దిల్ బోలే "రక్షించు బాబా.."
నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు. అలా అప్పుడప్పుడు అంటే యాడాదికి ఒకటో రెండో లా అన్నమాట.. నన్ను నేనే చిత్రవధ కి గురి చేసుకుంటా. (సేడో-మసోచిస్ట్ అనుకునేరు.. అంత బొమ్మ లేదు ) అంటే అదేదో చెట్టుకి కట్టేసుకొని కొట్టుకునే టైప్ కాదు.. మానసికంగా అన్నమాట. దానికి కొన్ని కారణాలు కొన్ని పద్ధతులు అవళంబించుకున్నా. శాస్త్రీ గారనట్టు "రాత్రిలో సొగసు ఏమిటో చూపడనికే చుక్కలు.. బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు .. " అని.. అలా అప్పుడప్పుడు నా బుద్ధిని పదును పెట్టుకునే దానికి నన్ను నేనే బుద్ధిపరంగా కొన్ని చిక్కులకి గురి చేసుకుంటా. దానికోసం కొన్ని సార్లు మంచి సినెమా దోహదపడుతుంది. అంటే రాబోయే సీన్ ఏంటా ఇది ఇలా ఎందుకు తీసాడు అలా ఆలోచిస్తా. దానికి విరుగుడు గా ఇంకో రకం సినెమా ఉంటుంది.. చూస్తున్నంత సేపు చూసినందుకు మనమీద తీసినందుకు దర్శకుని జీవితం మీద విరక్తి కలిగించేవి. ఈ చిత్రం రెండో కోవకి చెందింది.
ఈ ఉపోద్ఘాతం (సొల్లు అని కొంతమంది అనచ్చు) ఎందుకురా అంటే ఎదైన విషయం చెప్పే ముందు కొంచం భూమి పని (groundwork) చేయడం నాకిష్టం గనుక. గత కొద్ది సంవత్సరాళ్ళో ఇంత కంటే చెత్త సినెమా నేను చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ మాట నేనంటున్నాను అంటే ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోండి. కథ పక్కనబెట్టండి. అసలు .. పోనీ నేను పంజాబ్ కి ఎప్పుడు వెళ్ళలేదు కాని నాకు తెలిసినంత వరకు అక్కడ మనిషి ఎదురైతే రోడ్డు మీద భల్లే భల్లే అని భాంగ్రా వేయరనే అనుకుంటున్నా. అదేంటో యష్ రాజ్ సినిమాల్లో మాత్రమే ఇలా వెరైటీ గా ఉంటారు పంజాబీలు. ఈ సినెమా వాళ్ళకి చూపిస్తే స్తేట్ స్తేట్ మొత్తం పరువునష్టం దావా వేస్తారేమో. రాణీ ముఖర్జీ కష్ట పడి ప్రతి వాక్యం లో పంజాబీ పదాలు కలిపి మాట్లాడ్డం ఏంటో. నేచురల్ గా రావడం వేరు.. పనిగట్టుకొని ఇలా మాట్లాడ్డం వేరు. మొదటిది - అనుకోకుండా ఒక రోజు లో హర్ష వర్ధన్ టైప్ - you dance, i glance లాంటివి. రెండవది .. వద్దులేండి. తలుచుకుంటేనే అదో మాదిరి ఔతుంది పొట్టలో.
కథా పరంగా చెప్పేదానికి ఏమీ లేదు. పాకిస్తాన్ చేతిలో ప్రతి యేట ఓడిపోతూంటంది మగవాళ్ళ జట్టు. వీళ్ళతో ఐతే పని కాదని ఇగ రాణీ లుంగీ కట్టుకొని బరిలో దూకుతుంది. దసర వేషాళ్ళో దొరికే పెట్టుడు మీసాలు గేడ్డం అద్దెకు తెచ్చుకొని ఫెవికాల్ లో అద్దుకొని. అహా తెలీక అడుగుతాను .. ఓ అమ్మాయి అబ్బయిగా వేషం వేసుకోవడం అంటే మీసం గెడ్డం పెట్టుకుంటే సరిపోద్దా ? చేయి చూస్తే చెప్పచు అమ్మాయి అని. ఏంటో. మిగితాది పక్కన పెడితే కూడా. విరక్తి కలుగుతుంది ఇలాంటివి చూస్తే. పోనీ అలా అని పూర్నిమా రావు లా ఆడుతుందా అంటే అబ్బే ... గల్లి క్రికెట్ లో కూడా అంత కంటే అద్భుతమైన షాట్లు చూడచ్చు. గల్లి క్రికెట్ ని దీనితో పోల్చడం తప్పు. అపచారం. రాణీ లాస్ట్ వికెట్ కి వచ్చీ ఓ ఐదోవర్లల్లో ఓ నూట యాభై పరుగులు కొట్టడం అదీ ఆఫ్రీదీ లా ప్రతి బాల్ అడి.. ఆ ఒక్క షాట్ కోసమే దీన్ని కళా-ఖండం గా పరిగణించచ్చు.
ఈ యేడు ఈ సినెమా ని మన అఫీశియల్ ఆస్కర్ గా పంపాలని నా అభ్యర్తన. ఈ సినెమా చూసాక ఇంక జన్మ లో ఎప్పుడు భారతదేశం నుండి సినెమా అంటే చిన్న చూపు చూడరు. జడుసుకుంటారు. భయపడతారు. కాని కాని ఆస్కర్ ఇవ్వకుండ ఉండరు. ఎప్పటికీ. ఓ ఐదు వందల సంవత్సరాల తర్వత ఎప్పుడైన ఆస్కర్ కమిటీ వాళ్ళకి భరత దేశం నుండి సినెమాల మీద చిన్నచూపు వస్తే ఈ సినెమా లో యే ఒక్క సీన్ చూపించిన చాలు. సెట్ అయిపోతారు. అంత పవర్ ఉంది ఈ సినెమా కి. ప్రపంచ చరిత్రలో ఇదో మైలురాయి. స్టీవన్ స్పీల్బర్గ్, గురు దత్, మణి రత్నం, వర్మా, సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్ - ఎవ్వరు సాధించలేనిది అనురాగ్ సింఘ్ సాధించాడు. జోహార్. ఇది ప్రపంచ అన్ని భాషల్లో అనువదించి రిలీస్ చేసినా ఫ్లాప్ ఔతుంది. అసలు ఈ మహాయుగం లో ఇదే మొట్టమొదటి సినెమా ఐనా ఫ్లాప్ అయ్యేది. అంత గొప్ప చిత్రం ఇది. దీన్ని మీకోసం మిస్స్ అవ్వకండి. ప్లీజ్ నా కోసం వెళ్ళి చూడండి. చూసారా "చూడండి" అని అన్నాను "చూసి రండి" అని అనడం లేదు.. అంత potential ఉన్న మూవీ ఇది. గ్రేట్ సినెమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాంటివి అరుదు. అందుకే చూసి తరించండి.
9 comments:
లాగా చున్రిని బాగా ( लागा चुनारिमे दाग) అనే పరవసింపజేసే సినిమా చూసి ఇటువంటి వాటిని వదిలేసాను .... మీరు చెప్పింది బావుంది ...మంచి సినిమాలు ఎప్పుడైనా వుంటాయి..ఇలాంటి చెత్త చాల అరుదుగా ...
ఐన ..వచ్చే 100 సినిమాల్లో 98 చెత్తే ఐతే ఏమి చేయాలండి ?
మొత్తానికి మీరు కూడా విధాత తలపు తప్పించుకోలేకపోయారన్న మాట.
I think its a remake of a Malayalam movie in which Meera Jasmin was the heroine.
-Hemanth
టెకిట్టు ఆర్ లీవిట్టూ -
వన్ టూ తీన్ చార్
పరె మార్ జీత్ హార్
What You Doing I Liking
Five Six Seven Eight Dont To Be Getting Late
Going To Be Getting Exciting
విజయక్రాంతి అన్నట్టు, నేను లాగా చునరీమే దాగ్, బంటి ఔర్ బబ్లీ లాంటి సినిమాలద్వారా ఓ పెద్ద పంఖా అయిపొయ్యా రాణికి.
మీరేమో ఇలా అంటున్నారు..ఆమె కెరీర్ ఇక ముగిసినట్టేనా?
'రబ్ నే బనాదీ జోడీ'లో మొగుడుగారు మీసం తీసేస్తే భార్య గుర్తు పట్టకుండా అతనెవడో కొత్తోడనుకుని ప్రేమలో పడిపోతుంది. ఆ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేసిందట! అదీ ఆదిత్య చోప్రా సినిమానే. దాని దెబ్బకి, అతనికి భారతీయ ప్రేక్షకులు పిచ్చి వెధవలని పిచ్చపిచ్చగా నమ్మకం ముదిరిపోయి ఈ సారి రెచ్చిపోయి 'దిల్ బోలే హడిప్పా' అన్నాడు. దీనికి ఎన్నొందల కోట్లు రాలతాయో మరి.
క్రాంతి - ఆ అమోఘమైన దానికి నేను బలైయాన్ను. కాని ఇది వేరే లెవెల్. ఆ 98 చెత్తలో ఇది ఆణిముత్యం. న భూతో న భవిషత్!!!
@అమ్మ - కొన్ని కొన్ని సార్లు ఆయన మాట వినాల్సొస్తది. ఎప్పుడు నా మాతే నెగ్గదు కద..
@ హేము - ఇందాకే మా ఫ్రెండ్ చెప్పింది ఇదేదో అంగ్రేజ్ మూవీ అట. చూసావా అని అడిగింది.. చిక్ ఫ్లిక్ నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తా కద.. అదే చెప్పా. మీరా జాస్మినే ఆ ??? యే కోసైనైనా "అబ్బాయి" లా ఉంటదా?
@భాస్కరా - దీని తర్వత ముగకపోతే వింత. నాకు ఎప్పుడు నచ్చదు. అది వేరే విషయం. వీరోఇన్ అంటే సొనాలి తర్వత ప్చ్..
@అబ్రకదబ్ర - అదే మరి. వినేవాడు వెంకటేష్ ప్రసాద్ ఐతే చెప్పేవాడు.... బ్లేడ్ బాబ్జీ లో భలే పారడి చేసారు కద దీన్ని.
కాంప్ హీరోయిను తో సినిమా అంటే ఇంత తెలివైనవాళ్ళు అందులో ఏ వినోదాన్ని ఆశించారు?
ఆది చోప్రా కు అరవీర ఫానులైతే తప్ప యష్రాజ్ బానరులో రాణీ ని చూసే ధైర్యం చెయ్యరు!!
నా మటుకు నన్ను
neee tolerance ne test chesindante idi definite gaa kaLaa KHANDAM eee
"విజయ దశమి శుభాకాంక్షలు"
Post a Comment