Sunday, November 15, 2009

సెన్సార్ కత్తెరా మజాకా!!

నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో ఎందుకో అర్థం కాలేదు నాకు. ఇంక పేరు - reference కూడా తీసేయమంటారేమో ఇంకొద్ది రోజుల్లో. అసలు మనది ప్రజాస్వామ్యమేనా అని అనుమానం వస్తుంది. బహుశా పేరుకి మాత్రమే ప్రజాస్వామ్యం.. పద్ధతి మాత్రం రాచరికమే!!

కాదంటారా? ఒక్క సారి చుట్టు చూసుకోండి. ఒక మంత్రి చనిపోతే అతడి కుటుంబ సభ్యులకే ఆ పదవి ఇస్తారు. ఇవ్వకపోతే బస్సులు తగలెడతారు. ఓ రజకీయ నాయకుడి మీద.. అంటే అతడు ఉన్నా పోయినా ఓ మాట చెడ్డగా రాస్తే ఇంక ఐపోయినట్టే. అసలు అతడు బ్రతికున్నప్పుడు మొహం మీద ఓ మాట అంటే అతడు కూడా ఏమికునేవాడు కాకపోవచ్చు కాని అనుచరులు మాత్రం నానా రబస చేస్తారు. సొంత అమ్మ బాబులని అంటే కూడా అంతగా బాధపడరేమో అని అనిపిస్తుంది. ఈ విషయం లో ఇందిరమ్మ ఇంటిపేరు నిజంగానే గాంధి కాదు.. కాని ఆ వాస్తవాన్ని చెప్పినందుకు .. ప్రజలకి గుర్తుచేసీనందుకు కత్తెర పడింది. ఇది మన దేశ పరిస్థితి. ఇప్పుడే కాదు గత అరవై సంవత్సరాల నుండి ఇలనే ఉంది. యే విషయం అయినా సరే ప్రజళ్ళో ప్రజలతో చర్చ అనేది శూన్యం. ఒకడు ఎవడో "ఇది ఇలా చేయాలి" అని శాశిస్తాడు. మిగితా వాళ్ళు శిరసావహిస్తారు. అది మంచో చెడో అని తర్కించకుండా. వేల సంవత్సరాల నాటి రాచరికం గుర్తులు అయ్యిండచ్చు.

సెన్సార్ అనేది వేరొకరిని కించపరిస్తేనో అసభ్యకరంగా మాట్లాడితేనో నియంత్రించాలి తప్ప ఇల ప్రతి ఒక్కదానికి అడ్డుగా నిలవడం సమంజసం కాదు. వాక్ స్వతంత్రం ఎలాగో మనకి లేదు. మన దేశం లో పేరుకి మాత్రమే ఉండే స్వతంత్రాల్లో ఇదోటి. పొరబాటున ఎమైన రాస్తే పబ్లిక్ గా ఏమి జరగకపోయినా లోపల లోపల రాసినోడు గల్లంతు అయిపోతాడు. అంత స్వతంత్రం ఉంది మనకి. ఐనా నేనేం చూడాలో ఎలాంటిది చూడాలో నిర్ణయించేదానికి సెన్సార్ ఎవరు? నేనేమైన చిన్నపిల్లాడినా ఇది చూస్తే చెడిపోతా అది చూస్టే బాగుపడతా అని అనుకునేదానికి? ఇంకో విధం అంటే థియేటర్ లో టికెట్లు ఇచ్చేటప్పుడే కొంచం జాగ్రత్త పడ్డం. అంటే స్కూల్ పిల్లలని "A" సినెమాల్లోకి రానివ్వకపోవడం అన్నమాట. అసలు ఆ సర్టిఫికేట్లకి చూసేవాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదే!! ఉంటే అరుంధతి లాంటి వాయిలెంట్ సినెమాకి చిన్న చిన్న పిల్లల్తో రావడం ఎంటి? ముందే దానికి తాటికాయ అక్షరాలతో రాసారు "A" అని.

మన జనత కూడా మంద లా కాకుండా అప్పుడప్పుడు కొంచం niche లా ఆలోచిస్తున్నారు. మారుతున్న రుచులకి అనుగుణంగా చిత్రాలు వస్తున్నాయి. అందుకే అసలు ఆ సెన్సార్ని లేపేసి రేటింగ్ బోర్డ్ ని పెడితే సరి. అడ్డమైన చెత్త పిల్లలు చూడకుండా చూసే పూచి థియేటర్ మీద పెట్టాలి. అడ్డమైన చెత్త అంటే రోజు టీ.వీ లో వచ్చేదానికంటే తక్కువే!! యే డాన్స్ కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థం ఔతుంది. థూ.. అసలు 4-5 యేళ్ళ పిల్లలు అంత వల్గర్ స్టెప్పులేస్తుంటే నా జీవితం మీదే కాదు అలా వేస్తున్న చప్పట్లు కొట్టే వాళ్ళ అమ్మ నాన్నల జీవితాల మీద కూడా విరక్తి కలుగుతుంది. వాటితో పోలిస్తే మన "A" సినెమాల్లో చెత్త ఇంకా తక్కువే. కుటుంబ సమేతంగా చూసేదానికి శేఖర్ కమ్ములా, కే. విశ్వనాథ్, కృష్ణా రెడ్డి తదితరుల సినెమాలు ఉండనే ఉన్నాయి కద. మిగితా వాటిని కూడా "కుటుంబ సమేతం" చేయడం ఎందుకు?

ఇది నా ఓన్-సొంత-పర్సనల్ అభిప్రాయం. అలకాదు ప్రతి మాటకి కత్తెర పడాలి అంటే ఇంక అనేది ఏమీ లేదు. నా దృష్టిలో మాత్రం సెన్సార్ బోర్డ్ సుద్ధ దండగ. కించ పరిస్తే మరోకరిని గాయ పరిస్తే వేరే విషయం కాని చిన్నా చితక రెఫరెన్సుల్ని కూడా పట్టించుకొని ప్రతి సినెమాని చెడగొట్టడం మాత్రం మంచిది కాదు అనే అంటాను.

13 comments:

Vasu November 15, 2009 6:36 PM  

ఒక చిన్న సవరణ." ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ" పాట లో ఆవిడ ఇంటి పేరు గాంధీ కాదు (అది నిజమయినా) అని కాదు ఉద్దేశ్యం. గాంధీ ని గుర్తుపెట్టుకోవల్సింది అలా కాదు అని. రెండో లైన్ కూడా వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఊరుకొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇది సిరివెన్నెల గారే స్వయంగా చెప్ప్పారు. కానీ విన గానే మీరు చెప్పినట్టు గా అర్థం చేసుకుంటే ఎందుకొచ్చిన గొడవ అని తీసెయ్యి అన్నారుట వీళ్ళు సై అన్నారుట. మన దేశం లో ముఖ్యంగా మన రాష్ట్రం లో ఫ్రీడం అఫ్ ఎక్ష్ప్రెషన్ లేదు. ఇప్పట్లో రాదు.

Vasu November 15, 2009 6:38 PM  

"ఇది నా ఓన్-సొంత-పర్సనల్ అభిప్రాయం"

మీ బ్లాగ్ లో మీరు చెప్పేది మీ అభిప్రాయమే కదా. ఎందుకంత నొక్కి వక్కానించి ఇబ్బంది పడతారు :)

Shashank November 15, 2009 7:32 PM  

వాసు - అది నిజమే. నేను అన్నది "గాంధి" గురించి ఆ పాటలో ఎలా ఉందో అని కాదండి. మన వేస్ట్ గాళ్ళు ఎలా తీసుకున్నారు దాన్ని అని. ఆ పాట గాంధి గురించే కాని అందుకు కాదు కద కత్తెర పడింది.

నా సొంత అభిప్రాయం అని ఎందుకు అన్ననంటే కొంత మందికి బ్లాగంటే సొంతము స్వభప్రాయం అని ఓ పట్టన అర్థం కాదండి. కోడి గుడ్డుమీద ఈకలు పీకుతారేమో అని ముందు జాగ్రత్త చర్య.. అంతే..

Praveen Sarma November 15, 2009 9:04 PM  

నేనేమీ గాంధేయవాదిని కాదు కానీ మన సినిమా సెన్సార్ బోర్డ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు తెలియడం మంచిది. సెన్సార్ బోర్డ్ లో పదవులు లభించేది రాజకీయ నాయకులకీ, వాళ్ళ బంధువులకీ, సినిమా నిర్మాతలకీ, డైరెక్టర్లకీ, హీరోలకీ. 1970కి ముందు కాలంలో హిందీ సినిమాలలో బికినీలతో సెన్సార్ లేని ఎక్స్పోజింగ్ సన్నివేశాలలో నటించిన శర్మిల టాగోర్ కి కూడా సెన్సార్ బోర్డ్ లో పదవి వచ్చింది. మన సెన్సార్ చట్టాలు నిజంగా జోక్ కాకపోతే మరేమిటి?

అబ్రకదబ్ర November 15, 2009 10:29 PM  

@ప్రవీణ్:

సెన్సార్ గురించే కాదు, ప్రపంచంలో ఏ విషయం గురించైనా మరెవరికీ తెలీసి విషయాలు మీకు చాలా తెల్సనుకుంటా.

Praveen Sarma November 15, 2009 10:37 PM  

మాలతీ చందూర్ అనే ఒకావిడ సెన్సార్ బోర్డ్ గురించి తనకి తెలిసి తెలియని విషయాలు మాట్లాడింది. సెన్సార్ బోర్డ్ లో విధ్యాధికులని మాత్రమే నియమిస్తారట! అది ఆవిడ అభిప్రాయం.

Anonymous,  November 16, 2009 1:34 AM  
This comment has been removed by a blog administrator.
Anonymous,  November 16, 2009 1:38 AM  
This comment has been removed by a blog administrator.
Anonymous,  November 16, 2009 4:33 AM  

రాజకీయం కాస్త రజకీయం ఐనట్టుందండి ..

మీమీద ఏ రజక కులస్తులో కేసు వేసే ప్రమాదం వుంది ... దిక్కుమాలిన ప్రజాస్వామ్యం లో వున్నాం కదా ...

Shashank November 16, 2009 7:35 AM  

@Anon - maryadaga mATlADAlEkapOtE comment chEyaDam mAnEyanDi. antE dhairyam unTE pEru rAyacchu kada?

@praveen - mI abhiprAyam mIru cheppAru. adi nijamE anipistundi. sensor board O pedda jOke.

Shashank November 16, 2009 7:40 AM  

@anon - మీ వ్యాఖ్యలని తీసేసానండి. బూతులు లేకుండా రాయండి ప్లీజ్. అదొక్కకారణం వలనే తీసేసాను. కేసుల గురించి ఆలోచించకండి.. నేను ముందే ఓ రెండు కేసులేసి రెడీ గా ఉన్నా... ఎవరి పేరు కావాలంటే వారి పేరు రాసేయడమే!! ముందుజాగ్రత్త...

@అబ్రకదబ్ర - హి హి హి. కొంతమంది కారణజన్ములు.. తెలీదా?

Praveen Sarma November 16, 2009 8:03 AM  

సెన్సార్ బోర్డ్ లో రాజకీయ పార్టీల వాళ్ళకి (అది కూడా అధికార పార్టీ) వాళ్ళకి సభ్యత్వం ఇస్తారు. వీరితో పాటు సినిమా రంగంలో పని చేసిన అనుభవం ఉన్న నిర్మాతలకీ, డైరెక్టర్లకీ, హీరోలకీ కూడా సభ్యత్వం ఇస్తారు. ఈ విషయం కొన్ని న్యూస్ పేపర్లలో కూడా వ్రాసారు. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కొత్త నియమాలు పెట్టింది. సినిమాలలో విలన్లు, ఫాక్షనిస్టుల పేర్ల పక్కన రెడ్డి, నాయుడు లాంటి కులం పేర్లు పెట్టకూడదు. ఫాక్షన్ సినిమాలపై రెడ్డి సంఘాలు, కమ్మ సంఘాలు అభ్యంతరం చెప్పడం వల్ల సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు.

హరే కృష్ణ . November 21, 2009 11:48 AM  

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

"అడ్డమైన చెత్త అంటే రోజు టీ.వీ లో వచ్చేదానికంటే తక్కువే!! యే డాన్స్ కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థం ఔతుంది. థూ.. అసలు 4-5 యేళ్ళ పిల్లలు అంత వల్గర్ స్టెప్పులేస్తుంటే నా జీవితం మీదే కాదు అలా వేస్తున్న చప్పట్లు కొట్టే వాళ్ళ అమ్మ నాన్నల జీవితాల మీద కూడా విరక్తి కలుగుతుంది"


కేకో కేక కుమ్మేసావ్
keep going

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP