Saturday, July 25, 2009

kavya's dairy - కావ్యము కాని డైరీ

కొన్ని సినిమాలు చూస్తే అంటే ఓ పది క్షణాలు చూస్తే చెప్పేయచ్చు ఎలా ఉంటాయో అని.. ఎవరో అన్నట్టు అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక్క మెతుకు చాలు టైప్ అన్నమాట. అలా అని మొత్తం సినిమా చూడకపోతే తీసినోడు ఫీల్ ఔతాడు కద.. అందుకే మొత్తం చూస్తా నేను. సినిమా అయ్యాక పేర్లు వస్తాయి కద.. అప్పటి వరకు చూస్తా. ఇలానే మొన్నా ఓ సినిమా చూసా.. ఓ ఐదు నిమిషాలు చూసేపాటికి స్టోరీ చాలా మటుకు అర్థం అయిపోయింది.. కాని పుట్టుకతో వచ్చిన బుద్ధి కద సోఫా లో పడుకొని మిగితా చూసా.

అదే కావ్యాస్ డైరీ. ఇప్పటికి ఇలాంటివి ఓ వందో వెయ్యో వచ్చింటాయి .. సతకోటిలో ఇదోటి అంతే. పెద్దగా గుర్తుండే సన్నివేశాలు కాని డైలాగులు కాని సీన్ కాని అసలు ఏమి గుర్తుండదు ఓ రోజు తర్వత. అంత గ్రేట్ మూవీ ఇది. యే సన్నివేశం చూసినా ఇంతక మునుపే చూసిన ఫీలింగ్ కూడా ఉంటది. అది బోనస్. ఏం జరగబోతోందో అని ఇంతకముందు ఓ రెండు మూడు సినిమాలు చూసిన పెతీ ఒక్కరు చెప్పగలరు. ఇంక అసలు కథ (నాకు గుర్తున్నంత వరకు) - ఓ ఇల్లు, ఓ ఫామిలి అంటే కరెష్ట్ గా ఓ అమ్మా ఓ నాన్న ఓ చంటిది ఓ బుడ్డోడు వాళ్ళకి ఓ కుక్క. పెద్ద ఇల్లు. ఇందులో ఎగెస్ట్రా ఏంటంటే మంజుల కి ఓ గ్రీన్ హౌస్ ఉంటది. ఓ తోటమాలి .. అదే రాజేష్. రోల్ పెద్దగా లేదు అతనికి .. అలా ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తాడు అంతే.

స్క్రీన్ మొత్తం చార్మే ఉంటది.. ఎంట్రీ ఇచ్చాకా. మంత్రా తర్వత ఇలాంటి కారెక్టర్లకే పరిమితం అయిపోయినట్టు ఉంది చార్మి. అనుకోకుండా ఒక రోజు లో కొంచం నార్మల్ గానే ఉండేది తర్వత ఏమైయిందో ఏమో కాని ఆవిరి కుడుము లా తయారయ్యింది.. కొంచం ఏంటీ బానే తగ్గాలి. అసలు మెడ కనిపించడం లేదు. పోనీ మనమేమైన సావిత్రా అంటే అది కాదు కద.. క్లోస్ అప్ లో ఐతే చూసి జడుసుకున్నా. మా నటశేఖర నటకిరీటి నటచక్రవర్తి నటసామ్రాట్ నటరాజ సూపర్ స్టార్ గారి అమ్మాయి ఐతే ఈ రోల్ కి చాలా బాగా స్యూట్ అయ్యింది. అచ్చు మా సూపర్ స్టార్ ని చూసినట్టే ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు దివ్య ఏమో తర్వత ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అన్నది.. నాకు అర్థం కాలే నేను చూడని మూవీ తనెప్పుడు చూసిందా అని.. అప్పుడు చెప్పింది ఇది "hand that rocks the cradle" అని చిత్రం కాపీ అట. ఈ చిత్రం లైఫ్ టైం లో ఎప్పుడో వస్తే చూసిందట. లైఫ్ టైం కూడా చూస్తావా అని పరమవిపరీతల్టిమేట్ ఎక్స్ ప్రెషన్ ఒకటి పెట్టి మరో సినిమా చూడ్డం మొదలెట్టా..

<దీనితోబాటే చూసిన ఇంకో రెండు సినిమాల రివ్యూ రాద్దాం అనుకున్నా.. కాని అస్సలు టైం లేదు. మా బాసు రెండు నెలలు పట్టే పనిని ఒక్క వారం లో చేస్తాం అని క్లైంట్ కి చెప్పొచ్చాడట. థూ నా బ్రతుకు అని పని చేస్తున్నా(ము). దాని గురించి మళ్ళా చెప్తా లే..>

1 comments:

హరే కృష్ణ August 09, 2009 1:21 AM  

హరే హరే
ఎలా వున్నావ్ శశాంక్
చాలా రోజులు అయ్యింది కదా

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP