Wednesday, August 12, 2009

మేరా నంబర్ కబ్ ఆయేగా ??

ఎనిమిదేళ్ళు. eight long years ఆఠ్ సాల్.. భాష మారినా భావం ఒక్కటే. సంవత్సరాలు గడచినా బాధ ఒక్కటే. ఈ రోజుకి నేను నా స్వర్గం వదిలి ఎనిమిదేళ్ళయ్యింది. నా స్వగ్రామం నా స్వనగరం నా ఊరు.. నా హైదరాబాదు. దాన్ని విడిచి ఇన్నేళ్ళైనా హైదరాబాదు ఎంతగా మారినా సొంతం అనేపాటికి అదో ఆత్మబంధం. నా ప్రపంచం ని రెండుగా విభజించచ్చు. ఒకటి హైదరాబాదు ఇంకోటి నాన్-హైదరాబాద్ (non-hyderabad).

ఎనిమిదేళ్ళా క్రితం రింగులు రింగులు తిప్పితే.. హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ.. రోజూకి ఎక్కువకాదు మామూల్గా ఓ పదో పాతికో వందో పానీ పూరీలు తింటూ ఉండినాను. నలుగురితో నారాయణా అని అందరు రాస్తున్నారు కద అని నేను రాసా జి.ఆర్.యీ నా అద్రుష్టం పండి మధ్యలో విసొగొచ్చి త్వర త్వరగా అవ్వగొట్టేసా .. న్యాచురల్ గానే ఎదో మామూల్ స్కోర్ వచ్చింది. యాహూ అనుకొని గెంతుకుంటూ బయటకి వచ్చా.. ఈ స్కోర్ కి ఎవడిస్తాడు లే అని.. నేను అల తలిస్తే, నన్నే కాపీ కొడతావా అని పైనున్న విధాత మరోలా నిర్ణయించాడు. సీన్ కట్ చేస్తే యడ్మిషన్ వచ్చింది. సరేలే.. వీసా వస్తదా పెడ్తదా అనుకునొని దగ్గర్లో ఉన్న డ్రాప్ బాక్స్ (ఇది ఆ కాలం మాటాలు. గుర్తుందో లేదో చాలా మందికి, ఆ యేడే కొత్తగా drop box పెట్టారు స్టూడెంట్ వీసా కి. అదే యేడు తీసేసారు 9/11 తర్వాత. అది వేరే విషయం) లో పడేసా.. మందు కొట్టాడో ఏమో నాకు ఇచ్చేసారు వీసా. ఆ రోజే అనుకున్న.. శశి అయిపోయింది రా నీ హ్యాప్పీ డేస్ అని..

ఎనిమిదేళ్ళు గడిచాయి ఇక్కడికి వచ్చి. నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు. కొంచం కళ్ళాజొడు సరి చేసుకొని చూస్తే .. చకోర పక్షి లా .. హిటొస్తుంది అని వేచి చూస్తున్న సాయి కిరణ్ లా.. కామెడి పండిస్తా అని అనుకుంటున్న బాలయ్య లా దేశానికి తిరిగివెళ్ళిపోవాల్లన్నా ఆశ తప్ప ఏమీ లేదు. నా స్నేహితులు కొంత మంది ఇప్పటికే తిరుగు టపా కట్టేసారు. ఇంకొంతమంది అదే పని లో ఉన్నారు. నేను ఇంకా "మేరా నంబర్ కబ్ ఆయేగా " అని వేచి చూస్తున్నా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. అంత కంటే ఏం చేయలేము. ఎనిమిదేళ్ళల్లో ఈ దేశం లోని 30 రాష్ట్రాలు చూసాను. దిక్కు మొక్కు లేని డకోటా ప్రాంతం తప్ప బానే కవర్ చేసా.

ఎంచక్క ఇంటి దగ్గర సాయంత్రం 5 కి ఓ రెండు రూపాయలు ఇస్తే అరకిలో వేడి వేడి జిలేబిలు - తోచినప్పుడు పానీ పూరీలు , ఓస్మానియా బిస్కెట్ తో బాటు దం చాయిలు, బావర్చి బిర్యానీ, 113M, 156H, 3 నంబర్ బస్సు, ఆదివారం ఆబిడ్స్ లో పాత పుస్తకాలు, గల్లీ ఓ పది వినాయకులు.. అక్కడ దొరికే ప్రసాదాలు, నిమ్మజ్జనం గలాటాలు, హోళీ రంగులు, సంక్రాంతి పతంగుల ఢీల్ - లడీ - పేంచులు, దీపావళి పటాసులు, బోణాల జాతరలు, హలీములు, అలెక్స్ కిచన్ లో 'american chopsueyలు, గురువారం బాబా గుడిలో భజనలు, నీల్గిరి లో ... లు, RTC X Roads లో లెక్కకుమించిన సినిమాలు, పారడైస్ సాఫ్టీ డెన్ లో ఐస్ క్రీంలు.. లాంటివి ఎంజాయి చేయడం మానేసి ఇక్కడెక్కాడో.. ఇలా.. ప్చ్..

నా ప్రశ్నకి వరుణ్ విశ్వరూపం:

శశి:
ఇక చాలు అమెరికా. ఇక చాలు. ఇంత దాకా నేను కోల్పోయింది చాలు.

వరుణ్:
ఏం కోల్పోయావ్ శశీ?

శశి:
ఇంకా అర్థం కాలేదా నీకు...? యెనిమిదేళ్ళ క్రితం నా దగ్గర యేముండేదో, ఇప్పుడేం లేదో ..అదే కోల్పోయాను.. ఆనందం.. చిన్న చిన్న విషయలకు ఉండే ఆనందం..ఈ అమెరికా ఎప్పుడూ నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నట్టే ఫీల్ ఔతుంది. కానీ నాకేం కావాలో అర్థం చేసుకోదు.

వరుణ్:
శశీ, నీకు ఎప్పుడు అమెరికా లో ఏం చాన్స్ వచ్చినా అది నీ జీవితాన్ని వేయి రకాలు గా బాగు పరిచేది గా ఉంటుంది కదా.

శశి:
ఔను.. వేయి రకాలుగా బాగు పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క సారి నాకు ఏం కావాలి అని ఆలోచించదు. అడిగిందాని కన్నా ఎక్కువ ఇవ్వడం లో ఉన్న సాటిస్ఫాక్షన్ అమెరికా కు తెలుసు.. కానీ కోరుకొన్నది దొరక్క పోవడం లో ఉండే బాధ అమెరికా కు తెలీదు.. నాకు తెల్సు..అస్సలు ఎవరైనా నన్ను అడిగితే కదా తెలిసేది నాకు ఏది కావాలో ఏది ఒద్దో..! ఎదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు.. నన్ను అడగండి వరుణ్.. నా కళ్ళళ్ళో చూసి అడగండి వరుణ్.

వరుణ్:
ఎంటి శశీ, అప్పుడే అమెరికా వెళ్ళే ముందే అడిగాం కదా శశీ నీకు ఇష్టమా లేదా అని..

శశి:
అడిగారు, కానీ నేను చెప్పేది వినరు.. ఆశలు చూపిస్తారు..జీ ఆర్ యీ వ్రాయమంటారు..

నాకు జీ ఆర్ యీ స్కోరు రాకూడదు అని నేను అనుకొన్నా. తీరా చూస్తే వచ్చింది.. నాకెలా ఉండిందంటే, ఆ స్కోరు కార్డ్ చించేసి నేను అమెరికా కు వెళ్ళనూ అని అరవాలనిపించేది.. వీసా వచ్చినప్పుడు కదా అని అప్ప్లై చెయ్యమన్నావ్. నేను చేసాను. కానీ ఇలా అప్ప్లై చెయ్యగానే అలా పోస్ట్ లో వీసా పంపిచేసారు.. ఏడుపొచ్చింది వరుణ్ అప్పుడు నాకు.. ఏడుపొచ్చింది... ! ఒరే శశీ వెళ్ళరా చదివేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పారు. నేనేదో... చదివేసి వెళదాం అనుకొన్నా.. కానీ ఈ అమెరికా ఏమో, నాకు ఉద్యోగమొచ్చేంత చదువు చెప్పింది... నా ఉద్యోగం కూడా అమెరికాయే ఇప్పిస్తే.. నేనెందుకు వరుణ్, ఇండియా వెళతాను..? చివరికి వెనక్కు వెళ్ళాలన్నా, కుదరని పరిస్థితి కల్పిస్తే.. వెళ్ళ బుద్ది కావడం లేదు వరుణ్..

మీకెవరికీ తెలీదు.. ఇలా అమెరికా లో ఉండలేకా, ఇండియా వెళ్ళలేక నేను నరకం చూసాను వరుణ్, నరకం చూసాను. కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..? ఇక్కడకొచ్చేప్పుడు.. నేను ఇండియా లో చెప్పాను. రెండేళ్ళలో మళ్ళి వచ్చేస్తాను అని.. కానీ ఇప్పుడు చెపుతున్నా.. రెండేళ్ళూ కాదు కదా, మరో పదేళ్ళయినా వెళ్ళలేనని.. ఇప్పటి దాకా మీరంతా గెలిచారని సంబరపడుతున్నారు కదా.. కానీ మిమ్మల్ని గెలిపించడానికి యెనిమిదేళ్ళుగా నేను ఓడి పోతూనే ఉన్నాను వరుణ్...ఇలాగే ఓడిపోతుంటే.. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకొంటే.. నా జీవితమంతా అమెరికా యే ఉంటుంది.. అందులో ఇండియా ఉండదు. దయచేసి నాకు నచ్చని దేశాన్ని ఇచ్చి నన్ను ఆనందంగా ఉండమనొద్దు వరుణ్..!

వరుణ్: ఇంత కాలం నువ్వు అమెరికా లో ఆనందంగా ఉన్నావ్ అనుకొన్నా గానీ శశీ, నీ ఆనందాన్ని తీసుకొని మేము సంబర పడ్డమని తెలీదు. తెలీదు శశీ.. ! నాకు అమెరికా లో కంపెనీ కి సి.యి.ఓ గా వచ్చినా ఆనంద పడలేదు కానీ, నీకు అమెరికా లో సీట్ వస్తె రోజంతా పది మందికి చెప్పి ఆనందపడ్డాం.. కానీ మా ఆ ఆనండం కోసం నిన్ను బాధ పెడుతున్నా అని ఎప్పుడూ అనుకోలేదు శశీ.. సారీ రా నాన్నా..! వెంటనే ఇండియా కు వచ్చేసెయ్..

శశి:
థాంక్స్ వరుణ్. మరో రెండేళ్ళాగి వస్తా...!

21 comments:

శరత్ 'కాలమ్' August 12, 2009 3:16 PM  

నాకు మీలా ఇండియా తిరిగివెళ్ళే భాగ్యం లేదులెండి. నేను ఇంట్లో మైనారిటీ. మెజారిటీ ప్రజలందరూ ఇక్కడే బావుందీ - ఇక్కడినుండి కదలమంటారు. ఇహ వానప్రస్థాశ్రమమన్నా ఇండియాలో తీసుకోవాలని అత్యాశ.

నేను ఇండియాకు వెళితే కల్లు తాగిన కోతిలా, కళ్ళెం విడిచిన గుర్రంలా, మదమెక్కిన ఏనుగులా బ్లా బ్లా బ్లా అవుతానని కొందరి ప్రగాఢ నమ్మకం. అందుకే నేను (పర్మినెంటుగా) అటు వెళ్లకుండా కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి.

Varunudu August 12, 2009 4:51 PM  
This comment has been removed by a blog administrator.
భవాని August 12, 2009 5:26 PM  

నాకూ అలానే అనిపిస్తుంటుంది ఒకోసారి. ఇది నా ప్లేస్ అని ఫీల్ అవ్వలేకపోతున్నాను. పని చూసుకొని వెళిపోదామనిపిస్తుంది.

జీడిపప్పు August 12, 2009 6:47 PM  

"నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు."

This is too ridiculous! Yes, we are missing many things but at the same time we are gaining so many. If you ask me - "are you missing?", my answer is "Yes". "Are you living happily?" "Yes". "Did you achieve/learn any?" "Yes, many."

btw, ఈ ఎనిమిదేళ్ళలో నువ్వు అమెరికాలో చేసిన/నేర్చుకున్న/సాధించిన నాలుగు విషయాలు ఏమయినా ఉన్నాయా?

జీడిపప్పు August 12, 2009 6:50 PM  

వరుణుడు గారు, కెవ్వ్వ్వ్వ్వ్ కేక కామెంటు. మీ కామెంటును మీ బ్లాగులో పోస్టుగా వెయ్యండి.

"కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..?"

ఓరయ్యో!!!!! నవ్వలేక చస్తున్నా. Awesome creativity. కమాన్ వరుణ్, activate your blog.

చిలమకూరు విజయమోహన్ August 12, 2009 8:25 PM  

known is an ocean.. అమెరికా కన్నా భారద్దేశంలోనే బాగుంటుందని సాగరమంలోని నీళ్ళన్ని విషయాలను తెలియజేసారు unknown is a drop..తెలియని విషయమేమంటే :) ప్రస్తుతం ఇక్కడ కూడా పరిస్థితి బాలేదని నీటిబొట్టంత విషయాన్ని మరుస్తున్నారు

Shashank August 12, 2009 8:27 PM  

@వరుణ్ - నీ కమెంట్ టపా లో జతపరిచా. and ఉద్యోగం ఇచ్చింది కాదు .. MS చేసాక వెళ్ళీపోదామనే అనుకున్న... చేసిన అప్పులు తీర్చేపాటికి ఓ ఐదేళ్ళు పట్టింది.

@శరత్ - గురూ నిన్ను అన్ని దేశాళ్ళో నిర్బందించాల్సిందే. ఎక్కడైన కల్లు తాగిన.. ;-)

@ భవాని గారు - ఎజ్జాట్లీ!!! ఇన్నేళ్ళైన అదే అనిపిస్తుంది.

@బుడుగు - నేను నేర్చుకున్న దానికంటే కోల్పోయినదే ఎక్కువ. everything is relative. and it depends on perception ఈ దేశం నాకేమిచింది అని ఇంకో టపా రాస్తా. కాని గురు చెప్తున్న కద.. what i miss is more than what i gained.

Shashank August 12, 2009 10:33 PM  

'ఇక్కడ" అన్నారు.. అంటే యే దేశం మహాశేయా ?

నేస్తం August 12, 2009 11:54 PM  

వరుణ్ గారి తో మీ సంభాషణ చాలా బాగా రాసారు.. అయితే మొత్తానికి 2 years లో ఇండియా వెళ్ళిపోతారన్నమాత ..నమ్మచ్చా :)

Anonymous,  August 13, 2009 5:43 AM  

All this talk is trash...the real truth is ...FEW MORE DOLLARS..

Sirisha August 13, 2009 6:56 AM  

hi shashank...nice post nijamga miss avutunnara panipuri ni aitey mee peru cheppi nenu inko rondu ekkuva tinta lendi :P

Shashank August 13, 2009 7:48 AM  

@ నేస్తం - ఇంకా రెండేళ్ళా? ప్రస్తుత పరిషితుల్లొ అది కూడా చాల దూరం గా అనిపిస్తోంది.

@ పింకీ - అబ ఛా!!

@anon - మీకు ప్రతి ఒక్కరి గురించి ఇంత కరెష్ట్ గా ఎలా తెలుసండి?

@ సిరీషా - నీకేం తెలుసమ్మా. ఇంతకముందు అయితే ఏర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్తూ ముందు పానీ పూరి తిని దం చాయి తాగి వెళ్ళేవాడ్ని. ఇప్పుడు పక్క దేశాం లో కట్టారు కద కొత్తది. చూడాలి.

భాస్కర్ రామరాజు August 13, 2009 11:31 AM  

సక్కగా పెళ్ళి చేస్కో!! ఇంట్లోనే తినొచ్చు పానీపూరి.
ఏం మేమంతా తినట్లేదా?

Shashank August 13, 2009 11:45 AM  

మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకుంటదో లేదో మరి...

భాస్కర్ రామరాజు August 13, 2009 11:46 AM  

>>హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ..
??
నువ్వు నిజంగా హైద్ నుండేనా? నిజం చెప్పు. నేనైతే ఇలా చెప్తా
హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి చమోసా తింటూ..
నా దృష్టిలో!! నేను అమెరికాకి వచ్చి కేవలం మూడేళ్ళు. నాలుగో ఏడు నడుస్తోంది. ప్రతీ ఏడు బొంగు ఎనక్కి వెళ్దాంలే అనుకుంటా. ఎంత అనుకుంటానో అంతలా లోనకి కూరుకుపోతా. ఐతే, చివరాకరికి, *తానొకటి తలచిన దైవమొకటి తలచును* అనే సామెత మాత్రం నిజం.
సరే ఫ్లిప్ సైడ్ - ఇప్పుడు అక్కడి పరీస్థితులు నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకం. ఆడికి పోంగనే ఎంటనే ఈడకి వచ్చేద్దాం అనిపిస్తుంది, అది మర్చిపోకు.
ఇక్కడ ఏమి సాధించావ్? ప్రొఫెషనల్గా? అనేది పెద్ద ప్రశ్నేమీ కాదు. ఎందుకంటే *అక్కడి పీర్ ప్రెషర్స్* *వర్క్ కల్చెర్* *ప్రాసెస్* ఇక్కడివాటితో పోలొస్తే చాలా కటువుగా ఉంటాయ్. ఇక్కడ మనగలగటం ఉద్యోఘం వచ్చాక పెద్ద కష్టం కాకపోవచ్చేమో కానీ అక్కడ మాత్రం కత్తిమీద సాము. అంటే టెక్ పరంగా సౌండ్ ఐతే ఏముంది అని అనవచ్చు, కానీ, అది ఒక్కోసారి పెద్ద శపం. మనకి రాజకీయ కోణాలు ఎక్కువ. ప్రాంతీయ తత్వం ఎక్కువ. ఎప్పుడూ *నిచ్చన ఎక్కాలీ, లే లే లే పరుగు పరుగు పరుగు* అనుకుంటాం.
మానసికంగా దెబ్బతీస్థాయ్ కొన్ని. కష్టమో నిష్టూరమో, తొలిఅడుగు ఇక్కడే వేసావ్. ఇలానే నెట్టుకుర. వర్క్ కల్చెరల్ తేడాలతో నీ ఫ్యూచరిస్టిక్ గోల్స్ ని అనవసరంగా కదిలించుకోకు.
నేను అక్కడ 6 సమచ్చరాలు చేసా. బంగళూరు, హైద్, చెన్నై లలో చెసా. నా *థర్టీ యియర్స్ ఇండస్ట్రీ* అనుభవంతో చెప్తున్నా.

మరియూ ఇంకో మాట. ఇది కొంచం ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ చెప్పి తీరాలి. ఇక్కడ యం.యస్ చేసి ఓరినాయనో నేను కత్తి, డాలు అని అనుకుని, మితిమీరిన విశ్వాసంతో, ఛల్, నే యం.యస్ నేనూ ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగం తప్ప చెయ్య అని కొందరు వెళ్ళి బొక్కబోర్లా పడ్డారు. అంటే నువ్వు అలా అని కాదు. చెప్తున్నా. కాబట్టి, ఇక్కడ నుండి ఇండియాకి వెళ్ళే వాళ్ళతో నీ పోటీ, నీ ప్రొఫైల్, నిన్ను నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్కుందాం అనుకుంటున్నావు - ఇవి చాలా ముఖ్యం.

భాస్కర్ రామరాజు August 13, 2009 11:49 AM  

>> మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకుంటదో లేదో మరి...
తూచ్!! సమించన్నా!! ఏదో ఇంకా పిల్లోనివే అనుకుంటున్నా :):)

Shashank August 13, 2009 12:31 PM  

భాస్కర్ - బా చెప్పావు. మధ్యలో నాన్-టెక్ ఎలగబెట్టి విరక్తి కలిగి మళ్ళా టెక్ సైడే వచ్చేసా నేను. నాకు తిరిగి వెళ్ళేదానికి ఉద్యోగమో హైదరాబాదో ఒక్కట్టే reason కాదు గురు. నువ్వేమో ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే తట్టుకోలేవు అంటున్నవ్.. మరి ఇంకా చిన్నప్పుడు అస్సలు ఐడియా లేన్నప్పుడు ఇక్కడికి వచ్చి బ్రతికాము కద. ఐనా కాలం మన చేత్తుల్లొ ఉండదు కద.. దాని టైం వస్తే తిరిగివెళ్ళే ప్లేన్ మనకోసం వేచి ఉంటది. తిరిగివెళ్ళి మళ్ళా ఫార్ లూపులు రాసే ఆలోచన మాత్రం అంతగా లేదు. ;-) (ఇంత కంటే ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను బ్రదర్).

ఆ.. పిల్లాడ్నే.. బుద్ధిపరంగా..

తెలుగోడు,  August 16, 2009 12:37 AM  

you disappointed me... అర్థం పర్థం లేని బాలకృష్ణ డైలాగ్స్ లా ఉంది. so called feminists వ్రాసే మగదౌర్జన్యపు కథల్లా ఉంది. హిందూత్వం మీద సుత్తి సురేష్ కుమార్ వ్రాసే చెత్తలా ఉంది. పాడి పాడి అరిగిపోయి, చిరిగిపోయిన topic. This is the most worst borest topic. నువ్ నిజంగా ఇలా ఫీల్ అవుతున్నావా??? :shock:

Shashank August 22, 2009 11:47 AM  

bAbAi - petI rOju okElA unDalanTE bOr kada.. idi antE ani adjust ayipO. ayinA nEnEmaina mA parents ni missing annana.. :p

@kottapAli - manadi adE routE aa ?

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP