Tuesday, February 25, 2014

పాత రాష్ట్రం కొత్త పథం - 23. మన రాష్ట్రం లో విద్యుత్ కొరత అంతగా ఉండదు. కాని అవకాశం ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి పరచడం మంచిది కదా! అందులో క్రొత్త రాజధానికి విద్యుత్ చాలా అవసరం ఔతుంది. ఇవ్వన్నింటిని దృష్టి లో పేట్టుకొని శ్రీకాకులం లో అణు శక్తి విద్యుత్ ప్ల్యాంట్ కి శ్రీకారం చుట్టాలి. హైదరాబాదు కి కూడా విద్యుత్ శక్తి అవసరం పడుతుంది.. ఆ రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుండి విద్యుత్ అమ్మవచ్చు.

4. గోదావరి, కృష్ణమ్మల మీద ఆనకట్టలు నిర్మిస్తే చాలా ప్రమాదం మనకి. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలున్న చోత drip irrigation ని ప్రోత్సహించాలి. ఈ పద్ధతికి అనుకూలంగా అన్నదాతలకి రుణాలు సదుపాయాలు ఇవ్వాలి.

5.  కనీసం ఒక ఐదు - పది సంవత్సరాలు ట్యాక్సులు ఉండవు కనుక ఆంధ్ర లో head quarters పెట్టాలని అనుకునే కంపనీలు ఇక్కడి ప్రజలకు కూడా ఉద్యోగాలు సమకూర్చే విధంగా చేయాలి.

6. ఈ విభజన వల్ల అందరికంటే ఎక్కువగా నష్ఠపోయింది విద్యార్థులే.  అందునా పది - ఇంటర్ చదువుతున్న వారు ఎందుకంటే వీరికి ఇంక హైదరాబాదు లోని మంచి కళాశాలల్లో చేరాలేరు [JNTU Hyderabad, CBIT, Vasavi మున్నగునవి]. రాష్ట్ర పురోగతి వీరి మీదే ఆధారిపడి ఉంది కాబట్టి క్రొత్త / పాత కళాశాలలు ఆ లోటుని భర్తీ చేసేట్టు చూడాలి. అమేరికా, ఐరోపా, చైనా, జపాన్ లోని top universities తో ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాలల్లోని professors ని మన రాష్ట్రాంలో   [ఒక 1-2 సంవత్సరాలకి] చదువు నేర్పించమని అభ్యర్తించాలి. అలనే జాతీయ అంతర్జాతీయ కంపనీలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి కావాల్సిన research ని  చేసే సదుపాయాములని కలిగించాలి. ఇలా చేయగలిగితే పది - పదిహేను సంవత్సరములలో మన కళాశాలలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.


ఇవ్వన్ని చేయాలంటే ప్రథమంగా లంచగుండీ తనం తగ్గాలి. పోలీసు యాంత్రంగం సక్రమంగా ఉంటే మిగిలిన చోట్ల అదుపు చేసే ఆస్కారం ఉంటూంది. అందుకు పోలీసు వ్యవస్థకి కొన్ని అధిక, ఆధునీక సదుపాయాలు కలుగచేయాలి. మచ్చుక్కి - ఆర్మీ లాగా వస్తువులని చౌకగా అందజేయాలి. వారి కుటుంభ సభులకి కాలేజీల్లో కొంత reservation లాంతికి ఇవ్వాలి. ఇలాంటివి అన్నమాట.

------
నేను రాసినవి నాకు తోచిన కొన్ని అంశాలు మాత్రమే. ఒక్కసారి అనుకోవాలే కాని మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక స్వణాంధ్రగా ఒక హరితాంధ్రగా తీర్చిదిద్దగలం!

పై చెప్పినవి సులభం అని నేను అనడం లేదు భావించడమూ లేదు. కాని పోయినదాని గురించి బాధపడుతూ ఉండటం కంటే ఉన్నదాన్ని ఎలా అభ్యుదయ పరచాలో ఆలోచిస్తే ఉత్తమం అని నా అభిప్రాయం. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యం ఉన్నటులే శోకాల మడుగున దాగి శుఖమున్నదిలే...

0 comments:

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP