Thursday, July 9, 2009

పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్..

ఏంటో.. కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు నాకేమైన తెలుసా అని. అంటే ఏ ఒక్క ఫీల్డ్ లో అయినా కొంచం కొద్దో గొప్పో జ్ఞానం ఉంది అంటే అది ఈ సాఫ్ట్ వేర్ రంగం లోనే.. కాని ఇది ఓ మహా సముద్రం లా అనిపిస్తుంది. అది నిజమే.. కాని కొత్తగా ఏదైనా వస్తే అది ఎలా పని చేస్తుందో ఎందుకు పని చేస్తుందో అని వెంట్టనే అర్థం ఔతుంది. అదో ఆనందం. తుత్తి. నాలాగే చాలా మంది ఉంటారని నా అభిప్రాయం. మచ్చుక్కి.. గూగల్ వారి "క్రోం" వచ్చినప్పుడు దాన్ని దింపుకొని వాడి -ఓస్ ఇంతేనా. మంటనక్క (ఫైర్ ఫాక్స్) తో పోలిస్తే కొన్ని లేవు కొన్ని మంచిగా ఉంది అని తెలిసే వరకు జీవితం లో అదేదో కోల్పోయినట్టు ఉండడం సహజం. అది మన నైజం.

దీనికి విభిన్నంగా ఒక కొత్త (అంటే కొత్తదేమి కాదు.. ఓ రెండేళ్ళు అయ్యిందనుకుంట) టెక్నాలజి వచ్చి అది అంటుబట్టకుండా ఉంది అంటే అది - ట్విట్టర్. అది మొదలైనప్పుడు ప్రతిసారి లాగే ఓ యకౌంట్ తెరిచా. అదేంటో అని కొంచం వాడాను కాని అంతు బట్టలేదు. అసలు ఎందుకు వాడతారో అర్థం కాలేదు. ప్రతి క్షణం నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు లేరు. ఉండరని నా నమ్మకం. ఆశ కూడా.. నమ్మకం కంటే ఆశే ఎక్కువ. :p నిజంగా ఉన్నరంటే వాళ్ళ కంటే పని లేని వాళ్ళు.. అంటే కే.సీ.ఆర్ టైప్ అన్నమాట.. భూ ప్రపంచకం ఓల్ మొత్తం మీద ఎవ్వరు ఉండరు. అయినా సరే బోలెడు మంది ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఉంటారు. మచ్చుక్కి CNN పొరబాటున పెడితే చాలు. ప్రతి ఒక్కడు న్యూస్ బదులు ట్విట్టర్ చూడండి అంటు తెగ గోల చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో అంత గొప్ప గా నాకేమి కనిపించలేదు. బహుశా కనిపించదు కూడా. well this is just my own సొంత personal opinion. కాదు కూడాదు అని ఎవరైన అంటే కేసు పడుద్ది (TM).

నాకనిపించేది ఏంటంటే గూగల్ పెరుగుదల చూసి అర్రెర్రె ఇది మిస్ కొట్టామే ఇప్పుడెలా అని అనుకుంటున్న సమయం లో ఇది కనిపించింటది.. అందరు యకౌంట్లు తెరుస్తున్నారు బహుశ ఇది నెక్స్ట్ గూగల్ ఔతదేమో .. మళ్ళా ఇది కూడా మిస్ ఐతే జీవితం వేస్టూ అని భావించి ఈ CNN గట్ర ట్విట్టర్ వెంట పడ్డారు అని. అస్సలు పనికిరాదు అని చెప్పడం లేదు.. బంబాయి మీద దాడులు జరిగినప్పుడు ఈ ట్విట్టర్ ద్వారానే చాలా తెలిసింది. అలాంటప్పుడు ఒప్పుకుంటా.. కాని నిత్యం నిరంతరం "నేను ఇప్పుడు ఫార్ లూపు రాస్తున్నా" "ఇప్పుడు సొనాలీ బేంద్రే పోస్టర్ చూస్తున్నా " "ఇప్పుడు బుడుగుని తిట్టుకుంటున్నా" లాంటివి ఎవడు చదువుతాడు అని నా అనుమానం. నాతో ఎవడైన మాట్లాడాలంటే జీ-టాక్ లో పింగ్ చేస్తారు లేకపోతే .. వాళ్ళా అద్రుష్టం పండి ఉల్టా అయితే ఫోన్ చేస్తారు.. అంతే తప్ప ట్విట్టర్ లో "అరేయ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా" అని ఎవ్వడు రాయడు అనే నా ఫీలింగ్.

- ఇప్పుడే వీరో ఎంట్రీ ఇచ్చాడు.
- అప్పుడే ఓ పాట. పాట ఇలా ఉంది "పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్.. " (సాపాటు ఏటు లేదు ట్యూన్ లో..)
- వీరో "అగరబత్తులు" పట్టుకు తిరుగుతున్నాడు. ఎందుకో తెలీదు.
- వీరోఇన్ వచ్చింది.
- హీరో అగరబత్తులు వీరొఇన్ కి ఇచ్చాడు. ఏంటో నాకు పిచ్చేకుతోంది.
- వీరో కలగంటున్నాడు. అందులో బాలయ్య - హరికృష్ణ - తారక రత్నా - కలిసి పాటలు పాడుతున్నారు. అటువైపు నుండి రజని ఈల వేసుకుంటూ వస్తున్నాడు..
- ఇటు వైపు నుండి నేను జంప్ అని.
-----
- ఇప్పుడే మమతా తన రైలు బడ్జెట్ ప్రెసెంట్ చేస్తోంది.
- అటు పక్కనే కె.సి.ఆర్ ఎదో తాగుతున్నాడు
- లాలూ కి ఒక్క ముక్క అర్థం కాకుండా తన నోట్ బుక్ లో ఆవుల బొమ్మలేసుకుంటూ గడ్డిని ఊహించుకుంటున్నాడు.

ఏంటి వీడికి పిచ్చేకిందా అనుకుంటున్నారా? అంత లేదు..ఇది రాబోయే కాలానికి సంకేతాలు. ఆ రెండవది శశి తరూర్ ట్విట్టర్లు. (స్వకల్పితం) పోయినేడు U.N.O ఎన్నికల్లో బాన్-కి-మూన్ కి ప్రత్యర్థిగా నిలచి ఓడిపోయిన అతడికి కాంగ్రెస్ లో సీటిచ్చి పాలకాడ్ నుండి నిలబెట్టారు.. గెలిచేసాడు.. అర్రెర్రె గెలిచేసాడే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగోదేమో అని ఓ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఫుల్ "techie guy, youth తో టచ్ లో ఉన్నా అని ఎలా చెప్పాలా అనుకుంటున్నతడిని ఈ ట్విట్టర్ కరిచింది. దెబ్బకి ఇప్పుడు కేవలం ట్విట్టర్తోనే మాట్లాడుతున్నాడట. పదివేల మంది "followers" ఉన్న మొట్టమొదటి భారతీయుడు అట. (ఎందుకు అని అడగద్దు అది చదివిన తర్వత ఎందుకో వరైటి గా అనిపించింది).

ఈ ట్విట్టర్ మీఎవరికైన అర్థం అయితే ప్లీజ్ నాకు చెప్పండి. ఎం.ఎఫ్. హూసైన్ చిత్రాలు, బాలయ్య రొమాన్స్, అరవ కామెడి, అజిత్ అగార్కర్ బౌలింగ్ - వీటి తో బాటే ఈ ట్విట్టర్ అని డిసైడ్ అయ్యాను. అల కాదు దీన్ని ఇలా వాడాలి అనో అరవ కామెడి ని అర్థం చేసుకే పద్దథి ఇది అనో ఎవరైన నాకు "ట్విట్టరోపదేశం" చేస్తా అంటే - ధన్యుడని. అంత వరకు..

4 comments:

హరే కృష్ణ July 10, 2009 12:25 AM  

hare krishna hare krishna krishna krishna hare hare
hare rama hare rama rama rama hare hare


:)
shashank modatlo idedo baganevundi ani best of youtube ki panikochedi
parama bore twitter

bavundi nee post

MIRCHY VARMA OKA MANCHI PILLODU July 11, 2009 7:42 AM  

auvunu andi paramabore e twitter andi shashank garuu
alage na blog ki kuda vichhesi mee amulyamina coments istharani ashisthu
untanu andi
http://mirchyvarma.blogspot.com

Shashank July 12, 2009 10:11 AM  

@indian minerva - Thanks.

@harE kRshNa. - as usual :p

@ mirchy - bhale peeru. chustanandi mee site.. just koncham busy busy weekend anthe.. :(

ravinice July 28, 2009 1:03 PM  

twitter is a useless thing... somany people wrote that. it is a waste////

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP