Thursday, June 25, 2009

ఇళ్ళా? ఉద్యోగమా?

కొంత కాలం కిందట .. ఈ మధ్యలో వరకు కూడా అనుకోండి కొన్ని ఇళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న మొలిచేది.. తల్లా? పెళ్ళామా? అని. ఆ ప్రశ్న ఎంత మూర్ఖంగా ఉన్నా..ఈ మధ్య కాలం లో అసలు ఈ ప్రశ్న కి సమయమే లేకుండాపోయింది. శుభం అనుకునే లోపే ఇళ్ళా? ఉద్యోగమా? అన్న ప్రశ్న మొదలైంది. ఇది మూర్ఖమైన ప్రశ్న కాకున్నా చాలా మంది జీవితాల్లో చాలా ఇళ్ళాల్లో జరిగే నిరంతర పోరాటమే అని అనుకోవచ్చు. (చాలా ఇళ్ళాల్లో అన్నదానికి నా కాడ statistics గాని సర్వేలు కాని లేవు.. జీవితంలో చూసిన దాన్ని బట్టి నేను ownగా సొంతంగా personalగా ఊహించుకున్న సంఖ్య మాత్రమే!!).

ఉద్యోగం నుండి బయటకి వచ్చాకా అంటే జెస్ట్ ఆ డోర్ నుండి బయటకి వచ్చాక యే కంపనీ నీది అంటే బ్రహ్మానందం చూపులు చూసే వాళ్ళని నేను ఎరుగుదును. అందులో ఒక కాలం లో నేను ఉన్నా. ఠంచన్ గా ఐదో ఆరో అయితే మళ్ళా అసలు వర్క్ గురించి గుర్తుండేది కాదు నాకు. ఆ రోజు రాసిన for లూపులు కూడా మర్చిపోయేవాడ్ని. అల అయ్యేదానికి కొన్ని యేళ్ళు పట్టింది. అది వేరే విషయం. ఇప్పుడు కూడా నేను మించు ఇంచు గా అదే టైప్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు.. ఇంకో పది రోజుల్లో ఒక పెద్ద డెలివరి ఉంది మాకు.. సో అది అయ్యకా మళ్ళా ఐదైతే అన్ని మర్చిపోతా. అంత వరకు మాత్రం రోజుకి ఒక 12 గంటలు తప్పడం లేదు. అలా సంవత్సరానికో ఆర్నెల్లకో చేసేవాళ్ళని చూసాను. కాని నిత్యం నిరంతరం పెతీ రోజు అలా ఉద్యోగమే జీవితం అనుకుంటు ఉండేవాళ్ళూ ఉన్నారు.

ఎవరైన ఉద్యోగమ? ఫామిలీ ఆ? అని అడిగితే క్షణం పట్టదు తేల్చుకునేదానికి. కాని అలా 12 గంటలు ఇంట్లో కూడా మాట మాట్లాడకుండా ఎదో జాతిని ఉద్దరించే పని చేస్తున్నట్టుగా చేసేవాళ్ళ priority మీద నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళూ ఎట్లా భరిస్తున్నారా అని. ఆ స్టేట్మెంట్ కొంచం ఎక్కువే అయినా అందులో ఓ యాభై సాతం నిజం లేకపోలేదు. వీళ్ళు ఇంట్లో ఉన్నా వర్క్ లో ఉన్నా పెద్దగా తేడా పడదు.. జెస్ట్ ఎదో ఇంట్లో ఉంటే మన ముందు ఉన్నరాన్న ఆనందం తప్ప. కాని అదీ క్షణికమే. వర్క్ చేసేటప్పుడు శబ్ధం వచ్చినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే.. ఆ భాగ్యానికి ఇంటికి రావడం ఎందుకో? అని కూడా అనిపిస్తుంది. జివః కో రుచి అని తెలుసు... వెర్రి వెయ్యి విధాలు అని కూడా తెలుసు కాని ఇంత వర్క్ వెర్రా?

నేనేదో ఉత్తముడిని అని చెప్పడం లేదు..కాని at least i have my priorities right. క్రికెట్, NFL, ఫుడ్, సినిమాలు, ఫ్యామిలి, ................................................ వర్క్. in that order. సెప్టెంబర్ నుండి మొదటి రెండు కొంచం అటూ ఇటూ ఔతాయి. కాని ఆర్డర్ మాత్రం పెద్దగా మారలేదు చాలా ఏళ్ళగా. ఈ ఎకానమి లో ఆ మాత్రం పని చేయకపోతే కష్టం అని అనకండి.. ఎందుకంటే వీళ్ళు ఎకానమి ఎలా ఉన్నా మారరు కాబట్టి. అయినా పక్కనోడికి చెప్పేంత నాకు లేదు. నేను నూరుశాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా అంతే. ఉద్యోగాలు మారుతాయి (ఇది చాలా మందికి. కొంత మంది అలా ఒక్క సారి చేరితే గవర్నమేంట్ మారినా.. బాలయ్య మారిన.. చివరికి కె.చంద్రశేఖర్ రావ్ మారినా .. అదే ఉద్యోగం లో ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇష్టం. స్వభిప్రాయం. choice. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మిగితా వాళ్ళా గురించి అంటున్నా).. కాని ఫ్యామిలి మారదు. జావా కాకపోతే డాట్ నెట్ .. కాని ఫ్యామిలి కి ప్రత్యామ్న్యానం లేదు కదా!! అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ఎవరికి చెప్పాలని చూస్తున్నా నేనూ? నా వెర్రి కాకపోతే..

Read more...

Sunday, June 21, 2009

నేను మార్గదర్శి లో చేరా.. నేకు "కేసు" పెట్టా..

నేను మార్గదర్శి లో చేరుతా.. నేను కేసు పెడతా. ఎందుకు ఏమిటి అంటే ఒప్పుకోను ... అడిగే హక్కు మీకు లేదు. నా జాతిని బట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాకు అర్థం అయ్యింది. మీ మీద కూడా పెట్టేస్తా. మలక్ పేట్ రౌడి గారి మీద కేసు పెడుతున్న బుడుగు ఉరఫ్ జీడిపప్పు మీద నేను కేసు పెడుతున్నా. నా కంటే ముందు అలా కేసు పెడతా అని వ్రాసినందుకు. కేసు పెట్టడం నా జన్మ సిద్ధ అధికారం. దాన్ని నా నుండి ఎవ్వరు వేరు చేయలేరు.

నాకు అలా కేసు పెట్టాలనె ఆలోచన రాకమునుపే బుడుగు కి వచ్చింది. ఇది IPC సెక్షన్ 1116 క్రింద ఘోరాతి ఘోరమైన నేరం. దీన్ని శిక్షించకపోతే బుడుగు లాంటివాళ్ళు నా లాంటి మేధావుల్ని తొక్కేస్తారు. మాకు ఆలోచనలు రాకమునుపే కాపి కొట్టేస్తారు. ఇలాంటి "కిష్యోటకల్ని" ఒదిలితే దేశానికి చాలా నష్టం, కష్టం. అందుకే కేసు పెడుతున్నా. ఎందుకు ఏమిటీ అంటే అది అంతే. ఇది చెట్టరీత్య నేరం. అడిగినందుకు కూడా మీ మీద పెడతా. ఒక కేసు. ముందే హైదరాబాద్ లో ఈ మధ్యే సాఫ్ట్-వేర్ ఉద్యోగాలు పోయిన నా స్నేహితుల్ని అడిగి కనుకున్నా.. వాళ్ళు చాలా చాల కష్టపడి internet తీగలమీద పాకి స్తంబాలు ఎక్కి మరీ ఈ క్రింద చెప్పడే వ్యక్తుల IP లు కనుకున్నారు."మనవోన్మాది" "మానవద్వేషి" బుడుగు a.k.a జీడిపప్పు మీద పెడతా. యే సెక్షనో అర్థం కావడం లేదు. కొంచం ఎవరైన "న్యాయవాదుల్ని" సంప్రదించి చెప్పగలరు. బుడుగు IP, birth certificate వాళ్ళా ఊరి మునసబ్ నుండి తెచ్చిన లేఖ వాళ్ళా బడి హెడ్ మాస్టారు ఇచ్చిన 'అ-ప్రశంసా పత్రం" అన్ని సేకరిచ్చా నేను.

మీకు అలాంటివి ఇంకేమైన దొరికితే నన్ను సంప్రదించండి. నా ఈ-మేల్ ;dikkulenicourtlodava@gmail.com. అలనే బుడుగు ఉరఫ్ జీడిపప్పు ఫోటో కూడా సంపాదించా. (క్షమించాలి ఆ ఫోటో పెట్టలేకపోతున్నా. "unparliamentary / uncivilised గా ఉంటుందని) ఇంత చదువుకు కొని ఇన్నేసి చికేన్ లని తిని అన్నేసి సార్లు గాడ్ ఫాథర్ చూసినా కూడా జీడిపప్పు కి బుద్ధుని లా జ్ఞానం రాకపోవడం చింతనీయం.

పనిలో పని పేపర్లో పేపరు కేసులో కేసు అన్నట్టు మలక్ పేట్ రౌడి గారి మీద, రాఘవ మీద, నేను నిద్రపోతున్న సమయంలో నా బుర్రలోని ఆలోచనల్ని కాపి కొట్టిన ఏక లింగం గారి మీద, గూగల్ మీద నేను పెట్టాలనుకున్న కేసుని నా కంటే ముందే ఆలోచించిన విశ్వక్శేనుడి మీద, మాటి మాటికి కేసు కేసు అని భయపెట్టి నా లాంటి మేధవుల్ని కించపరుస్తున్న నాగప్రసాద్ మీద, ఇవ్వంటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్న శరత్ 'కాలాం" మీద కూడా ఓ పదో పాతికో కేసులు పడేస్తున్నా. వీళ్ళు హైదరాబాదులో కనిపిస్తే అప్పడ తప్పడి తాండ్రే.!!!! ఖబర్దార్!!! కమాన్ సూస్కుందాం. బస్తిమే సవాల్!!! ఎవరెవరు ఎన్నేసి కేసులు పెడతారో సూస్కుందాం.

నా కంటే ముందు మీకు ఏమైన ఆలోచన వస్తే జాగ్రత్త!!! ఇదే మీకు తుది హెచ్చరిక. నా కంటే ముందు ఆలోచిస్తే కేసు పడుద్ది.

ఇది చూసి కామెంట్ వేయని వాళ్ళకి / నా కంటే ముందే నా ఆలోచనల్ని కాపీ కొట్టే వాళ్ళకి ఇదే హెచ్చరిస్తున్నా: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

Read more...

Thursday, June 18, 2009

మా హిల్టన్ కి కన్నీటి వీడుకోలు - 1

జ్ఞాపకాలు. మన జీవితం ఎటువైపు పయనిస్తే బాగుంటుంది అని మనం భావిస్తామో దానికి పునాది మన గతమే అని నా అభిప్రాయాం. ప్రతి ఒక్కరికి కొన్ని మధురమైన జ్ఞాపకాలు కొన్ని ఖటినమైనవి ఉంటాయి. సాయాంసంధ్య వేళలో ఇంటి బయట కూర్చొని అస్తమిస్తున్న రవిని చూస్తూ తే నీళ్ళు తాగుతూ చల్లని గాలి వీస్తున్నప్పుడు వెనక ఎక్కడో కొద్ది దూరం లో "వే వేళ గోపెన్మల్ల మువ్వా గోపాలుడే.." పాట వినిపిస్తున్నప్పుడు చిన్నపుడు అంతగా చిన్నగా లేనప్పుడు జరిగినవి గుర్తొస్తాయి. ఆ రోజుల్లో... అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక ప్రదేశమో లేక ఒక గుర్తో లేక ఒక ఫోటో చూసినప్పుడు వద్దనుకున్నా చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ప్రదేశాలు చిన్నప్పటి గుర్తులు బహుశా మారుతాయి.చిన్నప్పుడు మనం తిరిగే ప్రదేశాలు చోట్లు ఎల్లప్పటికి అలనే ఉంటుంది అని భ్రమపడతాం. ఆశిస్తాం. కాని అల జరగడం ఇంచు మించు అసంభవమే. మార్పు తథ్యం కద. కాలాన్ని ఎవ్వరు ఆపలేరు.. కాలం కదలకుండా నిర్భంధించలేరు. అలాంటి కాలాన్ని ఒక్క క్షణమైన కదలకుండా ఎటువంటి మార్పు రాకుండా చెసే మన యత్నమే ఫోటో అని నేను భావిస్తాను. ఫోటో అనేది మనం కాలాన్ని జయించ్చే ప్రయత్నమే. కాలాని జయించడం అంటే ఒక ఫోటో తీసినప్పుడు ఆ క్షణాన్ని బంధిస్తాం .. భద్రపరుస్తాం... అంటే కాలాన్ని ఆ ఒక్క క్ష్ణమైన పర్లేదు.. కాని ఆ సమయాన్ని జయించి బంధించినట్టే కదా!

అలనే ఒకటి మా బడి కి వేళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు (గుల్మోహర్ అనుకుంటా) ఉండేది.. ఇంకా కూడా ఉంది. ప్రతి రోజు నడుచుకొని బడికి వెళ్ళేప్పుడు ఆ చెట్టుని ముట్టి వెళ్ళేవాళ్ళం. అల ఒక పది సంవత్సరాలు చేసింటా. మొన్నామధ్య దేశం కి వెళ్ళీనప్పుడు మా బడి వైపు వెల్తూంటే ఆ చెట్టు ని చూసినప్పుడు ఎన్నో ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. నేను మా అక్క రోజు అల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే మా బడి మొదటి గంట 9:10 కి కొట్టేవాళ్ళు నేనేమో 8:45 కి అల చేరాలి అని. అల చేరితే ఒక అరగంట ఆడుకోవచ్చని నా బాధ. మా అక్కేమో ఎందుకు లేరా హాయిగా 9:05 కి చేరుదాం అని. అల అప్పుడప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం కొన్ని కొన్ని సార్లు నేను ఇంట్లో రబస చేసి త్వరగా వెళ్ళిపోయేవాడ్ని. మా బడి ఇంటి నుండి ఓ పది పదిహేను నిమిషాల దూరం. కొంచం పెద్ద అయ్యేపాటికి మా అక్క పదవ తరగతి అయిపోయింది సో నేను ఒక్కడినే 9:15 కి చేరేవాడ్ని. of course అది చూసి మా అక్క నన్ను వీర బాదుడు బాదింది.

నేను ఒకటవ క్లాస్ లో ఉన్నప్పటి మాట. మా అక్క ఎమో ఐదు చదువుతోంది. బడి తర్వాత తను కరటే నేర్చుకునేది. నేను స్కూల్ లోనే ఎక్కడో ఆడుకుంటున్నాను. నేను మా అక్క క్లాస్ మేట్ ఒకడు. వాడేమో మా టీచర్ వాళ్ళ అబ్బాయి. ఎదో ఆడుకుంతున్నాం ఇసుకలో. సీన్ కట్ చేస్తే నేను వాడి మీద ఎక్కి బాటా బూటు తిరగేసి కొడుతున్నా. ఎందుకో నాకు గుర్తులేదు.. కని కొట్టడం మాత్రం బాగా గుర్తుంది. అప్పుడే మా ప్రిన్సిపాల్ వచ్చింది. ఇద్దరిని లాక్కెళ్ళి తిట్టింది (అనుకుంటా.. చెప్పా కద మొదటి తరగతి అని). మరుసటి రోజు ప్రొదున్న మా ఇంట్లో నేనేమో బడికి వెళ్ళను అని ఏదో ఒక నెపం ట్రై చేస్తున్నా. మా అమ్మ కి అనుమానం వచ్చింది. ప్రొద్దునైతే స్కూలు స్కూలు (ఆ ఆ వింటున్నా.. చిన్నప్పుడు స్కూల్ అంటే ఇష్టం నాకు. తర్వత తర్వత ఎల ఎగ్గొట్టాలా అని యోచించేవాడ్ని అది వేరే విషయం) అనే వాడూ వీడికేమొచ్చింది అని. అయినా సరే స్కూల్ వద్దు వద్దు అని నేను. జ్వరం అని చెప్ప పొట్టలో నెప్పి అని చెప్ప.. మా అమ్మ మాత్రం ఏది వినడం లేదు. మా నాన్న అప్పుడు మా అక్కని పిలిచి అడిగారు - ఏంటి వీడు ఇలా అని. మా అక్క చెప్పింది అప్పుడు ఇలా నిన్న సాయంత్రం వీడు ఇంకొకడు కొట్టుకున్నారు వీడు వాడ్ని బూటు తో కొట్టాడు అని. అప్పుడు చెప్పా నేను మెళ్ళగా నాన్న నన్ను బూట్ల మీద మూడు పేజీల వ్యాసం రాయమన్నది మా టీచర్ అని. నాకు పట్టుమని పది పదాలు కూడా రావు నేను మూడు పేజీలు రాయడం ఏంటో అని మైండ్ బ్లాక్ అయి స్కూల్ ఎగ్గొడదాం అని ప్లాన్ వేసా. కాని కుదరలేదు. మా అమ్మ వచ్చింది అనుకుంట నాతో ఆ రోజు.

ఇంకో సారి నేను నలుగు చదువుతున్నా. అయితే మా బడి లో 11 కి ఒక పది నిమిషాల బ్రేక్ ఇచ్చేవారు. 11 అయ్యేపాటికి గంట కొడితే పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళాను .. ఎవరో అటునుండి పరిగెత్తు కుంటూ వచ్చారు. అదొక్కటే గుర్తు నాకు. తర్వత గాల్లో ఒక 2-3 చక్కర్లు కొట్టి ఎటో పడ్డాను. గట్టి గట్టిగా ఏడుస్తుంటే తెలిసింది నా కుడి చేయి కొంచం డామేజ్ అయ్యింది అని. అప్పుడు ఎవరో వెళ్ళి మా అక్క కి చెప్పారు.. ఇలా వాడి చేయి విరిగింది అని. తనకి ఆ రోజు ఏదో పిట్ట పరీక్ష ఉండే... అది మధ్యలో ఆపి మరి వచ్చింది పాపాం. తను వచ్చే వరకు నేను అలా ఏడుస్తూనే ఉన్నా. నా ఏడుపు నెప్పి కంటే ఇంట్లో మా అమ్మ నా వీపు ఎల విమానం మోత మోగిస్తుందో అని భయం తో. చేయి విరగలేదు కాని కొంచం జరిగింది. అంటే dislocate అయ్యింది నా ఎముకలు. అయినా మ అక్క ని కాక పట్టి ఇంట్లో చెప్పద్దు అని ఒప్పించా. కాని ఏం చేస్తాం. నెప్పి. వాపు. భోజనం కూడా చేయలేక పోయా. అప్పుడు మళ్ళా మా అక్క ని పిలిచి అడిగితే చెప్పింది ఇలా అయ్యింది అని. మరుసటి రోజు మా నాన్న సెలవు పెట్టి నా చేతికి పట్టి కట్టించారు. ఇదే వంకా అని ఓ పది రోజులు స్కూల్ లో రాసే పని తప్పింది. :)

ఇంకో సారి .. ఇది వర్షా కాలం లో. నేను ఐదవ తరగతి లో ఉండినాను. అప్పటికి నాకు జ్ఞానోదయం అయ్యి బాటా బూట్లు మానేసి క్యాన్వాస్ వాడేవాడ్ని. బాటా అంటే మళ్ళా పాలిష్ గట్ర చేసుకోవాలి. పుట్టెడు బద్దకం ఉన్న నాకు అలాంటివి సుతరాగు పడవు. ఆ క్యాన్వాస్ రోడ్ల మీద రాచీ రాచి కొంచం చిల్లు పడ్డది. అది ఇంట్లో చెప్తే తిట్లుపడతాయి అని చెప్పలేదు. వర్షం.. దాంతో నా షూ మొత్తం తడిసిపోయింది. అలనే మా క్లాస్ లోకి వెళ్ళి కొంచం ఆరబెట్టుకుందాం అని తీసా. ఇంతలో మా శ్రీ గాడు ఫుట్ బాల్ కి నా షూ కి తేడా తెలీక దాన్ని తన్నాడు. అల అల మా గ్యాంగ్ మొత్తం నా షూ ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు. శ్రీ గాడు నా షూ ని తీసి మా గోడ మీద కొట్టాడు. అంతే! అదేదో గుర్తులాగా నా షూ అచ్చు తెల్లటి మా స్కూల్ గోడ మీద పడ్డది. అలనే మళ్ళా సున్నం వేసే వరకు అంటే దాదాపుగా ఇంకో 3-4 యేళ్ళు ఆ అచ్చు అలానే ఉండిపోయింది.

అర్రెర్రే అసలు నేను చెబుదాం అనుకున్న విషయం వేరు చెప్తోంది వేరు. మా బడి ముచ్చట్లు కాదు నేను అనుకున్నది. పెద్దయ్యాక అంటే ఇంజినీరింగ్ అప్పుడు ఎన్నేన్నో లెక్కకు మించిన జ్ఞాపకాలకు సాక్షం గా ఉండిన మా హిల్టన్ కేఫ్ ని మూసేసారట. ఈ హిల్టన్ అంటే ఊస్మానీ విశ్వవిద్యాలం దగ్గర్లో ఉండేది. ఆ చుట్టు పక్కళ్ళో చదివిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి సుపరిచితమైనది ఇది. మా ఇళ్ళలో కంటే ఎక్కువ సేపు అక్కడే ఉండేవాళ్ళాం. అలాంటి మా హిల్టం మూసేసారు అని తెలిసింది. ఆ విషాదాన్ని అందరితో పంచుకుందాం అనుకున్నా. ప్చ్.. సరె అది వచ్చే టప లో వ్రాస్తా. అంత దాకా సెలవు.

Read more...

Tuesday, June 16, 2009

i want to break free..

జీవితం లొ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చేస్తున్నానా అని. బహుశా ఇది చాలా మందిని కాలం తన్ని మరీ అడిగే ప్రశ్నే. ఏం చేస్తున్నానా అంటే ఈ రోజు ఈ పూటా ఈ క్షణం అని కాదు జీవితం తో జీవితం లో ఏం చేస్తున్నానా అని. అలా రోజులు గడిచిపోతోంది నెలలు సంవత్సరాలు కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనట్టు అక్కడే అదే ఫార్ చక్రాలు (టెన్షన్ పడకండి నేనన్నది for loops అని) కాలా చక్రాం లో రాసుకుపోతున్నా.

ఎనిమిది తొమ్మిది యేళ్ళగా రాసిన ఫార్ చక్రాలే రాసీ రాసీ అలసిపోయా. 8085 మొదలుకొని వివిధ భాషల్లో రాసి ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ గా .NET లో వెలగబెడుతున్నా. కాని ఏమి మార్పు లేదు .. ప్రతి రెండు మూడేళ్ళకి మారిన బిరుదు, జన్మానికో శివరాత్రి లా మారే జీతం తప్ప. అన్నమయ్య కూడా వివిధ రసాల్లో సంకీర్తనలు వ్రాసారు. ఒక సారి "భావాయామి గోపాలాబాలం మనఃసేవితం చింత్యే అహం సదా" అని మరో సారి "ఫలనేత్రానల ప్రబల విధుల్లతకేలి" అన్నారు. నేను మాత్రం for(int i =0; i < నా జీవితం; i++) అని రాస్తునే ఉన్నాను.

పరిస్థితులు బాలేనప్పుడు ఏంటీ గోల అంటే మరి మరి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఇలా అప్పుడప్పుడు అనిపించేది నాకు. తప్పుపట్టకండి.. నేను చేస్తున్న పని నాకు నచ్చే నాకిష్టం వచ్చే చేస్తున్నా. కాని నా ఆవేదన పని మీద కాదు నా మీద. రెంటికి D. రంగా రావ్ సినిమాకి కే. విశ్వనాథుని సినిమాకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. (డి. రంగా రావ్ ఎవరు అంటే అతనో మహానుభావుడు. "నవ్వు నవ్వించు", "మర్డర్" లాంటీ కళని, చూసిన వాల కలల్ని, ఖండించే చిత్రాలు తీసిన గొప్ప వ్యాక్తి. గుర్తొచ్చింది నవ్వు నవ్వించు చిత్రం రివ్యు కోసం వేచు చూస్తూండండి. శంకర్ రేంజి మూవి. చూడకపోతే వెంట్టనే వెళ్ళి చూడండి. థియేటర్ లో కాదు DVD లో. ఆ చిత్రాన్ని థియేటర్ లో ఎవ్వరు చూడలేరు.)

ఈ ఫార్ చక్రాలు వైల్ (while) చక్రాలనుండి i want to break free. కాని ఎలా అన్నదే నా బుర్రకి తోచడం లేదు. ఎంత సేపు "దత్తం పెట్టి" (అదే database) కి అనుసంధానం సరిగ్గా ఉందా ఉంటే కూడా రాసిన కోడు ఎందుకు పనిచేయడం లేదు చెప్మా ఉప్మా అని అనుకోవడం తోనే సరిపోతోంది. చస్స్.. ఏదో రాద్దాం అనుకొని ఏదో రాయబోయి ఏదో రాస్తున్నా. నా బుర్రని ఇప్పుడు లక్ష దిక్కుల్లో శతకోటి ఆలోచనలు పీకుతున్నాయి. అందుకే ఇలా సటిలాయిట్ సిగ్నల్ అందని జి.పి.యస్ లా ఉన్నా. ఇరవై నాలుగు గంట్టల్లో కనిష్టం ఒక 10 గంటలి ఇలా కోడు రాసి డీబగ్ చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనల్తో ఇదేనా జీవితం అంటే? నాకు విముక్తి లేదా ? అని అనుకుంటున్నప్పుడు మహాకవి శ్రీ శ్రీ గారన్నది గుర్తొచింది:

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

ఆ మాహాకవే అలా అన్నాక ఇంక చేసేది ఏమీ లేదని ఈ ఫార్ వ్యూహం లో - దర్శకేంద్రుని చేత్లో చిక్కిన ద్రాక్ష లా, వరం సినిమా నిర్మాత లా - చేసేది ఏమీ లేక .. ఏమీ చేయలేక నా బ్రేక్ పాయింట్ చేరే వరకు అలా తిరుగుతునే ఉందాం అని డిసైడ్ అయ్యాను. చూద్దాం.. బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది నేను ఈ లూపు నుండి బ్రేక్ అవ్వలేనా?

Read more...

Thursday, June 11, 2009

మరో T20 ప్రపంచ కప్.

టెన్నిస్, చెస్, జిమ్నాస్టిక్స్ చివరకి ఫుట్ బాల్ లో కూడా అమ్మయిలు వాళ్ళ సత్తా చూపించారు. తదణుగునంగా ఆ ఆటలని అమ్మయిలూ ఆడుతున్నప్పుడు ప్రజాధారన చాలానే ఉంటోంది. మన జాతియా క్రీడ అయిన హాకీ లో కూడా అమ్మయిలు చాలా ముందంజలో ఉన్నారు. చాలా స్వర్ణ పతకాలు సంపాదించారు కొన్ని కప్పులు కూడా చేజిక్కిచుకున్నారు. అప్పుడప్పుడైనా వీళ్ళని మన పత్రికలు / టి.వీ చానల్ వాళ్ళు చూపిస్తారు చదివి మనం ఆనందిస్తాం.

ఈ రోజుల్లో T20 క్రికెట్ చాలా చాలా జరుగుతోంది. మొన్ననే IPL2 ముగిసింది.. వెన్వెంటనే T20 World Cup మొదలైంది. చాలా మంది ఆ మ్యాచస్ ని చూస్తూ లేక చదువుతూ ఉంటారనే భావిస్తున్నాను. వీరు భుజం నెప్పితో ఇంటికి వచ్చేస్తున్నాడని, వీరు కి ధోని కి మధ్యలో ఎదో జరిగింది అని మనం ప్రతి రోజు చూస్తున్నాం. కాని అదే సమయం లో ఇంకొక World Cup మొదలైంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అదే women T20 World Championships. ఈ రోజు నుండే అది ప్రారంభమైంది. అబ్బాయిల కప్ లా కాకుండా కేవలం 8 టీంలతో మొదలైంది.

ఇదే మొట్టమొదటి women's T20 ప్రపంచ కప్. తొమ్మిది రోజుళ్ళో అయిపోతుంది. ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియూ దక్షిన ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంటభరితం గా చివరి ఓవర్ దాకా సాగింది. పోయినేడు జరిగిన ODI ప్రపంచ కప్ ని చేజిక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ సారి కూడా అందరికి గట్టి పోటి ని ఇచ్చి ఈ కప్ కూడా పొందే ప్రయత్నం లో ఉంది. ఇంగ్లిష్ జట్టు చాలా మట్టుకు వాళ్ళ క్యప్టన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది. తను చాలా మంచి ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా జట్టు కి సారాధ్యం వహిస్తున్న కారెన్ కి ఇదే చివరి ప్రపంచ కప్. ODI కప్ ని ఆస్ట్రేలియా గెలుచుకున్నది ఈవిడ క్యాప్టన్సి లోనే.

వీళ్ళ ప్రపంచం లో పవర్ హౌజుల్లో ఒకటిగా అభివర్ణించే జట్టు మన దేశానిది. మెర్క్యూరియల్ అని ఇంకొక పేరు కూడా ఉంది మన జట్టు కి. పోయినేడు జరిగిన ప్రపంచ కప్ లో మూడో స్థానం లో నిలిచాము. అప్పటి జట్టుకి ఇప్పటి ఈ T20 జట్టుకి పెద్దగా మార్పులు లేకపోయినా మన క్యాప్టైన్ మాత్రం మారింది. ఇప్పుడు ఝులన్ గోస్వామి కి ఇచ్చారు ఆ పదవి. తను మంచి ఫాస్ట్ బోలర్. చక్కని యాక్షన్ తో 120kph వేగం తో వేస్తుంది. మన బ్యాటింగ్ ప్రత్యేకించి అంజుం చోప్రా, మిథాలి రాజ్ ల మీద ఆధరపడి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా యేళ్ళ నుండి క్రికెట్ అన్ని ఫార్మాట్ల్లల్లో వారి నైపుణ్యం చూపారు. అలనే బోలింగ్ మన క్యాప్టన్ ఝులన్, చిచ్చుర పిడుగు అమితా షర్మా (మన వైస్-క్యాప్టన్), హైదరాబాద్ కి చెందిన గౌహెర్ సుల్తానా మీద ఆధరపడి ఉంటుంది. వీళ్ళందరు చాలా చాలా చక్కని ఫీల్డర్స్ కూడాను. వీళ్ళే కాదు మిగితా జట్టుళ్ళోని వారు కూడాను!! మెన్స్ క్రికెట్ కి ఏ మాత్రం తీసిపోకుండా వీళ్ళు ఆడతారు. కాని తగిన గుర్తింపుకి నోచుకోకుండా ఉన్నారు.

ఈ యేడు ఇప్పుడు జరుగుతున్న T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో మెన్స్ కప్ తో బాటే కొనసాగుతుంది. అదే గ్రండ్లల్లో వీళ్ళు ఆడుతున్నారు. మన దేశం గెలుస్తుంది అన్న ఆశ ఎక్కువగా లేదు నాకు... ఎందుకంటే మన వాళ్ళా కంటే న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులు బాగున్నాయి. ఈ ఫార్మాట్ లో మన వాళ్ళ కంటే ఎక్కువా ఆడారు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఉండి. చూడాలి ఎవరు గెలుస్తారో అని. ఎవ్వరు గెలిచినా, మహిళా క్రికెట్ లో ఇదో కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. may the best team win, and may the best team be INDIA.

Read more...

Wednesday, June 10, 2009

ఏం తీసుకోను చెప్మా...

గత కొద్ది రోజుల నుండి నేను చలా చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను ఈ విషయం. ముందుగా నా లాప్పీ గురించి కొంచం చెప్తా. నా లాప్పీ ఇంక బాల్చి తన్నేసినట్టు ఉంది. తల్లి రేకు అదే మదర్ బోర్డ్ మార్చిన తర్వత ఎంచక్కా ఒక 5-6 గంటలు పని చేసింది.. తర్వత మళ్ళా పోరా అనేసి పడుకుంది. ఎంత ప్రయట్నించినా ఇంక లాభం లేకపోయింది. CPR కూడా ట్రై చేసా.. కాని "చిత్రం విడుదలైన రోజే ప్రేక్షకులు తెర చింపేసిర్రు అని విన్న ప్రొడ్యూసర్" లెక్క శబ్ధం లేకుండా సైడ్ కి సెట్ అయ్యింది. ఇంక చేసేది ఏమీ లేక కొత్తది కొన్నా. lenovo. ఇప్పటిదాకా అయితే బానే అనిపిస్తోంది. వీస్టా ఇచ్చాడు with automatic upgrade to Win XP. ఇంతక ముందు వీస్టా వాడిన అనుభవం తో వెంఠనే మార్చేసా.

పోతే.. ఆల్రెడి పోయింది అంటే ఏం చెప్పలేను.. చాలా ఆలోచిస్తున్నా అని చెప్పాకద. అదేంటంటే ఇంకొద్ది రోజులు దివ్య పుట్టిన రోజు వస్తుంది. ఇంతదాకా ఏం కొనాలో ఆలోచించలేదు. పూలు, చాక్లెట్ చెత్త చెదారాం అని అనకండి. అవి ఆలోచించేసీ రిసైకల్ బిన్ లో పడేశా. నా బ్లాగు చదివే ఆడ లేడిస్ మరియూ ఇంతక ముందు బహుమతులు ఇచ్చిన boyses కొంచం సహాయం చేయండి. కొన్ని బహుమతి ఆలోచనలు (for the linguistically challenged - gift ideas) ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్.

ఏం ఏం వద్దో చెప్తా - నెక్లేస్లు (మొన్నే చెప్ప కద మిషన్ షాపింగ్ లో - కొనేసింది అని), చెప్పులు, హ్యండ్ బ్యాగులు, అత్తర్లు. ఇవ్వన్నీ మా స్నేహితురాలు చెప్పింది కొట్టేసా కూడా. ఇలాంటివి ఏమి కాకుండా కొంచం "మంచివి" మీకు తోస్తే చెప్పండి ప్లీజ్. ఎక్కడికైన బయటకి వెళ్ళండి అని అనకండి. అది ఓ రెండు నెలలు నాకు కష్టం. వారాంతాలు కూడా పని చేస్తున్నా. ఇంకేమైన ఆలోచించండి.

అప్పటికీ అడిగాను దివ్య ని - నీకేమి సర్ ప్రైస్ గిఫ్ట్ కావాలో చెప్పు అని. అయినా చెప్పలేదు. ఏం చేసేది. నాకు తోచినవన్ని తిరస్కరించేసా. అందుకే మీ లాంటి మేధావుల్ని అడుగుతున్నా. కొంచం సహాయం చేసి పుణ్యం కట్టుకోండి.

Read more...

Monday, June 1, 2009

నేను నా లాప్ టాప్...

మొన్న శుక్రవారం మా ఇంట్లో ఓ భయమకరమైన బాంబ్ పేలింది. ఈ మధ్యలో మన నగరాల్లో పేలుతున్న రకం కాదు. ఇది నా జీవితానికి సంబంధించినది. నేను ముద్దులార చూసుకుంటున్న నా లాప్ టాప్ చచ్చింది. గత నెల రోజుల నుండి నేను అహర్నిశలు చేసిన పని మొత్తం ఢమాల్ అయ్యింది. నాకేమో ఏం చేయాలో తెలీలేదు. ఈ వారాంతం మాకో డెలివరీ ఉంది. ఇప్పుడు ఇల అయితే కనిష్టం ఒక వారం ఎక్కువ ఔతుంది.. మాకు అంత సమయం లేదు. ఇంక చూడాలి నా పరిస్థితి.

అప్పుడు సమయం ఏమో రాత్రి 9 అవ్వబోతోంది. ఇంక షాపులు కూడా ఉండదు. వెంట్టనే వెళ్ళాం ఓ రెండు షాపులకి. కాని ఎక్కడా నాకు డాకింగ్ స్టేషన్ దొరకలేదు. నా లాప్ టాప్ మొదలు పెడితే బూటింగ్ శబ్ధం వస్తోంది కాని ఏమి కనిపించడం లేదు. అందుకే ఇది మానిటర్ గొడవేమో అనుకున్నా. మా బాస్ కి ఒక ఫోన్ కొట్టా బాబు కలెక్షన్ నిల్లు బాలు నా బ్రతుకు బస్టాండు పాలు అని. ఆ పిడుగు లాంటి వార్త విన్న వెంట్టానే రాయిలా గట్టిగా ఉండే మనిషి ఏక ధాటిగా "పరదేశీ", "వివాహ్", "హం సాత్ సాత్ హైన్" వరుసగా చూసిన వాడిలా ఢీలా పడిపోయాడు. ఇంక ఇల అయితే చేసిన పనే మళ్ళా చేయాల్సొస్తదా అని మా పాత కంపనీ లో పని చేసే స్నేహితుడి వెంటబడి పాపాం వాడు నిద్ర పోతున్నా లేపి ఆపీసు కి తీస్కెళ్ళి డేటా మొత్తం కాపీ చేయించా. దాని వళ్ళ కొంచం ఊరట కలిగింది. తీరా ఇంటికి వచ్చి మరోమారు మొదలెట్టేప్రయత్నం చేస్తే నా లాప్ టాప్ ఆన్ అయ్యింది. యాహూ అనుకొని అటు ఇటు కొంత సేపు గెంతా. మిగిలిన డేటా అంతా కాపీ చేసుకున్నా. ఇది శుక్రవారాం.

నా లాప్ టాప్ కి నా గురించి ఎంత క్షుణ్ణాం గా తెలుసంటే టంచన్ గా అది సోమవారం ప్రొదున్న మళ్ళా పని చేయడం ఆపేసింది. రెండు రోజులు పని చేసింది కద అన్న ఆనందం కాస్త ఈ రోజు ప్రొదున్నకి తీరిపోయింది. దాంతో మధ్యానం వరకు ఒక డాకింగ్ స్టేషన్ కోసం తిరగని చోటు లేదు ట్రై చేయని పోర్టు లేదు. విధి ఆడిన వింత నాటకం లో నా లాప్ టాప్ ఇంక పని చేయడం పూర్తిగా మానేసింది. డెల్ల్ వాడికి కాల్ చేస్తే వాడేమో ఇంకే ఎత్తి చెత్త కుప్ప లో పడేయి అన్నాడు. అంటే ఇంచు మించు గా ఇదే రకం గా అన్నాడు. మళ్ళా కాంగ్రెస్స్ గెలిచినంత బాధేసింది. అదే చెప్పా వాడికి.. పాపాం మేగాస్టార్ ఫ్యాన్ అనుకుంటా ఇంకో ఉపాయం చెప్పాడు. తల్లిరేకు - అంటే మదర్ బోర్డ్ మారిస్తే బాగుపడచ్చు అని. ఇంక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి ఒక మదర్ బోర్డ్ కొరకు దరఖాస్తు పెట్టా. అది రేపు వస్తుంది. తర్వత మళ్ళా ఎక్స్.పి మొదలు అన్ని పెట్టుకోవాలి. ప్చ్.. అది ఈ రోజు నా దుస్థితి. ఇంక రేపు లాప్ టాప్ తెరిచి కొత్త మదర్ బోర్డ్ పెట్టి అన్ని సక్రమంగా సాగితే దాని నుండి ఇంకో టపా వేస్తా. లేకుంటే అనుకునదొక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుకుంటూ కనిపిస్తా...

నేను లేను కద అని వందలకొద్ది టపాలు వేయకండి. ఓ పది అంటే తట్టుకోగలను.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP