Tuesday, May 19, 2009

మిషన్: షాపింగ్

అసలు భూ ప్రపంచం లో అతి బోర్ కొట్టే పనుల్లో ఈ షాపింగ్ ఒకటి. అన్-లైన్ కాదు నడుచుకొని వెళ్ళి కొంటామే అది. నా లిస్ట్ లో బట్టలు మడతపెట్టడం తర్వత వస్తుంది ఇది. అంత బోర్ నాకు షాపింగ్ అంటే. ఒక్క పుస్తకాలు కొనేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇది ఇష్టం ఉండదు నాకు. పుస్తకాలు అంటే అబ్బో అదో సరద నాకు. చిన్నప్పుడు కోఠీ లో, ఆబిడ్స్ లో ప్రతి ఆదివారం పెట్టే పుస్తకాల కొలువు కి వెళ్ళేవాడ్ని. ఓ 3-4 గంటలు తీరిగ్గా వెతికి బేరమాడి నాకు నచ్చేవి నచ్చుతాయి అనుకున్నవి తెచుకునెవాడ్ని. ఇది ప్రతి వారం కాదు.. నాన్న ఇచ్చిన జేబు డబ్బు లో నా "దినసరి" ఖర్చులు పోను మిగిలినవి దాచుకొని రెండొందలో మూడొందలో అయ్యాక వెళ్ళేవాడ్ని. ఇప్పటికి గుర్తొస్తే ఆ రోజులు కొంచం బాధగ కొంచం ఆనందంగా ఉంటది.

కాని నేను మాట్లాడుతున్న షాపింగ్ పుస్తకాలు కాదు.. రోజు వారి చేసేది. మొన్నామధ్య దివ్య వాళ్ళ స్నేహితుడు ఒకడు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండచ్చు కద... పనికిమాలిన రాళ్ళ నుమాయిష్ (అదే జెం షో) ఉందని చెప్పడు. అప్పటికి చెప్పా నువ్వు వాడు వెళ్ళిరండి నన్ను ఒగ్గేయండి అని. ఊ హూ.. నా మాటే వింటే తను దివ్య ఎందుకు అవుద్ది? రారా అని లకలకలక అని నిను వీడని నీడను నేనే... అంటే మరి మరి చివరి పాట కాదు కాని మిగితావి పాడతా అని బెదిరించి లాక్కెళ్ళింది నన్ను. నాకు ముందే బద్దకం. అసలు ఆదివారం (ఎన్.ఎఫ్.ఎల్ అప్పుడు) సోఫా నుండి కదలకుండా అలనే శిలా విగ్రహం లా పడుకొని దినమంతా టీ.వి చూస్తా. అలాంటిది వారాంతం అని కూడా చూడకుండ నన్ను ఆ దిక్కుమాలిన జెం షో కి తీస్కెళ్తె ఎల ఉంటది? ఏం చేస్తాం.. కష్టాలు మనుషులకి కాకుండా మంచు బ్రదర్స్ కి వస్తాయా అని వెళ్ళా. తీరా చూస్తే అదేదో సుల్తాన్ బజార్ టు పవర్ సుల్తాన్ బజార్ లా ఉంది. అందరు తెలుగే మాట్లాడుతున్నారు. ఇదేమైన విజేంద్ర వర్మ లా బాలాయ్య కొత్త చిత్రం షూటింగా అని ఒక్క సారి అనుమానం వచ్చింది. తర్వత తట్టింది ఇలా రాళ్ళు రప్పలు రత్నాలు అంటే మనవాళ్ళాకే అమితమైన ఇష్టం కదా అని. అలా మొదలైంది నా దినం.. అదే నాకు ఆ దినం.

సీన్ కట్ చేస్తే ఓ రెండు గంటల తర్వత కూడా వీళ్ళు ఏ ఒక్క "రాయి" కొనలేదు. నేనేమో అప్పటికే కన్య కుమరి నుండి కాష్మీరం వరకు మోకాలి మీద పాకినట్టు నీరశించి పోయా. పోనీ టైం పాస్ కి ఎవరైన అమ్మయిలని చూద్దం అనుకుంటే దివ్య ఫీల్ ఔతుందేమో అని ఆగిపోయా. ఇంక ఇలా అయితే రోజంతా అక్కడే ఉండి నిమిష నిమిషానికి ఓ ఇంచి చొప్పున భూస్థాపితం అయిపోతా అని అనుమానం వచ్చి ఇంక మొదలెట్ట.. ఆకలి, త్వరగా కానివ్వండి అని. అప్పటికి నా పరిస్థితి అగమ్యగోచరమే! గోమేధుకం బఠాని లాగ ముత్యాలు సబ్బు బియ్యం లా కనిపించాడం మొదలయ్యాయి.. అదే విషయం చెపా దివ్య కి. ఇంక నా వళ్ళ కాదే ఇంక పి.టీ.ఉష లా పరిగెట్టేళ్ళి తినకపోతే సోషొచ్చిపడిపోతా అని. పాపాం నిజంగానే అల అయిపోతా అని ఇంకో గంట లో మొత్తం షాపింగ్ అవ్వగొట్టింది.

అదే విషయం ఆలోచిస్తుంటే నాకు ఒక్కటి అనిపించింది. అసలు దివ్య కి ఇంత ఓపిక ఎక్కడిది అని. మామూలుగా అయితే ఎక్కడైన మాల్ గట్రా వెళ్తే ఓ గంట-గంటన్నర తిరిగేసరికి ఇద్దరికి ఓపిక నశిస్తుంది. అసలు అమేరికా లో పరమవిపరీతల్టిమేట్ షాపింగ్ బొనాంజా అయిన థాంక్స్-గివింగ్ షాపింగే రెండు గంటలకంటే ఎక్కువ తిరగము. నాకు బోర్ లెవెల్ తారాస్థాయి కి చేరిపోద్ది అప్పటికి. పద ఇంటికి పోదాం సినిమా కి పోదాం కార్ వరకు పోదాం అని మొదలెడుతా. తనకి అంతే. ఎక్కువ సేపు చేయదు షాపింగ్. కాని మొన్న అలా అవలీలగ నాలుగు గంటలు తను ఏక ధాటిగా షాపింగ్ చేసేసరికి భయం వేసింది. ఇది అలవాటు అయిపోతే నా గతేంటి అని? నేను షాపింగ్ అంటే ముందే ఎల వెళ్ళాలో ఏమి ఏమి కొనాలో అవి ఎక్కడ ఉంటాయో ముందే ఆలోచిచేసుకుంటా. అంతెందుకు సపోజ్ పర్ సపోజ్ హొల్ ఫుడ్స్ కి, లైబ్రరి కి సేఫ్ వే కి వేళ్ళాలంటే ముందుగా కార్ ఎక్కేలోపే ఏ దారి లో వెళ్తే త్వరగ పనులు అయిపోతాయో అని ఓ నాలుగు ఐదు దారులు ఆలోచించేసి "షార్టెస్ట్ పాథ్" ఎన్నుకొని హొల్ ఫుడ్స్ లో సేఫ్ వే లో ఏది ఎక్కడ ఉంటదో బాగా తెలుసు కాబట్టి అందులో కూడా ఏ దారి లో వెళ్తే త్వరగా బిల్ చేయించూవాచ్చో అని ఆలోచించి అలనే చేస్తా.

మామూలుగా నాకు తెలిసి.. అంటే నాకు తెలిసిన బాయ్స్ అందరు ఇలనే చేస్తారు అనుకుంటా. బ్రహ్మచారి గా ఉన్నప్పుడు షాపింగ్ కి ముగ్గురం వెళ్తే కొనాల్సిన వస్తువుల పట్టి ని ముగ్గురం పంచేసుకొని టక టక కొనేసి వచ్చేవాళ్ళాం కార్ దగ్గరికి. బిల్ దగ్గర క్యూ పెద్దగా ఉంటే ఒకడిని అక్కడ ముందు ఆగమని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళి అన్ని కొనేసి తెచ్చేవాళ్ళాం. ఇలా కాకుండా యే షాప్ కి వెళ్ళినా ప్రతి వస్తువుని చూసి పరిశీలించి వీలైతే ఆ వస్తువు ఎల ఉందో మిగితా వాళ్ళూ ఏమన్నరో అని తెలుసుకొని అప్పుడు కొనలా వద్దా అని ఆలోచించి ఓ నాలుగైదు ఫోన్లు చేసి కొనచ్చని తర్వత తర్వత తెలిసింది. ఇల దివ్య చేయదు. ముందే చెప్తున్నా మళ్ళా మొదలెట్టకండి. పాపాం తనకి షాపింగ్ అంటే బోరే. నా పూర్వ జనం సుకృతం అని డిసైడ్ అయ్యా. కాని కొంత మంది నా స్నేహితులని చూసి ఈ అనుమానం వచ్చింది. జీవితం లో నాకు తెలియని అతి తక్కువ విష్యాల్లో ఇదొకటి. అందుకే అడిగి తెలుసుకుందాం అని అడుగుతున్నా. అబ్బయిలు అందరు నాలాగే ఒక మిలిటరి మిషన్ లా షాపింగ్ చేస్తారా? మనలో కూడా షాపింగ్ ని "అనందించే" వాళ్ళు ఉన్నారా? ఆడలేడీస్ కి (ప్రత్యేకించి గంటలు గంటలు తిరిగి షాపింగ్ చేసే వాళ్ళాకి) నా ప్రశ్న - మీ దృష్టి లో షాపింగ్ అంటే ఏంటి : అవసరమా - ఆనందమా - ఏం తోచకుండా కాలం వెళ్ళబుచ్చడమా?

12 comments:

sreechandana May 20, 2009 12:22 PM  

ee vishayam lo i think divya mi wife anukuntaa, nenu divya same.. naaku shopping bore, naaku malls ki velte 2 hrs lo kaallu noppulu anni noppulu vachestaai.. bt gem show ki velte matram 4 hrs ekadaati gaa shopping chestaa... harsha kudaa nannu same question adugutaadu, malls lo vundavu, ikkada elaa 4 hrs 5 hrs vuntunnavvu ani :P

sreechandana May 20, 2009 12:23 PM  

intaku divya emi konnaru jus curiosity :P

Varunudu May 20, 2009 3:37 PM  

షాపింగ్ విషయంలో నువ్వూ నేనూ ఒకటే నెలరాజా ... కానీ మా ఆవిడ మాత్రం మీ ఆవిడ లా కాదు. షాపింగ్ అంటే ప్రపంచం మర్చి పోతుంది. ఆఖరికి చిన్న డబ్బా షాప్ ఐనా సరే.. ఒక రెండు మూడు గంటలు షాప్ చేస్తుంది. నువ్వు నాకు నచ్చావ్ లో హీరోయిన్ చెల్లెలు ఉంటుంది చూడు.. ఆ చీర ఎంత? దాని పక్కది.. ఆ సైడ్ లోది... ఆ పచ్చ రంగు ది.. అని అలా అన్న మాట. ముఖ్యం గా కోల్స్ లాంటి బట్టల షాప్ కు వెళితే జీవితానికి విరక్తి వస్తుంది. దాదాపు ఒక 2 గంటలు తిరిగి, చివరికి ఏమీ కొనకుండా వస్తుంది. ఇంతోటి దానికి ఇంత సేపా అంటే... మరి మనకు ఏ వస్తువు ఎలాంటిదో తెలియాలంటే అన్నీ చూస్తేనే కదా తెలిసేది అంటుంది... నాకా అస్సలస్సలస్సలస్సలు ఓపిక లేదు! సో చిట్కా ఏమంటే.. పిల్లల్ని చూస్కుంటూ ఇంట్లో ఉంటా.. నువ్వెళ్ళి దున్నెయ్ అని పంపిస్తున్నా... కొంచం ప్రాణం హాయిగా ఉంది.!

మా ఆఫీసు లో ఒకతను ఉన్నాడు. అతనికి కూడా షాపింగ్ అంటే అమృతం తాగిన ఫీలింగ్ వస్తుంది. అది ఏ షాపింగ్ ఐనా కానీ... ఆన్ లైన్.. ఆఫ్ లైన్ ఏదైనా.. బోర్ కొడితే.. "ఏంటి అలా సరదాగా షాపింగ్ కు వెళ్ళొద్దామేంటి" అంటుంటాడు. నీ యెంకమ్మా అదేమైనా పార్కా సినిమా నా అంటే. చిద్విలాసంగా నవ్వుతాడు. ఐతే లోకం లో ఎక్కడ డీల్స్ ఉన్నా ఆఫీసు కు మొత్తం దండోరా యేస్తాడు. ఆ విధంగా మా లాంటి వాళ్ళకు కాస్తా వెసులు బాటు.

వీళ్ళందరికీ షాపింగ్ ఎందుకు ఇష్టం అంటే ఏం చేపుతాం.. పుర్రె కో బుధ్ధి అని సరి పెట్టుకోవడమే ...

Shashank May 20, 2009 9:22 PM  

@చందు - ఓహో దివ్య లాంటి నమూనా ఇంకా ఉన్నరన్నమాట. ఈ విషయం తనకి అర్గెంట్ గా చెప్పాలి. :) దివ్య కి ఏమి కొన్నానా ? ఏదో చిల్లర ముత్యాలది ఎదో కొనుక్కుంది. మొన్నామధ్య వాళ్ళ అమ్మ & అక్క తో ఎదో షాప్ కి వెళ్ళినప్పుడు ఎదో రంగుల రంగుల రాళ్ళు కొన్నది. ఆ రాళ్ళేంటో నన్ను అడగొద్దు ప్లీజ్. చెప్పింది.. గుర్తు లేదు. :) నాకు తెలిసినది ఒక్క ముత్యం మాత్రమే. వాటిని చూసి చెప్పగలను ఇది మంచి ముత్యమా కాదా అని.

@వరుణ్ - రచ్చ బ్రదర్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు .. వాడు అంతే రోజు ఒక మేల్ పంపుతాడు - ఈ కొట్టులో ఈ రోజు ఇది చవక ఆ కొట్టులో ఈ రోజు అది చవక అని. స్పాం అని కొడదామంటే చాలా తెలిసిన వాడు. నీ న్యుస్ లెటర్ వద్దు రా బాబూ అన్న సీతయ్య అంటాడు. షాపింగ్ ఎగ్గొట్టేదానికి నా చిట్కాలు - తల నెప్పి, కాలు నెప్పి, పొట్టలో నెప్పి, స్నానం చేసి వస్త, ఇదిగో ఇప్పుడే వెల్దాం అని ఓ గంట అలనే ఉండిపోడం. ఇప్పటికి ఇవ్వన్ని రక్షణ ఇచ్చాయి.

జీడిపప్పు May 20, 2009 11:27 PM  

@ సీడీ & వరుణ్ - మీరిద్దరూ పెళ్ళైనోళ్ళు, హాయిగా ఇంటిపని-వంటపని చేసుకుంటూ ఆనందంగా ఉంటారు అనుకున్నా.. మీకు ఇలాంటి కష్టాలున్నాయన్నమాట!!
అన్నట్టు నేను సగటున ఒక షర్ట్ కొనడానికి 2-3 నిమిషాలకంటే ఎక్కువ ఖర్చుపెట్టను!

Karthika May 21, 2009 12:23 AM  

Hmmm nenu shopping avasaram unte nee chestaanu munde manaki baddakam inka timepass ki shopping aa abbo antha scene ledu:).

Tappadu inka anukuntene veltha shopping ki.but enduko dress koanli ani velthe matram naku nachuthe ani dresses nachutayi nachakunte asalu okkati nachaduuu
:(,inka mothaniki manchidi select chesukune lopuu min 2-3 hrs ayyipotundi:).

Shashank May 21, 2009 8:53 AM  

@బుడుగు - మాకి షర్ట్ కి కూడా అంతే సేపు పడుతుంది. సైజ్ ప్రకారం సరిపోయిందా లేదా అని చూస్తే చాలు.

@పింకీ - నేటి పిల్ల షాపర్లే రేపటి మెగా షాపర్లు. నీకు ఆ లక్షణాలు ఉన్నాయి పుష్కలంగా. ఒక డ్రెస్ కి రెండు గంటలా? నా పెళ్ళికి కావాల్సిన బట్టలన్ని హోల్ మొత్తం కలిపి అంత సేపు పట్టింది నాకు.

Karthika May 21, 2009 2:33 PM  

hehehe adi emo kaani em cheyyanu nachuthe anni nachestayyi anduloo edi tisukovaloo asalu ardam kaadu n nachakapothe nachedi dorike varaku vetakali gaa :).

Varunudu May 21, 2009 11:02 PM  

@జీడీపప్పు

ఏంటి బాబూ ఇంటి పని వంట పని చేస్కుంటే ఆనందంగా ఉంటుందా? ఏది నా గుఱ్ఱం? ఏది నా కత్తి?

షాపింగ్ అనేది చాలా చిన్న కష్టం శిష్యా! అంతకు మించిన కష్టాలు అనేకం ఉన్నాయి.
అవన్నీ నీకు చెప్పి పెళ్ళి పట్ల నీకు విముఖత కల్పించడం ఇష్టం లేక వదిలేస్తున్నా..

Shashank May 21, 2009 11:15 PM  

గురు ఇంక నో థియరి.. బుడుగు కి లగ్గం టైం అయ్యింది. చాలా రోజులు బ్రహ్మచారి గా ఆనందించేసాడు. కాని గురు షాపింగ్ కంటే ఇంటి పని వంట పని వీజీ.

Veena,  May 28, 2009 9:23 PM  

hahahaa good one

naaku shopping ante parama bore, kani love kottha battalu hahaha
chivaraki grocery shopping kuda postpone chesi, cereal for lunch and dinner tho inko roju postpone cheyyataaniki kuda venakaadanu...
yedo neelanti manchi cook neighbor gaa dorike roju kosam aasagaa yeduru choosthu....

henti ee cashew mana budugaa, hello budugabbai yela unnai yenti kaburlu...

Shashank May 29, 2009 12:10 PM  

mana lazyness gurinchi nuvvu pratyekinchi cheppala? legendary kada..

neenemo meeru maa inti pakkaki eppudu shift kodatara ani waiting. pustakalu tiragesi vanta chesestav kada. adee aasa.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP