Saturday, May 9, 2009

వీకెండ్ ధమాకా !!!! శంకర్ The Great చిత్రం!!!

ఈ బ్లాగు లో ఇప్పటికి చాలా సార్లు నేను "శంకర్" అనే సినిమా గురించి చెప్పడం జరిగింది. నేను తెలిసిన వాళ్ళకి ఈ శంకర్ ఎఫ్ఫెక్ట్ ఎప్పుడొ ఒకప్పుడు పడే ఉంటుంది. ఇన్ని సార్లు చెప్పిన ఈ సినిమా ఘనత ఏంటా అని నన్ను ఇక్కడ బాహ్య ప్రపంచం లో చాలా మందే అడిగారు. కొంతమందికి నేను డీ.వీ.డీ ల రూపం లో గానీ, సీ.డీ ల రూపం లో కాని ఈ సినిమా ని నిర్బంధించి పంపడం జరిగింది. అసలు నన్నడిగితే ..నన్నే కాదు,, కాలిఫోర్నియ లో ఉన్నప్పటీ నా రూం మేట్స్ ని ఎవ్వరిని అడిగినా ఇదే మాటంటారు.. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. అసలు భూ-ప్రపంచం లోని యే సినిచతిరలోను ఇంత గొప్ప చిత్రం రాలేదు. రాదు కూడా.

రజనికాంత్, జాకీ షరాఫ్, మాధురి దీక్షీత్, కుల్భూషన్ కార్బండ తదితర నటీనటులు అద్భుతంగా నటించిన.. అదే జీవించిన చిత్రం ఇది. ఇది చూడకపోతే మనం జీవితం లో ఎదో కోల్పోయినట్టే. it gives a meaning to our lives. ఒక్కసారి ఈ సినిమా చూస్తే మన జీవితం మొత్తం ఈ సినిమా చుట్టే తిరుగుతుంది. ఇది ఖాయం. ఎన్ని జన్మలైన ఈ సినిమా తాలూక చాయలు మనతోబాటే వస్తాయి అని నా నమ్మకం. రహమాన్, ఇళయరాజా ఈ చిత్రం లోని పాటలనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. చిత్రానువాదానికి .. అదే స్క్రీన్ ప్లే... ఇది ఒక బ్లూ-ప్రింట్. ఇవ్వంటికంటే ముఖ్యమైనది "నటపిశాచి" (థాంక్స్ ఎం.ఎన్.ఎం) సాయి కుమార్ డబ్బింగ్. చెప్పడం మరిచా ఈ సినిమా హింది లో ప్రధమంగా తీసారు. ఎవడికి వచ్చిందో కాని ఆలోచన దిన్ని తెలుగులో అనువదించారు. ప్రతి క్షణం ఉట్కంటభరితం గా ఉంటుంది. అచ్చు హింది సినిమాలో అరవ మాసు కలిపి ఒరియ నృత్యాలతో అస్సామీ కామెడీ తో తెలుగు భాషలో ఉంటుంది. దేశ సమైక్యత కి ఇంత కంటే నిదర్శనం ఉండదు!!!

కథా పరంగా వస్తే - మొదటి సీన్ తోనే మీ మెదడు బద్దలైపోద్ది. కుల్భూషన్ ఒక పెద్ద వ్యాపారవేత్త. అతను ఎక్కడో వేరే ఊరు నుండి ఫోన్ చేసి వాళ్ళావిడ తో "హే డార్లింగ్" అని మొదలెడుతాడు. మన బాబా బాత్ టబ్ లో నుండి వాళ్ళా నాన్న తో మాట్లాడతాడు. ఇది చూసాక కూడా మీరు తట్టుకోగలిగితే మీరు అర్జెంట్ గా ఉన్నపళంగా వెళ్ళి రాం గోపాల్ వర్మ కి ఆగ్ తెచ్చుకొని పకోడి తింటూ చూసేయచ్చు. అదేంఖర్మ.. ఎంచక్క పరదేశి, హం సాత్ సాత్ హైన్, వివాహ్ గట్ర కూడా అవలీలగా చూసేయచ్చు. సారీ రూటు మళ్ళాను.. ఎక్కడున్నా.. ఆ.. అంతలో మాధురి దీక్షీత్ వస్తుంది. మన వీరోలు ఇద్దరు తనతో ప్రేమ లో పడతారు.. సారి తనని ప్రేమిస్తారు. (ఈ ముక్క తారాగణం చదివినప్పుడే అర్థమైంది రా అంటారా... ) కొన్ని అధుభుతమైన సీన్లనంతరం ముగ్గురూ ఒక పార్టీ కి వెళ్తారు. వెళ్తారో సడ్డన్ గా పార్టీ ప్రత్యక్షమౌతుందో సరిగ్గ గుర్తులేదు.. కొంచం చూసి చెప్పండి .. అక్కడ రజనీకాంత్ మందు గ్లాస్సు చేత్లో పట్టుకొని అదో రకంగా జాకీ వైపు మరో రకంగా మాధురి వైపు చూసి చూసి చూసి అలసి ఒక కలల పాట.. అదే డ్రీం సాంగ్ .. డ్రీం సాంగో నైట్మేర్ సాంగో తెలీదు.. ఊహించుకుంటాడు. తనతో మాధురి తో అనుకుంటే మీకు ఇంకా ఈ సినిమ అర్థం కాలేదు. ముందేళ్ళి మొదటినుండి చూడంది మళ్ళా. అప్పుడైన అర్థమౌతుందేమో.. జాకీ, మాధురి మీద పాట ఊహించుకుంటాడు ఆ పాటేంటో తెలుసా "ప్రెమరాయా స్వాగతము.. ప్రేమరాయా స్వాగతము.. నామది కోరెను నిన్నే.. " అంటూ చాలా చలాకీ గా సాగుతుంది పాట. జైహో కి కాదు ఈ పాటా కి ఇవ్వాలి ఆస్కర్ .. ఏం చేస్తాం. తర్వతే అతి కీలకమైన ట్విస్ట్. అది ఏంటో తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే!!!

ఇంకొక్క సీన్ వర్ణిస్తా ప్లీజ్ ప్లీజ్. నాకు నచ్చిన సీన్ ఇది. రజనీ కీ వాళ్ళ అమ్మ కుల్భూషన్ మొదటి భార్య కాదు రెండవ భార్య అని తెలుస్తుంది.. అప్పుడు అతని ఆర్ధ్రత ని మన కంటికి కట్టీనట్టూ నటనతో చెవుల్లో జీవితకాలం ఉండిపోయేట్టూ డబ్బింగ్ తో "నేనెప్పుడూ అనుకునేవాడ్ని మా అమ్మ - భార్య నంబర్ వం, మమ్మీ నంబర్ వన్, లక్కీ నంబర్ వన్ అని.. కాని నువ్వు నంబర్ టూ అమ్మ నువ్వు నంబర్ టూ.. ఈహ్ హీ హీ .. ఈహ్ హీ హీ " అన్న డవిలాగ్ ఈ జన్మ లో ఎవ్వరి మర్చిపోలేరు. తర్వత ఏం జరుగుతుందో నాకు తెలేదు. అంతకు మించి నేను ఎప్పుడూ చూడలేకపోయా. కన్నీటి సముద్రం లో మునిగిపోతా ఇది అయ్యేసరికి.. అందుకే.

ఈ చిత్రాన్ని మేము ప్రతి శుక్రవారాం మిగితా అన్ని సినిమాలు చూసేదానికి ముందు ఓ అరగంట చూసేవాళ్ళం. ఇది చూసాక టైగర్ హరిస్చంద్ర ప్రసాద్, విజేంద్ర వర్మ - శంకరాభరణం లా అనిపించ్చేవి. ఇంతటి అమోఘమైన చిత్రాన్ని మీరు ఆస్వాదించండి. ఆనందించండి. చూసి నన్ను అభినందించండి.

భాగం-1
, భాగం-2 మరియు భాగం-3

6 comments:

Karthika May 10, 2009 10:26 AM  

Oyee neeku em ayyindi babu?mind baane undi gaaa?emo naku aithe doubt vastundi munde nuvvu tikka emadya ento tega post chessestunaav avi antha peddavii.

R u fine???konchem me avida ni kanukonii reply ivvu urgent gaaa.naku ento bayam ga undi :(,
Get well sooon.

Inka ee post naku oka mukka ardam kaledu rondo sari chadive opika aithe asaale leduuu :(.takecare

sreechandana May 10, 2009 2:44 PM  

oh my god.. nenu starting chusi idedo nice movie nenu miss inattu vunna urgent gaa chuseyaali ani feel iyyaa... nice post.. :)

Shashank May 10, 2009 7:29 PM  

pinky nuvvu ee cinema tattukolevu le. ye movie tere bas ki baath nahin hein. postla varsham antava.. adi aagipoddi le... :-D


@sree - thanks! pandaga chesuko. inka aalasyam enduku? download chesukoni prati vaaram chuseyandi inka. :)

వేణూ శ్రీకాంత్ May 10, 2009 9:35 PM  

అసలు ఈ సినిమా అంతా చూసి రివ్యూ కూడా రాసారంటే మీరు సామాన్యులు కాదు... :-)

Shashank May 11, 2009 7:40 AM  

వేణూ - ఈ సినిమా నేను 2003 ప్రాంతం లో చూసా మొదటి సారి. అప్పటి నుండి ఒక 3-4 సార్లు మొత్తం, ఇంకో 5-6 సార్లు పార్ట్లు పార్ట్లుగా చూసింటా. ఒక్క సారి చూసి ఎవ్వరైన మర్చిపోగలర ఈ కాళాఖండ్డాన్ని ? అదే సమయం లో ఇంకో గ్రేట్ మూవీ చూసా.. "నవ్వు నవ్వించు" అని.. వీళైతే అది చూసే ప్రయత్నం చేయండి.

జీడిపప్పు May 11, 2009 10:04 PM  

శశాంక్ అన్నా, జనాలమీద పగబట్టి మరీ ఈ సినిమాలను రెకమండ్ చేస్తున్నావు.. ఎందుకింత కచ్చ?. చూడబోతే 'డెట్రాయిట్ పులి" హరినాథ్ పోచర్ల సినిమాలు కూడా రెకమండ్ చేసేలా ఉన్నావే!!

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP