Tuesday, November 17, 2009

ఒక గోడ - ఒక సామ్రాజ్యం - ఒక రాష్ట్రం.

ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో కాలుపెట్టడమే. అంతక ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచక్క అన్నింటిని రేషన్ చేసి నెట్టుకొని వస్తున్న యూనియన్ ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన తర్వత ఏది సరిగ్గా చేయలేకపోయింది.

ఐనా ఆఫ్ఘన్ లో వాళ్ళంతటవాళ్ళే వెళ్ళలేదు కద.. అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీళ్ళు పాపాం వెళ్ళారు. 79 లో. కనిపించిన చిన్న చిన్న గుడిసెలు సైతం సైతాన్నుల్లాగా పేల్చేసారు. ఇసుకని గుప్పెట్లో బంధించే ప్రయత్నం లానే ఇది విఫలమైంది. కాని దాని ప్రకంపణలు క్రెంలిన్ లో కనిపించాయి. రేషన్ చేసి అన్నింటికి కోట (quota) లెక్కన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం ఇంక ఏమీ చేయలేకపోయింది. చేసేదానికి డబ్బు లేకుండా పోయింది. ఒక్కసారి ఈస్ట్ జెర్మని వెస్ట్ లో చేరిపోయాక యూనియన్ లోని మిగితా దేశాలు కూడా స్వతంత్రం అడిగాయి. ఇంక ఇవ్వకతప్పలేదు కద... Nov 09, 1989 బెర్లిన్ వాల్ ని కూలద్రోసారు. సోవియట్ యూనియన్ ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకగలిగింది... అది విరిగి 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. ప్రపంచం లో అతి పెద్ద కమ్యునిస్ట్ దేశం గా రష్యా పోయి చైనా అయ్యింది. మన దేశం కూడా అదే సమయం లో సోషలిస్ట్ / కమ్యునిస్ట్ ఛాయలనుండి సురక్షితంగా బయటపడింది... శ్రీ పీ.వీ మేధస్సు తో.

ఒక్క రాష్ట్రం తప్ప. మన దేశం లో ఆ ఒక రాష్ట్రం లో గత 30 సంవత్సరాల నుండి ఒకటే పార్టి పరిపాలిస్తోంది కద.. పాపం ఒక్కప్పుడు చాలా విషయాల్లో ముందంజ లో ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు టిక్కు టిక్కు అంటూ నెట్టుకొస్తోంది. అంటే కమ్యునిస్టేతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అది నిజం కాదు.. బీహర్, ఉత్తర ప్రదేశ్ వాటికి ఉదాహరణలు.. కాని నకు కమ్యునిస్ట్లన్న ఫెమినిస్ట్లన్న పడరు. కమ్యూనిస్ట్లు చైనా తో యుద్ధం అప్పుడు చైనా కి సపొర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళని దేశం నుండి బహిష్కరించేదానికి. ప్రగతికి అడ్డంకులు.. అందుకే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. ఏం సాధించారో ముఫై యేళ్ళళ్ళో నాకైతే తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు.. సరిగ్గ పని చేసేవాళ్ళు లేరు .. పెద్దగ ఒరిగింది కూడా లేదు. ఒకప్పుడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండినది ఇప్పుడు బీహార్ కంటే కొంచం మెరుగ్గా ఉంది అట. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల్లో అస్సెంబ్లీ ఉప ఎనికల్లో కొంచం వెనుకపడింది సి.పి.ఎం. చూద్దం ఈ సారి ఎన్నికల్లో గెలుస్తుందో లేక చివరికి బెంగాల్ కి కూడా మంచి రోజులు వస్తయో లేదో అని.

క్యాపిటలిజం గొప్పది అనో సర్వరోగ నివారణి అనో నేను అనడం లేదు. అనేంత తెలివి కూడా నాకు లేదు. కాని కమ్యునిస్ట్ కంటే యే రోజైన క్యాపిటలిస్ట్ సొసైటి బెటెర్ అని నా అభిప్రాయం. వాక్ స్వాతంత్రం కదిలే స్వాతంత్రం నాకు చాలా ముఖ్యం. ఒక్క మాట ఎవరినైన అంటే రాత్రి ఎవడొచ్చి తలుపు కొడతాడో ఎక్కడ క్యాంపుల్లో పడేస్తారో అని భయపడాల్సిన అవసరం ఉండదు. డెమాక్రసి అలాంటిది. కమ్యూనిస్ట్ అంటే ఒక మాట చెప్పాలి - పని ఎవడి శక్తి కొలది వాళ్ళు చేయాలి పరిహారం మాత్రం అందరికీ సరిపోయేంతే అనే ముష్ఠి భావన మీద బేసైన ఎటువంటి "ఆలోచన" ఐనా నాకు చిరాకే. నేను చేసే పనికి తగినంత పరిహారం నాకు కావాలి. నేను 12 గంటలు కొట్టించుకొనీ.. నా పక్కనోడు ఓ గంట చేసి ఇద్దరికి ఒకటే జీతం అంటే లాగి కొట్టలనిపిస్తుందా లేదా? ఎమైన అంటే ప్రపంచం బాగు కోసం అని అనడం ఇంకో పెద్ద బూతు. నాకు పని చేయాలి అని అనిపిస్తే కద నేను, నా ఇల్లు, నా ఊరూ నా దేశం నా ప్రపంచం బాగుపడేది? అసలు నేను ఎంత కొట్టించుకున్నా నాకు మిగిలేది చిప్పే అంటే నేనెందుకు పని చేయాలి? ఎందుకు చేస్తా? ఈ చిన్న ముక్క బుద్ధి లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎలా నెగ్గిందో నాకు ఐతే అర్థం కాదు. ఏదైతేనేమి ఇంకో ఇరవై సంవత్సరాల్లో . బెంగల్ వాళ్ళకి బుద్ధి రాకపోద్దా..మన దేశం మారకపోద్దా. చూద్దాం. ఆశిద్దాం.

గమనిక: ఇది నా బ్లాగు. నాకు నచ్చని వాటి గురించి నచ్చిన వాటి గురించి రాస్తాను. కార్ల్ మార్క్స్ దేవుడు లెనిన్ ఇంకో దేవుడు. స్టాలిన్ మావో లు దేవుని ప్రతిరూపాలు గట్ర గట్ర అని అనాలనుకుంటే దారి అటు --> ఇక్కడ కాదు. నా దృష్టి లో లాలూ ములయం మాయవతి కంటే తక్కువ పింకోలు .. వాళ్ళని చూస్తే at least చెప్పచ్చు దేనికి పనికిరారు అని.. వీళ్ళు అల కాదు. మరోసారి చెప్తున్న ఈ టప కమ్యునిస్ట్ టప లాంటిది.. వ్యతిరేకిస్తే కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పడేసి కుర్చి కి కట్టేసి వివాహ్ సినెమా చూపిస్తా. కేసు బోనస్!! ఖబర్దార్!.

Read more...

Sunday, November 15, 2009

సెన్సార్ కత్తెరా మజాకా!!

నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో ఎందుకో అర్థం కాలేదు నాకు. ఇంక పేరు - reference కూడా తీసేయమంటారేమో ఇంకొద్ది రోజుల్లో. అసలు మనది ప్రజాస్వామ్యమేనా అని అనుమానం వస్తుంది. బహుశా పేరుకి మాత్రమే ప్రజాస్వామ్యం.. పద్ధతి మాత్రం రాచరికమే!!

కాదంటారా? ఒక్క సారి చుట్టు చూసుకోండి. ఒక మంత్రి చనిపోతే అతడి కుటుంబ సభ్యులకే ఆ పదవి ఇస్తారు. ఇవ్వకపోతే బస్సులు తగలెడతారు. ఓ రజకీయ నాయకుడి మీద.. అంటే అతడు ఉన్నా పోయినా ఓ మాట చెడ్డగా రాస్తే ఇంక ఐపోయినట్టే. అసలు అతడు బ్రతికున్నప్పుడు మొహం మీద ఓ మాట అంటే అతడు కూడా ఏమికునేవాడు కాకపోవచ్చు కాని అనుచరులు మాత్రం నానా రబస చేస్తారు. సొంత అమ్మ బాబులని అంటే కూడా అంతగా బాధపడరేమో అని అనిపిస్తుంది. ఈ విషయం లో ఇందిరమ్మ ఇంటిపేరు నిజంగానే గాంధి కాదు.. కాని ఆ వాస్తవాన్ని చెప్పినందుకు .. ప్రజలకి గుర్తుచేసీనందుకు కత్తెర పడింది. ఇది మన దేశ పరిస్థితి. ఇప్పుడే కాదు గత అరవై సంవత్సరాల నుండి ఇలనే ఉంది. యే విషయం అయినా సరే ప్రజళ్ళో ప్రజలతో చర్చ అనేది శూన్యం. ఒకడు ఎవడో "ఇది ఇలా చేయాలి" అని శాశిస్తాడు. మిగితా వాళ్ళు శిరసావహిస్తారు. అది మంచో చెడో అని తర్కించకుండా. వేల సంవత్సరాల నాటి రాచరికం గుర్తులు అయ్యిండచ్చు.

సెన్సార్ అనేది వేరొకరిని కించపరిస్తేనో అసభ్యకరంగా మాట్లాడితేనో నియంత్రించాలి తప్ప ఇల ప్రతి ఒక్కదానికి అడ్డుగా నిలవడం సమంజసం కాదు. వాక్ స్వతంత్రం ఎలాగో మనకి లేదు. మన దేశం లో పేరుకి మాత్రమే ఉండే స్వతంత్రాల్లో ఇదోటి. పొరబాటున ఎమైన రాస్తే పబ్లిక్ గా ఏమి జరగకపోయినా లోపల లోపల రాసినోడు గల్లంతు అయిపోతాడు. అంత స్వతంత్రం ఉంది మనకి. ఐనా నేనేం చూడాలో ఎలాంటిది చూడాలో నిర్ణయించేదానికి సెన్సార్ ఎవరు? నేనేమైన చిన్నపిల్లాడినా ఇది చూస్తే చెడిపోతా అది చూస్టే బాగుపడతా అని అనుకునేదానికి? ఇంకో విధం అంటే థియేటర్ లో టికెట్లు ఇచ్చేటప్పుడే కొంచం జాగ్రత్త పడ్డం. అంటే స్కూల్ పిల్లలని "A" సినెమాల్లోకి రానివ్వకపోవడం అన్నమాట. అసలు ఆ సర్టిఫికేట్లకి చూసేవాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదే!! ఉంటే అరుంధతి లాంటి వాయిలెంట్ సినెమాకి చిన్న చిన్న పిల్లల్తో రావడం ఎంటి? ముందే దానికి తాటికాయ అక్షరాలతో రాసారు "A" అని.

మన జనత కూడా మంద లా కాకుండా అప్పుడప్పుడు కొంచం niche లా ఆలోచిస్తున్నారు. మారుతున్న రుచులకి అనుగుణంగా చిత్రాలు వస్తున్నాయి. అందుకే అసలు ఆ సెన్సార్ని లేపేసి రేటింగ్ బోర్డ్ ని పెడితే సరి. అడ్డమైన చెత్త పిల్లలు చూడకుండా చూసే పూచి థియేటర్ మీద పెట్టాలి. అడ్డమైన చెత్త అంటే రోజు టీ.వీ లో వచ్చేదానికంటే తక్కువే!! యే డాన్స్ కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థం ఔతుంది. థూ.. అసలు 4-5 యేళ్ళ పిల్లలు అంత వల్గర్ స్టెప్పులేస్తుంటే నా జీవితం మీదే కాదు అలా వేస్తున్న చప్పట్లు కొట్టే వాళ్ళ అమ్మ నాన్నల జీవితాల మీద కూడా విరక్తి కలుగుతుంది. వాటితో పోలిస్తే మన "A" సినెమాల్లో చెత్త ఇంకా తక్కువే. కుటుంబ సమేతంగా చూసేదానికి శేఖర్ కమ్ములా, కే. విశ్వనాథ్, కృష్ణా రెడ్డి తదితరుల సినెమాలు ఉండనే ఉన్నాయి కద. మిగితా వాటిని కూడా "కుటుంబ సమేతం" చేయడం ఎందుకు?

ఇది నా ఓన్-సొంత-పర్సనల్ అభిప్రాయం. అలకాదు ప్రతి మాటకి కత్తెర పడాలి అంటే ఇంక అనేది ఏమీ లేదు. నా దృష్టిలో మాత్రం సెన్సార్ బోర్డ్ సుద్ధ దండగ. కించ పరిస్తే మరోకరిని గాయ పరిస్తే వేరే విషయం కాని చిన్నా చితక రెఫరెన్సుల్ని కూడా పట్టించుకొని ప్రతి సినెమాని చెడగొట్టడం మాత్రం మంచిది కాదు అనే అంటాను.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP