Wednesday, April 29, 2009

కుడి ఏడమైతే..

పొరబాటు ఉందోయి. పెద్ద పొరబాటు. ప్రొదున్న ఉద్యోగానికి వేళ్ళేటప్పుడు ఆ తొందరలో ఆ చిరాకు లో కుడు ఏడమ చాలా పెద్ద తేడా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అమేరికా లో ట్రాఫిక్ కొంచం మన దేశం కంటే పద్ధాతిగా ఉంటుంది.. అందుకే ఎడమ లో ఉండే సివరాఖరి బిట్టు ని కొంచం వేగం గా వేళ్ళే వాళ్ళకి కేటాయించారు. హైదరాబాదు లో అయ్యింటే యే సందుల్లోనో పాకల మధ్యలో నుండో ఆర్.టీ.సీ బస్సు కింద నుండో పైనుండో డేక్కుంటూ పాక్కుంటూ రద్ది నీ దాటచ్చు. (ఇది ఒక 10+ సంవత్సరాలు హైదరబాదు రద్దిలో నడిపీ నడిపీ తెలుస్కున్న కిటుకుల వలన.) వన్-వే లో వెళ్తూ పోలీసు పట్టుకుంటే సుధాకర్ సుధాకర్.. ఇదిగో జేస్ట్ ఇప్పుడే చాలా రోజుల తర్వత హైదరబాదు కి వచ్చాను అనో లేకుంటే సార్ చదువుకునే పిల్లలం సార్ మా కాడ ఏముంటది చాయి కి చిల్లర తప్ప అనో బుకాయించి తప్పించుకోవచ్చు రద్ది నీ పోలీసు ని. కాని ఈ అమేరికా లో ఇది చాలా కష్టం. పద్ధతి కొంచం ఎక్కువ. చస్..

ప్రొదున 20 మైళ్ళ దూరం ఉండే ఆఫీసుకి బయలదేరా. మామూలుగా అయితే అంటే జనసంచారం మహేష్ బాబు-త్రివిక్రం-అనుష్కాపాప కొత్త చిత్రం విడుదల రోజు లా కాకుండా "ఈ అబ్బయి చాలా మంచోడు" సినెమా హీరో కొత్త చిత్రం విడుదల రోజు లా ఉంటే 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. కాని ఈ రోజు పెద్ద తుఫాను వచ్చినట్టు వార్తల్లో చూడ్డం మరిచా. తుఫాను అంటే అదేదో కట్రినా నో మొన్నామధ్యలో బాంగ్లదేశం లో వచ్చినా నగీనా (పేరు ఇలాంటిదే ఎదో ఉండాలి మరిచా) లాంటిది కాదు సుమీ.. మే లో మద్రాస్ లో పడే వానా లాంటిది అన్నమాట.. దానికి ఎదురుగా సునామి వచ్చినట్టు జనాలు మెల్లిగా అతి మెల్లిగా మరీ మెల్లిగా అతివీరభయంకర మెల్లిగా వేళ్ళడం మొదలెట్టారు. సివరాఖరి "వేగ లేను" లో కూడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాశం తో 55 స్పేడు లిమిట్ లో 35 లో వెళ్ళడం మొదలెట్టారు. అలా నా 30 నిమిషాల ప్రయాణం ఒక గంటన్నర కి చేరింది. అ వెళ్ళే 35 యెం.పీ.ఎచ్. ఆ మూల కుడి వైపు వెళ్ళచ్చు కద? అదేదో 90 లో నడుపుతున్నట్టు నా లేను పట్టేయడం అవసరమా?

ముందే వర్షం వళ్ళ చిరాకు, దానికి తోడు ఈ స్పీడు మనుషులు నాకు బీ.పీ భయంకరంగా పెరుగుతునుది. road rage అనేది ఎందువళ్ళ వచ్చిందో మా ఊర్లో 66-495 మీద ఒక నెల నడిపితే అర్థమైపోతుంది. నేను అదేదో గొప్పగా నడుపుతా అని చెప్పడం లేదు.. కాని 55 జోను లో ఓ 70-75 కొడతా.. 35 లో ఓ 45-50. పాము లాగా మధ్యలో అటూ ఇటూ వెళ్తా. ఏం చేయను? అటు ఫాస్టు లేను లోను ఇటు స్లో లేను లోనూ ఒకటే వేగం లో వెళ్తే నా లాంటి వళ్ళు మరి ఎక్కడ నడపాలి బండి ని?

అందుచేత నేను చెప్పోచ్చేది ఏంటంటే - మీరు ఎడమ లేను లో 55 లో 50 లో వెళ్తూంటే నేను కట్ చేస్తే ఏమి అనుకోకండి. tailgate చేస్తే కూడా ఏమి అనుకోకండి. అప్పుడప్పుడు మెంటల్ ఎక్కువై హార్ను చేస్తే కూడా ఏమీ అనుకోకండి. వీళైతే నాకంటే వేగంగా వెళ్ళండి. come on.. you can do it. Let's make this world a faster place to live in...

Read more...

Wednesday, April 22, 2009

విశ్వ దర్శిని - ఈ వారం నేను చదివిన వార్తలు.

అంటే కేవలం ఇవే కావనుకోండి. రోజు చదివే వార్తల్లో ఇవి కొంచం మంచిగా,వరైటీగా అనిపించాయి. ఇంక ఆలస్యం యేలా?

అంటార్టికా లో ఒక చోట, భూమికి 400 మీ కింద, గాలి కూడా లేని ప్రదేశం లో కొన్ని లక్షల సంవత్సరాల నుండి కొన్ని microbes జీవిస్తున్నాయి అట. ఈ క్రిమికీటకాలు మన ప్రాణ వాయువికి బదులుగా సల్ఫర్ ని, ఇనుము ని "పీల్చుకుంటాయట". ఇన్ని సంవత్సరాలు నిపుణులు అంతరిక్షం లో మన భూమి లాంటి గ్రహాల కోసం వెతుకేవాళ్ళు. అంటే నీరు, గాలి, వెలుతురు - ఇవి జీవనానికి అత్యంత ఆవశక్యమైనవని ఇన్నేళ్ళు నమ్మారు.. కాని అసలు ఇవేమి లేకుండా కేవలం సల్ఫర్ మీద బ్రతికే ఇలాంటి జీవులని చూసాక ఆ అభిప్రాయం మార్చుకోక తప్పదు. మార్స్ యొక్క ఎరుపు దీనివళ్ళేనేమో! ఏది ఏమైన వీటిని కన్నుకోవడం వలన ఈ అంతరిక్షం లో మనమ్మొక్కరమే లేము అన్నది వాస్తవమ్మే రోజు దగ్గర్లో ఉన్నట్టే ఉంది.

జావా ని కనుక్కొని ఎన్నో లక్షల ప్రోగ్రామర్లకి ఆరాధ్యంగా నిలిచిన SUN Microsystems ని Oracle కొనుక్కునే యత్నం చేస్తోంది. గత యేడది సన్ MySql ని ఒక్క బిల్లియన్ డాల్లర్లకి కొనుకున్నది. ఓరకల్ కి mysql కొంచం గట్టి పోటినిచ్చేది. ఆ మధ్యకాలం లో ఓరకల్ BEA ని కూడా కొన్నుకోవడం తో అటు middleware సాఫ్ట్వేర్ ని ఇటు database ని గట్టిపరుచుకుంది. జావా ని కొన్నుకోవడం తో అన్ని ఓరకల్ గుప్పెట్లోకి వచ్చినట్టే. దీని వల్ల జావా, mysql పై ప్రభావం ఎల ఉంటుందో మరి.

ఆ మధ్యలో డెరివేటివ్ల గురించి రాసాను. వాటి మీద ఇంకొన్ని వార్తలు. ఒక వార్త ప్రకారం, ఈ డెరివేటివ్ మార్కెట్ మొత్తం "విలువ" 64 ట్రిల్లియన్ డాల్లర్లట!! మన ప్రపంచ జీ.డీ.పీ విలువ కేవలం 56 ట్రిల్లియన్లు మాత్రమే. దీన్ని బట్టి అంచనా వేయచ్చు అసలు ఈ డెర్వేటివ్లని వారెన్ బఫ్ఫెట్ ఎందుకు financial weapons of mass destruction అని అన్నారో.

1963 నుండి 1998 వరకు వచ్చిన భూకంపలన్నంటిని ఒక చిత్రపటం పై వేస్తే ఇల ఉంటుంది. ప్రతి యొక్క tectonic plate ని చక్కగ గుర్తుపట్టచు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వత మన భారతఖండం యురేశియా ప్లేటు కిందికి వెళ్ళిపోతుంది.

మొన్సాంటో ని జెర్మనీ బహిష్కరించింది అట. ప్రపంచంలోకల్ల అతి నీచమైన కంపనీల్లో ఈ మొన్సాంటో ఒకటి. వాళ్ళు చేసే చెండాలపు పనుల గురించి చెప్పలంటే దానికే ఒక టపా రాయాలి. మరికొన్ని వార్తల్తో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.

Read more...

Thursday, April 16, 2009

ఆకాశమంతా - just భరించగలిగేంత.

శంకారాభరణం, స్వర్ణకమలం, గోదావరి, గమ్యం ఇత్యాది సినిమాలు నచ్చడ్డం వలన నేను "క్లాసో" విజేంద్ర వర్మా, టైగర్ హరిస్చంద్రప్రసాద్, చిత్రం భలారే విచిత్రం, లేడిస్ టైలర్ లాంటి సినిమాలు నచ్చడ్డం వలన "మాసో" ఇంతదాకా అర్థం కాలేదు నాకు. బహుశా నాలాగా అందరూ అనుకుంటారేమో తెలేదు మరి. ఏ సోదంత ఎందుకురా అంటారా.. నిన్నా అంటే రెండు రోజులు పట్టింది లేండి .. ఆకాశమంతా చూసేసరికి. కొంతమంది ఇది చాలా క్లాస్ మూవీ నీకు నచ్చుద్ది అన్నరు.. ఇంకొంతమంది మామా ఇది మనకి ఎక్కదురా అన్నారు. సరే రజనీ, మాధురీ దీక్షీత్, జాకీ ష్రాఫ్ నటించిన "శంకర్" చిత్రం ఇప్పటికి ఒక 20 సార్లు చూసినవాడికి ఇదో లెక్క అని చూసా.

ఏంటో.. పరమ వరైటిగా అనిపించింది చిత్రం. ఒక్కర్తే కూతురు ఉంటే ఇలా ఉంటదా అని అనుమానం వచ్చింది కూడా. వెంట్టనే మా అక్క కి కాలా.. అక్కా నువ్వు ఒక్కర్తే కద ఇలా ఇలా ఉంటదా అని.. తనేమో ఇలా ఎగెస్ట్రాలు చేసింటే తనకి దెబ్బలి పడేవని, అలనే వాళ్ళ నానా అలా (సినెమా లో లా) చేసింటే ఎప్పుడో ఇంటి నుండి పారిపోయేదని చెప్పింది. అప్పుడు కొంచం కుదుటబడ్డ. ఇది నా అభిప్రాయం మాత్రమే. బహుశా అలాంటి తండ్రులు ఉన్నరేమో.. సినెమా లో ప్రకాష్ రాజ్ కి జూనియర్ వర్షన్ నేను చూశా / చూస్తూనే ఉన్నా. (ఎవరు అనేది ఇక్కడ చెప్పలేను .. స్వారీ) కానీ సినెమా లో లాగా "అంతా కూతురిమయం" ఎప్పుడు చూడలేదు.

ఒక్కరే ఉంటే అంటే ఒక్కర్తే అమ్మయి అయినా, ఒక్కడే అబ్బయి అయినా చాలా గారాబం అని ఒక అపనమ్మకం ఉంది ప్రజల్లో. అపనమ్మకం అని ఎందుకు అన్ననంటే నేను ఒక్కడినే కాని మా అమ్మ నానాలు నేను అడిగిన వెంట్టనే ఏది ఇవ్వలేదు. పైపెచ్చు ఇంట్లో అటు అమ్మయి కోటా పనులు ఇటు అబ్బయి కోటా పనులు చేయాల్సి వచ్చేది (మచ్చుక్కి - ఇళ్ళు చిమ్మి, ముగ్గు పెట్టడం మొదలు గంజ్ కి వెళ్ళి నెలకి సరిపడ సరుకులు తేవడం గట్ర వరకు అన్నమాట) చేయాల్సి వచ్చేది / చేయాల్సి వస్తోంది. సో.. ఎవ్వరాఇనా "త్రిషా ఒక్కర్తే అమ్మయి కద అందుకే అంత గారాభంగా పెరిగింది అంటే నేను ఒప్పుకోను"..

ఇంతకీ కథ ఏంటంటే - ఒక్కర్తే అమ్మయి ఉన్న తల్లిదండ్రుల కథ అన్నమాట. ఒక కూతురికి తన తండ్రికి మధ్యలో ఉండే మనోభావాలు. కొంచం గరం మసాలా, ఉప్పు, కారం, చింతపండు, మామిడి తొక్కు, కొబ్బెర పచ్చడి, టమాట పప్పు వేసి తయారు చేసింది. అంత వరైటీ తగ్గించింటే నచ్చేదేమో కాని ఇన్ని కలిపే సరికి టేస్ట్ మరోలా తయారయ్యింది. ప్రకాష్ రాజ్ కొన్ని చోట్ల అతిగా కొన్ని చోట్ల మామూల్గా చేసాడు. త్రిష కి పెద్దగా రోలు లేదు. ఐశ్వర్యా తల్లిగా బానే చేసింది. మిగితా వాళ్ళందరు లైట్.

సినెమా ఒక 30% నిజానికి దగ్గర్లో ఉందని ఖచితంగా చెప్పగలను. అంతకు మించి ఏమీ లేదు. చిత్రం భలారే విచిత్రం చూసి చూసి బోరు కొడితే ఇది చూడండి.. చూసాకా మళ్ళా చిత్రం భలారే విచిత్రం చూడచ్చు.

Read more...

Saturday, April 11, 2009

ఆదాబ్ హైదరాబాద్

హైదరాబాదు... ఆ పేరు వినగానే ఎదలోతుల్లో నిక్షిప్తమైన ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు అలా వరదలొచ్చిన గోదావరిలా గండిపేట్ కట్టకమునుపు మూసీ నదిలా తన్నుకుంటూ బాదుకుంటూ వస్తాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సొంత ఊరు గుర్తొస్తే ఇలానే ఉంటుంది అనుకుంటా. పుట్టి పెరిగి తిని గల్లి గల్లి (మించు ఇంచుగా) తిరిగిన నా సొంత ఊరూ కాబట్టి హైదరబాదు అంటే కొంచం... చాలా ఎక్కువ ఆప్యాయత. నేను మా ఇంటిని వదిలి వెళ్ళడానికి బాధ పడలేదు.. నా సిటీ ని వదిలి వచ్చెనందుకు బాధ పడతా. ఇప్పటికీ అంతే. ఊరుని మిస్స్ అవ్వమ్ము అక్కడ మన స్నేహితలని మిస్స్ అవుతాము అని మొదట్లో చాలా మంది చెప్తే .. ఓహో బహుశా ఇది నిజమేమో అనుకున్న. కాని కాదని తర్వత తర్వత తెలుసుకున్నా. ఇప్పటికీ ఐ మిస్స్ మై సిటి.

ప్రొదున్న నానా దగ్గర "చదువుకో" అనో, "ఇంత టైం అయినా లేవడు" (అప్పుడు టైం ఉదయం 6:15) అనో తిట్లు తప్పించుకోవడం కోసం, 6 కే లేచి ఓస్మానియా లో జాగ్గింగ్ చేయడం మిస్స్ ఔతా. హిల్టన్ దగ్గర బండి పెట్టేసి అక్కడ నుండి ఆర్ట్స్ భవనం వరకు వెళ్ళి తిరిగి జాగ్గింగ్ చేస్తూ వచ్చి చేసిన వ్యాయామం కి సరిపడ చాయి, ఓస్మానియా బిస్కెట్లు తిని తాపిగ యే 8 కో అల ఇంటికి రావడం మిస్స్ ఔతా. ఆంధ్ర యువతి మండలి, శివం రోడ్డు పై ఆ సమయానికే ఉండే "అందాలని" చూడ్డం మిస్స్ ఔతా (ఇది ఇంక ఇప్పుడు సాధ్యం కాదేమో.. but still... ;-) )

హిల్టన్ లో ఖాతా, గంగా హాస్టల్ ఎదురుగా సత్తర్ డబ్బా దగ్గర ఖాతా, మా కాలేజి క్యాంటీన్ లో ఖాతా, బస్స్ స్టాప్ దగ్గర యాదవ్ డబ్బా లో ఖాతా - అబ్బో ఇంకా దిల్షుక్ నగర్ లో ఒకటి రెండు చోట్ల ఖాతా ఇలా ప్రతి నెల 20-22 కి మొదలైయ్యేది. మళ్ళా నానా పాకెట్ మనీ ఇచ్చాకో మరి ఎక్కువగా విసిగిస్తే ఒక టెక్స్ట్ బుక్కు అమ్మాకో తీర్చడం. తార్నాకా జంక్షన్ దాటాక ఒక అమ్మయిల కాలేజి (పేరు గుర్తు రావడం లేదు) ముందు ఉన్న పానీ పూరి డబ్బ, సికందరాబాద్ లో స్వప్నలోక్ ముందు ఉన్న పాని పూరి డబ్బ, తిలక్ నగర్ లో ఒక పాని పూరి డబ్బ లో తినడం. ఒక సారి (అంటే ఇది రెండు రూపైయిలకి ఐదు పాని పూరి రోజులు) నేను మా నాగ్ గాడు కలిసి తిలక్ నగర్ లోని బండి (అది షాపు అనుకోండి) వాడి దగ్గర 26 రూపైయిల పానీ పూరి తిన్నాం!! ఇంటికి వెళ్ళాక అమ్మ పెట్టిన టిఫినూ తిన్నాం అనుకోండి అది వేరే విషయం. లకిడి-కా-పూల్ లోని ధనలక్ష్మీ మెస్స్ లో 23 ఫుల్ మీల్స్ ఉండేది. అక్కడికి వెల్తే మరి ఒక గంట గంటన్నర తినేవాళ్ళం.

ఇక్కడ ఒక సంఘటన - మెహదీపట్నం లో స్వాతి టిఫిన్స్ అని ఉంది. అక్కడ ఐదు రూపాయిలకి ప్లేట్ ఇడ్లీ ఉండేది. మేము అంటే ఒక 8 మంది వెళ్ళాం, ప్లేట్ ఇడ్లి కి 2-3 సాంబార్, 2-3 చట్నీ లాగించాం.. మరి వాడేమనుకున్నాడో ఎమో మరో సారి వెళ్తే ఎకెస్ట్రా సాంబార్ కి 1 రుపాయి అని పెట్టాడు. ఇలా అయితే మేము దివాలా ఐపోతాము అని, సగం ఖాలి అయిన సాంబార్ గిన్నే తీసుకు వెళ్ళేవాళ్ళం .. అప్పుడు దానికి వాడు చార్జి చేయలేడు కద. పాపాం ఒక వారం తర్వత ఆ ఎక్స్ట్రా చార్జీ తీసేసాడు. ఇలా ఎన్నో ఎన్నో విషయాలు గుర్స్తోస్తాయి.

కొయి లౌటా దె మెరె భీతే హుయే దిన్...

మళ్ళి కలిసే వరకు - ఆదాబ్ హైదరాబాద్.

Read more...

Thursday, April 9, 2009

ఎకానమి -3 : డెరివేటివ్స్ & CDOs

ఈ CDO లు లను ఐ-బ్యాంకులు ఎంచక్క అమ్ముకుంటున్నాయి. ఇదే పథం లో అతి పెద్ద ఐదు ఐ-బ్యాంకుల్లో ఒకటైన జె.పీ. మార్గన్ చేస్ (జె.పీ) లో కొందరికి ఒక మహత్తరమైన ఆలోచన మొలిచింది. ఆ ఆలోచనా ప్రతిరూపమే CDS. మామూలుగా, అంటే నిజ జీవితం లో అన్నమాట, మనం ఏదైన వస్తువు (ఉ|| మిక్సీ అనుకుందాం) కొంటే, అది ఎక్కడ పాడైపోతుందో అని కొన్ని సార్లు ఇన్సూరెన్సె కొంటాం. ఆ ఇన్సూరెన్సె మనం కొన్న వస్తువుకి వర్తిస్తుంది. ఔన? ఈ CDS కూడా మించు ఇంచు అలాంటిదే!!

CDS అనగా Credit Default Swaps. ఈ సి.డి.ఎస్ ఎలా పనిచేస్తుందంటే - మన ఇందాకటి ఉదాహరణ లో ఆ మిక్సీ మీద కద ఇన్సూరెన్సె తీసుకున్నది. ఇప్పుడు ఆ మిక్సీ పాడైపోదు అని నమ్మి ఇంకొకళ్ళు దాని మీద పందెం కాసారనుకుందాం. ఆ పందెం ని ఇన్సూరె చేసే ప్రక్రియే సి.డి.ఎస్!! అర్థం కాలేదా? అర్థం అయితే ఇంతదాకా వచ్చేది కాదంటారా? అది ఒకంతుకు నిజమే లేండి. (నిజం చెప్పండి.. ఇది కనక అర్థం అయితే మీకు derivatives market లో ఉజ్వల భవిషత్తు ఉన్నట్టే.) ఈ సి.డి.ఎస్ ఎల పని చేస్తుంది అని మన గురుమావయ్య కూడా చెప్పారు. ఐనా అర్థం కాలేదా? అంతే లేండి. వారెన్ బఫ్ఫెట్ కే బోధపడలేదు - మిమ్మల్ని కించ పరచడం లేదు సుమి. అన్ని వేల కోట్లు షేర్ మార్కెట్ లో సంపాదించిన అటువంటి వ్యక్తికే అర్థం కాదంటే మనకి కొంచం కష్టం కద.

పోని ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక పుస్తకం ఉందనుకుందాం. అది అసలు వస్తువు. ఓకే నా? ఇప్పుడు ఆ పుస్తకా ప్రతిబింబాన్ని అమ్మామనుకోండి.. అది షేర్. అంటే స్టాక్ సర్టిఫికేట్ అన్నమాట (పుస్తకాన్ని కంపనీ అనుకుంటే, కంపనీ లో ఒక భాగం ఒక షేర్) ఇంతదాకా అర్థం అయ్యింది కద. ఇప్పుడు ఆ అద్దన్నికి ఎదురుగా ఇంకొక అద్దం పెట్టం అనుకోండి. అంటే ప్రతిబింబం యొక్క ప్రతిబింబం దాన్ని అమ్మితే.. అది derivative అన్నమాట. ఇల ఒక 10,000 అద్దాలు పెట్టుకుంటు పోయి ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని అమ్మితే అది derivatives market!!!! అందులోని ప్రతి ప్రతిబింబాన్ని ఇన్సూర్ చేసేది సి.డి.ఎస్. ఇలా ఇన్సూర్ చేసిన కంపనీల్లో ఒకటి ఏ.ఐ.జి. (AIG. )మధ్యలో యే ఒక్క అద్దం పాడైనా, ప్రతిబింబం సరిగ్గ అగుపడకపోయినా మిగితావన్ని ఢమాల్!! అదే జరిగింది A.I.G విషయం లో.

ఇప్పుడు చెప్పండి బాగా అర్థం అయ్యిందా? ఇలా వేల వేల ప్రతిబింబాల్లో యే ఒక్కటి కూడా చెక్కు చెదరదు అని అతి వీర భయంకరమైన లెక్కలేసారు. ఇక్కడ ప్రతిబింబాలకి బదులుగా, CDOs, CDS అని భావించాలి. వీటిల్లో చాల మటుకు మార్టగేజులే కద ఉండేవి. అలా ఒక్కో సీ.డె.ఓ లో ఉన్నా మార్టగేజులు ఆధారంగా లెక్కలు వేసేవాళ్ళు. అంటే కొంతమంది గణిత శస్త్రం లో తోపులైన భారతీయులని అల పిలిచి ఇవి ఫేల్ అయ్యే probability లెక్కగట్టమనే వాళ్ళట, ఐ-బ్యాంకుల్లో!!! ఈ లెక్కలంటికి ఆధారం ఒక్కటే - ఇంటి ధరలు ఎప్పటికీ ఎప్పటెప్పటికి పదివేల సంవత్సరాలకి, కలియుగాంతం వరకి ఇలనే ప్రతియేడు పెరుగుతునే ఉంటాయి అని భావించడం. అసలు ఈ rise of home prices ఒక్కే ఒక్క దిశగా సాగుతుంది అన్ని నమ్మివేసిన లెక్కలు మరి ఎల ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం.

ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఈ derivatives market మిద అసలంటు నిఘ లేకుండా చూడ్డం మరో ఎత్తు. దీనికి కారణం 2000 లో వచ్చిన ఒక చట్టం. దాన్నే Commodity Futures Modernization Act of 2000 అని అంటారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ల్ క్లింటన్ దీన్ని అమల్లోకి తెచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ హౌసింగ్ బూం (housing boom) కి పునాది గురించి కూడా చెప్పుకోవాలి. అది మరుసటి టపాలో. అంత వరకు..

Read more...

Monday, April 6, 2009

నా కోసం..

తొలిసంధ్య తొలకరి తళుకువినీవే,
అణువేణు ఆలోచనల ఆధారంనీవే,
ఊసులాడే ఊహల ఉవాచనీవే,
పలవరించే పదాల పెన్నిధినీవే,
అహమొందు ఆనందాల ఆకృతినీవే,
మదికోరే మృదు మిథునంనీవే,
డెందమున దివ్య ధ్యానమైనావే,
కలకాలం కరచలనం కోరుచున్నానే..

Read more...

Sunday, April 5, 2009

ఏకానమి - 2 : ఒక "మేధావి" ఆలోచన (CDOs)

ఎకానమి ఇల అవ్వకముందు తాతకముందు అంటే కేవలం ఒక్క సంవత్సరం ముందన్నమాట అనూష్కాలా అందంగా ఉన్నప్పటిమాట ఇది. ఆ రోజుల్లో ఇప్పటిలాకాకుండా "ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్"లు ఉండేవి. వీటికి మన వీధి చివర్ల్లోని బ్యాంకులకి కొంచం తేడ ఉంది. వీధి చివర్ల్లోని బ్యాంకులని ముచ్చటగా "కమర్షియల్ బ్యాంక్"లని కూడా అంటారు. అంటే వీళ్ళేమో మన డబ్బులని చెకింగో సేవింగో యకౌంట్ల రూపంలో తీసుకొని వాటి మీద పరమ చెత్త వడ్డిలు ఇస్తారు (అంటే చెకింగ్ యకౌంట్ మీద 1% వడ్డి, సేవింగ్ యకౌంట్ మీద 3-5% వడ్డి) మనం దాచుకున్న డబ్బుని పద్ధతిగా అప్పులు తిరిగిచ్చే వాళ్ళనే ఎంచుకొని మరీ అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇదిలా ఉండగా ఇంటిపేరు తప్ప ఇంక ఏమీ సంబంధం లేని "ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్"లు (ఐ-బ్యాంకులు) విపరీతమైన వడ్డిలతో బోలెడన్ని రిస్కులతో నడిచేవి. కంపనీలకి డబ్బు అవసరం వస్తే వాటి షేర్లు అమ్మిపెట్టేదానికి ఈ ఐ-బ్యాంకుల సహాయం తీసుకునేవి. అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు మధ్యవర్తి లాంటివి.. కంపనీల షేర్లు కొనేదానికి మంచి పార్టీ ని అలగే కంపనీలకి కొంచం ఎక్కువ డబ్బు ఒచ్చేట్టు చూసేవాళ్ళు. (ఐ-బ్యాంకులు ఇంకా చాలా పనులు కూడా చేస్తారు.. అందులో ప్రథమంగా ఇది).

1929 లో ఒచ్చిన "గ్రేట్ డిప్రెషన్" మూలానా ఆ రోజుల్లో అంటే 1933-35 ప్రాంతం లో ఒక చట్టం ప్రవేసపెట్టారు. దాన్నే "Glass-Steagall Act of 1933" అంటారు. దానివలన కమర్షియల్ బ్యాంకులు ఈ ఇన్వెస్ట్మెంత్ బ్యాంకుల పని చేయగలిగేవి కాదు. కమర్షియల్ బ్యాంకులపై చాల గట్టి నిబంధనలు ఉండేవి. ఈ చట్టాన్ని 1999 లో మార్చారు.. ఈ రోజు ఉన్న పరిస్థికి ఆ చట్టాన్ని రద్దుచేయడం కూడా ఒక కారణమే! ఆ విషయాలు మరో టపాలో చూద్దం.

అసలు విషయానికి వస్తే 80లో మాట ఇది. "Drexel Burnham Lambert" అనే బ్యాంక్ లో ఒక రోజు ఏమీ తోచక ఒక మేనేజరు మధ్యానం భోజనం చేసి ఇంట్లో పోరు ఆఫీసులో తన మేనేజరు పోరు పడలేక ఎదో ఒకటి చేద్దం అని నిర్ణయించుకుని, తన టీము ని పిలిచి "బాబులు మీరేం చేస్తారో నాకు తెలేదు కాని ఇక నుండి మన టీము మన కంపనీకే అత్యధిక సంపాదన తెచ్చిపెట్టలి. లేకుంటే మీకు ఊస్టింగే" అని సగటు మేనేజర్లలాగా గోల గోల చేసాడు. ఏం చేయాల్రా దేవుడా అని ఆ టీము సభ్యులు ఆలోచించగా ఒకడి పుర్రెలో ఒక మహత్తరమైన ఆలోచన మొలిచింది. "మన దగ్గర జనాల ఇళ్ళు, కంపనీలు, చదువులు గట్ర కి ఇచ్చిన అప్పులు ఉన్నాయి.. వాటిని అలానే ఉంచితే ప్రతి నెల వాళ్ళు కట్టే వడ్డి తప్ప ఏమి లాభం ఉండడం లేదు.. అన్నింటిని కొంచం కొంచం కలిపి ఒక డబ్బలో పెట్టీ వేరేవాళ్ళకి అమ్మేస్తే" ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. దాన్నే "Asset backed security" అని నామకరణం చేసాడు... అల అనడం కన్న కొంచం రొమాంటిక్ పేరు పెడదాం అని వాటినే "Collateralized debt obligations (CDOs)" అని పిలిచాడు.

అసలు ఇవి ఎలా పని చేస్తాయంటే ఉదాహరణకి ఒక కంపనీ - 50 మంది మంచి క్రెడిట్ ఉన్నవాళ్ళకి ఇంటికి లోనులు ఇచ్చయి అనుకుందాం. అలనే ఇంకొక 40 మంది ఎదో కొంచం మంచి క్రెడిట్ ఉన్నవాళ్ళకి ఇచ్చింది అనుకుందాం. ఇంకొక 10 క్రెడిట్ అస్సలుబాగోలేని అంటే నమ్మలేని వాళ్ళన్నమాట మన విజగశాంతి లాగన్నమాట ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ మంచి క్రెడిట్ కాకుండా మిగిలిన వాళ్ళ అప్పులని వేరే బ్యాంకులని, ఇన్వెస్టర్లకి అమ్మడం ఎలా? అందుకే ఒక రెండు డబ్బాలు తయారు చేసింది ఆ అప్పులిచ్చిన బ్యాంక్. ప్రతి డబ్బలో 25 మంచివి, 20 మాములువి, 5 చెత్తవి వేసి రేటింగ్ ఏజెన్సీ కి పంపింది. అప్పటి వాళ్ళ లెక్కలు ప్రకారం ప్రతి డబ్బ రిస్కు చాలా తక్కువ (5 ఏ చెత్తవి కద) కాబట్టి AAA రేటింగ్ ఇచ్చేసేవి. ఇప్పుడు అప్పులిచ్చిన బ్యాంక్ వీటిని వేరే బ్యాంకులకి, ఇన్వెస్టర్లకి హాయిగా అమ్మేయచ్చు. అక్కడ మొదలైంది అసలు కథ. మొదట్లో రొమాన్స్సు బానే ఉన్నా తర్వత తర్వత నువ్వు నేను లో తెలంగాణా శకుంతల లా విశ్వరూపం చూపించాయి.

వచ్చేటపలో ఇంకొక మేధావి ఆలోచన ఫలం (credit default swap (CDS)) గురించి చెప్తా. అంతవరకు శెలవు.

Read more...

Friday, April 3, 2009

ఎకానమి -1: ఇంకా జరగాల్సింది ఉంది.

అంటే ఎకానమి గురించి చెబుతున్నా. అసలు సమస్యని మూడు భాగాలుగా విభజిస్తే అందులో sub prime ఒక్క భాగము మాత్రమే. మిగిలిన రెండు Alt A, ARM మరియు credit cards గా భావించచ్చు. ఇంకా ఒక్కటే అయ్యింది.. రెండు మిగిలి ఉన్నాయి అనిపిస్తోంది. Alt A గురించి చాలా తక్కువ మంది వినిఉంటారు. ఎందుకంటే ఇది సుబ్-ప్రైం అంత సత్తా లేకపోయినా ఎదో దానికి చేతనైనంత పంజా విసురుతుంది. Alt A అనగా Alternate prime -A అని అర్థం. ఇవి అటు sub prime కి ఇటు రెగులర్ ప్రైం లోన్లకి మధ్యలోనివి. క్రెడిట్ క్రైసిస్ లేకపోయింటే వీటితో ఇంత కష్టం నష్టం వచ్చేవి కాదు.. ఎందుకంటె జన్మతః ఇవి high risk కావు. కానీ సుబ్-ప్రైం వళ్ళ కలిగిన ఈ క్రైసిస్ ములాన వీటి మీద కూడా ప్రభావం పడి... ఇప్పుడు ఈ Alt A లోన్లు గురి తప్పుతున్నాయి. ఈ లోన్ల మీద san francisco chronicle కథనం ఇక్కడ వుంది.

ఇళ్ళాకి సుబ్-ప్రైం లాగానే కార్పొరేట్ రంగానికి కూడా మార్టగేజ్లు ఉంటాయి. ఎకానమి అంతగా బాగోలేకపోవడం వలన గత యేడాది కంపనీలు అంతగా (అంటే మిగిలున్న కంపనీలు) లాభం పొందలేదు. అందువలన వాళ్ళు కార్పొరేట్ లోన్లు కట్టడం తగ్గాయి... వాటి ప్రభావం ప్రతి బ్యాంక్ మీద మళ్ళి పడుతుంది. sub prime part 2 అన్నమాట!! వీటితోబాటు ARM resets కూడా జరగనున్నాయి. ఈ సంవత్సరం రెండవ భాగం లో ఇవి జరగనున్నాయి. ముందే ఉద్యోగాలు లేక డబ్బు సరిపోక అంతంత మాత్రం లో ఉంటున్న వాళ్ళ నెత్తి మీద సిమెట్ట తో కొట్టీనట్టే. ARM అనగా Adjustable Rate Mortagage - అమేరికా లో ఇంటికోసం అప్పు తీసుకునేటప్పుడు ఈ వింత సదుపాయం కూడా ఉంటూంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళు అప్పు తీసుకున్న వడ్డి కి బదులుగా తక్కువ రేట్ తో కట్టచ్చు.. (అలా తగ్గించినట్టుగా అనిపించే డబ్బు "అసలు" లో చేరుతుంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళూ ఇలా ARM తీసుకున్నవాళ్ళు ఇంటి అప్పులో నయ పైసా కూడా తీర్చలేదన్నమాట!! వీటీ మీద pbs లోనూ cbs లోనూ ప్రసారాలు వచ్చాయి. కవాలంటే ఆ లంకెలు ఇక్కడ పెడతా.)

ఈ atl a, arm reset చాలా చిన్నవిగా అనిపిస్తాయి అసలు సిసలైన నాటు బాంబుతో పోలిస్తే.. అదే credit card క్రైసిస్. దాని గురించి, మన బీ.యస్.యీ ఎందుకు పైకి వెళ్తోందో, మన దేశం ఎందుకు కొంచం మెరుగ్గా ఉండచ్చొ ఇవ్వన్ని మరో టపాలో. అంత వరకు happy stock picking...

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP