Tuesday, March 31, 2009

జల్లెడ, కూడలి కి ఒక ఆలోచన..

ఇందాక మన మిత్రుడు జీడిపప్పు ఉరఫ్ బుడుగు "అయ్యా మార్తాండగారు ....అలాగే వీవెన్ గారు" అని టపా వేసాడు. నేను చెప్పేది ఇదే - ఒక రోజుకి ప్రతి ఒక్కరు ఇన్నే టపాలు వేయాలి అని రూలు లేదు అలనే నెలల తరబడి టపాలు వేయని వాళ్ళు ఉన్నారు. టపాలు అనేవి ప్రతిఒక్కరి స్వంత విషయం. వాళ్ళ వాళ్ళ బ్లాగుల్లో రోజుకి వంద టపాలు వేసుకున్న అభ్యర్తన చెప్పే అధికారం మనకి లేదు. అలాగని బుడుగు వ్యతిరేకించడం లేదు.. just request చేస్తున్నాడు.

ఒక ఆలోచన కూడలి, జల్లెడ వారికి. రాబోయే రోజుళ్ళో ఇంకా తెలుగు బ్లాగుల సంఖ్య పెరుగుతాయి. అప్పుడు ప్రతి రోజు కొన్ని వందల కొద్ది టపాలు ప్రచరించబడతాయి. ప్రతి టపా ఎదో ఒక గుంపు కి చెందుతుంది. అలా గుంపులవారిగా subscribe చేయగలిగేటట్టు చేస్తే బాగుంటుందేమో. (ఈ ఆలోచన reddit.com ని చూసి వచ్చినదే. అక్కడ sub-reddits కి subscribe చేసుకోవచ్చు. ఎవరికి కావల్సినవి వారు చూడచ్చు). ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇలా కాకుండా వేరే పద్ధతి మీకు తోచితే క్రింద కమెంట్లల్లో వ్రాయండి.

Read more...

Thursday, March 26, 2009

విరోధికి వందనం..

ఆశా నిరాశాలకతీతం మన జీవతం,
ప్రతిక్షణం జీవించాలన్నదే నిజం,
మరలినక్షణం మరలరాని వాస్తవం,
రానున్న తరుణం తొంగిచూస్తున్న రహస్యం,
మరుగవని మననడుమ మనస్తాపం,
కలసి ఆహ్వానిద్దాం వేచిచూస్తున్న అభ్యుదయం,
గడించిన చేదుగతాన్ని "సర్వజిన్"తో పోనిద్దాం,
తేట తలపుతో "విరోధి"' కి వందనమిద్దాం..


అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

Read more...

Wednesday, March 25, 2009

నిశివర్ణోశ్నోదకము..

ఈ అలవాటు ఎప్పటిదో ఎక్కడదిదో తెలీదుకాని.. ప్రొదున్నే ఓ కప్పు నిశివర్ణోశ్నోదకము.. అదే ఆంగ్లములో కాఫీ పడకపోతే (..దిండుపోతే దుప్పట్టిపోతే కాదు.. రోడ్డు మీదో రోకటి మీదో కూడా కాదు .. కడుపులో పడకపోతే) రోజంతా అదోమాదిరిగా - ప్రొదుట్టే MS సుప్రభాతం బదులు 'ఇప్పటికింకా నా వయస్సు ..' వింటూ లేచినంత వెరైటీగా ఉంటుంది. రత్రే డికాక్షన్ కి వేసి పడుకుంటా.. కాని నిన్న మరిచ.. ప్రొదున్న లేచి చూస్తే ఇంట్లో కాఫీ కి పొడి లేదు. పోనీ కాఫీ కాయలు (కాఫీ బీన్సు) అయినా ఉంటే నమిలేద్దాం అనుకున్న... అవి కూడా లేవు. ఏం చేయాలో బోధపడలేదు .. కాఫీ తాగితేనే నా బుర్ర పని మొదలెట్టేదానికి ఓ అరగంట పైనే పడుతుంది.. ఇంక కాఫీ లేకపోతే అంతే సంగతి.

దేవదాసు పక్కనే లేని కుక్కలా .. జారిపడేదానికి మనిషిలేని అరటితొక్కలా.. కఫీ లేని నా జీవితం ఒక్కట్టే అని అనిపించింది. ఏదో ఒక ద్రవం అని .windexO phenylO కోసం వెతుకుతూ పిచ్చి కేకలు పేడుతున్న నన్ను మా ఆవిడ తను ఊరెళ్ళి వస్తే నా చేష్టల్లాగా అనిపించాయి. ఇల కుదరదని పక్కనే ఉన్న కొట్టుకెళ్ళి తనే పొడి తెచి కాఫీ పెట్టిచింది. ఆఫీసు కి వెళ్ళకా రాసే ఫార్ లూపులు ఎప్పుడైనా రాయచ్చులే అని అసలు ఈ కాఫీ యొక్క పుట్టుపూర్వత్రాలు గురించి ఆరాతీసా కొద్ది గంటలు. అప్పుడు తెలిసింది..

నిశివర్నోశ్ణోదకోత్పత్తి -
శూతమహాముని అలా నడుచుకుంటూ వెళ్తూంటే హరప్పా మొహెంజదారోలోని ఆడ-లేడీస్ ఆయన్ని ఆపి ఇలా అడిగారు - 'స్వామీ మేము ప్రొదుట్టే లేచి ఈ-మేల్ చూసుకున్నాక కూడా ఈ మగజాతి లేవదు. ఇలా అయితే ఇళ్ళు చిమ్మి ముగ్గెట్టి బిందెలతో నీళ్ళుతెచి మాకు టిఫినీలు చేసేదిక్కు ఉండదు. వీళ్ళని ఉదయాన్నే లేపే ఏదైనా ఉపాయం చెప్పండి?' అందుకు ఆ మాహాముని ఇలా అన్నరు - 'పూర్వము నిశివర్ణన అనే ఒక పట్టణం లో మీలాంటి ఒక బాధితురాలు ఉండేది. వాళ్ళ ఆయన కూడా మీ వాళ్ళ లాగా ఉదయాన్నే అంటే అదే పదకొండు - పన్నెండు కు లేచేవాడు. ఇలా ఐతే ఇంటిపనులు అలానే ఆగిపోతాయి వంటా వార్పు .. పిల్లల స్కూలూ గట్రా కి ఆలస్యం ఔతుంది అని గ్రహించిన ఆ నిశివర్ణన ఈ విషయం మీద ఈశ్వరుని కొరకు తపస్సు చేసింది. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమడుగగా నిశివర్ణన తన బాధని తెలిపింది. అప్పుడు ఆ పరమేశ్వరుడి ఒక ఉదకము గురించి తెలిపి అది ఎలా చేయాలో కూడా చెప్పి, ఉదయన్నే ఈ ఉదకము సేవించేట్టూ ఒక వ్యసనం చేసి మాయమయ్యడు. అలా అప్పటి నుండి ఆ నిశివర్ణన తూ.చా తప్పకుండా ఉదయాన్నే లేచీ ఆ ఉదకమును తయారు చేసి తన భర్త కి ఇచ్చి పనులు చేయించుకునేదీ.
అందుకే ఆ ఉదకముని నిశివర్ణోశ్నోదకము అని అంటారు అని చెప్పి అది ఎల చేయాలో కూడా వివరంగా చెప్పి తన ఉదయ వ్యాహ్యాళి కి వెళ్ళారు శూతమహాముని.

అది మొదలు ఇన్ని వేళ సంవత్సరాలు ప్రొదుట్టే లేచి కాఫీ పెడుతున్న మన ఆడ-లేడీస్ కోసం ఈ పాట అంకితం

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

పాలు కాచింది కాఫీ కోసం...

Read more...

కేవలం ఎనిమిది..

ఎనిమిది .. సంఖ్య చిన్నదే అయినా ఎంత తేడా చేస్తుందో. గెలుపుకి ఓటమికి తేడా 'ఒక్క ఇంచే' అని రాజీవ్ కనకాల అరిచి అరిచి చెప్పాడు.. అలాంటిది 8 అంటే కొంచం ఎక్కువే తేడా అనిపిస్తుంది. కాని 545 లో 8 అంత పెద్ద సంఖ్య కాదు. మన దురద్రుష్టం ఆ 8 అటు పడింది.. అదే ఇటు పడింటే కథే వేరుగా ఉండేది. ఎనిమిది సంఖ్య ప్రాధాన్యత గురించా ఈ టపా అనుకోకండి.. గత ఎన్నికల్లో ఈ సంఖ్య చేసిన తేడా గురించి చెప్తున్నా.

బహుసా చాలా మంది ప్రకారం మనం అంటే అంధ్ర ప్రజలు, దేశానికి నష్టం చేకూర్చాము. మన కష్టాలు మనకి ఉంటే ఇదేలా చేసాం అని ఆలోచిస్తున్నారా? ఇదేదో రాకెట్ సైన్స్ కాదు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్స్ గెలిచిన ఏకైక 'పెద్దా రాష్ట్రం మనదే! చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చూసి చూసి బొరు కొట్టి మనం మారిస్తే దాని ప్రభావం యావత్ దేశం మీద పడింది.. ఆ 29 సీట్లే కాంగ్రెస్స్ ని లోక సభ లో అతి పెద్ద పార్టీ చేసింది. 29 కూడా కాదు కేవలం 8. (భారతీయ జనతా పార్టి కి 137 సీట్లు, కాంగ్రెస్స్ కి 145 సీట్లు వచాయి గత ఎన్నికల్లో). 9 యేళ్ళ తె.దే.పా పరిపాలన తో విసుగెత్తో చెం.బా. చేసిన అప్పులతో విసుగెత్తో మనం ఎదో మిగిలిన దిక్కుగా వై.యెస్.ఆర్ ని ఎన్నుకున్నం.. పనిలోపనిగా లోక సభ కి కూడా కాంగ్రెస్స్ కే వేసేసాం దానితో మొదలైంది కేంద్రం లో UPA పరిపాలన.

1989 ఎన్నికల నుండి చూస్తే కాంగ్రెస్స్ 1991 sympathy wave లో తప్ప ఎప్పుడు 200 సీట్లు దాటలేదు. పైపెచ్చు వోట్ల శాతం కూడా 1991 నుండి 30 దాటలేదు. 1996 నుండి అయితే 141 సీట్లని మించి రాలేదు.. ఐతే సోనియామ్మ కీ సీతారాం కేసరి కి తేడా ఏంటో? ఈ ప్రశ్న కి జవాబు కేవలం కాంగ్రెస్స్ వాదీయులే చెప్ప గలరేమో!! 2004 ఎన్నికల్లో చిన్న చితక రాష్ట్రాలని గెలుచుకొని 145 సీట్లు సాధించింది కాంగ్రెస్స్. అతి పెద్ద పార్టి కావడం వళ్ళ వాళ్ళనే ఆహ్వానించారు. ఈ సారి మన రాష్ట్రం లో 29 సీట్లు కాంగ్రెస్స్ కి రావడం చాలా కష్టం అనిపిస్తోంది. మహకూటమి, ప్రె.రా.పా సంగతి ఎలా వున్నా.. వై.యెస్.ఆర్ మరియూ జగన్ నిర్వాకాలు చూసి ఆంధ్ర ప్రజలు మళ్ళి వాళ్ళకే పట్టం కట్టడం కష్టం.

నా అంచనా ప్రకారం అయితే భా.జ.పా 180 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాని భారత ప్రజానికాని గురించి ఎం చెప్పగలం? ఐదేళ్ళు మోడి ప్రధానమంత్రి అయితే మన దేశ భవిషత్తే మారిపోతుంది. కాని అది జరగడం ఆసాధ్యంగా అనిపిస్తుంది. చూద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో....

Read more...

Friday, March 20, 2009

క్రొత్త పార్టీ - భాగ్యనగర ప్రజా పార్టీ

పాత రోజుళ్ళో లాగ కాకుండా ఈ నాడు ఎంత తక్కువ సీట్లు ఉంటే అంత ఉత్తమం. లేకపోతే రెండే రెండు సీట్ల తో కమ్మునిస్ట్లు ఒర్రిస్సా లో చేసిన ఆర్భాటం చూస్తే వాళ్ళకి ఒక పాతిక సీట్లు ఉన్నయి అనిపిస్తుంది. నావీన్ పట్నయక్ కి బహుసా ఏం చెప్పలో అర్థం కావడం లేదేమో. లేకపోతే ఎన్నికల్లో 7 గెలుచుకున్న వాళ్ళకి ఈ సారి 35 కావాలట! కేంద్రం లో కూడా వీళ్ళ 60 మంద తో చాలా గోల చేసారు నాలుగేళ్ళు. బహుసా కమ్మున్స్ట్లకీ తెలుసనుకుంటా ఇంక జీవితం లో మళ్ళి ఇన్నేసి స్థానాలు గెలవరు అని. (నన్నడిగితే వాళ్ళ వల్ల నష్టమే కాని లాభం ఏమి ఉండదు).

నేనూ ఇలాంటిదే ప్లాన్ చేస్తున్నా.. తె.రా.స లా ఏదో ఒక sentiment ని రెచ్చగొట్టి ఒక 10 సీట్లలో గెలిస్తే 5 యేళ్ళల్లో కనీసం ఒక 2000-3000 ఎకరాలు + 40-50 కోట్ల రూపాయలు నొక్కేయాలని. చాలా సేపు ఆలోచించగా ఒక మహత్తరమైన ఉపాయం తోచింది. తెలంగాణా sentimentకోసం చాలా మందే కొట్టుకుంట్టూనారు.. అందుకని తెలంగాణా ఆధారంగా నా పార్టీ ని గెలిపించలేను.. so "జై భాగ్యనగరం" అంటున్నా!!! "భాగ్యనర రాజ్య పార్టీ" ని తదనుగుణంగా స్థాపిస్తున్న అని సభాముఖం గా తెలియజేస్తున్న.
(ప్రజా రాజ్యం లో రాజ్యం, భా.జ.పా నుండి పార్టీ, తె.రా.స నుండి ఆలోచన కొట్టేసీ పార్టీ పెట్టేసా - నా మేధస్సే మేధస్సు!)

మా పార్టీ మానిఫెస్టో ఇంకా ముద్రణ లో ఉండడం వళ్ళ ఆవిష్కరించలేకపోతున్న. కాని అగెండ లోని కొన్ని కీలక అంశాలు :

* భాగ్యనరాన్ని వేరే రాష్ట్రం గా చేయాలి. దానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise)

* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం concession ఇస్తాము.

* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "భాగ్యనర రాష్ట్రం" లో చోటు లేదు.

* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ etc కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కట్టమంటమనుకోండి. అది వేరే విషయం.

ఇల ఇంక్కొన్ని అంశాలు ఉన్నయి మా అగెండాలో. ఏది ఏమైనా ఈ sentiment ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవాలి ఈ ఎన్నికల్లో.. ఇంతటి అద్భుతమైన ఆలోచనా-ట్యాంక్ బండ్ల (ఆలోచనాతరంగాలు type) మా పార్టీ లో సభ్యత్వం కోరేవారు సంప్రదించ ప్రార్థన. (సభ్యత్వ ఫీసు just 116 డాల్లర్లు మాత్రమే - ఒక్కసారి 10 సీట్లూ గెలిచాకా అంతకంత సంపాదించచ్చులేండీ)

Read more...

Wednesday, March 18, 2009

ఇంక కొంత కాలమేనా ?

ఈ మధ్యలో చాలా చోట్ల వింటున్నాము H1 B వీసా లు ఉన్న వారు పరి పరి కష్టాలు పడుతున్నారు అని. మొన్న బుడుగు కూడా ఈ విషయం మీద ఒక టపా వ్రాసాడు. మా స్నేహితుడు ఒకడు H1 extension కి query పడింది అట. ఇంకో సంవత్సరం అతడు చేస్తున్న ఉద్యోగం ఉన్నట్టు విజ్ఙాపన పత్రం పంపమని అన్నరట. పాపాం వాడి ఉద్యోగం ఇంకొక రెండు నెలల్లో అయిపోతోంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు.

చూస్తూంటే ఇక్కడ ఈ సంవత్సరం కూడా గడవడం కష్టం అనిపిస్తోంది H1 మీద ఉన్న వాళ్ళకి. TARP సొమ్ము ముట్టినవాళ్ళు H1లని ఎలగూ తాకడంలేదు.. మిగిలినవాళ్ళు ఆదరించినా extension ఒస్తుందో లేదో తెలియకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఉద్యోగాలు ఇస్తారు? పొమ్మనలేక పొగబెడుతున్నట్టు అనిపిస్తోంది.

కొత్తగా Green Card కోసం అభ్యర్థన పెట్టిన వాళ్ళ సంగతి ఏంటో కూడా బోధపడ్డం లేదు. labour అయినా clear ఔతుందో లేదో తెలియదు. అది ఇవ్వకపోతే ఇంక ఈ దేశం లో ఉండే సమస్యే లేదు. యేం చేస్తం..అన్ని రోజులు మనవి కావు కద అని అనుకోవడమే. ఆర్థిక వ్యావస్థ (economy) పరిస్థితి అంతగా ఏమి బాగోలేదు. ఈ రోజు ఫెడ్ ఇంకొక ట్రిల్లియన్ డాల్లర్లు దింపింది కాని అది కేవలం band aid లాగా అనిపిస్తుంది. ఇంకా market లో చాలా "పెంట" ఉంది. అదంతా పోవాలి అంటే ఇంకెన్ని TARPలు కావాలో. (ఈ విషయం మీద కొంచం విశ్లేషణ అవసరం.. అది ఇంకొక రోజు) ఒక్కట్టి మాత్రం సత్యం.. ఈ market stabilize అయ్యెపాటికి ప్రపంచ రూపురేఖలు మారిపోయింటాయి.

ఆ మారినా రూపురేఖల్లో ఎక్కడో H1 లు ఉంటారనిపిస్తోంది. ఇంక అమెరికా లో మా కొట్టు కట్టేసే సమయం ఆశన్నమైందనిపిస్తోంది.

Read more...

Tuesday, March 17, 2009

ఎందరో మహానుభావులు - మహాకవి శ్రీ శ్రీ

అతని కావ్యం ఉద్వేగం, అతని పేరు ఒక ప్రభంజనం, అతని మాటల చాయ ఒక అగ్ని పర్వతం. ఆంధ్ర దేశం లో అతను తెలియని వాడంటూ లేడంటే అది అతిసయోక్తి కాదేమో! ప్రపంచం లో ఎక్కడవున్నా ఒక తెలుగు వాడి హృదయంలో ఎన్నటికీ నివాశం ఏర్పర్చుకున్న ఆ "ఆవేశం" పేరు శ్రీ శ్రీ.


నేను సైతం అంటూ సకల జీవకోటి తో కదం కలిపిన మహానుభావుడు. ఆయన తన ఆలోచనలని ప్రపంచానికి అందించడానికి ఎన్నుకున్న పద్దతి మాటలే. కాని ఆయన ఆలోచనా సరళికి మాటలు సరిపోవేమో అని అనిపిస్తాయి. ప్రతి కవితలో ప్రతి పదం లో ఆవేశం ఉద్వేగం ఆర్తనాదం వినిపిస్తాయి. ఆ భావాలని ఆ అక్షర సంకెళ్ళు నిభందించేసాయేమొ అని అనిపిస్తుంది. "మనదీ ఒక బ్రతుకేనా .." అన్న ఆవేదన ఎందుకు నన్ను ఈ అక్షరాళ్ళోనే బంధించేసావు? అని ఎదురుప్రశ్న వేసినట్టనిపిస్తుంది.

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగరిపోతే

నిబిడాశ్చర్యంతో వీరు

నెత్తురు క్రక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే!

ప్రపంచం విధానాన్ని కేవలం ఆరు వాక్యాల్లోనే తెలియజేయగలిగిన అసమాన ప్రతిభావంతుడు ఆయన. ఇది జీవిత సత్యం కాదని ఎవ్వరు అనరేమో! ఆయన తరనికే కాకుండా భావితరలకి - తెలుగు భాష ఉన్నంతవరకు - ఈ మహకవి గురించి చెప్పుకుంటూనే ఉంటారని అనడం లో ఎటువంటి సందేహం లేదు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించి, నేను సైతం అంటూ జయభేరిని మ్రోగించాడు అన్నారు ఆచార్య చెలం గారు. ఇంత కంటే గొప్పగా శ్రీ శ్రీ గురించి చెప్పడం సాధ్యం కాదనిపిస్తుంది.

నేను అనేవాడిని మనుషుల్లో ఒక్కడిని, అందరికోసం మనం మన కోసం అందరు అన్న శ్రీ శ్రీ నినాదం ఈ కాలం లో చాలా చాలా సబబుగా అనిపిస్తుంది. మా అమ్మ నాకు ఇచిన్న ఏకైక పుస్తకం "మహాప్రస్థానం". జీవితం గురించి నువ్వు అందులో ఎల ఉండాలో అన్నవిషయం గురించి ఇంతకంటే నేను చెప్పను అన్న మా అమ్మ మాటలు ఈ పుస్తక ప్రతి అక్షరం లో వినిపిస్తుంది.

ఎందరో మహనుభావులు అందరికీ సతసహస్ర వందనాలు..


ఈ శిర్షికలో నన్ను ప్రభావితం చేసిన కొంతమంది మహనీయుల గురించి వ్రాయదలిచాను. అందున ఒక భాగమే ఈ టప.

Read more...

Monday, March 16, 2009

ఈ సారి...

మళ్ళి ఎన్నికల సమయం వచ్చేసింది. వోట్ల కోసం మన రాజకీయ నాయకులు పడే పాట్లని చూస్తూంటే భలే ముచ్చట్టేస్తుంది. నోటికొచ్చినన్ని మాటలు, కంటికి కనబడని వాస్తవాలు, విపరీతంగా అప్పుచేసిన సరిపోని వాగ్ధానాలు - ప్రతీ పార్టి అదే పద్దత్తి. ఈ టపలో నేను ప్రతి రాజకీయ పార్టీ ని విశ్లేసించడం లేదు చేస్తానని వాగ్ధానం కూడా చేయడం లేదు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెబుతున్న.
మొదట్లో చిరంజీవి పార్టి పెట్టినప్పుడు తిరుపతి లో అతని మాటలు విని చాలా ఆనందించాను మొట్టమొదటి సారి ఎవరైన కులాల గురించి కాదు ఆర్థిక వర్గాల గురించి మాట్లాడారు అని.. పోలీసుల గురించి వారికి అందించాల్సిన సదుపాయాల గురించి మాట్లాడారు అని.. కాని అదంతా కేవలం ఆ speech కే పరిమితం అయ్యయి అని తెలుసుకునేదానికి ఎక్కువ సమయం పట్టలేదు. పేరుమోసిన గూండాలు వేరే వేరే పార్టీల నుండి వలస వచ్చిన రాజకీయవేత్తలని చూస్తే అర్థం అవుతుంది ప్ర.రా.పా మిగిలిన వాళ్ళ లాగానే మరొకటిగా మరిందని. దానికి తోడు ఉచిత వాగ్ధానాలు. అబ్బో ఇంక వాటి గురించి ఎంత తక్కువ చెబితే అంథ మంచింది. దానికి తోడు ప్రతి విషయం లో జాతిని బట్టి మాట్లాడ్డం.. కొత్తదననికి తావు లేకుండా భలే set చేసేసారు. కొత్తదనం అంటే గుర్తొచింది.. ప్రె.రా.పా కొత్తగా రాజకీయాల్లోకి తెచ్చింది - direct గా బూతులు తిట్టుకునే పద్దత్తి. రోజ - శోభ ల మాటలు వింటే తెలుగు తెలిసినందుకు, దేవుడు కనులకి రెప్పల్లు ఇచ్చినట్టు చెవులకి మూతలు ఎందుకు ఇవ్వలేదనందుకు (జై జంధ్యాలా) బాధ వేస్తుంది. వీళ్ళు మనని పరిపాలిస్తారట!! బూతులు ఎంత వస్తే అంత త్వరగా సీటు ఇస్తరేమో..
పోతే.. (అంటే నేనో ఇంకొకళ్ళో కాదు సుమీ) తె.దే.పా, కాంగ్రెస్స్ గురించి చెప్పనే చెప్పక్కరలేదు. వాటి గురించి అయితే ఒక్కొక్కొదానికి ఒక్కొక్క టపా తప్పదు. కమ్యూనిస్ట్ల గురించి అయితే వాళ్ళకి pro-china అని ఏది అనిపిస్తే అదే వాళ్ళ మానిఫెస్టో.
ఇంక మిగిలింది లోక్ సత్తా. జేబులో దారిద్ర్యం ఉన్న ఆలోచనా దారిద్ర్యం లేని ఏకైక పార్టి. రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచిస్తున్న పార్టి. వీళ్ళు చండలమైన వాగ్ధానాలు చేయలేదు.. చేయలేరు కూడా. రాజకీయాల్లో నిజాయతీకి తావు లేదు అని చెప్పెడానికి ఇదొక్కట్టే సరిపోతుంది. పాపం campaign కి కూడా సరిగ్గా డబ్బులు లేని పార్టి..కాని దేశం పురోగతి చెందాలంటే వీళ్ళకే వోటు వేయాలి. ఒక్క సీటు గెలవకపోయినా మనఃసాక్షి గెలుస్తుంది అని నా అభిప్రాయం. మన రాష్ట్రాన్ని / దేశాన్ని ఇంకా అప్పుల్లో ముంచేవాళ్ళకి వోటు వేయలేదు అన్న సంత్రుప్తైనా వస్తుంది. అందుకే ఈ సారి నా వోటు వీళ్లకే.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP