Monday, February 8, 2010

రణ్ - మీడియా రణరంగం

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రస్ఫుటంగా అనిపిస్తుంది.. గత రెండు నెలలుగా మన ఆంధ్ర దేశం లో జరిగిన అల్లకల్లోలాకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇలాంటి స్థిథి నెలకొన్నదానికి ఓ రకంగా పర్తికా రంగం దోహదపడింది. TV9, TV5, I-TV గట్ర గట్ర ఎంత సేపు ఎవరు ముందు చెప్పారా వార్తని ఎవరు ఎవరిని "ఓడించారా" అన్న విషయం మీదె ఎక్కువ మక్కువ చూపుతోంది.. అసలు వార్త కంటే. వై యెస్ ఆర్ ప్రయానించిన హెలీకాప్టర్ కనిపిస్తే ముందు ఆ వార్త చెప్పింది మేమే అంటు అంత దుఖం లో కూడా సొంత డబ్బా కొట్టుకోవడం మనం చూసాము. ఓ రాజకీయ నేత కి ఓ ప్రఖ్యాత చానెల్ అధినేతకి చాలా మంచి సంబంధాలు ఉండడం వలన రెండు రోజుల్లో ఆపేసిన నిరాహారదీక్ష ఎంత పెద్ద గందరగోలం సృష్టించిందో విధితమే.

ఒక కాలం లో బొఫొర్స్ ని బయటపెట్టి 'investigative journalism తో దేశానికి మేలు చేసిన పత్రికలు లేకపోలేదు. 75-77 లో ఎమర్జెన్సీ లో పత్రికాస్వేచ్చని నిర్బంధించిన ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ సంపాదకీయం స్థానాన్ని నల్లగా చేసి.. అటు తర్వత ఓ యేడాది పాటు అసలు పత్రికనే ప్రచురించకుండా అందులో పని చేసే అందరికి జీతాలు ఇచ్చిన పత్రికలూ ఉన్నాయి. అవన్ని గతం గతః ఎమో అనిపిస్తోంది ఇప్పుడు. ఎంతసేపు TRP రేటింగ్స్ ... అడ్డతిడ్డమైన అసహ్యకరణమైన నృత్యాలు గోరంత వార్తని కొండంత చేసి చూపే ప్రయత్నాలు. ప్రతి గంట ఎక్కడ నుండి వస్తాయి "బ్రేకింగ్ న్యూస్" ??? అందుకే వార్తలని సృస్టిస్తున్నారేమో. ఇలాంటి సమయాల్లో యే కొంచం అలజడి జరిగినా వీళ్ళకి పండాగే!! గొడవ ఆగిపోతే మళ్ళ చూపేదానికి వార్తలు విశేషాలు ఉండవు కద! ఎన్ని రోజులు గొడవలు జరిగితే అన్ని రోజులు పండగ.

ఈ వార్తా చాన్నెల్ల వ్యవహారం గురించే వర్మ తీసిన "రణ్". కొంచం కథా పరంగా బేలాగా ఉన్న కథనం మాత్రం నిజానికి దగ్గర్లో అనిపించింది. ఈ రోజు మన దేశం లో ఉన్న .. దేశం అనే కాదు ఇక్కడ అమేరికా లో కూడా అలానే తగలెడ్డాయి .. గోరంతని కొండంతగా చూపిస్తూ. సినెమా అంతా ఒక ఎత్తు.. అమితాబ్ చివర్లో 20 నిమిషాలు మీడియా ని కడిగేయడం ఒక ఎత్తు. అసలు ఆ సినెమా ని ఆయువుపట్టు అదే అనిపించింది. పైపెచ్చు మన తెలుగు వారికి బాగా అర్థం ఔతుంది.. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితుల ద్రుష్ట్యా.

నటనా పరంగా చూస్తే అమితాబ్ కొంచం కంట్రోల్డ్ గా చేసారు. ఆ చివరి క్లిమాక్స్ లో మాత్రం తన నటనా వైశిష్ట్యాన్ని చూపారు. తరువాత నాకు నచ్చిన వాడు సుదీప్. అతడు కన్నడ నటుడట. చాలా చాలా బాగా చేసాడు. కాని ఒక్కటే ఏంటంటే ప్రతి సీన్ లో ధూమపానం చేస్తూ ఉంటాడు. అదొక్కటే చిరాక్ గా ఉండింది. రితేష్ దేష్ముఖ్ సీరియస్ రోల్ చేసాడు. ఎప్పుడు నవ్వించేవాడు ఇందులో అంత సీరుయస్ గా చేయడం బాగుండింది. ఒక్క చోట అతని నిస్సహయత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.. భలే సీన్ అది. అదే సీన్ లో ఇంకొకడు మొనీష్ భేల్. వార్తని సృష్టించినా అడపాదడపా అబద్దాలు చెప్పినా ఆ మనకేమౌతుందిలే.. చూసేవాళ్ళు చూస్తారు అన్న భావన ఉన్న చానల్ అధిపతి. డబ్బే ప్రాధన్యాం గా మంచి రోల్. పరేష్ రావల్ గురించి చెప్పక్కరలేదు. గుల్ పనాగ్, సుచిత్ర బాగా చేసారు. ఈ సినెమాలో నాకు నచ్చిన ఇంకో ఆంశం ఏంటంటే ఏదైన వీడియో చూస్తుంటే చూసేవారి ముఖ కదలికల మీదే ఉంటుంది కమేరా.. వీడియో కంటే. వారి ఎక్స్ ప్రెషన్స్ ని బట్టి చెప్పచ్చు అది ఎంత షాకింగో ఏంటో అని. నాకు అది నచ్చింది.

చివరగా ఓ మాట - మీడియ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడచ్చు. తొక్కలే నాకెందుకు ఎవడు ఎటుపోతే అని అనుకుంటే గంటన్నర సమయం వృధ అని అనిపిస్తుంది. కామేడి ట్రాక్ పాటలు గట్ర ఏమీ లేదు. సింగల్ పాయింట్ అజెండ తో తీసిన చిత్రం. సీరీయస్ సినెమాలు చూసేవారికి నచ్చుతుంది.

3 comments:

Karthika February 09, 2010 4:06 AM  

gud to see ur post after a loooooooooooooooooong time :).

పరిమళం February 10, 2010 2:10 PM  

సినిమా చూశాను.మీ రివ్యూ బావుంది .మీడియా వల్ల మంచి జరుగుతుందా ,చెడుజరుగుతుందా అని తేల్చుకోలేకపోతున్నది సామాన్య ప్రజలు !

హరే కృష్ణ . February 13, 2010 9:40 AM  

hare krishna hare krishna krishna krishna hare hare
hare rama hare rama rama rama hare hare

welcome back
సుదీప్ బాగా చెసాడు
మంచి సినిమా big B న్యాయం చేసాడు
చాలా బాగా రాశావ్ shashank

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP