసి అర్రెర్రె ఇది మిస్ కొట్టామే ఇప్పుడెలా అని అనుకుంటున్న సమయం లో ఇది కనిపించింటది.. అందరు యకౌంట్లు తెరుస్తున్నారు బహుశ ఇది నెక్స్ట్ గూగల్ ఔతదేమో .. మళ్ళా ఇది కూడా మిస్ ఐతే జీవితం వేస్టూ అని భావించి ఈ CNN గట్ర ట్విట్టర్ వెంట పడ్డారు అని. అస్సలు పనికిరాదు అని చెప్పడం లేదు.. బంబాయి మీద దాడులు జరిగినప్పుడు ఈ ట్విట్టర్ ద్వారానే చాలా తెలిసింది. అలాంటప్పుడు ఒప్పుకుంటా.. కాని నిత్యం నిరంతరం "నేను ఇప్పుడు ఫార్ లూపు రాస్తున్నా" "ఇప్పుడు సొనాలీ బేంద్రే పోస్టర్ చూస్తున్నా " "ఇప్పుడు బుడుగుని తిట్టుకుంటున్నా" లాంటివి ఎవడు చదువుతాడు అని నా అనుమానం. నాతో ఎవడైన మాట్లాడాలంటే జీ-టాక్ లో పింగ్ చేస్తారు లేకపోతే .. వాళ్ళా అద్రుష్టం పండి ఉల్టా అయితే ఫోన్ చేస్తారు.. అంతే తప్ప ట్విట్టర్ లో "అరేయ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా" అని ఎవ్వడు రాయడు అనే నా ఫీలింగ్.

- ఇప్పుడే వీరో ఎంట్రీ ఇచ్చాడు.
- అప్పుడే ఓ పాట. పాట ఇలా ఉంది "పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్.. " (సాపాటు ఏటు లేదు ట్యూన్ లో..)
- వీరో "అగరబత్తులు" పట్టుకు తిరుగుతున్నాడు. ఎందుకో తెలీదు.
- వీరోఇన్ వచ్చింది.
- హీరో అగరబత్తులు వీరొఇన్ కి ఇచ్చాడు. ఏంటో నాకు పిచ్చేకుతోంది.
- వీరో కలగంటున్నాడు. అందులో బాలయ్య - హరికృష్ణ - తారక రత్నా - కలిసి పాటలు పాడుతున్నారు. అటువైపు నుండి రజని ఈల వేసుకుంటూ వస్తున్నాడు..
- ఇటు వైపు నుండి నేను జంప్ అని.
-----
- ఇప్పుడే మమతా తన రైలు బడ్జెట్ ప్రెసెంట్ చేస్తోంది.
- అటు పక్కనే కె.సి.ఆర్ ఎదో తాగుతున్నాడు
- లాలూ కి ఒక్క ముక్క అర్థం కాకుండా తన నోట్ బుక్ లో ఆవుల బొమ్మలేసుకుంటూ గడ్డిని ఊహించుకుంటున్నాడు.

ఏంటి వీడికి పిచ్చేకిందా అనుకుంటున్నారా? అంత లేదు..ఇది రాబోయే కాలానికి సంకేతాలు. ఆ రెండవది శశి తరూర్ ట్విట్టర్లు. (స్వకల్పితం) పోయినేడు U.N.O ఎన్నికల్లో బాన్-కి-మూన్ కి ప్రత్యర్థిగా నిలచి ఓడిపోయిన అతడికి కాంగ్రెస్ లో సీటిచ్చి పాలకాడ్ నుండి నిలబెట్టారు.. గెలిచేసాడు.. అర్రెర్రె గెలిచేసాడే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగోదేమో అని ఓ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఫుల్ "techie guy, youth తో టచ్ లో ఉన్నా అని ఎలా చెప్పాలా అనుకుంటున్నతడిని ఈ ట్విట్టర్ కరిచింది. దెబ్బకి ఇప్పుడు కేవలం ట్విట్టర్తోనే మాట్లాడుతున్నాడట. పదివేల మంది "followers" ఉన్న మొట్టమొదటి భారతీయుడు అట. (ఎందుకు అని అడగద్దు అది చదివిన తర్వత ఎందుకో వరైటి గా అనిపించింది).

ఈ ట్విట్టర్ మీఎవరికైన అర్థం అయితే ప్లీజ్ నాకు చెప్పండి. ఎం.ఎఫ్. హూసైన్ చిత్రాలు, బాలయ్య రొమాన్స్, అరవ కామెడి, అజిత్ అగార్కర్ బౌలింగ్ - వీటి తో బాటే ఈ ట్విట్టర్ అని డిసైడ్ అయ్యాను. అల కాదు దీన్ని ఇలా వాడాలి అనో అరవ కామెడి ని అర్థం చేసుకే పద్దథి ఇది అనో ఎవరైన నాకు "ట్విట్టరోపదేశం" చేస్తా అంటే - ధన్యుడని. అంత వరకు..

Read more...

Monday, July 6, 2009

Home - an invaluable documentary.

ప్రపంచం. ధరణి. మన భూమి. పదాలు వేరైన భావం ఒక్కటే కదా. మనుషులు వేరైన నిల్చునేది ఒక్కటే. దేశాలు వేరైనా చెడగొట్టేది ఒక్కటే. గత వంద సంవత్సరాళ్ళో మానవజాతి చాలా రంగాల్లో ముందడుగు వేసింది.. ఇంకా చాలా విషయాల్లో వెనకడుగు వేసిందనే చెప్పాలి. శాంకేతికంగా ఇంతకమునుపెన్నడు లేలంత నైపుణ్యం సంపాదించాము.. ఎన్నో ఎన్నేన్నో రోగాలకి మందులు కనుకున్నాం.. అంతరిక్షాంలోకి వెళ్ళాం ఇంటర్నెట్ ద్వారా ప్రతి క్షణం "కనెక్ట్" అయ్యివున్నాం. ప్రపంచం తో "డిస్కనెక్ట్" అయ్యాం.

మనిషి ఇలా నాగరికంగా సాంఘికంగా చరిత్ర చూస్తే ఓ పది వేల సంవత్సరాల నుండి ఉంటున్నాడని తెలుస్తుంది. కాని మునుపెన్నడు లేనంత ఇబ్బందులు ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. మన దేశం లో మొట్టమొదటి దాదాపుగా పది వేల సంవత్సరాల క్రితం సరస్వతి నది ఒడ్డున మకాం వేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహానది సరస్వతి లేనేలేదు!!! కాని ఇప్పుడు మన దేశం లో మనిషి అంటూ లేని ఇంచు లేదేమో! ఒక్కప్పుడు దిల్లీ నుండి ఆగ్రా వరకు ధట్టమైన అడవులు ఉండేవి. మన ఆంధ్ర దేశం అటవీ ప్రాంతం గా వాల్మీకి రామాయణం లో చెప్పబడుతుంది. అంతెందుకు చిత్తూరు జిల్లా మొన్న మొన్నటిదాకా ప్రతియేట వరదలు వచ్చేవి. భాగ్యనగరం లో సరిగ్గా వందేళ్ళ క్రితం వచ్చిన వరద ఫలమే శ్రీ మోక్షగుండం నిర్మించిన గండీపేట్ ఆనకట్ట. ఇప్పుడు మూసి అంటే పెద్ద బూతైపోయింది. హైదరాబాదు నాలుగు వందలేళ్ళ చరిత్రలో దాదపుగ మూడువందలేళ్ళూ ఆ మూసి నది నీళ్ళే తాగింది. ఇప్పుడు మురికి కాలువగా జతకట్టేసాము. ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

మనము పురోగతి సాధించామో పురోగతి పేరిట తిరోగతి సాధించామో నాకు తెలీదు. కాని తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు లంకవేయపడ్డారు కాబట్టి. అమేరికా తదితర దేశాలు ఇన్నేళ్ళు పురోగతి పేరిట చాలా చాల పొగ ప్రపంచంలోకి వదిలింది చాలా చెత్త చేర్చింది అందుకే మాకు కొన్నేళ్ళు వ్యవధి కావాలి మా వంతు కాలుష్యాన్ని చేసేదానికి అని చైనా మన దేశం అనడం మూర్ఖంగా ఉంది. వాళ్ళు చేసారు కాబట్టీ మేమూ చేయాలి అనడం తప్పు కాదు కాని వాళ్ళు చేసిన తప్పే మేమూ చేస్తాం అనడం తప్పు అంటున్నా. యాభై యేళ్ళ క్రితం వరకు మనకి ప్రపంచం లో కాలుష్యం వలన సంభవించిన మార్పులు తెలీవు.. కాని ఈ రోజు ప్రతి దేశం లో ప్రతి చోట ఎన్ని అవకతవకలు జరుగుతున్నయో కళ్ళారా చూడగలుగుతున్నాం. కాని నివారించే యే ప్రయత్నం చేయడం లేదు. ఆ మనం ఏమి చేసిన ఏమి అవ్వదు అన్న సినికల్ మెంటాలిటీ కి బానిసలైపోయాం.

ప్రపంచం కనిష్టం 33 శాతం వృక్షాలతో ఉంటేనే వర్షాలు సరిగ్గా పడుతయి భూమి ఎడారిగా మారదు అని తెలిసినా మనం ఏమీ చేయడం లేదు. ఇది రాజకీయం గా ఎంత తప్పో మనం ప్రజలుగా చేస్తున్నది కూడా అంతే తప్పు. మన నగరల్లో అసలు చెట్లు కనిపించవు. చెట్లు లేకపోతే వర్షాలు పడవు అని తెలిసినా మనం చెట్లు నాటము. మన carbon footprint తగ్గించుక్నే యే ప్రయత్నం చేయము. అనంతపురం జిల్లా ని చూసైన బుద్ధి తెచ్చుకుంటాం అనుకున్నా.. కాని అదీ కష్టం గా ఉంది. మన వాతావర్ణం చాలా చాలా సున్నితమైనది. యే కొంచం మార్పు వచ్చినా సరిపొయేదానికి చాలా టైం పడుతుంది. కాని అదేమి పట్టించుకోవడం లేదు మనం. fishing పేరిట సముద్రాంలోని చేపల్ని ఎంత పట్టేసాం అంటే ఇంకో 20-30 యేళ్ళల్లో అసలు చేపలే ఉండవట. మెళ్ళ మెళ్ళగా మన సముద్రాల్లు అన్ని అసిడిక్ ఔతున్నాయి. దాని వలన కోరల్ రీఫ్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. ప్రతి జీవి కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలనే ఈ కోరల్ రీఫ్స్ కూడా. వాటిలో యే ఒక్కటి మాయమైనా బ్యాలన్సె తప్పుతుంది. Our world is like a beautiful glass globe balanced on the edge of a pin. Any minute change from this state of equilibrium will disturb the balance and shatter the globe.

వేసవి లో ఆర్టిక్ లో ఇప్పుడు మంచు ఉండడం లేదు. దాని వలన సూర్య రస్మి సముద్రాన్ని ఇంకా త్వరగా వేడి చేయగలుగుతోంది. పోలార్ బేర్స్ ఇంచు మించు గా శాస్వతంగా మాయామయిపోట్టూ ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ లో దాదాపుగా ప్రపంచం లోని 20% మంచి నీళ్ళు మంచు రూపంలో ఉంది. కాని అది చాలా వేగంగా కరిగిపోతోంది. అలనే మనం హిమాలయాలు కూడా శరవేగం తో కరిగిపోతున్నాయి. కాని మనం మత్రం అలనే కాలుష్యం చేస్తునే ఉన్నాం. ఇప్పుడు వాతావర్ణం లో మునుపెన్నడు లేనంత CO2 ఉంది. ఇంక సైబీరియా లోని పర్మా ఫ్రాస్ట్ కరిగితే అందులో కొన్ని వేల సంవత్సరాల నుండి నిర్భంచ్నబడిన మీథేన్ బయటకి వచ్చే ప్రమాదం ఉంది. మీథేన్ CO2 కంటే నాలుగింతలు పవర్ ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. అసలు అలా మీథేన్ వాతావర్ణం లోనికి వస్తే ఏమౌతుందో చెప్పేదానికి మోడల్స్ కూడా లేవు.

ఇన్నేళ్ళు నేను కొంచం ఆప్టిమిస్తిక్ గా ఉండేవాడ్ని. కాని ఏమీ జరగకపోవడం చూసి నాకు అంతగా hopes ఏమీ లేవు. We might have crossed the point of no return అదే గనక జరిగి వుంటే ఇంకొద్ది యేళ్ళల్లో there will be a "reset". ధరణి ప్రతి సారి తన బ్యాలన్స్ తప్పినప్పుడు రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సరి కూడా అలా జరిగే చాన్సులు ఉన్నాయి. ఎప్పుడు ఎలా అని మనకి తెలీదు. జరుగుతుంది అని మాత్రమే తెలుసు. మన రాబోయే తరానికి మనం ఇచ్చే బహుమతి ఇదేనేమో.

నాకు వీళైతే ఈ documentary ని మన దేశం లోని అన్ని భాషల్లోకి అనువదించి ఊర్లల్లో కూడా చూపించే ఏర్పాటు చేసేవాడ్ని. మన ప్రజలకి తెలియాలి మనం చేస్తున్న తప్పేంటో అని. ఇది తప్పు అని తెలిస్తే కద దాన్ని సరిదిద్దుకునేది. మీ అందరికి నా మనవి. 93 నిమిషాలు పక్కనబెట్టి చూడండి. నెట్ లో రోజు చెత్త బదులు అందులో ఒక్క 93 నిమిషాలు పక్కనబెట్టి ఇది చూడండి. ప్రతి ఒక్కరు చూడండి. మనవంతు కృషి మనం చేద్దాం. మన తర్వాత తరం మనన్ని తిట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేద్దాం.

గమనిక: ఈ documentary free version ఇక్కడ చూడచ్చు.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP