Wednesday, February 19, 2014

పాత రాష్ట్రం కొత్త పథం - 1


ఇప్పుడు ఇంక ఎలగో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చేసుకున్నాం కాబట్టి కొంచం ఊపిరి అందుకొని చేయాల్సిన కార్యక్రమాలనైన సక్రమంగా చేస్తే మంచిది అని నా అభిప్రాయం. అంటే.. ఇంక సమ్మెల్లు బందులు మానేసి జరిగినదాన్నే ఆలోచిస్తూ చింతిస్తూ అందరికి అసౌకర్యం కలగజేయకుండా ఇప్పుడు ఏమి చెయాలో ఆలోచిస్తే మనకే మంచిది. లోక్ సభ లో ప్యాస్ అయ్యాక ఇక రాజ్య సభలో ఎవరు ఆపుతారు? పోని లెండి.. అయ్యిందేదో అయ్యింది. చాలా మందికి ఈ బాధ ఉంది.. కాని ఇప్పుడు ఇక ఈ విషయం లో ఏమి చేయలేము అన్నది మత్రం వాస్తవం.

ఇంత ఉపోద్గాతం చాలు.

ఇప్పుడు మన ఆంధ్ర దేశాన్ని ఎలా మళ్ళీ అభివృది పథం లో నడపాలో ఆలోచించాలి. ఈ సారి జరిగినది ఇంకో సారి జరగకూడదు. అలనే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకే తాటి పై నిలబెట్టి అభివృది పరచాలి. అందుకు కొంచం (చాలానే) సమయం పడుతుంది... కాదనడం లేదు. కాని హైదరాబాదుని సొంతం చేసుకొని ఆ నగర అభ్యునతికి ఎలా పాటు పడ్డామో మరో సారి చేసే అద్రుష్టం దొరికింది అని భావించచ్చు. ముఖ్య మంత్రి ఎవరు అయినా కొన్ని కీలక పనులు చేబట్టటం మన అందరికి మంచిది. నాకంటే గొప్పగా అతిశయోక్తిగా ఆలోచిప్మగలిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు.. కాని ఇది నా బ్లాగు కనుక ఇక్కడ నాకు తోచిన కొన్ని ముఖ్యమైనవి వ్రాస్తున్నాను. అవధరించండి..

1. ప్రథమంగా, క్రొత్త రాజధాని యేదైనా, మిగిలిన నాలుగు ముఖ్య పట్టనాలని అత్యాధుకిన పద్ధతులతో కలపాలి. కర్నూలు, బెజవాడ, విశాఖ, తిరుపతి - ఈ నాలుగు మిగిలిన ముఖ్య పట్టనాలు (అని నా అభిప్రాయం.. కాదు ఇందులో బుచ్చిరెడ్డి పాలెం కూడా ఉండాలి అంటారా అది మీ ఇష్ఠం). ముందుగా ఈ నాలుగు నగరాలని 8 lane highways ద్వారా కలపాలి. అలనే అత్యాధునిక రైళ్ళ తో కూడా కలపాలి.. విశాఖ నుండి తిరుపతికి ఒక 5-6 గంట్టల్లో చేరేట్టు అని నా అభిప్రాయం. (జపాన్ joint venture కోసం చూస్తోంది) ఇలా ఈ నాలుగు నగరాలు + హైదరాబాదు ని కలపాలి. ఇదే విధం గా Golden Quadrilateral ద్వారా కలవని నగరాలకి కూడా అలాంటి రోడ్డు వేయాలి.

ఈ నాలుగు నగరాలు ఒక triangle లా ఔతాయి. క్రొత్త రాజధాని కూడా ఈ త్రికోణం లోనే ఉంటుంది కాబట్టీ అన్ని ముఖ్య నగరాలకి సౌకర్యాలు చాలా మెరుగౌతాయి!! ఇలా ఎందుకంటే..

2. విశాఖ లో steel factory, ship yard ఉంది. విశాఖ, బెజవాడ, తిరుపతి లో IT కి తగినట్టు అభివృద్ది పరచాలి. దానికి high speed fiber optic cables వేసి మద్రాసు లోని hub కి కలపాలి.  కర్నూలు లో defense industries, fabrication parks etc స్థాపించాలి. ఇలా చేయడం వలన మొత్తం రాష్ట్రం అభివృద్ది పడే ఆస్కారం ఉంటుంది. అదే సమయం లో కోస్తా కి ఆయువుపట్టు ఐన వ్యవసాయానికి కష్టం కలిగించదు.

(సశేషం)

2 comments:

Anonymous,  February 22, 2014 7:19 AM  

Welcome back. Hope to see posts more often.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP