Friday, December 25, 2009

The Known Universe - మనమొక్కరమే అంటే నమ్మలేను...

నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి అన్నింటిని ఒక చోట పెడితే ఇలా ఉంటుంది..

మధ్యలో భాగం మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఈ ధరణి నుండి పైకో కిందికో చూసి అటువైపు ఉండే నక్షత్రాలని చూడగలము. కాని కుడీ యెడమల్లో చూడలంటే మనకి ఆకాశ గంగ లోని ఇతరనక్షత్రాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు భాగాల్లో ఇంకా మ్యాప్ చేయలేదు. బహుశా ఏదో ఒక రోజు మనము ఆ భాగాలని కూడా ఇంతకంటే సూక్ష్మంగా పరిశీలించచ్చేమో. ఆ రోజుకోసమే చూస్తున్నా.



ఈ వీడియో చూసాక ఎవ్వరికైన అనిపించాలి - మనము ఉండే చోటు ఎంత చిన్నది అంటే it is just not worth fighting over petty things. మనవజాతి అంతా ఒక తాటిపై నిలబడి సమస్త జగతిని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతరిక్షాన్ని అర్థం చేసుకొని వేరే గ్రాహాల మీద ఇంక ఎవరైన ఉన్నరేమో అని వెతికేదానికి సర్వ శక్తుల ప్రయత్నం చేయాలి. అన్ని కోట్ల కోట్ల నక్షత్రాల చుట్టు ఇంకా కోట్ల కోట్ల భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో జీవులు ఉంటారన్నది ఖండించలేని వాస్తవం. ఒక ఊహ ప్రకారం వాళ్ళు ఎంత ముందు ఉండింటారంటే వాళ్ళు పంపే సిగ్నల్స్ మనకి అర్థం కావడం లేదు - ఒక చీమకి మన భాష ఎట్ల అర్థం కాదో అలా అన్నమాట. అది కూడా అయ్యిండచ్చు. చూద్దాం.. ఇంకో ఇరవై యేళ్ళల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ఆ మాత్రం అభివృద్ధి చెందదా? Hopefully someday we will be able to make contact with the others....Hopefully..

Read more...

Tuesday, December 22, 2009

ఒక తెలుగు వాడి క్షోభ.

జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.

దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.

ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?

రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.

Read more...

Saturday, December 19, 2009

అవతార్ - my experience

ప్రతీ యేట కొన్ని వేల చిత్రాలు విడుదతౌతాయి. కాని కొన్ని సంవత్సరాలకి ఒక్క సారి ఓ చిత్రం వస్తుంది.. సినీ చత్రిరనే తిరిగిరాసే చిత్రం. ఒక్కప్పుడు స్టార్ వార్స్ వచ్చింది. (1979 మొదటిది).. ఆ రోజుల్లో అంత ఆధునికంగా తీసిన చిత్రం. తర్వాత తర్వాత ఆ టెక్నాలజి అందరికి అందుబాటలోకి వచ్చి ఇప్పటి తరం వారికి స్టర్ వార్స్ చూపిస్తే ఓస్ ఇంతేనా.. దీనికంటే గొప్ప సినెమాలు చూసాము అని అంటారు. రాముడు భీముడు ఇప్పుడు చూస్తే అలనే ఉంటది.

ప్రపంచ సినీ చరిత్రలో తనకంటు ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న అలాంటి ఒక (వి)చిత్రమే ఈ "అవతార్". సినెమాలు వచ్చాయి. 3D సినెమాలు వచ్చాయి. కాని ఇలాంటి 3D చిత్రం రాలేదు. ఇంకొన్ని సంవత్సరాల్లో బోలేడు వస్తాయి ఇలాంటి సినెమాలు కాని ఇదే ప్రథమం. ఊహని అందని అందాలని అధ్భుతంగా చూపించాడు జేంస్ క్యామరూన్. టర్మినేటర్, ఏలియన్స్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత ..టైటానిక్ లాంటి పరమ సుత్తి చిత్రం తర్వాత 12 యేళ్ళకి ఈ సినెమా తీసాడు. ఈ సినిమ మీద అతడి (+ ఫాక్స్ కూడా) ఖర్చు 1200 కోట్ల రూపాయలు. అంత ఖర్చు పెట్టాడు అని కాదు.. ఖర్చు పెట్టిన ప్రతి పవల కనిపిస్తుంది మూవీ లో. మన వాళ్ళు ఖర్చుపెడతారు.. గజిని ని నలభై కోట్లు అయ్యింది అట.. ఎందుకు అయ్యిందో ఎక్కడ ఖర్చు చేసారో కనిపించదు. అలా కాదు ఈ అవతార్.

కథా పరంగా పెద్దగ చెప్పుకునేదానికి ఏమి లేదు. కాని for some reason I could identify with the story at multiple levels. అంగ్రేజులు రాకమునుపు ఓ తొమ్మిది వేళ సంవత్సరాలు మన దేశం లో మనము ప్రకృతిని చాలా గొప్పగా ఆధారించేవాళ్ళం. ఒక చెట్టు కొట్టేసేమునుపు ఇంకో రెండు నాటేవాళ్ళం. అందుకే చాలా చాలా చాలా అరుదుగా మన దేశం లో కరువు ఉండేది. నీళ్ళని కాని భూమిని కాని విచ్చలవిడిగా ఉపయోగించేవాళ్ళం కాదు.. ఎదైన ఉపయోగించే ముందు ఆలోచించి వాడేవాళ్ళం. అందువలన there was a balance in the environment. ఇలా మనం తొమ్మిదివేల సంవత్సరాలు గడిపాము. కాని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇవన్ని గాలికి వదిలేసి.. ఇదిగో ఇలా తయారయ్యాం. కథ కూడా ఇలాంటిదే.. పండోరా అనే గ్రహం మీద ఉండేవాళ్ళు ఇలానే ప్రకృతి తో అవినాభావంగా ఉంటారు. కాని భూమి నుండి వెళ్ళిన వాళ్ళు ఆ గ్రాహన్ని కూడా స్వార్థం కోసం ఎలా ధ్వంసం చేస్తారో .. అది కథ.

కథ కొంచం సైడ్ కి పెడితే తీసిన విధానం మాత్రం -A W E S O M E !!!! హెలీకాప్టర్లు మొదలుకొని అన్ని 100 years into the future లా ఉంది. తీసిన టెక్నాలజీ కూడా ఓ పదేళ్ళ ముందే వచ్చినట్టు ఉంది. ఆర్థర్ క్లార్క్ ఊహమీద పుట్టినదే జియో-స్టేషనరీ సటిలైట్ (geo-stationary statellite), జూల్స్ వెర్న ఊహే సబ్మరీన్ (సుబ్మరినె).. అలనే జేంస్ క్యమరూన్ ఊహే ఈ రకం చిత్రం అని చెప్పుకోవచ్చు. 3D లోనే చూడాలి మూవి. వీలైతే IMAX 3D లో చూడండి. anything less would be doing injustice to the effort that went into making this movie.

గమనిక: ఇలా నకు నచ్చే చిత్రాలు నాకు నచ్చే విధం గానే మీకు నచ్చాలని రూల్ లేదు. Every movie is a personal experience. నాకు ఇలాంటి technically advanced movies చాలా ఇష్టం.

Read more...

Thursday, December 10, 2009

అనుకోనిదా? కోరుకున్నదా?

తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే బాగున్ను.

దెబ్బకి మిగితా రాష్ట్రం వాళ్ళు కూడా అడగడం మొదలెట్టారు. పైనుండి మొదలుకొని చూస్తే:
1. బెంగాల్ లో గోర్ఖాల్యాండ్
2. బీహార్ + మధ్య ప్రదేశ్ + ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ప్రదేశాలు కలిపి బుందేల్ఖండ్
3. ఉత్తర్ ప్రదేశ్ కొన్ని భాగాలతో హరిత్ ప్రదేశ్
4. గుజరాత్ లో సౌరాష్ట్ర
5. మహరాష్ట్ర లో విధర్బా
6. కర్నాటక లో కూర్గ్
7. తమిళనాడు - ??? వీళ్ళకి వేరు దేశం కావాలేమో మరి.

ఇవి సాధించడం పిచ్చ వీజీ కద. కె సి ఆర్ చూపిన దారి ఉంది కద. ఆయా ప్రదేశాల ఏం.పీ లు ఓ పది రోజులు సలైన్ పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తే చాలు. ఇవ్వన్ని చాలా చాలా యేళ్ళ నుండి అడుగుతున్నవే. ఈ రోజేమి కొత్త కాదు. కాని తెలంగాణా ఇస్తాము అనడం వళ్ళ అన్ని మొదలయ్యాయి.

ఈ పరినామం కాని, ప్రతినిధుల రాజీనామాలు కాని అస్సలు ఊహించనిది కానేకాదు. రాష్ట్రాన్ని విభజిస్తాము అంటే మిగితావాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? It makes perfect sense to the way they reacted. They owe nothing to Telangana.. but everything to Visalandhra. కొందరు వ్రాశారు కేంద్రానికి మంచి షాక్ తగిలింది అని. కాని నాకు అనిపిస్తోంది ఇది వాళ్ళు కోరుకున్నదే అని. అటు మేము తెలంగాణా ఇచ్చేదానికి ఒప్పుకున్నాము కాని ప్రజలు ఒప్పుకోలేదు అని అనవచ్చు. అటు ఇచ్చినట్టు ఉంటుంది ఇటు ఇవ్వనట్టు ఉంటుంది. ఇచ్చారు అని తెలంగాణా ప్రజలు ఆనందిస్తారు ఇవ్వలేదని విశాలాంధ్ర ప్రజలు హర్షితారు. భలే భలే!! నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.

ఒక "మేధావి" అన్న మాటలు - ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ఇప్పుడు తెలంగాణా వస్తే దోచుకున్న సొమ్ము తెలంగాణాలోనే పెడతారట. అందుకే వేరు రాష్ట్రం కావాలి అట. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు - ఇప్పుడు కూడా దోచుకొని కోస్తాలో పెట్టుబడి పెట్టచు కద? తెలంగాణా కి వేరు "రూపాయలు" లేవు కద? కొత్తగా రాష్ట్రం వచ్చినా వాడేది "ఇండియన్ రుపీ" నే కద? తెలంగాణా వస్తే అన్నల రాజ్యం ఎక్కువతుందేమో ఎందుకైన మంచింది అని పూర్వము కంటే ఎక్కువ డబ్బులు వేరే చోట పెట్టుబడి పెట్టడని నమ్మకం ఏంటి? ఆ వేరే చోట వేరు రాష్ట్రం కూడా అవ్వచ్చు కద? ఏంటో ..

ఈ గోల వళ్ళ హైదరాబాదు లో కాని మిగితా రాష్ట్రం లో ఎవైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకున్నవాళ్ళు ఇగ చేయరేమో. దాని వళ్ళ తెలుగువారందరికి నష్టమే. అంత ఆలోచనే ఉంటే ఇదంత ఎందుకు జరుగుద్ది? ఇక ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. . కాని ఈ పరినామం మాత్రం ఊహించనిది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.

Read more...

Tuesday, December 8, 2009

నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. భాగ్యనగర ప్రజా పార్టీ డిమాండ్!!

మొన్న ఆ మధ్య ఎక్కడో చదివా "ఆంద్ర బ్యాంక్" పేరు కొట్టేసి "తెలంగాణా బ్యాంక్" అని రాసారని. అసలు అలా రాయడం లో ఎమైన బుద్ది ఉందా అని నా అనుమానం. ఆ సాతవాహనుడి కాలం కంటే పూర్వమే మన ప్రదేశానికి "ఆంధ్ర" అని పేరుండేది. అశోకుని చరిత్రలో కూడా మన ప్రదేశాన్ని "ఆంద్రా" అనే ఉంది. మన రాష్ట్రం లోని మూడు పెద్ద ప్రదేశాల్లో ఒకటి రాయలసీమ. ఆ మాటకి వస్తే ఓ ఐదొందల యేళ్ళ క్రితం అసలు ప్రస్తుత రాయలసీమ కి ఆ పేరే లేదు. రాయలవారు పరిపాలించేదాకా ఆ సీమ కి పేరే లేదు. (ఉండింటే నాకు తెలీదు). నా ఉద్దేశం ఏంటంటే "ఆంధ్రులు" అంటే కేవలం కోస్తా జిల్లా వారే కాదు అని.

అది అలా ఉండగా.. ఇన్ని యేళ్ళు తెలంగాణా రాకపోవడానికి కారణం.. ఇకపై కూడా అదే వర్తించచ్చు కూడా.. ఒక్కటే.. హైదరాబాదు. అసలంటు 'నా' నగరం తెలంగాణా లో లేకపోయింటే 1969 తెలంగాణా ఉద్యమం అప్పుడే వచ్చేసేది. సపోస్ పర్ సపోస్ మన రాజధాని హైదరాబాదు కాకుండా యే కర్నూలో, బెజవాడో, పలమనేరో అయ్యింటే ఇంత జరిగేది కాదు. ఇది లోక విధితమైన మాటే కద! మా ఊరే లేకుంటే ఇప్పటికి మరో చత్తిస్ ఘడ్ లా, ఉత్తరాంచల్ లా తెలంగాణా కూడా మరో రాష్ట్రం అయ్యిండేది. అందుకే నేను మా పార్టీ బాగా ఆలోచించి.. చించి చించి చించి.. ఆంధ్ర పటాన్ని ఇంకాస్త చించితే అప్పుడే వచ్చింది ఈ ఆలోచన.. తెలంగాణా రావడానికి అడ్డుగా ఉన్నా నా ఊరుని పీకేయండి. నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. ఇదే మా డిమాండ్!

శరత్ లాంటి వాళ్ళ మాటలు వినకండి. అతడు హైదరాబాదు-ద్రోహి. నలగొండ "పులి" ఎమో కాని మా ఊరుకి మాత్రం అన్యాయం తలబెడుతున్నాడు. he has lost all my respect. అసలు ఎవరిని అడిగి ఇలా హైదరాబాదుని వేరు చేయద్దు అని అంటున్నాడు? అసలు మా ఊర్లో ఎప్పుడైన ఉన్నాడా? ఉంటే ఇంటి నంబరు, ఫోను నంబరు, రెజిస్ట్రాషన్ అన్ని చూపించమని డిమాండ్ చేస్తున్నా!!

అలనే మిగితా విషయాలకి వస్తే. మా రాష్ట్రం లో నివసించేదానికి కొన్ని నిబంధనలు పెట్టాము. వాటిలో కొన్ని:

* గ్రేటర్ హైదరాబాదు ఇప్పుడున్న విస్తారానికి ఇంకో ఐదో పదో కిలోమీటర్లు అన్ని వైపులా జోడిచి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి.

* భాగ్యనరానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise). మిగితా పోస్టులకి కె.బ్లా.స వారు తువాల్లు వేసుకోవచ్చు.

* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం చొంచెస్సిఒన్ ఇస్తాము.

* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "మహా భాగ్యనగరం" లో చోటు లేదు.

* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ గట్రా కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కడితే సరి. అది వేరే విషయం.

* ఓస్మానియా లోని సత్తర్ డబ్బా ని national monument గా డిక్లార్ చేయాలి.

మా రాష్ట్రాన్ని మేము దక్కించుకుంటాం. ఎలాగో మన శరత్ నిరాహార దీక్ష చేస్తనే ఉన్నాడు. అతని డిమాండ్లతో బాటే ఇది చేర్చే ప్రయత్నం చేస్తున్నా.

జై తెలుగు తల్లి.
జై హైదరబాదు.
జై హైదరబాదు నూతన ముఖ మంత్రి (అంటే నేనే!!)...

సవరణ - ఇందాక నేను "తిట్టేటప్పుడు" శరత్ ఓ టపా రాసేసాడు. పార్టీ లో సిద్ధాంతకర్త పదవి ఇస్తా అంటే ప్లేట్ ఫిరయించి ఇప్పుడు "జై హైదరాబాదు" అంటున్నాడు. అందుములాంగా అతడిని హైదరాబాదు-ద్రోహుల ఖాతా నుండి సగౌరవంగా తొలగించడమైనది. బ్రదర్ welcome to "my" state.

గమనిక: ఇది తెలంగాణా వాదననో వాదులనో కించపరిస్తూ వ్రాసినది కానే కాదు. మీరు అనవసరంగా అపోహలు పెట్టుకోకండి. ఎదో శరత్ టపా చూసి ఉత్తేజితుడనై రాసినది అంతే. రాజకీయ రంగులు పులుముకొని చూడకండి. చూస్తే అది మీ ఇష్టం. నాకు తెలంగాణా, కోస్తా, రాయలసీమ, కర్నాటక కంటే భారతదేశం ముఖ్యం. తర్వాత నా ఊరు ముఖ్యం. నా భాగ్యనగరం యే ఒక్కరి వళ్ళో ఇంత అభివృద్ధి చెందలేదు.. ఎంతో మంది తెలుగు వారు, వెరే రాష్ట్రాల వారు అందరి సమిష్టగా కృషి చేస్తేనే ఈ మాత్రం ఉంది.

Read more...

Wednesday, December 2, 2009

"పులి" నిరాహార దీక్ష జయప్రదం చేయండి!!!

జై తెలంగాణా. జై జై తెలుగు తల్లి.. అర్రెరె మరిచా.. తెలంగాణా తల్లి కద. మరిచే పోయా. ఇంతకి పాపాం ఆ తెలుగు తల్లిని విభజించి తెలంగాణా తల్లి అని మిగితా వాళ్ళ తల్లి అని చేసారు.. ఇప్పుడు ఏక్కడుందో ఏంటో ఆ తల్లి. ఎంతో మంది వారి వారి స్వార్థం.. కేవలం pure unadultrated 100% సుద్దమైన స్వార్థం కోసం తెలంగాణా ఉద్యమాన్ని ఆ సెంటిమెంట్ ని లేవదీసారు. ఆ నాడు చెన్నా రెడ్డి ఐతే ఈ రోజు కె సి ఆర్. రేపు మరొకడు. ఇలా మాకు తెలంగాణా కావాలి కావాలి అని అరిచి రబస చేస్తున్న యే ఒక్కడు నిజంగానే తెలంగాణా అంటూ వస్తే ఎలా అభివృద్ధి పరుస్తారో చెప్పిన ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు మళ్ళా కె సి ఆర్ రూపొందించిన "ప్రణాలిక" ని తె రా స మానిఫెస్టొ ని చూపించేరు!!! అందులో తెలంగాణాని సంపాదించేదానికి ఏం చేస్తారో ఉంది .. ఎలా అభివృద్ధి చేస్తారో లేదు. అంత దూరం ఆలోచించలెదేమో మరి మేధవులు...

బొంబాయి లో మహరాష్ట్రేతరులు ఉండకూడదు అని ఒక మలపత్రాష్టుడు ఓ తొక్కలో ఉద్యమం లేవనెత్తాడూ ఓ నలభై యేళ్ళ క్రితం. ఇప్పుడు అతడి చుట్టం అదే అంటున్నాడు మళ్ళా. ఈ లోపు పాపం అన్యం పున్యం ఎరుగని సచిన్ ని కూడా ఈ పరమ కంపులోకి లాగారు. నాకు తెలీక అడుగుతాను బొంబాయి.. ఇటు హైదరబాదు ఎవడబ్బ జాగీరు అని ఇల అంటున్నారు వీళ్ళు ? అసలు ఈ భూమి అంటే మన ధరణి ఆవిర్భవించినప్పటి నుండి కె సి ఆర్ వాళ్ళు కానివండి అటు మ.న.ని.సే వాళ్ళు కాని ఉన్నరా ఇక్కడే? అల కాదు అంటే వాళ్ళు ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళే. జాతి మీద విభజించుకున్నాం.. తర్వత భాషల మీద.. ఇప్పుడు మాండలీకల మీదా? అంతే లేండి.. every country has leaders it deserves. మనకి కె సి ఆర్, రాజ్ థాకరె నే కరెక్ట్ ఏమో. వీళ్ళని నాయకులు అని అనడం లేదు... ఎంతో మంది జీవితాలతో ఆడుకుంతున్నారు వీళ్ళు. ఆ పాపం ఊరికే పోదు.

దానికి మళ్ళా ఓ నిరాహార దీక్ష.. అదో నాటకం. కాని కాని ఇక్కడే అసలు twist ఉంది. కె సి ఆర్ ఒక్కడేనా నిరాహార దీక్ష చేసేది? ఆ మాత్రం దీక్ష మేమూ చేయగలం అని మనలో ఒకడు ముందుకు వచ్చాడు. అతన్ని మనం అందరం ఉత్సాహ పరచాలి. ముందుకు తోసి.. అదే ముందుంచి వెనకనుండి మనం మన support ఇవ్వాళ్ళి. కె సి ఆర్ లా మధ్యలో విరమించనీయకూడదు. ఎంతో కష్ట సాధ్యమైన అతడి గమ్యాన్ని చేరేదాకా నిరహారదీక్ష చేసేట్టు మనమే చేయాలి. అందునా తోటి కె బ్లా స సభ్యులు ముందుగా మనం మనం మాట్లాడుకోని పులిరాజు ఎటువంటి మంతనాలు జరపకుండ జాగ్రత్త పడాలి. నీమ్మ రసం, చారు, ఇడ్లి, విస్కీ ఇలంటివి ఏది అతనికి ఇవ్వకూడదు... at least గమ్యం చేరే వరకు.

గమ్యం ఏంటి అన్నది ఇంకా ఆలోచిస్తున్నాము. అంత వరకు సమయం ఎందుకులే వృధ చేసేది అని రేపటి నుండే మన పులిరాజుని బరిలోకి దింపే పనిలో ఉన్నాము. రేపటి నుండి అభినవ పొట్టి శ్రీరాములు .. ఉరఫ్ పులిరాజు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించబోతున్నారు. అందరి ఈ మహోనత్త ఉద్యమానికి ఆహ్వానితులే. అందరు పాలు పెరుగు పూరి కూర పంచుకుందాం.. మన పులిరాజుని మాడగొడదాం.. అదే పులిరాజు ఆకాంక్షని తీరుద్దాం. మీరందరు తప్పకుండా వస్తారనే ఆశిస్తూ.... జై పులిరాజు. జై జై పులిరాజు.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP