Sunday, September 6, 2009

వై.యెస్.ఆర్ ... తర్వాత ?

ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది. ఇది నా దృష్టిలో ultimate water conservation. కాని బ్రిటిషర్లు ఈ కోనేరులు filthy water అని నమ్మి చాలా వాటిని పూడ్చేసారు. స్వతంత్రం వచ్చాక మన ప్రభుత్వం వేల యేళ్ళ నాటి మన మనుగడని తలచక బ్రిటిషర్ల బాటలోనే నడిచి.. ఇదిగో ఇప్పుడు నీళ్ళూ లేని పరిస్థితి తెచ్చి పెట్టింది.

పంటలకి నీటి కోసం పంపు సెట్లు ఎంత లోపల దింపిన చాలా చోట్ల నీరు రావడం లేదు ఈ కాలం లో. అసలు భూమిలో నీరు ఉంటే కద వచ్చేది. water table restoration కి ఓ ఉపాయం జలయగ్ఞం. 70 చిల్లర చిన్న పెద్ద ఆనకట్టలు నిర్మించడంతో ఈ సమస్య కొంత తీరుతుందేమో. అందులో భాగం గా ఇప్పటికి 35 దాక నిర్మాణం పూర్తి చేసింది వై.యెస్ ప్రభుత్వం. అన్నిటి నిర్మాణం తర్వత ఒక కోటి ఎకరాలకి సాగునీరు అందేది. వ్యవసాయం మీదే ఆధరపడే మనకి ఇది ఎంత మేలో మాటల్లో చెప్పలేము. మన దేశం లో గుజరాత్ తర్వత ఇంతగా నీటి మీద వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపింది ఈ ప్రభుత్వమే. అందుకే నాకు వై.యెస్ అంటే అభిమానం. మన నాయకుల మీద మనకి ఎంత అపనమ్మకం అంటే వాడు ఎంత తిన్న పర్లేదు కొంచం ప్రజలకి చేస్తే చాలు అని అనుకుంటాం. అందులో ఇంకొంచం ఎక్కువగా ప్రజల సమస్యలని పట్టించుకుంటే దేవుడు అనేస్తాం. వై.యెస్, ఎన్.టీ.ఆర్, జలగం, బూర్గుల, ప్రకాశం పంతులు .. ఈ కోవకి చెందిన వారు.

వై.యెస్ హఠాన్మరణం తో ఆంధ్ర చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. ఇప్పుడు అతడి పేరు చెప్పుకొని బ్రతికే ఘట్టం ఆరభం ఔతుంది. మనం పేరుకిమాత్రం democracy పనితీరు మాత్రం feudalistic అని చెప్పేదానికి గత రెండు మూడు రోజుల్లో టి.వీ చూస్తే చాలు. శరత్ అన్నట్టు YS est mort, vive YS!. అసలు జగన్ అనేవాడు ఎవరు? ముఖ్యమంత్రి కి కావల్సింది ఎక్స్ పీరియన్స్. అది అతనికి అసలు ఉందా? సాక్షి పెట్టకమునుపు అతనెవరో కూడా చాలా మందికి తెలీదు. పైగా సత్యం అవకతవకల్లో అతనికీ భాగం ఉందని అప్పట్లో అన్ని పత్రికలు, చానల్లు రాసాయి / చెప్పాయి. ఇప్పుడు అవేమి గుర్తుకు రావే!! ఇందిరాని చంపేసారని రాజీవ్ కి పట్టం కట్టారు. 410+ సీట్లోచ్చిన కాంగ్రెస్ని ఐదేళ్ళల్లో 200 కంటే తక్కువచి తెచ్చేసాడు. యే పనికైన ఎక్స్పీరియన్సె అవసరం. అంటే జూనియర్ పోస్ట్లకి కాదు.. అవి నేర్చుకునేదానికే ఉంటాయి. కాని పెద్ద పోస్ట్లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ కి తగ్గ బుద్ధి విగ్ఞానం తోబాటు మనకి ఉన్న అనుభవాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కేవలం రాజకీయాల్లో సినిమాళ్ళో ఇదెందుకో వర్తించదు.

ఏమైన అంటే మా రక్తం లో నటన ఉందనో రాజకీయం ఉందనో అంటారు. అదెలా? సినిమాలూ వేరే విషయం అనుకోండి. ఒక గొప్ప నటుడి కొడుకు (ఫార్ దట్ మాటర్ కూతురు) సర్రిగ నటించకపోతే దేశానికి ఒచ్చే నష్టం ఏమీ లేదు. ఓ రెండు మూడు సినిమాలు తర్వత వాడ్ని అసలు ఎవ్వరు చూడరు. దానితో ఎవ్వరికి నష్టం లేదు. కాని రజకీయం ఇత్యాది వాటిల్లో అల జరగకూడదు. ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? సపోస్ వాళ్ళ నాన్న కార్డియాలగిస్ట్ అయ్యిఉంటే ఇతడు ఆర్థోపెడిస్ట్ ఐనా కూడా లేదు లేదు వాళ్ళ నాన్న గొప్ప గుండె డాక్టర్ కాబట్టి ఇతడి రక్తం లో గుండెకోయడం వచ్చింటది అందుకే ఇతడే గుండె ఆపరేషన్ చేయాలి అని పట్టుబడతారా?

చెప్పోచేదేంటంటే ఇప్పటికైన ఈ వారస్త్వపు ఆలోచనలు మానేయాలి. ముకేష్ అంబానిని కూడా డైరెక్ట్ గా ఎం.డి చేయలేదు ధీరుభాయి. అతడికి మొదట్లో చిన్న చితక పనులు ఇచ్చి అది చేసాకే ప్రమోషన్ ఇచ్చాడు. కుమారమంగళం కథ కూడా అదే. సురేష్ బాబు కథ కూడా అదే. నటవారసుల సంగతి నాకు తెలీదు కాని మిగితావాటిలో వారసత్వం.. i am not that sure.

8 comments:

Bhãskar Rãmarãju September 06, 2009 11:05 AM  

ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది.
-నిజం. బ్రిట్స్ ఏంచేసారో కానీ, మన బ్రిట్స్, అంటే మనలోని దేశద్రోహులు, వ్యాపార రాక్షసులు, రియల్ ఎస్టేట్ అసురులు నిర్దాక్షణ్యంగా పూడ్చేసారు.

Sravya V September 06, 2009 11:19 AM  

ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? >>
ఇక్కడ దాక ఎందుకు అదే దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం, వెస్లీ, భాటియా, ఎం ఎస్ రెడ్డి గారి పిల్లలకు కూడా వాళ్ళ తండ్రులు పోస్టులు ఇవ్వమనండి చాలు !

Anonymous,  September 06, 2009 11:19 AM  

sympathy wave buddy. even center doesn't want that, as congress already has this image of family based party. but lack of options I guess is their main problem. YSR didn't groom his successor and there aren't many charismatic options.

-Hemanth

Anonymous,  September 06, 2009 12:42 PM  

సి.ఎమ్ తో పాటుగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్యాకేజీలు ప్రకటించిన ప్రభుత్వం వై.ఎస్ కుటుంబానికి నష్టపరిహారం ఎందుకు ప్రకటించలేదు? ఆయన పదవిలో ఉండగా ఎంత తిన్నాడనుకున్నా, ప్రభుత్వ విధిగా ప్రకటించి తీరాలి కదా...

Anonymous,  September 06, 2009 1:09 PM  

jalayagnam is only one of the many good projects that ysr started.i am most impressed by health care changes made by ysr.another correction-satyam affair was totally cbn's mess and avarice.2 acres--->multimillionaire????.do not drag ysr's family into the same muck as what nara lives in and breathes.

Shashank September 06, 2009 1:22 PM  

@భాస్కర్ - మనలో కొంతమంది probably are more అంగ్రేజ్ than the angrez themselves. మా ఇంటికాడ బతుకమ్మకుంటని పూడ్చేసారు. ఇల్లుల్లు కట్టుకున్నారు.. వర్షం వళ్ళ ఆడ నీళ్ళొస్తే ఎందుకు వచ్చాయా అని ఏడిచారు.

@శ్రావ్యా - కరెష్ట్!!! అలా ఐతే ఇంక కొత్తవాళ్ళకి ఉద్యోగాలూ వచ్చే చాన్సే ఉండదు.

@ హేమూ - ysr కి టైం లేకుండె కద successor ni groom చేసేదానికి.. అంత లోనే.. పాపం.
@వికాసం - హ్మ్ .. నాక్గుర్తుండి ఇప్పటివరకు యే politician కుటుంబానికి ఇలా ఇవ్వలేదనుకుంట. ఎందుకంటారు? ;-)

@అజ్ఞాత - కేవలం CBN తిన్నాడు ysr and/or family అసలు తినలేదు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? పోయినోల్లందరు మంచోల్లే... అలాగని వారు ఎదైన తప్పులు చేస్తే అది ఒప్పులైపోతాయా? జగన్ కి సంబంధించిన 14 కంపనీల మీద కేసులున్నాయి సత్యం కుంభకోణం తో ముడిపడి. నిప్పులేనిదే పొగరాదు. కాదు వాళ్ళు ఉత్తములు. gods on earth అంటే ఇగ నేను చెప్పేది ఏమి లేదు.

Anonymous,  September 06, 2009 11:53 PM  

మనందరి బాధ ఎవరికీ కావాలి? ఇక్కడ high command చూసే విషయాలేమిటంటే:
౧) ఆంధ్ర ప్రదేశ్ biggest contributor to party fund, రాజశేఖరా రెడ్డి వలన - అందుకు గాను రాజశేఖర రెడ్డి పొందినది -౩౩ మంది MP లున్నా, మినిస్త్రిలు తక్కువ ఇవ్వటం , ఇచ్చినయికూడా తుక్కువి
ఫండ్ ఫ్లో ఆటంకాలు లేకుండా జరగాలంటే high command కు జగనే మేలు.
౨) 4th Sep - TV9, Gemini News సర్వీసెస్ (till he becomes CM)are bought by Jagan. ఈ TV బ్లాక్మెయిల్ చేయబడింది. ౩౦ నిమిషాల న్యూస్ లో ౨౦ నిమిషాలు జగన్ కోసం కార్యకర్తల ఆందోళనే కనిపిస్తుంది.
౩) real estate and industrial lobbies జగన్ వెనుకే వున్నది. ఎలేచ్షన్స్ లో పెట్టుబడి పెట్టింది రాబట్టుకోకముందే రాజ గారు పరమపదించారు.
౪) ఇప్పుడున్న మంత్రులందరూ తమ పదవులు కాపాడుకోవాలంటే జగాన్నే సమర్దించాలి.
౫) TV లో జగాన్నే ప్రతిపాదించే (పదవిలో లేని) ప్రతీ నాయకుడు పేరులో చివరి రెండు అక్షరాలూ గమనించతగ్గినవి.

కాబట్టి ninety nine percentage జగన్కే చాన్సు.

హరే కృష్ణ September 13, 2009 12:51 AM  

good post..

sasank naaku mail chesthava harekrishna011@gmail.com

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP