Wednesday, May 27, 2009

ఇది చాలా హాట్ గురు

ఈ మధ్యలో రోజు కి ఓ పది గంటలు ఇదే వింటున్నా. రేడియో మిర్చి 98.3 FM. అసలు మన దేశం లో ఈ FM revolution వళ్ళ వెలువడిన ఓ మహత్తరమైన స్టేషన్ ఇది, నా దృష్టిలో. ప్రొదున్నే అంటే అదే అమేరికా లో సాయంత్రం టైం లో ఎంచక్క భక్తి గీతాల్తో అనామికా ఉరఫ్ బేబీ శుభోదయం పలుకుతుంది. ఓ రెండు గంటలు అల భక్తి గీతాల తర్వత లొల్లి షురు.

హలో హైదరాబాద్ అంటూ తిక్క మగాడు ఉరఫ్ హేమంత్ మొదలెడతాడు. అదో నాలుగు గంటల కాలక్షేపం. నేను ఎప్పుడు రోజంతా అంటే మన దేశం లో రోజంత వినలేదు. ఎందుకంటే హేమంత్ ప్రోగ్రాం సగం అయ్యేపాటికి నేను నిద్రావస్త లో ఉంటా. తర్వత మళ్ళ అనామిక లేడీస్ కార్నర్ మొదలెడుతుంది. తర్వత బంపర్ టు బంపర్ లో భారతి పాప వస్తుంది. ఓ నాలుగు గంటలు బుర్ర తిన్నాకా భార్గవి వంతు. ఈ టాలివుడ్ భామ బోలెడు విషయాలు చెప్ప్తుంది ఓ రెండు గంటలు. తర్వత డక్టర్ లవ్ ఉరఫ్ సౌమ్య ఇంకో రెండు గంటలు.

ఇలా నాన్-స్టాప్ గోల తో రోజంతా హాయిగ గడిపేయచ్చు. నాకు పని చేస్తున్నప్పుడు పాటలు వినడం అలవాటు. అల వెత్తుకొని వెత్తుకొని వినెబదులు ఈ రేడియో వింటే ఉత్తమం కద.. అందునా సరదా అయిన యాడ్స్ వస్తాయి.. బేబీ - మమ్మీ అనుకుంటు. (ఆ గొంతులు భార్గవి - అనామిక వి).

ప్రవాశాంధ్రులకి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి సొంత ఊరు గుర్తుచేసే ప్రయత్నం అని రాజ్ అంటాడు. కాని ఇది వింటే i miss hyderabad even more. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదే గనక మన కార్ రేడియో లో వస్తె ఎంత బాగున్ను అని. కాని ఏం చేస్తం.. అన్ని రోజులు మనవి కావు కద. అందాకా హాయిగ వినండి. రాడియో మిర్చి.. ఇది చాల హాట్ గురు..

Read more...

Tuesday, May 19, 2009

మిషన్: షాపింగ్

అసలు భూ ప్రపంచం లో అతి బోర్ కొట్టే పనుల్లో ఈ షాపింగ్ ఒకటి. అన్-లైన్ కాదు నడుచుకొని వెళ్ళి కొంటామే అది. నా లిస్ట్ లో బట్టలు మడతపెట్టడం తర్వత వస్తుంది ఇది. అంత బోర్ నాకు షాపింగ్ అంటే. ఒక్క పుస్తకాలు కొనేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇది ఇష్టం ఉండదు నాకు. పుస్తకాలు అంటే అబ్బో అదో సరద నాకు. చిన్నప్పుడు కోఠీ లో, ఆబిడ్స్ లో ప్రతి ఆదివారం పెట్టే పుస్తకాల కొలువు కి వెళ్ళేవాడ్ని. ఓ 3-4 గంటలు తీరిగ్గా వెతికి బేరమాడి నాకు నచ్చేవి నచ్చుతాయి అనుకున్నవి తెచుకునెవాడ్ని. ఇది ప్రతి వారం కాదు.. నాన్న ఇచ్చిన జేబు డబ్బు లో నా "దినసరి" ఖర్చులు పోను మిగిలినవి దాచుకొని రెండొందలో మూడొందలో అయ్యాక వెళ్ళేవాడ్ని. ఇప్పటికి గుర్తొస్తే ఆ రోజులు కొంచం బాధగ కొంచం ఆనందంగా ఉంటది.

కాని నేను మాట్లాడుతున్న షాపింగ్ పుస్తకాలు కాదు.. రోజు వారి చేసేది. మొన్నామధ్య దివ్య వాళ్ళ స్నేహితుడు ఒకడు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండచ్చు కద... పనికిమాలిన రాళ్ళ నుమాయిష్ (అదే జెం షో) ఉందని చెప్పడు. అప్పటికి చెప్పా నువ్వు వాడు వెళ్ళిరండి నన్ను ఒగ్గేయండి అని. ఊ హూ.. నా మాటే వింటే తను దివ్య ఎందుకు అవుద్ది? రారా అని లకలకలక అని నిను వీడని నీడను నేనే... అంటే మరి మరి చివరి పాట కాదు కాని మిగితావి పాడతా అని బెదిరించి లాక్కెళ్ళింది నన్ను. నాకు ముందే బద్దకం. అసలు ఆదివారం (ఎన్.ఎఫ్.ఎల్ అప్పుడు) సోఫా నుండి కదలకుండా అలనే శిలా విగ్రహం లా పడుకొని దినమంతా టీ.వి చూస్తా. అలాంటిది వారాంతం అని కూడా చూడకుండ నన్ను ఆ దిక్కుమాలిన జెం షో కి తీస్కెళ్తె ఎల ఉంటది? ఏం చేస్తాం.. కష్టాలు మనుషులకి కాకుండా మంచు బ్రదర్స్ కి వస్తాయా అని వెళ్ళా. తీరా చూస్తే అదేదో సుల్తాన్ బజార్ టు పవర్ సుల్తాన్ బజార్ లా ఉంది. అందరు తెలుగే మాట్లాడుతున్నారు. ఇదేమైన విజేంద్ర వర్మ లా బాలాయ్య కొత్త చిత్రం షూటింగా అని ఒక్క సారి అనుమానం వచ్చింది. తర్వత తట్టింది ఇలా రాళ్ళు రప్పలు రత్నాలు అంటే మనవాళ్ళాకే అమితమైన ఇష్టం కదా అని. అలా మొదలైంది నా దినం.. అదే నాకు ఆ దినం.

సీన్ కట్ చేస్తే ఓ రెండు గంటల తర్వత కూడా వీళ్ళు ఏ ఒక్క "రాయి" కొనలేదు. నేనేమో అప్పటికే కన్య కుమరి నుండి కాష్మీరం వరకు మోకాలి మీద పాకినట్టు నీరశించి పోయా. పోనీ టైం పాస్ కి ఎవరైన అమ్మయిలని చూద్దం అనుకుంటే దివ్య ఫీల్ ఔతుందేమో అని ఆగిపోయా. ఇంక ఇలా అయితే రోజంతా అక్కడే ఉండి నిమిష నిమిషానికి ఓ ఇంచి చొప్పున భూస్థాపితం అయిపోతా అని అనుమానం వచ్చి ఇంక మొదలెట్ట.. ఆకలి, త్వరగా కానివ్వండి అని. అప్పటికి నా పరిస్థితి అగమ్యగోచరమే! గోమేధుకం బఠాని లాగ ముత్యాలు సబ్బు బియ్యం లా కనిపించాడం మొదలయ్యాయి.. అదే విషయం చెపా దివ్య కి. ఇంక నా వళ్ళ కాదే ఇంక పి.టీ.ఉష లా పరిగెట్టేళ్ళి తినకపోతే సోషొచ్చిపడిపోతా అని. పాపాం నిజంగానే అల అయిపోతా అని ఇంకో గంట లో మొత్తం షాపింగ్ అవ్వగొట్టింది.

అదే విషయం ఆలోచిస్తుంటే నాకు ఒక్కటి అనిపించింది. అసలు దివ్య కి ఇంత ఓపిక ఎక్కడిది అని. మామూలుగా అయితే ఎక్కడైన మాల్ గట్రా వెళ్తే ఓ గంట-గంటన్నర తిరిగేసరికి ఇద్దరికి ఓపిక నశిస్తుంది. అసలు అమేరికా లో పరమవిపరీతల్టిమేట్ షాపింగ్ బొనాంజా అయిన థాంక్స్-గివింగ్ షాపింగే రెండు గంటలకంటే ఎక్కువ తిరగము. నాకు బోర్ లెవెల్ తారాస్థాయి కి చేరిపోద్ది అప్పటికి. పద ఇంటికి పోదాం సినిమా కి పోదాం కార్ వరకు పోదాం అని మొదలెడుతా. తనకి అంతే. ఎక్కువ సేపు చేయదు షాపింగ్. కాని మొన్న అలా అవలీలగ నాలుగు గంటలు తను ఏక ధాటిగా షాపింగ్ చేసేసరికి భయం వేసింది. ఇది అలవాటు అయిపోతే నా గతేంటి అని? నేను షాపింగ్ అంటే ముందే ఎల వెళ్ళాలో ఏమి ఏమి కొనాలో అవి ఎక్కడ ఉంటాయో ముందే ఆలోచిచేసుకుంటా. అంతెందుకు సపోజ్ పర్ సపోజ్ హొల్ ఫుడ్స్ కి, లైబ్రరి కి సేఫ్ వే కి వేళ్ళాలంటే ముందుగా కార్ ఎక్కేలోపే ఏ దారి లో వెళ్తే త్వరగ పనులు అయిపోతాయో అని ఓ నాలుగు ఐదు దారులు ఆలోచించేసి "షార్టెస్ట్ పాథ్" ఎన్నుకొని హొల్ ఫుడ్స్ లో సేఫ్ వే లో ఏది ఎక్కడ ఉంటదో బాగా తెలుసు కాబట్టి అందులో కూడా ఏ దారి లో వెళ్తే త్వరగా బిల్ చేయించూవాచ్చో అని ఆలోచించి అలనే చేస్తా.

మామూలుగా నాకు తెలిసి.. అంటే నాకు తెలిసిన బాయ్స్ అందరు ఇలనే చేస్తారు అనుకుంటా. బ్రహ్మచారి గా ఉన్నప్పుడు షాపింగ్ కి ముగ్గురం వెళ్తే కొనాల్సిన వస్తువుల పట్టి ని ముగ్గురం పంచేసుకొని టక టక కొనేసి వచ్చేవాళ్ళాం కార్ దగ్గరికి. బిల్ దగ్గర క్యూ పెద్దగా ఉంటే ఒకడిని అక్కడ ముందు ఆగమని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళి అన్ని కొనేసి తెచ్చేవాళ్ళాం. ఇలా కాకుండా యే షాప్ కి వెళ్ళినా ప్రతి వస్తువుని చూసి పరిశీలించి వీలైతే ఆ వస్తువు ఎల ఉందో మిగితా వాళ్ళూ ఏమన్నరో అని తెలుసుకొని అప్పుడు కొనలా వద్దా అని ఆలోచించి ఓ నాలుగైదు ఫోన్లు చేసి కొనచ్చని తర్వత తర్వత తెలిసింది. ఇల దివ్య చేయదు. ముందే చెప్తున్నా మళ్ళా మొదలెట్టకండి. పాపాం తనకి షాపింగ్ అంటే బోరే. నా పూర్వ జనం సుకృతం అని డిసైడ్ అయ్యా. కాని కొంత మంది నా స్నేహితులని చూసి ఈ అనుమానం వచ్చింది. జీవితం లో నాకు తెలియని అతి తక్కువ విష్యాల్లో ఇదొకటి. అందుకే అడిగి తెలుసుకుందాం అని అడుగుతున్నా. అబ్బయిలు అందరు నాలాగే ఒక మిలిటరి మిషన్ లా షాపింగ్ చేస్తారా? మనలో కూడా షాపింగ్ ని "అనందించే" వాళ్ళు ఉన్నారా? ఆడలేడీస్ కి (ప్రత్యేకించి గంటలు గంటలు తిరిగి షాపింగ్ చేసే వాళ్ళాకి) నా ప్రశ్న - మీ దృష్టి లో షాపింగ్ అంటే ఏంటి : అవసరమా - ఆనందమా - ఏం తోచకుండా కాలం వెళ్ళబుచ్చడమా?

Read more...

Sunday, May 17, 2009

ఒక్క రోజు తర్వాత..

నిన్న (అమేరికా టైం ప్రకారం) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లా అనిపించింది. రాష్ట్రం లో తెలుగుదేశమో, చిరంజీవో (అత్యాశ కాని లోక్ సత్తానో) వస్తుందేమో అని భావించా. మన ఆంధ్ర ప్రజలు నువ్వేమనుకుంటే నాకేంట్రా అని తిరిగి రాజశేఖర్ రెడ్డినే ఎన్నుకున్నారు. అలనే దేశం లో కాంగ్రెస్ రాదేమో బహుశా భా.జ.పా. వస్తుందేమో .. ఎదో చమత్కారం అయి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిపోతాడేమో అని అనుకున్న. ఆశ పడ్డ. కాని ఏం చేస్తాం.. మళ్ళ మన్మోహనుడినే ఎన్నుకున్నారు.

మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు. ఎందుకో రాష్ట్రం లో చెం.బా రాలేదు అని ఎక్కడో ఒక మూల కొంచం రిలీఫ్ గా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. నేను జన్మతహా కాంగ్రెస్ వ్యతిరేకుడ్ని. ఒక్క శ్రీ పీ.వీ.నరసింహా రావు గారు తప్ప ఎవ్వరు నచ్చరు నాకు. అలాంటిది రాష్ట్రం లో వై.యెస్.ఆర్ కేంద్రం లో మన్మోహన్ రావడం అంత చెడేమి కాదని అనిపిస్తోంది. ఎందుకో తెలీడం లేదు.

కొంచం ఆలోచించగా రాష్ట్రం లో కాంగ్రెస్ రావడం కంటే ఎక్కువగా తె.రా.స ని చిత్తు చిత్తు గా కొట్టడం ఆనందంగా అనిపిస్తోంది. తెలంగాణా ప్రజలని స్వార్థం కోసం ఇన్ని యేళ్ళగా వాడుకొని విసిరేసిన కే.సీ.ఆర్ ని ఈ సారి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలు. తెలంగాణా లో కాంగ్రెస్ కి మహాకూటమి కి సరిసమానంగా 54 సీట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి తెలంగాణా కి ఎదైన మేలు చేసేది వై.యెస్.ఆర్ ప్రభుత్వమే తప్ప కే.సీ.ఆర్ కాదని భావించినట్టు ఉన్నారు. మళ్ళా ఇక్కడ తెలంగాణా సాయుధ పోరటం తెలంగాణా ప్రజలు వేరు భాష వేరు గట్ర గట్ర అని ఎవరైన అనకముందే ఒక్క మాట చెప్పాలి. మా కుటుంబం కూడా ఆ నాడు జరిగిన పోరాటం లో పాల్గొన్నదే. త్యాగాలు చేసినదే. ఓ రెండొందల యేళ్ళ నుండి మా నాన్నమ్మా వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళే. అయినా నాకు విశాలాంధ్రే ఇష్టం. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసుకోడం ఇష్టం లేదు. నా స్వభిప్రాయం. ఈ సారి తగిలిన దెబ్బ వళ్ళన ఇంక తె.రా.స సంగతి అయినట్టే అనిపిస్తోంది. మళ్ళ ఇంకో "నాయకుడు" వచ్చి స్వార్థానికి ఆశలు రేపి నట్టేట్లో ముంచేదాకా తెలంగాణా ప్రజలకి కొంచం విరామం.

ఇంక కేంద్రం లో.. నాకు ఈ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని బ్లాక్ మేల్ చేయడం అస్సలు నచ్చదు. గత పది యేళ్ళ గా ఇలాంటి స్వార్థలు వళ్ళనా దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన వలని వచ్చింది. ఒక ఎన్నికల భారాన్ని కూడా అధికంగా మోసింది. మాటి మాటికి ఆ కమ్యునిస్ట్ల చెత్త ని సేవించాల్సి వచ్చింది. హమ్మయ్య.. దెబ్బకి దరిద్రం ఒదిలింది. 60 నుండి 24 కి పడ్డ వాళ్ళ సీట్లని చూస్తే అబ్బో సంబరం పట్టలేకపోయా. నాకు బేసిక్ కా కమ్యునిస్ట్లన్నా ఫెమినిస్ట్లన్న పడరు. 60 సీట్లతో దేశాన్ని ఓ ఐదేళ్ళూ చీడపురుగుల్లా వేధించిన దానికి తగిన శాస్తే జరిగింది. ఇంక దేశాం నుండి శాస్వతంగా ఈ చెండాలం వెళ్ళిపోతే ఆ రోజు మనకి పెద్ద పండగే. పలిసీలకి చైనా ని సమర్థించే ఈ బూటకపు నాయకులని జైల్లో వేయాలి. ఆ అవసరం లేకుండా దేశ ప్రజలు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. అలనే మిగితా లోకల్ రాష్ట్ర నాయకులని కూడా ఎక్కువగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ భా.జ.ప కలిపి 320-330 సీట్లు వచ్చాయి ఈ సారి. ఇద్దరి ఎకనామిక్ పాలిసీలు ఇంచు మించు ఒకటే అవడం వలన తొంభై శాతం దేశ భవిషత్తుకి మంచిదయ్యే పాలిసీలు సులువుగా నెగ్గుతాయి అనిపిస్తోంది. చూద్దాం. మధ్యలో ఎక్కడ ములాయాం ప్రధాని అయిపోతాడో అని టెన్షన్. హమ్మయ్యా అనిపించింది లెక్కలు చూసాక.

చివరిది ఎందుకో నాకు అద్వాని కంటే మన్మోహనే మంచి ప్రధానిలా అనిపిస్తాడు. అంటే అద్వాని ఎప్పుడు ప్రధాని కాలేదు అనకండి. ప్రధాని అయ్యింటే కూడా మన్మోహన్ అంత అయ్యిండేవాడు కాదు అని నా అభిప్రాయం. ఇవ్వన్నీ చూతే మన ప్రజలు బాగా ఆలోచించే వోటు వేసారనిపిస్తోంది. I seriously hope that is the case, and that we have turned a corner. చూద్దాం. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది.. రాష్ట్రం లో పోయిన సారి చేపట్టినన్ని అభివృధి కార్యక్రమాలు మాత్రం జరగవు.. కేంద్రం లో పోయినసారి కంటే ఎక్కువ అభివృధి జరుగుతుంది అని. చూద్దాం.

Read more...

Thursday, May 14, 2009

జన గణ మన రణ...

అంటే తప్పేంటి? గత కొద్ది రోజుల్లో మీరు ఈ మాట / పాట వినే ఉంటారు. ఈ ప్రశ్న నేనడిగింది కాదు.. రాం గోపాల్ వర్మ కొత్త చిత్రంది. మన జాతీయ గీతాన్ని కొంచం మార్చి ఒక ప్రశ్న గా మార్చాడు. అందులో నాకేమి తప్పు అనిపించడం లేదు. రాజకీయనేతల్ని ఎలాగు మనం ప్రశ్నించము.. లంచం అడిగే ట్రాఫిక్ కానిస్టేబల్ ని ప్రశ్నించము .. నగర పాలక సంస్థ లో ఏదైన పనికి లంచం అడిగినప్పుడు ప్రశ్నించము.. వోట్లడ్డుక్కొని ఎన్నికబడ్డ "నాయాకులు" ఏ ఒక్క ఎన్నికల వాగ్ధానాలని పూరించనప్పుడు ప్రశ్నించము.. ఒక్కడైన ధైర్యం చేసి అడిగాడే అనము.. మన జాతి ఇల ఎందుకు అయ్యింది అని ప్రశ్నించిన వాడ్ని మాత్రం అర్రెర్రె అది మన జాతీయ గీతాన్ని కించపరుస్తున్నాడు అని అంటాం.

అసలు మనలో ఇంత నిరాశ నిస్ప్రుహ ఎల జీర్నించుకుపోయిందో నాకు తెలేదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఐతే ఇలా ఉండిఉండదు.. మన దేశాన్ని పునరుద్దరించుకోవాలి అన్న తాపత్రయం తో అప్పటి స్వాతంత్ర సమరయోధులు ఆశావాదులై ఉండిఉంటారు. లేకుంటె మనకి "ఉందిలే మంచి కాలం ముందు ముందు నా.." అన్న పాట ఉండేది కాదేమో. కాని తర్వత ఏమైందో తెలేదు.. ఇలా ఆ నాకేమి కాలేదు కద అలాంటప్పుడు నాకెందుకు అని అయిపోయాం. మొత్తం భారతావని లో ఏదైన భావం ఏక కంఠం తో వినిపిస్తుంది అంటే అది - మన దేశం ఇంతే. దీన్ని ఎవ్వడు బాగుచేయలేడు అన్నదే కద. అరవై యేళ్ళ తర్వత కూడా ఇంత దరిద్రం, ఇంత చండాలం మొత్తం దేశం యే ఒక్క ఇంచు కూడా వదలకుండా మనలో మనతోనే అది పెరుగుతోంది. మేరా భారత్ మహాన్ అని కపటపు గర్వాన్ని నెత్తినేసుకొని ఓ ఊరేగుతాం.. దేశాలేగుతాం. కాని అంథ మహాన్ అనేంత ఏముంది మన కాడ? పదివేల సంవత్సారల చరిత్ర? ప్రపంచ జ్ఞాన నిధి వేదాలా? కౌటిల్యుని అర్థశాస్త్రమా? ఇవ్వన్ని ఉన్నాయి.. కాని ఇవ్వన్ని ఎప్పటివో. కాదనడం లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు ఈ మన నవ సమాజం లో ఏముంది మన దేశాన్ని చూసి గర్వ పడేదానికీ? ఎలుగెత్తి మేరా భారత్ మహాన్ అని చాటేదానికి? అలాంటప్పుడు ఓ "థా" తగిలిస్తే సరిపోద్ది కద.. అప్పుడు మేరా భారత్ మహాన్ థా అయిపోతుంది. లెక్క సరిపోతుంది.

మామూలుగా మన దినచర్య లో ఎదైన సమస్య వస్తే అసలు ఇది ఎందుకు అయ్యిందో అని అనుకుంటాం. మరోసారి అల జరగకుండా చూసుకుంటాం.. కాని అరవైయేళ్ళు వీళ్ళు కకపోతే వాళ్ళు ఎవరైన దొబ్బెవాళ్ళే తప్ప మంచి చేసే వాళ్ళని ఎందుకు ఎన్నుకోము? అసలు ఎన్నుకున్న వాళ్ళాని ఎందుకు ప్రశ్నించము? ఎందుకు నిలదీయము? ఇప్పుడంటే గూండాలు, డాకూలు, కనిష్టం ఒక 2-3 కేసులైన ఉన్నవాళ్ళాకే పార్టీ టికెట్లు ఇస్తున్నారు అనుకో.. కాని ఓ 30 యేళ్ళ క్రితం వరకు ఇల లేదు కద. అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు నిలదీయలేదు? అంటే స్వాతంత్రం వచ్చేసింది మన పని అయిపోయింది అని ఆ తరం వాళ్ళు అనుకున్నారా? ఇది మన తరానిదా ఇంతక ముందు తరానిదా అని తప్పులు నెట్టుకోవడం వలన ప్రయోజనం ఎమైన ఉందా? తప్పెవరిదైన శిక్ష యావత్మందీ అనుభవిస్తున్నాము. మన రాబోయే తరలవారు అనుభవిస్తారు. అంత మాత్రాన ఈ దేశాం మొత్తం ఎదో బాగుచేసేస్తా అని నేనేమి అనడం లేదు. అసలు ఎందుకు ఇలా అయ్యిందో ప్రశ్నించడం మానద్దు అంటున్నా. ఎక్కడ తేడ జరిగింది అన్నది నా ప్రశ్న.

అఖండ భారతావనిని రెండుగా చీల్చుకున్నాం. తర్వతా భాష మీద విడగొట్టుకున్నాం. ఇప్పుడు యాసల మీద. తర్వత? వాడ ల మీదా? మనం భారతీయులం అని మర్చిపోయి చాలా యేళ్ళైంది. ఒక్క రణం వళ్ళనో లేకుంటే క్రికెట్ వళ్ళనో తప్ప భారతీయులం అనిపించుకోం. మనలో ఎన్ని విభజనలు ఉన్నయో ఆ చిత్రగుప్తునికి కూడా తెలీదు. మనం మారమా? ఇంక ఇంతేనా ? ప్రేమికుల రోజు గురించి పట్టించుకుంటాం. పార్కులో ప్రేమికుల గురించి పట్టీంచుకుంటాం. ఎవరిని ఎన్నుకున్నామో వాళ్ళేమి చేస్తున్నారో అది మాత్రం పట్టించుకోం. శాస్త్రి గారు అన్నట్టూ:

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో బీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమె మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ

Read more...

Saturday, May 9, 2009

వీకెండ్ ధమాకా !!!! శంకర్ The Great చిత్రం!!!

ఈ బ్లాగు లో ఇప్పటికి చాలా సార్లు నేను "శంకర్" అనే సినిమా గురించి చెప్పడం జరిగింది. నేను తెలిసిన వాళ్ళకి ఈ శంకర్ ఎఫ్ఫెక్ట్ ఎప్పుడొ ఒకప్పుడు పడే ఉంటుంది. ఇన్ని సార్లు చెప్పిన ఈ సినిమా ఘనత ఏంటా అని నన్ను ఇక్కడ బాహ్య ప్రపంచం లో చాలా మందే అడిగారు. కొంతమందికి నేను డీ.వీ.డీ ల రూపం లో గానీ, సీ.డీ ల రూపం లో కాని ఈ సినిమా ని నిర్బంధించి పంపడం జరిగింది. అసలు నన్నడిగితే ..నన్నే కాదు,, కాలిఫోర్నియ లో ఉన్నప్పటీ నా రూం మేట్స్ ని ఎవ్వరిని అడిగినా ఇదే మాటంటారు.. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. అసలు భూ-ప్రపంచం లోని యే సినిచతిరలోను ఇంత గొప్ప చిత్రం రాలేదు. రాదు కూడా.

రజనికాంత్, జాకీ షరాఫ్, మాధురి దీక్షీత్, కుల్భూషన్ కార్బండ తదితర నటీనటులు అద్భుతంగా నటించిన.. అదే జీవించిన చిత్రం ఇది. ఇది చూడకపోతే మనం జీవితం లో ఎదో కోల్పోయినట్టే. it gives a meaning to our lives. ఒక్కసారి ఈ సినిమా చూస్తే మన జీవితం మొత్తం ఈ సినిమా చుట్టే తిరుగుతుంది. ఇది ఖాయం. ఎన్ని జన్మలైన ఈ సినిమా తాలూక చాయలు మనతోబాటే వస్తాయి అని నా నమ్మకం. రహమాన్, ఇళయరాజా ఈ చిత్రం లోని పాటలనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. చిత్రానువాదానికి .. అదే స్క్రీన్ ప్లే... ఇది ఒక బ్లూ-ప్రింట్. ఇవ్వంటికంటే ముఖ్యమైనది "నటపిశాచి" (థాంక్స్ ఎం.ఎన్.ఎం) సాయి కుమార్ డబ్బింగ్. చెప్పడం మరిచా ఈ సినిమా హింది లో ప్రధమంగా తీసారు. ఎవడికి వచ్చిందో కాని ఆలోచన దిన్ని తెలుగులో అనువదించారు. ప్రతి క్షణం ఉట్కంటభరితం గా ఉంటుంది. అచ్చు హింది సినిమాలో అరవ మాసు కలిపి ఒరియ నృత్యాలతో అస్సామీ కామెడీ తో తెలుగు భాషలో ఉంటుంది. దేశ సమైక్యత కి ఇంత కంటే నిదర్శనం ఉండదు!!!

కథా పరంగా వస్తే - మొదటి సీన్ తోనే మీ మెదడు బద్దలైపోద్ది. కుల్భూషన్ ఒక పెద్ద వ్యాపారవేత్త. అతను ఎక్కడో వేరే ఊరు నుండి ఫోన్ చేసి వాళ్ళావిడ తో "హే డార్లింగ్" అని మొదలెడుతాడు. మన బాబా బాత్ టబ్ లో నుండి వాళ్ళా నాన్న తో మాట్లాడతాడు. ఇది చూసాక కూడా మీరు తట్టుకోగలిగితే మీరు అర్జెంట్ గా ఉన్నపళంగా వెళ్ళి రాం గోపాల్ వర్మ కి ఆగ్ తెచ్చుకొని పకోడి తింటూ చూసేయచ్చు. అదేంఖర్మ.. ఎంచక్క పరదేశి, హం సాత్ సాత్ హైన్, వివాహ్ గట్ర కూడా అవలీలగా చూసేయచ్చు. సారీ రూటు మళ్ళాను.. ఎక్కడున్నా.. ఆ.. అంతలో మాధురి దీక్షీత్ వస్తుంది. మన వీరోలు ఇద్దరు తనతో ప్రేమ లో పడతారు.. సారి తనని ప్రేమిస్తారు. (ఈ ముక్క తారాగణం చదివినప్పుడే అర్థమైంది రా అంటారా... ) కొన్ని అధుభుతమైన సీన్లనంతరం ముగ్గురూ ఒక పార్టీ కి వెళ్తారు. వెళ్తారో సడ్డన్ గా పార్టీ ప్రత్యక్షమౌతుందో సరిగ్గ గుర్తులేదు.. కొంచం చూసి చెప్పండి .. అక్కడ రజనీకాంత్ మందు గ్లాస్సు చేత్లో పట్టుకొని అదో రకంగా జాకీ వైపు మరో రకంగా మాధురి వైపు చూసి చూసి చూసి అలసి ఒక కలల పాట.. అదే డ్రీం సాంగ్ .. డ్రీం సాంగో నైట్మేర్ సాంగో తెలీదు.. ఊహించుకుంటాడు. తనతో మాధురి తో అనుకుంటే మీకు ఇంకా ఈ సినిమ అర్థం కాలేదు. ముందేళ్ళి మొదటినుండి చూడంది మళ్ళా. అప్పుడైన అర్థమౌతుందేమో.. జాకీ, మాధురి మీద పాట ఊహించుకుంటాడు ఆ పాటేంటో తెలుసా "ప్రెమరాయా స్వాగతము.. ప్రేమరాయా స్వాగతము.. నామది కోరెను నిన్నే.. " అంటూ చాలా చలాకీ గా సాగుతుంది పాట. జైహో కి కాదు ఈ పాటా కి ఇవ్వాలి ఆస్కర్ .. ఏం చేస్తాం. తర్వతే అతి కీలకమైన ట్విస్ట్. అది ఏంటో తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే!!!

ఇంకొక్క సీన్ వర్ణిస్తా ప్లీజ్ ప్లీజ్. నాకు నచ్చిన సీన్ ఇది. రజనీ కీ వాళ్ళ అమ్మ కుల్భూషన్ మొదటి భార్య కాదు రెండవ భార్య అని తెలుస్తుంది.. అప్పుడు అతని ఆర్ధ్రత ని మన కంటికి కట్టీనట్టూ నటనతో చెవుల్లో జీవితకాలం ఉండిపోయేట్టూ డబ్బింగ్ తో "నేనెప్పుడూ అనుకునేవాడ్ని మా అమ్మ - భార్య నంబర్ వం, మమ్మీ నంబర్ వన్, లక్కీ నంబర్ వన్ అని.. కాని నువ్వు నంబర్ టూ అమ్మ నువ్వు నంబర్ టూ.. ఈహ్ హీ హీ .. ఈహ్ హీ హీ " అన్న డవిలాగ్ ఈ జన్మ లో ఎవ్వరి మర్చిపోలేరు. తర్వత ఏం జరుగుతుందో నాకు తెలేదు. అంతకు మించి నేను ఎప్పుడూ చూడలేకపోయా. కన్నీటి సముద్రం లో మునిగిపోతా ఇది అయ్యేసరికి.. అందుకే.

ఈ చిత్రాన్ని మేము ప్రతి శుక్రవారాం మిగితా అన్ని సినిమాలు చూసేదానికి ముందు ఓ అరగంట చూసేవాళ్ళం. ఇది చూసాక టైగర్ హరిస్చంద్ర ప్రసాద్, విజేంద్ర వర్మ - శంకరాభరణం లా అనిపించ్చేవి. ఇంతటి అమోఘమైన చిత్రాన్ని మీరు ఆస్వాదించండి. ఆనందించండి. చూసి నన్ను అభినందించండి.

భాగం-1
, భాగం-2 మరియు భాగం-3

Read more...

Friday, May 8, 2009

దిల్లీ 6- జోర్ సా ఝట్కా జోర్ సె లగా..

సినిమా మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తారు అనేదానికి మా బావగాడి ఉవాచ - ఎలాగో థియేటర్ వాడికి, నిర్మాత కి మనం చదివించాల్సింది చదివించేసాము, ఇంక మన తో ఆ దర్శకుడికి పెద్దగా అవసరం లేదు .. మన ఖర్మకొద్ది మిగితా సగం చూడచ్చు లేకుంటే బ్రతుకు జీవుడా అని పారిపోవచ్చు. ఇలా నాకు సినిమా మధ్యలో నుండి పారిపోవాలి అని ఇప్పటివరకు జెస్ట్ రెండే రెండు సార్లు అనిపించి లేచ్చి వచ్చాను. అల రావడం వలనే ఇంకా మతిస్థిమితంగా ఉన్నా అని ఎప్పుడూ అనిపిస్తూంటది. రజనీకాంత్ - మాధురి దీక్షీత్ "శంకర్", నాగ్ - "డాన్" లాంటి ఆస్కర్ లెవెల్ చిత్రాలనే అవలిలగా తట్టుకున్నా.. అలాంటిది రెండు సినిమాల మధ్యలో నుండి వాక్-ఔట్ చేశా.. అవి ఏంటో చెప్తే నన్ను బోలెడు మంది తిడతారు. అయిన పర్లేదు .. ఒకటి దర్శకేంద్రుని "పరదేశీ" (గుర్తుందా? అదేదో talent search పెట్టి నలుగురు జాతి రత్నాలని ఎన్నుకొని, ఒక ముష్టి కథ తో తీసిన ఘనమైన చిత్రం అది. చూసినోళ్ళకి సతసహస్ర వందనాలు. మీరు నాకంటే చాలా ఘనులు.). ఇంకొకటి .. చెప్పేస్తున్నా.. ఇదిగో మళ్ళ నామీద అరవకండి - హం ఆప్కె హై కౌన్. నా జీవితం మీద నాకే విరక్తి కలిగించిన చిత్రం. మూడు నెలల ముందు టికెట్ కొని మరీ దొబ్బించుకున్నా. సగం అయ్యేసరికి నా జుట్టు నెరిసిపోయింది.. నేను చార్మినార్ కట్టినట్టు, టీ లో సాంబార్ పోసుకొని బ్రెడ్ తో తిన్నట్టు ఇల రక రకాలుగా అనిపించింది. అందుకే లేచ్చొచేసా(ము).

ఇప్పుడివ్వన్ని ఎందుకు చెప్తున్నా అంటారా.. అబ్బే ఏమీ లేదు.. దిల్లి 6 చూసాక ఎందుకో ఇవ్వన్ని గుర్తొచ్చాయి నాకు. తాడు బొంగరం లేకుండా ఏదో అప్పట్లో ఆషికీ సినిమా తీసినట్టుగా ఉంది. మొదట్లో ఓహో ఇది మతసామరస్యం మీద మూవీ అనుకున్న.. తర్వత కాలా బందర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓహో ఇది satarical మూవీ అనుకున్న.. మధ్య మధ్యలో అంటే అసలు ఎందుకు వచ్చాయో ఎల వచ్చాయో అర్థం లేకుండా పాటలు వచ్చినప్పుడు ఓహో ఇది మ్యూజికల్ మూవీ అనుకున్న.. కాని ఇది ఏదీ కాదు. అన్ని అని చివరకి తేలింది.

ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది.. బహుశా రహమాన్ సంగీతం సమకూర్చాకా కథ రాశారేమో అని. ఎందుకంటే చాలా చోట్ల చాలా డిస్జాయింట్ గా ఉంటుంది. రెండేళ్ళ పిల్ల కి ఆ సంవత్సరం లో తిరిగిన ప్రదేశాల చిత్రపటాలు ఇచ్చి ఒక ఆల్బం లొ పెట్టమంటే ఎల ఇష్టం వచ్చినట్టూ పెడుతుందో ఊహించుకోండి. అదే దాదాపుగా మూడూ గంటలు సినిమా తీస్తే ఎల ఉంటుంది? సేం టు సేం. కథ పరంగా ఐతే ఒక కోతి వళ్ళ మనుషులు మతి ఎల కోల్పోతారో మత కలహాలు ఎల రేగుతాయో.. అదే ఒక కోతి వళ్ళ అని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. మనిషి కోతి నుండే పుట్టాడు కావున మనిషి కలహాలు కూడా కోతి వళ్ళనే అన్న నిజాన్ని నేను ఈ చిత్రం ద్వారా గ్రహించాను.

అభిషేక్ సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉంటాడు. బోలేడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు పోతారు. ఎందుకు అన్నరంటే డిక్కి లో తొంగోబెట్టేస్తా. అది అంతే. వాళ్ళకి డబ్బిచాడు కద నిర్మాత? అందుకే వాళ్ళు వస్తారు. పోతారు. నీకెందుకోయి? ఆ సోనల్ కపూర్ గురించి నేను చెప్పదల్చుకోలేదు. అనిల్ కపూర్ అమ్మయిగా పుట్టింటే ఎల ఉంటాడో అలనే ఉంది. బహుశా ఇంకొక ఐదేళ్ళ తర్వత ఏమైన మార్పు వస్తుందేమో పిల్ల లో చూడాలి. అప్పటి వరకు అయితే లైట్. ఆ మధ్యలో మీనాక్షి అని టబు తో యం.ఎఫ్.హుస్సేయిన్ తీసాడు. గుర్తుందా? భలే పాటలు. ఇది అంతే. ఐ.క్యూ ఒక 300 ఉంటే కాని అర్థం కాదేమో. నాకు అంత టాలెంట్ లేదు. మీకుందేమో చూడండి. ఈ సినిమా చూస్తే ప్లీజ్ ప్లీజ్ నాకు కథ చెప్పడం మరువకండి.

Read more...

Thursday, May 7, 2009

ప్రేమ కథ - 2

ఇలా ఉన్న సమయం లో నేను ఏదో ఇంకొక అమ్మాయిని లైన్ లో పెట్టే సమయం లో నా కష్టాలు అలా అప్పుడప్పుడు ఈ అమ్మాయి (అంటే నా కథ లో వీరోయిన్) తో యాహూ చాట్ లో మాట్లాడేవాడ్ని. అల మా మధ్యలో సఖత్వం పెరిగింది. తనకి నా ఇంతక ముందు ప్రేం కహాని తెలీడం వలన వాళ్ళ ఇంట్లో నా గురించి అడిగినా కుదరదు అని చెప్పేసింది. కాని ఆ టైం కి నేను మళ్ళి ఏకాఇకినే అని తెలేదు తనకి. అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళు మా ఇంటికి సంబంధం తెచ్చినప్పుడు .. ఆ విషయం తనకి తెలిసి టాస్ పూస్ అని ఎగిరింది అట. ఇది చాలా natural reaction అనే అనిపించింది నాకు.
ఇది ఇలా ఉండాగా.. నా ప్రేం కహాని అంతలో ముగుసింది as usual. రెండు వారాలు అప్పుడప్పుదు ఒక నెల కంటే ఎక్కువ యే అమ్మయీతో నేను మాట్లాడలేదు.. నాకు వాళ్ళు బోరు కొట్టేవాళ్ళు.. అలనే వాళ్ళకీ నేను అలనే అనిపించేవాడ్నేమో. ఎదో అలా మా నాన్నా ఫోను బిల్లు పెంచేదానికి తప్ప నా ఎక్స్-గరళ్ ఫ్రెండ్స్ వళ్ళ నాకంటూ ఎప్పుడు ఖర్చు ఉండేది కాదు. (అమ్మయిలని పటాయించాలి అనుకుంటున్న కుర్రాల్లారా.. ఈ విషయం మీకు చాలా చాలా చాలా యింపార్టంట్. మన జేబు మీద భారం పడితే లైట్ తీసుకోండి. అమ్మయిలూ మాలో ఇలాంటి పీనాసి కుర్రాల్లు కూడా ఉంటారు. మీతో ఖర్చు పెట్టిసూ.. గుర్తెట్టూకోండి.. దయతలచి మాకు అప్పులు ఇవ్వండి). సరే ఇలా చాట్ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ.. నాకు ఈ అమ్మయి నచ్చడం మొదలైంది. మా అమ్మ కి చెప్పా.. ఇదిగో అమ్మ నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మయి నాకు నచ్చింది. నీకేమైన అభ్యంతరమా అని. నీకూ అమ్మయికి ఏమీ ప్రాబ్లం లేకపోతే మాకేమి అభ్యంతరమ లేదు రా అని. సరే ముందే తెలుసుకుంటే మంచింది అని వాళ్ళ అమ్మ ని అడిగేసా.. ఆంటీ మీకేమైన అభ్యంతరమా అని. మాదేముంది చేసుకునేది అది.. దాని ఇష్టం అన్నారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోయేదానికి డిసైడ్ అయ్యాను.
ఇలా నేను ముందే వాళ్ళ అమ్మ పర్మిషన్ గట్ర తీసుకున్న అని తెలీదు మన వీరోయిన్ కి. అందుకే ఫోనే చేసినప్పుడు ఫ్రెండ్షిప్ కొద్ది మాట్లాడేది. అల కొన్ని కార్డ్ల తర్వాతా అంటే రెలైయన్స్ షేర్లు నా ఫోను బిల్లు వళ్ళ పెరిగాకా అప్పుడు చెప్పా.. నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే ఇంకిష్టం అని.. నీ గతం అంత తెలిసిన నాకే లైన్ వేస్తావా అని ఎగిరింది. ఏం చేస్తాం.. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇదే లాస్ట్ ఒప్పేసుకో అన్న.. బ్రతిమలాడా.. అడ్డుకున్నా. కాని చెక్కు చెదరని ఆత్మవిశ్వాశం తో గెట్ ఆవుట్ టైప్ లో అన్నది. ఇది మనకి మామూలే కద అని పెద్దగా పట్టించుకోలేదు. ఓ వారం అంటే ఓ రెండు రోజులు గాప్ ఇచ్చి మళ్ళి ఫోన్ చేయడం మొదలెట్టా. ఇలా మరి కొద్ది రోజులు గడిచాక చెప్పింది.. వాళ్ళ అమ్మ వాళ్ళాకి ఏం అభ్యంతరం లేకపోతె తను అప్పుడు ఆలోచిస్తా అని. ఇంక పూజారిని బుట్టలో వేసుకోవలి అని బాగా ఆలోచించి ఒక పకడ్బంది ప్ల్యాన్ వేసా. ముందు మా అత్తగారిని బుట్టలో వేసుకున్న. రాముడి కంటే మంచి బాలుడు కావడం వలన సులువుగా అయ్యింది. తర్వత మా మామాగారితో మాట్లాడి. సుధీర్గ చర్చానంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇగ మిగిలింది వీరోయినే. అప్పుడే ఒప్పుకుంటే ఇంత కథ ఎందుకు ఉంటది? వాళ్ళ అమ్మ వాళ్ళు అల అన్న.. తనకి ఇంకా నమ్మకం కుదరలేదు. వాళ్ళా పిన్ని తో, అక్క తో, బావా తో, వాళ్ళ జిల్లా లో ఉన్న వాళ్ళందరితో, బాలాయ్య తో మాట్లాడి వాళ్ళొప్పుకుంటేనే అని షరత్తు పెట్టిండి. ఇలా దాదాపుగా ఒక పది రౌండ్ల ఇంటర్వ్యూలు అయ్యాయి.. (నిజమండి బాబు.. నాకు ముందే ఇంటర్వ్యూ అంటే చచ్చేంత భయం.. అలాంటిది పది రౌండ్లు అంటే ఆలోచించండి) నామీద నాకే ఆశ్చర్యం వేసింది. అసలు నేను నేనేనా అని డౌట్ కూడా వచ్చింది. నాకు ఇంత ఓపిక ఎక్కడిదో ఇంకా మా అమ్మ కి చిన్నప్పటి నుండి నేను తెలిసిన వాళ్ళకి ఆశ్చర్యం. కళ్యానం వచ్చినా ఇంకేదో వచ్చినా ఆగదు అంటారు కద.. అల ఏదో అయ్యింటది అని ఫిక్స్ అయిపోయారంతా. ఇలా అందరు నేను ఉత్తముడిని నా భూతో న భవిషత్ ఇరగ కత్తి అని పరి పరి విధములుగా పాస్ చేయడం వలన తను కూడా సరెలే పపం వీడు ఇంతలా ఇనేళ్ళగా వెంట పడి కష్ట పడుతున్నాడు కద అని ఆలోచించి. నిన్ను ఒక్క సారి చూడాలి.. చూసి చాలా రోజులైంది కద అని అన్నది. అల తను అన్నదో లేదో ఇలా నేను టికెట్ ఎట్టుకొని రెడీ అయిపోయా.
ఇదే ఫైనల్ ఫేస్ టు ఫేస్. మా ఆవిడ నన్ను అడిగిన ఏకైక క్వెస్చన్ నీకు వంట వచ్చా? చదువుకునే రోజుల్లో నాకు బ్రహ్మం (చిత్రం భలరే విచిత్రం గుర్తుందా?) అని అంటారని చెప్పాను. ఇలా ఇంకొన్ని ప్ర-జలు నడిచాయి. నాకు గుర్తుండి నేను అడిగిన ఒకటే ఒక్క ప్రశ్న నువ్వు క్రికెట్ చూస్తావా అని. తను ఓ యెస్ అన్నది. ఇంకే సీన్ కట్ చేస్తే రెండొ రోజు నిశ్చితార్థం.. అజహర్ టెస్ట్ లో అత్యధిక స్కోరు లా 199 రోజులు తర్వత లగ్గం. ఏ 199 రోజుల్లో నా ఫోను బిల్లు అక్షరాలా వెయ్యి డాలర్లు.. అది వేరే విషయం అనుకోండి.
ఇప్పుడు ఎవరైన మమ్మల్ని మీది ప్రేమ వివహమ పెద్దలు కుదిర్చినదా అంటే నేను చెప్పేది (ఇల చెప్పి చెప్పి మా ఆవిడని ఆల్మోస్ట్ కన్విన్స్ చేసేసా ఇదే నిజం అని) - నేను బుద్ధిగా చదువుకొని శ్రద్ధాగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే తనే నా వెంట పడి 18 నెలలు నిరంతరం వేధించి సాధించుకుంది అని. :-)

Read more...

Monday, May 4, 2009

ప్రేమ కథ

అనగనగా ఒక ఊరులో.. ఇల మొదలెడదాం అనుకున్న ఈ కథ ని.. కాని మరీ రొటీన్ గా ఉంటుందేమో అని ఆగిపోయ. నాకు ఒక ఖ్వయిష్ ఉంది. పెళ్ళి చూపులకి వెళ్ళాలి అని. అంటే నాకనె కాదు ఎవ్వరిదైన.. ప్రత్యక్షంగా ఒక్క పెళ్ళి చూపులకి వెళ్ళాలి అని. నిజంగా సినెమాల్లో లాగా ఉంటుందా అని నా డౌట్. నాకు ఆ చాన్స్ లేదని చిన్నప్పుడే తెలిసిపోయింది. నాకు ..నా own సొంత అభిప్రాయం దృష్ట్యా ఐదు నిమిషాలు చూసి ఒప్పుకోలేను అని అర్థమైపోయింది.
అది నేను ముద్దుగా పధతిగా చదువు అయ్యాక ఎదో ఉద్యోగం చేసుకుంటు ఉన్న రోజులు. అప్పట్లో చాలా కష్టం మీద మళ్ళి ఇంకొక అమ్మయిని లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తూండినాను. అదే సమయం లో అంటే రెండు ఒకటే సారి అని కాదు.. ఇంచు మించుగా అదే సమయం లో అని.. మా అమ్మ వాళ్ళాకి నాకోసం సంబంధాలు రాడం మొదలెట్టాయి. మా అమ్మ కి నా సంగతి తెలుసుకాబట్టి వీలైనంత వరకు అబ్బే మా వాడికి అప్పుడె పెళ్ళి చేసే ఉద్దేశం లేదు అనో మా వాడికి కొంచం తిక్క అనో ఇలా సర్ది చెప్పేవారు. కాని ఏమి చేస్తాం.. విధాత ఒకటి తలిస్తే నేను ఇంకొకటి తలిచా అని.. స్వారి స్వారి నేను ఒకటి తలిస్తే విధాత ఇంకొకటి అన్నట్టు అనుకోకుండా ఒక సంబంధం వచ్చింది.

మా అమ్మ వాళ్ళ వేలు కాలు విడిచిన చుట్టలమ్మయి ఉందని ఒక సంబంధం వచ్చింది. సరే మీ వాడికి కాకపోతే వాడి స్నేహితులో ఎవరైన తెలిసిన వాళ్ళో ఉంటారు కద అని చెప్పారట. చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మయి అవ్వడం వలన .. అంటే మొదటి సారి యెంసెట్ రాసినప్పుడు నాకొచ్చిన ర్యాంక్ కుకి వాళ్ళా ఊరులో ఉన్న కాలేజి లో సీటు వచ్చింది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా.. తనేమో అప్పుడు ఇంకా స్కూల్ లో చదువుతోంది. (అంత చిన్న పిళ్ళ అని అనుకోకండి మనం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ఉంటే నాలుగేళ్ళ తేడ అంటే పిల్ల స్కూల్ లోనే ఉంటుంది.. ఈ ముక్క చాలా రోజులతర్వత అర్థమైంది నాకు). కాని పుట్టి పెరిగిన నా హైదరాబాద్ ని వదలడం ఇష్టం లేక వెళ్ళలేదు. మరోసారి రాసి తెచ్చుకున్న హైదరబాదు లోనే. తర్వతేడు వాళ్ళ అక్క కౌన్సెల్లింగ్ కి హాజరు అయ్యాను. లేకపోతె మా అమ్మ నా వీపు విమానం మోత చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది.

ఇంకొక రెండేళ్ళ తర్వత వీరోయిన్ కౌన్సెల్లింగ్ కి కూడా వేళ్ళాను. ఒకవైపు మా ఫ్రెండ్స్ ఏమో థియేటర్ లో కాచుకొని ఉన్నారు ఇక్కడేమో ఈ పిల్ల నంబర్ రాదు. వాళ్ళ నాన్నాగారేమో ఏరా నీకు కాలేజి లేదా? పుస్తకాలేవి అని ప్రశ్నలు. ఇంజనీరింగ్ లో బ్యాగ్ ఎంటి పుస్తకలేంటి.. మా గ్యాంగ్ లో అయితే ఎవడైతే చివరుగా బుక్కు పెడతాడో వాడే మోసుకొని వెళ్ళాలి బ్యాగు ని. ఈ లెక్కన ఏ వారానికో రెండు వారాలకో నాకు నా బ్యాగ్ వచ్చేది. పాపాం ఫస్ట్ యేడాది తర్వత మా నాన్న అడగడం మానేసారు. అసలు నేను కాలేజి కి వెళ్తున్నానా అని అనుమానం వచ్చేది మా నాన్న కి. అది సరె అసలు నాలుగేళ్ళల్లో ఔతుందా రా అని ఎప్పుడు టెన్షన్ పడేవారు. అది వేరే విషయం.

ఇంతకీ ఎక్కడున్నా.. ఆ కౌన్సెల్లింగ్ లో.. నాకేమో టైమైపోతోంది.. మ్యాట్నీ టైం ఔతోంది... ఇక్కడేమో ఈ పిల్ల వెళ్ళదు లోనికి. ఇంక చేసేది ఏమి లేక అక్కడే గడియారానికి అక్కడున్న మానిటర్ కేసి ఎన్నికల ఫలితాలు చూస్తున్నట్టుగా తదేకగా చూస్తూ కూర్చున్నా. తర్వత తనని మళ్ళ చాలా రోజులవరకు చూడలేదు. ఇలా ఉన్న సమయంలో..

(ఇంత పెద్ద టపా రాయడం ఇదే ప్రథమం. సహవాస దోషం అని.. నేస్తం, పింకీ సావాసం వలన.)

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP