Thursday, September 24, 2009

దిల్ బోలే "రక్షించు బాబా.."

నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు. అలా అప్పుడప్పుడు అంటే యాడాదికి ఒకటో రెండో లా అన్నమాట.. నన్ను నేనే చిత్రవధ కి గురి చేసుకుంటా. (సేడో-మసోచిస్ట్ అనుకునేరు.. అంత బొమ్మ లేదు ) అంటే అదేదో చెట్టుకి కట్టేసుకొని కొట్టుకునే టైప్ కాదు.. మానసికంగా అన్నమాట. దానికి కొన్ని కారణాలు కొన్ని పద్ధతులు అవళంబించుకున్నా. శాస్త్రీ గారనట్టు "రాత్రిలో సొగసు ఏమిటో చూపడనికే చుక్కలు.. బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు .. " అని.. అలా అప్పుడప్పుడు నా బుద్ధిని పదును పెట్టుకునే దానికి నన్ను నేనే బుద్ధిపరంగా కొన్ని చిక్కులకి గురి చేసుకుంటా. దానికోసం కొన్ని సార్లు మంచి సినెమా దోహదపడుతుంది. అంటే రాబోయే సీన్ ఏంటా ఇది ఇలా ఎందుకు తీసాడు అలా ఆలోచిస్తా. దానికి విరుగుడు గా ఇంకో రకం సినెమా ఉంటుంది.. చూస్తున్నంత సేపు చూసినందుకు మనమీద తీసినందుకు దర్శకుని జీవితం మీద విరక్తి కలిగించేవి. ఈ చిత్రం రెండో కోవకి చెందింది.

ఈ ఉపోద్ఘాతం (సొల్లు అని కొంతమంది అనచ్చు) ఎందుకురా అంటే ఎదైన విషయం చెప్పే ముందు కొంచం భూమి పని (groundwork) చేయడం నాకిష్టం గనుక. గత కొద్ది సంవత్సరాళ్ళో ఇంత కంటే చెత్త సినెమా నేను చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ మాట నేనంటున్నాను అంటే ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోండి. కథ పక్కనబెట్టండి. అసలు .. పోనీ నేను పంజాబ్ కి ఎప్పుడు వెళ్ళలేదు కాని నాకు తెలిసినంత వరకు అక్కడ మనిషి ఎదురైతే రోడ్డు మీద భల్లే భల్లే అని భాంగ్రా వేయరనే అనుకుంటున్నా. అదేంటో యష్ రాజ్ సినిమాల్లో మాత్రమే ఇలా వెరైటీ గా ఉంటారు పంజాబీలు. ఈ సినెమా వాళ్ళకి చూపిస్తే స్తేట్ స్తేట్ మొత్తం పరువునష్టం దావా వేస్తారేమో. రాణీ ముఖర్జీ కష్ట పడి ప్రతి వాక్యం లో పంజాబీ పదాలు కలిపి మాట్లాడ్డం ఏంటో. నేచురల్ గా రావడం వేరు.. పనిగట్టుకొని ఇలా మాట్లాడ్డం వేరు. మొదటిది - అనుకోకుండా ఒక రోజు లో హర్ష వర్ధన్ టైప్ - you dance, i glance లాంటివి. రెండవది .. వద్దులేండి. తలుచుకుంటేనే అదో మాదిరి ఔతుంది పొట్టలో.

కథా పరంగా చెప్పేదానికి ఏమీ లేదు. పాకిస్తాన్ చేతిలో ప్రతి యేట ఓడిపోతూంటంది మగవాళ్ళ జట్టు. వీళ్ళతో ఐతే పని కాదని ఇగ రాణీ లుంగీ కట్టుకొని బరిలో దూకుతుంది. దసర వేషాళ్ళో దొరికే పెట్టుడు మీసాలు గేడ్డం అద్దెకు తెచ్చుకొని ఫెవికాల్ లో అద్దుకొని. అహా తెలీక అడుగుతాను .. ఓ అమ్మాయి అబ్బయిగా వేషం వేసుకోవడం అంటే మీసం గెడ్డం పెట్టుకుంటే సరిపోద్దా ? చేయి చూస్తే చెప్పచు అమ్మాయి అని. ఏంటో. మిగితాది పక్కన పెడితే కూడా. విరక్తి కలుగుతుంది ఇలాంటివి చూస్తే. పోనీ అలా అని పూర్నిమా రావు లా ఆడుతుందా అంటే అబ్బే ... గల్లి క్రికెట్ లో కూడా అంత కంటే అద్భుతమైన షాట్లు చూడచ్చు. గల్లి క్రికెట్ ని దీనితో పోల్చడం తప్పు. అపచారం. రాణీ లాస్ట్ వికెట్ కి వచ్చీ ఓ ఐదోవర్లల్లో ఓ నూట యాభై పరుగులు కొట్టడం అదీ ఆఫ్రీదీ లా ప్రతి బాల్ అడి.. ఆ ఒక్క షాట్ కోసమే దీన్ని కళా-ఖండం గా పరిగణించచ్చు.

ఈ యేడు ఈ సినెమా ని మన అఫీశియల్ ఆస్కర్ గా పంపాలని నా అభ్యర్తన. ఈ సినెమా చూసాక ఇంక జన్మ లో ఎప్పుడు భారతదేశం నుండి సినెమా అంటే చిన్న చూపు చూడరు. జడుసుకుంటారు. భయపడతారు. కాని కాని ఆస్కర్ ఇవ్వకుండ ఉండరు. ఎప్పటికీ. ఓ ఐదు వందల సంవత్సరాల తర్వత ఎప్పుడైన ఆస్కర్ కమిటీ వాళ్ళకి భరత దేశం నుండి సినెమాల మీద చిన్నచూపు వస్తే ఈ సినెమా లో యే ఒక్క సీన్ చూపించిన చాలు. సెట్ అయిపోతారు. అంత పవర్ ఉంది ఈ సినెమా కి. ప్రపంచ చరిత్రలో ఇదో మైలురాయి. స్టీవన్ స్పీల్బర్గ్, గురు దత్, మణి రత్నం, వర్మా, సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్ - ఎవ్వరు సాధించలేనిది అనురాగ్ సింఘ్ సాధించాడు. జోహార్. ఇది ప్రపంచ అన్ని భాషల్లో అనువదించి రిలీస్ చేసినా ఫ్లాప్ ఔతుంది. అసలు ఈ మహాయుగం లో ఇదే మొట్టమొదటి సినెమా ఐనా ఫ్లాప్ అయ్యేది. అంత గొప్ప చిత్రం ఇది. దీన్ని మీకోసం మిస్స్ అవ్వకండి. ప్లీజ్ నా కోసం వెళ్ళి చూడండి. చూసారా "చూడండి" అని అన్నాను "చూసి రండి" అని అనడం లేదు.. అంత potential ఉన్న మూవీ ఇది. గ్రేట్ సినెమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాంటివి అరుదు. అందుకే చూసి తరించండి.

Read more...

Sunday, September 6, 2009

వై.యెస్.ఆర్ ... తర్వాత ?

ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది. ఇది నా దృష్టిలో ultimate water conservation. కాని బ్రిటిషర్లు ఈ కోనేరులు filthy water అని నమ్మి చాలా వాటిని పూడ్చేసారు. స్వతంత్రం వచ్చాక మన ప్రభుత్వం వేల యేళ్ళ నాటి మన మనుగడని తలచక బ్రిటిషర్ల బాటలోనే నడిచి.. ఇదిగో ఇప్పుడు నీళ్ళూ లేని పరిస్థితి తెచ్చి పెట్టింది.

పంటలకి నీటి కోసం పంపు సెట్లు ఎంత లోపల దింపిన చాలా చోట్ల నీరు రావడం లేదు ఈ కాలం లో. అసలు భూమిలో నీరు ఉంటే కద వచ్చేది. water table restoration కి ఓ ఉపాయం జలయగ్ఞం. 70 చిల్లర చిన్న పెద్ద ఆనకట్టలు నిర్మించడంతో ఈ సమస్య కొంత తీరుతుందేమో. అందులో భాగం గా ఇప్పటికి 35 దాక నిర్మాణం పూర్తి చేసింది వై.యెస్ ప్రభుత్వం. అన్నిటి నిర్మాణం తర్వత ఒక కోటి ఎకరాలకి సాగునీరు అందేది. వ్యవసాయం మీదే ఆధరపడే మనకి ఇది ఎంత మేలో మాటల్లో చెప్పలేము. మన దేశం లో గుజరాత్ తర్వత ఇంతగా నీటి మీద వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపింది ఈ ప్రభుత్వమే. అందుకే నాకు వై.యెస్ అంటే అభిమానం. మన నాయకుల మీద మనకి ఎంత అపనమ్మకం అంటే వాడు ఎంత తిన్న పర్లేదు కొంచం ప్రజలకి చేస్తే చాలు అని అనుకుంటాం. అందులో ఇంకొంచం ఎక్కువగా ప్రజల సమస్యలని పట్టించుకుంటే దేవుడు అనేస్తాం. వై.యెస్, ఎన్.టీ.ఆర్, జలగం, బూర్గుల, ప్రకాశం పంతులు .. ఈ కోవకి చెందిన వారు.

వై.యెస్ హఠాన్మరణం తో ఆంధ్ర చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. ఇప్పుడు అతడి పేరు చెప్పుకొని బ్రతికే ఘట్టం ఆరభం ఔతుంది. మనం పేరుకిమాత్రం democracy పనితీరు మాత్రం feudalistic అని చెప్పేదానికి గత రెండు మూడు రోజుల్లో టి.వీ చూస్తే చాలు. శరత్ అన్నట్టు YS est mort, vive YS!. అసలు జగన్ అనేవాడు ఎవరు? ముఖ్యమంత్రి కి కావల్సింది ఎక్స్ పీరియన్స్. అది అతనికి అసలు ఉందా? సాక్షి పెట్టకమునుపు అతనెవరో కూడా చాలా మందికి తెలీదు. పైగా సత్యం అవకతవకల్లో అతనికీ భాగం ఉందని అప్పట్లో అన్ని పత్రికలు, చానల్లు రాసాయి / చెప్పాయి. ఇప్పుడు అవేమి గుర్తుకు రావే!! ఇందిరాని చంపేసారని రాజీవ్ కి పట్టం కట్టారు. 410+ సీట్లోచ్చిన కాంగ్రెస్‌ని ఐదేళ్ళల్లో 200 కంటే తక్కువచి తెచ్చేసాడు. యే పనికైన ఎక్స్పీరియన్సె అవసరం. అంటే జూనియర్ పోస్ట్‌లకి కాదు.. అవి నేర్చుకునేదానికే ఉంటాయి. కాని పెద్ద పోస్ట్‌లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ కి తగ్గ బుద్ధి విగ్ఞానం తోబాటు మనకి ఉన్న అనుభవాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కేవలం రాజకీయాల్లో సినిమాళ్ళో ఇదెందుకో వర్తించదు.

ఏమైన అంటే మా రక్తం లో నటన ఉందనో రాజకీయం ఉందనో అంటారు. అదెలా? సినిమాలూ వేరే విషయం అనుకోండి. ఒక గొప్ప నటుడి కొడుకు (ఫార్ దట్ మాటర్ కూతురు) సర్రిగ నటించకపోతే దేశానికి ఒచ్చే నష్టం ఏమీ లేదు. ఓ రెండు మూడు సినిమాలు తర్వత వాడ్ని అసలు ఎవ్వరు చూడరు. దానితో ఎవ్వరికి నష్టం లేదు. కాని రజకీయం ఇత్యాది వాటిల్లో అల జరగకూడదు. ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? సపోస్ వాళ్ళ నాన్న కార్డియాలగిస్ట్ అయ్యిఉంటే ఇతడు ఆర్థోపెడిస్ట్ ఐనా కూడా లేదు లేదు వాళ్ళ నాన్న గొప్ప గుండె డాక్టర్ కాబట్టి ఇతడి రక్తం లో గుండెకోయడం వచ్చింటది అందుకే ఇతడే గుండె ఆపరేషన్ చేయాలి అని పట్టుబడతారా?

చెప్పోచేదేంటంటే ఇప్పటికైన ఈ వారస్త్వపు ఆలోచనలు మానేయాలి. ముకేష్ అంబానిని కూడా డైరెక్ట్ గా ఎం.డి చేయలేదు ధీరుభాయి. అతడికి మొదట్లో చిన్న చితక పనులు ఇచ్చి అది చేసాకే ప్రమోషన్ ఇచ్చాడు. కుమారమంగళం కథ కూడా అదే. సురేష్ బాబు కథ కూడా అదే. నటవారసుల సంగతి నాకు తెలీదు కాని మిగితావాటిలో వారసత్వం.. i am not that sure.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP