Saturday, August 22, 2009

విశ్వ దర్శిని - sports edition

ఉసేన్ బోల్ట్ strikes again
Lightning Bolt గురించి దేవుడెరుగు ఉసేన్ బోల్ట్ గురించి ప్రపంచం అంతా చెప్తారు. పోయినేడు చైనా లో జరిగిన ఒలంపిక్స్ 100, 200 మీటర్ల పరుగు పందాళ్ళో ప్రపంచాన్ని ఆహ్లాదపరచి ప్రత్యర్థులని భయపెట్టి రెండు ప్రపంచ రికార్డ్లని స్థాపించాడు. 100 మీ పరుగులో 80 తర్వత కొంచం మెళ్ళాగా అయిపోయీ అప్పుడే celebrations మొదలెట్టాడంటే ఆలోచించండి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అని. అప్పుడు నెలకొలిపిన రికార్డు 9.69 సెకన్లు. గతవారం జెర్మనీ లో జరిగిన పరుపుపోటీళ్ళో మళ్ళీ తర రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకొని ఈ సారి 9.58 సె లో 100 మీ పరిగెత్తాడు. 100 meters in 9.58 secs!!!! ఒక కాలం లో 100 మీ లని 10 సే లో పరిగెట్టడం గొప్పగా ఉండేది. ఇప్పుడు ఈ 22 యేళ్ళ కుర్రాడు ఇంకొన్ని యేళ్ళవరకు ఎవ్వరికి అందకుండా పరిగెత్తి ఆ రికార్డ్లని దాచేటట్టు ఉన్నాడు. పనిలో పనిగా 200 మీ లని 19.19 సె లో ఛేదిచ్చేసాడు. ఆ రెండు పరుగుల వీడియోలు ఇక్కడ:

Where is Tiger?
ఈ ప్రశ్న నాతోబాటే ప్రపంచంలో చాలామంది అడిగింటారు. అసలు PGA ఆడుతున్నది టైగర్ వుడ్సేనా ఇంకెవరైన నా అని. ఐదో సారి గెలిచేటందుకు అన్ని సెట్ చేసుకొని ఉన్న టైగర్, చివరి రోజున యాంగ్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఇప్పటివరకు మేజర్స్ లో అంటే ఎనిమిది సార్లు టైగర్ చివరి రోజున ఆధిక్యం లో ఉంటే ఎప్పుడు ఓడిపోలేదు. ఈ సారి కూడా అంతేనేమో అని అందరు ఊహించారు. టైగర్ మీద నమ్మకమో యాంగ్ అంటే "ఎవరు?" అన్న ధైర్యమో తెలీదు కాని ఒక ఐరిష్ బుకీ మాత్రం ఆదివారం ముగిసే PGA tournament కి శుక్రవారం, టైగర్ 4 షాట్ల ఆధిక్యం లో ఉండగా, టైగర్ మీద పందెం కాసిన వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేసారు. ఆదివరం అది ఉల్టా అయ్యింది.. దెబ్బకి ఓ $2.12 మిల్లియన్లు నష్టం కోరితెచ్చుకున్నారు. ఆత్రమో ఆవేశమో ఓ ఐదు నిమిషాలు.. ఇక్కడ ఓ రోజు.. ఓపిక పట్టుకోవాలి అని ఊరికే కాదు అనేది. యాంగ్ టైగర్ ని ఓడించడం ఇది రేండో సారి. 2006 HSBC tournament లో ఒక్కసారి ఇంతకముందే ఓడించాడు. ఈ PGA గెలుపువళ్ళ మేజర్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చరిత్ర పుట్టాళ్ళో తన స్థానాన్ని చేజిక్కిచ్చుకున్నాడు.

యేయ్ యేయ్ ఇంగ్లండ్.
మన దేశాన్ని దోచుకొని ఇన్నేసి కలతల్ని రేపి విభజించి భ్రష్టుపట్టించి మన దారిద్ర్యానికి కారకులైన ఇంగ్లాండ్ ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఒక్క బుడిదలో తప్ప.. అదే అదే ఆషెస్ లో తప్ప. ఇంగ్లాండ్ మీద కోపం కంటే ఆసీస్ అంటే చిరాకు ఎక్కువ. చిరాకు చాలా చిన్న పదమేమో. కంపరం apt. అందుకని ఆసీస్ ని ఎవ్వరు ఓడించిన ఒక్క పాకిస్తాన్ తప్ప వాళ్ళకి నేను అభిమానిని. తప్పుబట్టకండి .. స్టీవ్ వా ఉన్నప్పుడు కొంచం బాగుండేది వాళ్ళ బిహేవియర్. ఈ పంటర్ చేత్లో వచ్చాక అదేదో god given right గా అతిగా చాలా చేసాడు. ఈ సారి ఓడిపోతే పీకేస్తారు పంటర్ ని. హమ్మయ్య ఈ పీడ విరగడైద్ది. షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, గిల్లి గట్ర ఉన్నప్పుడు నిజంగానే ఆసీస్ రాజుల్లా ఉండేవారు. ఇప్పుడు world XI లో చోటు సంపాదిచ్చుకునే ప్లేయరే లేడు. కాని పంటర్ పొగరు మాత్రం అలనే ఉంది. ఈ దెబ్బతో అతడి క్యాప్టన్సీ పొగరు రెండు హూష్ కాకి ఔతాయేమో అని చిన్ని చిన్ని ఆశ..

బ్రేడి ఈజ్ బ్యాక్ ..so is Favre.
2001 లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి దాక రోజంత క్రికెట్ చూస్తూ ఆనందంగా ఉండే నా జీవితం సడన్ గా ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా MLB, NBA చూడ్డం మొదలెట్టాను. కొద్ది రోజులు చూసాకా నాకు పరమ బోరింగ్ గా అనిపించింది. ఇలా ఐతే నాకు పిచ్చి ఎక్కుతుంది అని అనిపించేది. అప్పుడు చూసా NFL. అర్థం చేసుకునేదానికి ఓ సీజన్ పట్టింది కాని నాకు భలే నచ్చింది. అసలు క్రికెట్ కి మన ఊర్లో ఉన్నంత అభిమానం ఈ క్రీడకి ఉండడం అన్నింటికన్న నన్ను ఆకట్టుకున్న విషయం. దానికి తోడు MLB NBA లా కాకుండా ఒక్క రోజు.. ఒక్క గేం లో తేలిపోద్ది.. అది ఇంకా నచ్చింది నాకు. ఈ గేం ని అర్థం చేసుకునేదానికి నేను ఫాలో అయినా టీం పేట్రియట్స్. 2001 సూపర్ బోల్ గెలుచుకున్న టీం. అప్పటి నుండి నాకు పేట్రియట్స్ అన్నా టాం బ్రేడి అన్న అభిమానం. 2008 లో ఏడే ఏడు నిమిషాలు ఆడాడు. మళ్ళా ఆడగలడొ లేదో అని అనుమానం వచ్చింది. కాని ఈ యేడు ప్రీ సీజన్ గేం లో ఆడి న్యూ ఇంగ్లాండ్ వాళ్ళందరికి పేట్ర్యియాట్స్ ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. హమ్మయ్య.

అలనే నేను ఒక్కప్పుడు అభిమానించే ఇంకో QB బ్రెట్ ఫావ్ర్. గ్రీన్ బే కి ఆడినన్ని రోజులు బాగుండేవాడు.. ఇప్పుడు సంవత్సరానికి ఓ రెండు సార్లు రిటైర్ అయ్యి ఒక వేరే వేరే టీం లో చేరి తన అభిమానులని దూరం చేసుకుంటున్నాడు. బహూసా ఈ జన్మ లో రిటైర్ అయ్యి Hall of Fame కి వెళ్తే చాలా మంది మర్చిపోతారేమో. కాని అసలు ఆ మనిషి రిటైర్ ఔతాడా అన్నది కోటి రూపాయల ప్రశ్న.

Read more...

Friday, August 14, 2009

కమీనే - My Experience

ఒక మనిషి పనిని చూసి మరో మనిషి అదే విధంగా చేయడం మానవ నైజం. మానవులదే కాదు ప్రతి జంతువు కి అది సహజం. ప్రతి మనిషి తనని తాను మలుచుకుంటూ ఉంటాడు. అది నిత్య ప్రక్రియ. అలా మలుచుకునేదానికి దోహదపడేవి అతడి చుట్టు ఉన్న సమాజం.. చుట్టు ఉన్న మనుషులు వారి గుణాలు. ఇంకొకరి లో నచ్చినవి మనం మనలో నిబిడీకృతించే ప్రయత్నం చేస్తాం. అలానే ఇంకొకరి లో నచ్చనివి మనలో లేకుండా.. రాకుండా జాగ్రతపడతాం.ఇవేవి తప్పు గా అనిపించవు.. తప్పు కావు కూడా. ఒక మనిషి మలిచిన ఒక వస్తువుని చూసి అది మనకి నచ్చి మళ్ళా అది మనం వాడితే లేకుంటే దాన్ని ప్రస్తావిస్తే అది కాపి కొట్టినట్టు కంటే ఆ మనిషికి అర్పిస్తున్న నివాళి లా భావించాలి. ఎవరో అన్నట్టు originality is overrated అది వాస్తవం కాకపోయినా పాయింట్ ఏంటంటే an inspiration can be as good, if not better, than the original. nothing wrong with that.ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నా అంటే..

ఇందాకే కమీనే చూసి వచ్చా. భారతీయ సినిమాళ్ళో ఓ his-pearl (ఆణిముత్యం) అని అనడం లేదు కాని భారతీయ చిత్రాలని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళే చిత్రం అని ఖండితంగా చెప్పగళను. ఒక్క మెట్టేం ఖర్మా ఓ పది మెట్లు పైకి లాగుతుంది అని నమ్మకం. కొంచం విశ్లేషన అవసరం. రాం గోపాల్ వర్మా రాక ముందు తెలుగు సినిమాలు అలానే హింది సినిమాలు నాటకరంగానికి వారసుల్లానే ఉండేవి. అంటే కెమెరా యాంగల్ మారే సంధర్బాలు చాలా అరుదుగా ఉండేవి. సినిమా అంటే నాటకాన్ని రెకార్డ్ చేసి రోజు చూపించే దానిలా భావించేవాళ్ళు. కావాలంటే చూడండి. శివ ముందు వరకు (అంటే తర్వత ఈ రోజు వరకు కూడా ఇది వర్తిస్తుంది..) ప్రతి సీన్ కి ఓ ఫ్రేం లో బంధించేవారు. నటీనటులు ఆ ఫ్రేం లో లేకుంటే వారి మాటలు వినపడేవి కావు. అలనే ప్రతి ఒక్కరు ఆ ఫ్రేం లో వచ్చే వరకు మాట్లాడేవారు కాదు. కెమెరా ఎక్కువగా జరిగేది కాదు.. సినిమా మొత్తం అలా ఓ ఫ్రేం లోనే ఉండేది. (దీనికి ఉదాహరణ కె.రాఘవేంద్ర రావ్, బీ.ఏ చిత్రాలు చూడండి) మామూలుగా మనం నిజ జీవితం లో యే విషయాన్నైనా ఓ కోణం నుండి చూస్తాం... అలనే ఆ విషయాన్ని మరోకడ్డూ ఇంకో కోణం నుండి చూస్తాడు. కాని ఇది సినెమాలో కనిపించేది కాదు. ప్రేక్షకులు అందరు తెర ముందు ఓ నాటిక చూస్తున్నారు అనే భావన తోనే సినిమాలు తీసేవారు.

ఈ పద్ధతి కి విరుద్ధంగా వెళ్ళిన వ్యక్తి రాం గోపాల్ వర్మా. అంతక పూర్వం (నాకున్న చిత్ర పరిజ్ఞానం ప్రకారం) ప్రయత్నించింది గురు దత్త్. కాని అతడూ వర్మ అంత పేరు పొందలేదు.. వర్మ చేసినన్ని experiments చేయలేదు. "కంపని" చూస్తే మీకే అర్థం ఔతుంది నేను ఏం చెప్పెప్రయత్నం చేస్తున్నానో అని. "ఖల్లాస్ " పాట లో ఈషా అదేదో వీధి నాటకాల్లో లా అగుపించదు... తన చుట్టూ కెమెరా తిరుగుతూ ఉంటది. ఆ కెమెరా కదలికల్లో ఆ బార్ లో జరిగే వేరే విషయాలు కూడా కనిపిస్తాయి.. కాని వాటి మీద ఎక్కువగ concentration ఉండవు. నన్నడిగితే కేవలం కెమెరా యాంగెల్స్ కోసం కంపని నీ ఓ textbook గా తీసుకోవచ్చు. అలనే ఇప్పుడు ఈ కమీనే ని.

Quentin Tarantino పేరు వినే ఉంటారు చాలా మంది. pulp fiction, reservoir dogs, kill bill చిత్ర దర్శకుడు. అతడి యాంగెల్స్ అన్ని చాలా చాలా చాలా వరైటీ గా ఉంటాయి. ఒక సీన్ ని ఇలా చూపిస్తే బాగుంటది అని మనం అనుకుంటే అదే సీన్ ని మరో కోణం నుండీ చూపించి "ఇప్పుడేమంటావ్" అని మన ఆలోచనని ఎగతాలి చేయగల సత్తా ఉన్న దర్శకుడు. non linear కథానువాదం (screenplay) కింగ్. చూసే ప్రేక్షకుల ఐ.క్యూ ని కించపరచడు. మన వర్మ (కొన్ని) చిత్రాల్లా.విడమర్చి ఏదీ చెప్పరు అలా అని అర్థం కానివ్వకుండా ఏదీ వదలరు.

ఈ కమీనేయ్ కూడా అంతే. ఎక్కడ అంటే యే ఒక్క సీన్ ని విడమర్చి పూసగుచ్చినట్టు చెప్పె ప్రయత్నం చేయలేదు విషాల్ భరద్వాజ్. అర్థం కాకుంటే నీ ఖర్మా లా అనిపిస్తుంది.. అలా అని అర్థం కానిది ఏమీ ఉండదు. కాని మెదడుకి మేత మాత్రం ఉంటుంది. మన టైం వృధా చేయకూడదు అన్నట్టు ప్రతి సీన్ ని కుదించినట్టు ఉంటూంది. కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం ఉండదు.. అంటే మనమే అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటివి మన దేశి సినిమాల్లో చాలా అరుదు. మొత్తం సినెమా తొందర తొందర లో ఉన్నట్టు అనిపిస్తుంది. కాని ఇలా linear సినిమాలోకి nonlinear element తేవాలంటే ఆ మాత్రం తప్పదు కద. అలా సీన్ సీన్ కి ఉన్న 4-5 కమెరా యాంగెల్స్ లోనుండి ఎన్నుకొని సినెమా ఫ్లో ని వారించకుండా చేయడం చాలా కష్టమైన పని. editing చేసిన శ్రీకర్ ప్రసాద్ కి జోహార్లు.

ధన్ తనా అన్నా వెనక వచ్చే శబ్ధాలైనా ప్రతి సీన్ లో అంతలా జాగ్రత్తపడిన విషాల్ ని మెచ్చుకోకుండా ఉండలేకున్నా. every single scene every single sound every single dialogue every single expression has been carefully thought about. every single one has been made to "act". Hats off to him. నీతిబోధనలు ప్రేమ కథలు కామెడి ట్రాక్ త్యాగాలు సావుడబ్బు బ్యాక్ గ్రౌండ్ అదే అదే అదే ఎక్స్ ప్రెషన్స్ కోరేవారు దీన్ని చూడకండి. చరిత్ర పాఠాలు కోరేవారు కూడా చూడకండి. రాజశ్రీ సినిమాలే నచ్చేవాల్లు చూడకండి. మీకు అర్థం కాకపోవచ్చు. అది మీ తప్పు కాదు.. ప్రతి విషయాన్ని ఒలిచి చేతికి ఇచ్చి ఇన్నేళ్ళూ తినిపించ ఆ దర్శకుల తప్పు. People who want an exhilarated experience, people who "get" Quentin and RGV, people who "think" thru their movies, people who dont want the movie to question their intelligence - get your expectations to zero and let Vishal unfold Kaminey for you.

గమనిక: రివ్యూ అని కథ రాయలేదేంట్రా అనుకుంటున్నారా? fullhyd.com కి వెళ్ళినా, bollywoodhungama.com కి వెళ్ళినా, rediff.com కి వెళ్ళినా మీకు రివ్యూలు దొరుకుతాయి. నాకు సినిమాలో నచ్చినదాని గురించి ఇక్కడ రాశా. సినిమా చూసొచ్చి చస్ నువ్వు చెప్పినట్టూ లేదు అంటే అది కూడా నా తప్పు కాదు. every film is a personal experience "వాడి IQ కొంచం ఎక్కువా" అని సరిపెట్టుకోండి అంతే. ;-)

Read more...

Wednesday, August 12, 2009

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.


ఈ రోజు కృష్ణాష్టమి. ఆ యోగేశ్వరున్ని కొంచం సేపు మన ఆలోచనల్లో బంధిద్దాం. చిలిపి చేష్టలు చేసినా గీతని భోదించినా విశ్వరూపాన్ని ప్రదర్శించినా అది ఆ కృష్ణపరమాత్మునికే చెల్లు. యుగపురుషులు రాబోయే యుగానికి నిదర్శనంగా ఉంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అంటే కృష్ణావతారం ద్వాపరం చివర్లో వస్తుంది. ఆ అవతారం ముగిసినవెంట్టనే ద్వాపరం ముగిసి కలి మొదలైంది అని మన నమ్మకం. అంటే కృష్ణావతారం లో బోధించిన భగవత్ గీత ఆ యుగానికంటే మన కలికే ఎక్కువగా వర్తిస్తుంది. సత్య, త్రేత తో పోలిస్తే ద్వాపరం లో ఈర్షలు, కుట్రలు, రాజకీయాం గట్ర కలి కంటే కొంచం తక్కువగా ఉన్నయనే చెప్పాలి. అలాంటి యుగానికి కృష్ణావతారం తగునైంది అని చెప్పడం లో ఎటువంటి అనునామం లేదు.

జగమంత కుటుమబైనా ఏకాకిగానే జీవించాడు. ఎవ్వరిని నొప్పించలేదు. అందరికి అందుబాటులోనే నిలచాడు. యుద్ధం తథ్యం అని తెలిసినా నివారించేదానికి ఓ ప్రయత్నం కూడా చేసాడు .సకల వేదాల సారామైన గీతని యుద్ధభూమి మీద ప్రబోధించాడు. ఆ ఒక్క అవతారం లోనే "నేనే భవగంతుడని.." అని చెప్పాడు. దశావతారాల్లో అన్నింటికంటే మోస్ట్ పవర్ఫుల్ అవతారం కృష్ణుడే అని చెప్పచ్చు. అంటే మనుషులకి అన్ని యుగాలు పట్టిందనుకోవాలా.. ఆ పరమేశ్వరుడ్ని అర్థం చేసుకునేదానికి? అంతకముందు యే అవతారం లోను తన విశ్వరూపం చూపలేదు. తర్వత యే అవతారం లోను అవసరం పడలేదు.

ఏ విషయం మారదో అదే సత్యం అని అంటారని మా గురువుగారు చెప్పారు. అలానే ఎవరైతే మారరో.. స్థితప్రజ్ఞులుగా ఉంటారో వారే అచ్యుతులని అంటే భగవంతుడని చెప్పారు. గీతలో శ్రీ కృష్ణుడు అదే అంటాడు తానే సత్యాన్ని అని. అంటే తానే ఆ పరమపురుషుడని. తానే తత్వదర్శి అని. తానే జ్ఞానాన్ని అని. ఆ యోగేశ్వరుడ్ని ఆ జ్ఞానేశ్వరుడ్ని ఆ కృష్ణపరమాత్ముడ్ని తలచుకుంటూ కొన్ని పాటలు / సంకీర్తనలు.
శ్రావణుడు అన్నమయ్య సంకీర్తనలకు తద్వారా తెలుగు కి చేస్తున్న ఎనలేని కృషికి సత సహస్ర వందనాలు. అన్నమయ్య కృష్ణునుని మీద రచించిన అరుదైన సంకీర్తనలు ఇక్కడ వినచు.

అందరికి గోకులాష్టమి శుభాకాంక్షలు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

Read more...

మేరా నంబర్ కబ్ ఆయేగా ??

ఎనిమిదేళ్ళు. eight long years ఆఠ్ సాల్.. భాష మారినా భావం ఒక్కటే. సంవత్సరాలు గడచినా బాధ ఒక్కటే. ఈ రోజుకి నేను నా స్వర్గం వదిలి ఎనిమిదేళ్ళయ్యింది. నా స్వగ్రామం నా స్వనగరం నా ఊరు.. నా హైదరాబాదు. దాన్ని విడిచి ఇన్నేళ్ళైనా హైదరాబాదు ఎంతగా మారినా సొంతం అనేపాటికి అదో ఆత్మబంధం. నా ప్రపంచం ని రెండుగా విభజించచ్చు. ఒకటి హైదరాబాదు ఇంకోటి నాన్-హైదరాబాద్ (non-hyderabad).

ఎనిమిదేళ్ళా క్రితం రింగులు రింగులు తిప్పితే.. హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ.. రోజూకి ఎక్కువకాదు మామూల్గా ఓ పదో పాతికో వందో పానీ పూరీలు తింటూ ఉండినాను. నలుగురితో నారాయణా అని అందరు రాస్తున్నారు కద అని నేను రాసా జి.ఆర్.యీ నా అద్రుష్టం పండి మధ్యలో విసొగొచ్చి త్వర త్వరగా అవ్వగొట్టేసా .. న్యాచురల్ గానే ఎదో మామూల్ స్కోర్ వచ్చింది. యాహూ అనుకొని గెంతుకుంటూ బయటకి వచ్చా.. ఈ స్కోర్ కి ఎవడిస్తాడు లే అని.. నేను అల తలిస్తే, నన్నే కాపీ కొడతావా అని పైనున్న విధాత మరోలా నిర్ణయించాడు. సీన్ కట్ చేస్తే యడ్మిషన్ వచ్చింది. సరేలే.. వీసా వస్తదా పెడ్తదా అనుకునొని దగ్గర్లో ఉన్న డ్రాప్ బాక్స్ (ఇది ఆ కాలం మాటాలు. గుర్తుందో లేదో చాలా మందికి, ఆ యేడే కొత్తగా drop box పెట్టారు స్టూడెంట్ వీసా కి. అదే యేడు తీసేసారు 9/11 తర్వాత. అది వేరే విషయం) లో పడేసా.. మందు కొట్టాడో ఏమో నాకు ఇచ్చేసారు వీసా. ఆ రోజే అనుకున్న.. శశి అయిపోయింది రా నీ హ్యాప్పీ డేస్ అని..

ఎనిమిదేళ్ళు గడిచాయి ఇక్కడికి వచ్చి. నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు. కొంచం కళ్ళాజొడు సరి చేసుకొని చూస్తే .. చకోర పక్షి లా .. హిటొస్తుంది అని వేచి చూస్తున్న సాయి కిరణ్ లా.. కామెడి పండిస్తా అని అనుకుంటున్న బాలయ్య లా దేశానికి తిరిగివెళ్ళిపోవాల్లన్నా ఆశ తప్ప ఏమీ లేదు. నా స్నేహితులు కొంత మంది ఇప్పటికే తిరుగు టపా కట్టేసారు. ఇంకొంతమంది అదే పని లో ఉన్నారు. నేను ఇంకా "మేరా నంబర్ కబ్ ఆయేగా " అని వేచి చూస్తున్నా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. అంత కంటే ఏం చేయలేము. ఎనిమిదేళ్ళల్లో ఈ దేశం లోని 30 రాష్ట్రాలు చూసాను. దిక్కు మొక్కు లేని డకోటా ప్రాంతం తప్ప బానే కవర్ చేసా.

ఎంచక్క ఇంటి దగ్గర సాయంత్రం 5 కి ఓ రెండు రూపాయలు ఇస్తే అరకిలో వేడి వేడి జిలేబిలు - తోచినప్పుడు పానీ పూరీలు , ఓస్మానియా బిస్కెట్ తో బాటు దం చాయిలు, బావర్చి బిర్యానీ, 113M, 156H, 3 నంబర్ బస్సు, ఆదివారం ఆబిడ్స్ లో పాత పుస్తకాలు, గల్లీ ఓ పది వినాయకులు.. అక్కడ దొరికే ప్రసాదాలు, నిమ్మజ్జనం గలాటాలు, హోళీ రంగులు, సంక్రాంతి పతంగుల ఢీల్ - లడీ - పేంచులు, దీపావళి పటాసులు, బోణాల జాతరలు, హలీములు, అలెక్స్ కిచన్ లో 'american chopsueyలు, గురువారం బాబా గుడిలో భజనలు, నీల్గిరి లో ... లు, RTC X Roads లో లెక్కకుమించిన సినిమాలు, పారడైస్ సాఫ్టీ డెన్ లో ఐస్ క్రీంలు.. లాంటివి ఎంజాయి చేయడం మానేసి ఇక్కడెక్కాడో.. ఇలా.. ప్చ్..

నా ప్రశ్నకి వరుణ్ విశ్వరూపం:

శశి:
ఇక చాలు అమెరికా. ఇక చాలు. ఇంత దాకా నేను కోల్పోయింది చాలు.

వరుణ్:
ఏం కోల్పోయావ్ శశీ?

శశి:
ఇంకా అర్థం కాలేదా నీకు...? యెనిమిదేళ్ళ క్రితం నా దగ్గర యేముండేదో, ఇప్పుడేం లేదో ..అదే కోల్పోయాను.. ఆనందం.. చిన్న చిన్న విషయలకు ఉండే ఆనందం..ఈ అమెరికా ఎప్పుడూ నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నట్టే ఫీల్ ఔతుంది. కానీ నాకేం కావాలో అర్థం చేసుకోదు.

వరుణ్:
శశీ, నీకు ఎప్పుడు అమెరికా లో ఏం చాన్స్ వచ్చినా అది నీ జీవితాన్ని వేయి రకాలు గా బాగు పరిచేది గా ఉంటుంది కదా.

శశి:
ఔను.. వేయి రకాలుగా బాగు పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క సారి నాకు ఏం కావాలి అని ఆలోచించదు. అడిగిందాని కన్నా ఎక్కువ ఇవ్వడం లో ఉన్న సాటిస్ఫాక్షన్ అమెరికా కు తెలుసు.. కానీ కోరుకొన్నది దొరక్క పోవడం లో ఉండే బాధ అమెరికా కు తెలీదు.. నాకు తెల్సు..అస్సలు ఎవరైనా నన్ను అడిగితే కదా తెలిసేది నాకు ఏది కావాలో ఏది ఒద్దో..! ఎదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు.. నన్ను అడగండి వరుణ్.. నా కళ్ళళ్ళో చూసి అడగండి వరుణ్.

వరుణ్:
ఎంటి శశీ, అప్పుడే అమెరికా వెళ్ళే ముందే అడిగాం కదా శశీ నీకు ఇష్టమా లేదా అని..

శశి:
అడిగారు, కానీ నేను చెప్పేది వినరు.. ఆశలు చూపిస్తారు..జీ ఆర్ యీ వ్రాయమంటారు..

నాకు జీ ఆర్ యీ స్కోరు రాకూడదు అని నేను అనుకొన్నా. తీరా చూస్తే వచ్చింది.. నాకెలా ఉండిందంటే, ఆ స్కోరు కార్డ్ చించేసి నేను అమెరికా కు వెళ్ళనూ అని అరవాలనిపించేది.. వీసా వచ్చినప్పుడు కదా అని అప్ప్లై చెయ్యమన్నావ్. నేను చేసాను. కానీ ఇలా అప్ప్లై చెయ్యగానే అలా పోస్ట్ లో వీసా పంపిచేసారు.. ఏడుపొచ్చింది వరుణ్ అప్పుడు నాకు.. ఏడుపొచ్చింది... ! ఒరే శశీ వెళ్ళరా చదివేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పారు. నేనేదో... చదివేసి వెళదాం అనుకొన్నా.. కానీ ఈ అమెరికా ఏమో, నాకు ఉద్యోగమొచ్చేంత చదువు చెప్పింది... నా ఉద్యోగం కూడా అమెరికాయే ఇప్పిస్తే.. నేనెందుకు వరుణ్, ఇండియా వెళతాను..? చివరికి వెనక్కు వెళ్ళాలన్నా, కుదరని పరిస్థితి కల్పిస్తే.. వెళ్ళ బుద్ది కావడం లేదు వరుణ్..

మీకెవరికీ తెలీదు.. ఇలా అమెరికా లో ఉండలేకా, ఇండియా వెళ్ళలేక నేను నరకం చూసాను వరుణ్, నరకం చూసాను. కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..? ఇక్కడకొచ్చేప్పుడు.. నేను ఇండియా లో చెప్పాను. రెండేళ్ళలో మళ్ళి వచ్చేస్తాను అని.. కానీ ఇప్పుడు చెపుతున్నా.. రెండేళ్ళూ కాదు కదా, మరో పదేళ్ళయినా వెళ్ళలేనని.. ఇప్పటి దాకా మీరంతా గెలిచారని సంబరపడుతున్నారు కదా.. కానీ మిమ్మల్ని గెలిపించడానికి యెనిమిదేళ్ళుగా నేను ఓడి పోతూనే ఉన్నాను వరుణ్...ఇలాగే ఓడిపోతుంటే.. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకొంటే.. నా జీవితమంతా అమెరికా యే ఉంటుంది.. అందులో ఇండియా ఉండదు. దయచేసి నాకు నచ్చని దేశాన్ని ఇచ్చి నన్ను ఆనందంగా ఉండమనొద్దు వరుణ్..!

వరుణ్: ఇంత కాలం నువ్వు అమెరికా లో ఆనందంగా ఉన్నావ్ అనుకొన్నా గానీ శశీ, నీ ఆనందాన్ని తీసుకొని మేము సంబర పడ్డమని తెలీదు. తెలీదు శశీ.. ! నాకు అమెరికా లో కంపెనీ కి సి.యి.ఓ గా వచ్చినా ఆనంద పడలేదు కానీ, నీకు అమెరికా లో సీట్ వస్తె రోజంతా పది మందికి చెప్పి ఆనందపడ్డాం.. కానీ మా ఆ ఆనండం కోసం నిన్ను బాధ పెడుతున్నా అని ఎప్పుడూ అనుకోలేదు శశీ.. సారీ రా నాన్నా..! వెంటనే ఇండియా కు వచ్చేసెయ్..

శశి:
థాంక్స్ వరుణ్. మరో రెండేళ్ళాగి వస్తా...!

Read more...

Monday, August 10, 2009

పరీక్షలే లేకుంటే..

ప్రతి ఒక్కరి జీవితం లో అసలు మరిచిపోలేని మరపురాని రోజులు ఏంటా అని తిరిగిచూస్తే సగానికి సగం పరీక్షలు రాసిన రోజులే అయ్యింటాయేమో. పదవ తరగతి పరీక్షలు మొదలైన రోజు.. మొదలైయ్యే ముందు రోజు పొట్టలో పోటి పడ్డ పక్షులు గుర్తొస్తాయి. మాకు అంటే cbse ఉద్దరించిన వాళ్ళకి పదవ తరగతే మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. జీవితం లో మొట్ట మొదటి సారి హాల్ కి వెళ్ళి పరీక్ష రాయడం అంటే అదేదో గొప్ప అనుభూతి. అంత మందితో పోటి పడ్డం పక్కన.. అసలు నెగ్గుతామా లేదో తెలీని పరిస్థితి. రాస్తున్నప్పుడు అల్ల నన్ను ఎవరైన చూస్తున్నరేమో డిబార్ చెస్తారేమో అని పిచ్చి టెన్షన్. కాని అల ఏమి జరలఏదు. అది వేరే విషయం. తర్వాత తర్వాత అన్ని పబ్లిక్ పరీక్షలు కావడం తో ఇంజనీరింగ్ రేండో యేడు వచ్చేపాటికి పెద్దగా ఏమీ అనిపించేది కాదు. జెస్ట్ పాసా ఫేల్ ఆ అని తప్ప.

ఇంకొద్ది రోజుల్లో ఇలాంటి గొప్ప అనుభూతి ఉండకపోవచ్చేమో. మన విద్యాసాఖ మంత్రి కపిల్ సిబాల్ పావు పారితే ఇంక పదవ తరగతి కి పరీక్షలు ఉండకపోవచ్చు. అసలు పరీక్ష అంటే ఆ యేడు మనం ఎంత నేర్చుకున్నామో మన పుర్రెల్లో ఎంత పోయిందో ఎంత గాలికి వదిలేసామో సినిమాల చూసి ఎంత నేర్చుకున్నామో కొత్త స్టెప్పులు కొత్త కామెడి గట్ర గట్ర అని. సరే సరే సినిమా విషయం పక్కనపెడితే మిగితావి అన్ని పరీక్షిస్తారు. అలానే ఈ యేడు కొత్తగా కాపీ కొట్టే పద్దథులని కూడా పనిలో పని గా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు పబ్లిక్ పరీక్షల ముందు ఓ రెండు మూడు నెలల నుండి ఇంట్లో బయట నెలకొనే ఉత్కంఠత మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించింటారు. అనుభవించాలి. జీవితం అంటే ఏంటో చాలా మందికి బోధ పడే సమయం కూడా అదే అనుకుంట.

అసలుకే మోసం తేవడం లో కపిల్ సిబాల్ ఆలోచన నాకు అంతు చిక్కడం లేదు. మన పరీక్షా విధానం కొంచం తప్పే. అంటే బొరుగుల బట్టి కొట్టగలిగేవాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటారు .. కొంచం చదివి అర్థం చేసుకొని వాళ్ళా భాషలో రాసేవాళ్ళు కొంచం కష్టంగా మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఎంత పెద్ద తప్పో లోక విధితమే! పరీక్షా విధానాన్ని సవరించాల్సింది పోయీ అసలు ఆ సంస్థనే తీసేద్దాం అనడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి నిపుణులతో చర్చించాల్సి తీసుకోవాల్సిన నిర్ణయం. స్కూల్ స్కూల్ కి విడి విడిగా పరీక్ష ఒక ఉపాయం కాని అప్పుడు స్కూల్ వాళ్ళే స్వార్థం కోసం పరీక్ష విధానాన్ని వారికి అనుకూలంగ మార్చుకోరు అని నమ్మకం ఏంటి? అసలు ఇలా జరగకూడదూ అనే కద పబ్లిక్ పరీక్ష పద్దతి ని ప్రవేశపెట్టింది. బట్టికొట్టే విధానన్ని అరికట్టాలి... అంతే కాని అసలు పరీక్షలే ఎత్తేస్తే సినిమా హాల్లు నిండడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు.

ఉన్నత విద్య ని కూడా కొంచం మెరుగు పరిస్తే బాగుంటుంది. ఆంధ్ర దేశం లో మొత్తం మీద ఓ 5-6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే అమేరికా లో ఐతే దాదాపుగా ఓ 3000-5000 దాకా ఉన్నాయి. రెంటికి పోలికే లేదు. కొత్త పదవి జోష్ లో రెండు దశాబ్దాల నుండి ఎవ్వరు పట్టించుకోని ఉన్నత విద్య ని కపిల్ సిబల్ గారు ఎమైన చొరవ చూపి modernize చేస్తే అదే పది వేలు, పది లక్షలు. చూద్దాం. మనిషి ఆశా జీవి కద..

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP