Friday, October 30, 2009

పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?

ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..

అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?

ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.

ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...

15 comments:

భాస్కర్ రామరాజు October 30, 2009 4:20 PM  

దీనికి ఫ్లిప్ సైడ్ చెప్పనా -
పాక్ మరియూ ఆఫ్ఘన్ లలో శాంతి నెలకొల్పటానికి ట్రిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది అమెరికా ప్రభుత.
ఈ రోజు న్యూ యార్క్ రాష్ట్ర బడ్జెట్ లో 3.2 బిలియన్ల్స్ లోటు. దీనివల్ల ప్రభుత్వ సంస్థల్లో కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు, వెరసి కాస్ట్ కట్, వర్క్ ఫోర్స్ తగ్గింపు. జీతాల్లో కోత. ట్రావెల్ కట్, హెల్త్ ఇన్సూరెన్స్ కట్, కన్సల్టెంట్స్ వర్క్ అవర్స్ కట్.
ఇదేకధ ఇంకొంత కాలం నడిస్తే, అటుమళ్ళించాల్సిన ఫండ్స్ ఎక్కువై అమెరికాలో జీవినానికి ఆటంకం ఏర్పడే రోజులు వస్తాయి.
ఇప్పటికే ఆ పరీస్థితి వచ్చింది.

కాబట్టి - ఎవరు ఎవరిమీద ఎందుకు పోరాడినా, అవలాంచ్ లాగా రెకాడితే కానీ డొక్కాడని బతుకులు రోడ్డునపడతాయి. పడుతున్నాయి.

ఈ పేలుళ్ళు, యుద్ధ కాంక్షలు, జిహాదులు - ఇవన్నీ కేవలం పొలిటికల్.

Malakpet Rowdy October 30, 2009 5:23 PM  

A stable Pakistan is one way good for India. If Pakistan breaks up, all the refugess have only one way to Travel - Eastward towards India cuz India is the only country that is so close to Pakistan in terms of culture.

Killing of civilians is bad, be it India or be it Pakistan.

Shashank October 30, 2009 10:14 PM  

@భాస్కర - అది ఫ్లిప్ సైడ్ కాదు.. extension. అమెరికా కి ప్రపంచం మొత్తం మీద 700+ ఆర్మీ బేసులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో గాలన్ పెట్రోల్ $30-40.. రోజుకి మరీన్స్ 800,000 గాలన్స్ వాడుతారు అట. లెక్క కట్టుకో.. మిగితా బేసులు వాటితో వచ్చే ఖర్చు చెత్త చెదారం సరిపోదన్నట్టు రెండు యుద్ధాలు.. ప్రొడక్షన్ ఏమీ లేకుండా సర్విసస్ మీద బ్రతికే అమెరికన్ ఎకానమి తట్టుకునే దానికంటే ఎక్కువ ఉంటే ఖర్చులు ఇలానే ఔద్ది. కొత్త వింత ఏమీ లేదు. అలనాటి రోమన్ ఎంపైర్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయేదానికి కారణాలు ఇవే!! ఎవరో అన్నట్టు history repeats itself.. first time as a farce and the second time as a tragedy అని..

@రౌడి - i am not denying the fact that killing civilians anywhere is bad. but looks like pak is getting a taste of its own home grown and manufactured medicine. సంతాపం చెప్పడం తప్ప మనం ఏమీ చేయలేము.. చేయకూడదు కూడ.

Sravya Vattikuti October 30, 2009 10:39 PM  

శశాంక్ గారు బాగా వ్రాసారు ! కాని పాక్ లో జరుగుతున్న మారణహోమం మనకు ఖచ్చితం గా నష్టమే ! పాక్ కున్న అతి దరిద్రపు లక్షనలాలో ఒకటి - వాళ్ళు ఇలాంటి పరిస్తితులలో ఉన్నప్పుడు మన దేశంలో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించి అక్కడ జనాల అటెన్స్న్ ను ఇటు మళ్ళించటమ్.. So we should be ready to face this. ఇక అక్రమ చొరబాట్ల సంగతి తెలిసిందే . మనము సుఖం గా ఉండాలంటే మన పక్కనునున్న వాడు గాడు సుఖం గా ఉండాల్సిందే తప్పదు.

karthik October 30, 2009 11:47 PM  

you shall reap what you sow!!
Strange to see even countries, civilizations,communities cant defy the rule of karma.
కర్మన్యే వాధికారస్తే మాఫలేషు కదాచనా
-Karthik

Anonymous,  October 31, 2009 12:24 AM  

*Killing of civilians is bad, be it India or be it Pakistan*
ఆర్మి వాళ్ళు ఎమీ పాపం చేసారని యుద్దం లో చావాలి. ఇందులో సామాన్య ప్రజలు ఎందుకు మినహాయింపు?యుద్దం చేయటం అనేది పొలిటికల్/ప్రభుత్వ నిర్న్ణయం,మరి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకున్న పుడు వారు చేసె తప్పులకి ప్రజలు కూడాఅ బాధ్యత వహించాలి.
అప్పుడప్పుడు కొంతమంది సామాన్యప్రజలకు ఇటువంటి దెబ్బలు తగిలితేనే కొంచెం అన్నా ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది. లేక పోతె సామాన్య ప్రజలు ఊరు కదల కుండా తిని కూర్చొని క్రికేట్, సినేమాలు మొదలైన వాటిమీద బెట్టింగ్ కట్టుకుంటూ వారికి చాలా దేశభక్తి ఉన్నట్టు వారు ఎన్నుకునే నాయకులు చాల సమర్దులు అన్ని సమస్యల నుంచి బయట పడేస్తారనే బ్రమ లో ఉంటారు. తెలుగు బ్లాగులు రాసే వారికి సామాజిక అవగాహన ఎక్కువ, మీరు బ్లాగులో రాసిన విషయాలు సామాన్య ప్రజలకు అర్థమయేటట్టు చెప్పగలరా? చెప్పినా ఎవరైనా వింటారా? నాకు తెలిసి ఎవ్వరు వినరు. అటువంటి వారికి ఇటువంటి సంఘటనలు (గోకుల్ చాట్ లో పేళ్ళు లాంటివి జరగటం) కొంత కనువిప్పును కలిగిస్తాయి. ప్రజలను వాస్తవం లో కి తీసుకొస్తాయి లేక పోతె మీడీయా మాయాజాలంలో శాశ్వతం గా చిక్కుకొని ఉంటారు.

Jayaho

AMMA ODI October 31, 2009 3:44 AM  

బాగా వ్రాసారు. నెనర్లు!

Anonymous,  October 31, 2009 7:31 AM  

*ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది.*

పాపం అని మీరు ఎవరినైనా అనవచ్చును కాని పాకిస్తాన్ ప్రజలను కాదు. అదొక దేశమే కాదు ప్రధాని చెప్పింది, అధ్యక్షుడు అంగికరించడు ఒకరికొకరు పడదు. అటువంటి రాజ్యాంగాన్ని కేవలం మత ప్రాతిపదిక మీద ఏర్పరుచు కొని ఇంకా కాష్మిర్ కావలని పొరాడుతున్నారు. కాష్మీర్ లో చదువు కున్న వారు కూడా పాకిస్తాన్ లో ఉన్న లోపాలు తెలిసినా తెలియని విధం గా నటిస్తూ వీలైతె పాకిస్తాన్ లో చెరటానికి సిద్దం గా ఉన్నారు. వారికి ఉన్న మత వ్యామొహం అటువంటిది. భారత వ్యతిరేకత/నాశనం చేయడం అనే ఆక్సిజన్ పీలుస్తూ ఆ దేశాన్ని ఎన్ని రోజులు ఎకం గా ఉంచుతారొ ఆదేశా పజలకే తెలియాలి నిన్న నే అమెరికా బెలుచిస్తాన్ లో ని గొడవలకు భారత్ కు ఏటువంటి సంభందం లేదు అని చెప్పింది కూడాను. వారి ఇల్లు చక్క బెట్టు కోవడం వారే ప్పుడొ మరచి పోయారు. భారత దేశాన్ని నాశనమ చేయటానికి ఇంకొక పథకం ఆలోచిస్తుంటారు మీరు పాపం అనే ఆ దేశ నాయకులు, వాటిని అమలు జరపటానికి సిద్దం గా ఉంటారు ఆ దేశ ప్రజలు.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/oct/30main51

అప్పారావు శాస్త్రి October 31, 2009 7:51 AM  

బాగా చెప్పారు , అమెరికా ఆగడాల గురించి మరింత లోతుగా వ్రాస్తే ఆనందిస్తా !!

Shashank October 31, 2009 8:42 AM  

@శ్రావ్యా - మనం అనుకుంటే సరిపోదు.. పొరుగింటి వాళ్ళు కూడా అలనే అనుకోవాలి. ఎప్పుడు మన ఇంట్లో నిప్పులు పెడదామా అని చూసే వారికి అసలు ఇల్లే లేకుండే చేస్తే ఉత్తమం కద. ఏమంటారు?

@కార్తీక్ - ఆ వాక్యం అందరికి అన్నింటీకి వర్తిస్తుంది.. ప్రథమంగా చెడు చేస్తే.

@అజ్ఞాత1- బా చెప్పారు. ఇన్నేళ్ళు మన దేశం మీద జరిపిన / జరుపుతున్న జిహాద్ కి ప్రజలకి సంబంధం లేదంటే నమ్మడం కొంచం కష్టమే. ప్రతి ప్రసంగం లో కాశ్మీరాన్ని స్వతంత్రం చేస్తాం అని ఇంకా ఎందుకు అంటారు? వాళ్ళు ప్రారంభించిందే తిరిగి వాళ్ళ మీదకే చేరింది. గుడ్.
@అమ్మ - :-)
@అజ్ఞాత2 - ఇన్నేళ్ళు తెర చాటున అనుకున్న మాటలు హిల్లరీ అందరి ముందు అనేసింది. నిజం నిప్పులాంటిది.. (అందుకే నేను బర్నాల్ జేబులో పెట్టుకొని తిరుగుతా). ఆ ఇచ్చే భిక్ష కూడా ఆపేస్తే సెట్ మాటర్.

@అప్పా రావు గారు - అమెరికా ఆగడాల గురించి ఏకంగా PhD లే చేసారు. నేనెంతండి? కాని ఎదో చిన్న చితక రాస్త... మెల్లగా... అప్పటివరకు కొంచం నిరీక్షించండి. ప్లీజ్.

హరే కృష్ణ . October 31, 2009 12:10 PM  

hare krishna hare krishna krisha krishna hare hare
hare rama rama hare rama rama rama hare hare

entha baaga raasav
analysis kummesav

Shashank October 31, 2009 1:32 PM  

హరే రామ హరే రామ రామ రామ హరే హరే

థాంక్స్ గురు..

శరత్ చంద్ర November 04, 2009 12:31 AM  

శశాంక్ గారు,

నాకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. మీరు తెలిసే అంటున్నారా వారికి నీడ లేకుండా చేయడం ఉత్తమం అని.. అలా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. తీవ్రవాదం ఎవరికైనా ఒకటే. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తీవ్రవాదాన్ని సమర్ధించింది అన్నది నిర్వివాద అంశం కానీ దానికి పాక్ ప్రజలను ఎలా బాధ్యులను చేస్తారు? మన దేశంలోని కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న సైనిక దళాల ప్రత్యేక అధికారాలా చట్టం కింద సైన్యం చేస్తున్న దురాగతాలన్ని మన దేశ ప్రజలు చేస్తున్నట్లుగా లేదా సమర్ధించినట్లుగా మీరు భావిస్తున్నారా?? అలానే పాకిస్తాన్ లో కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే సామాన్య ప్రజలు ఉన్నారు. వారికి నీడా లేకుండా చేయాలి అనుకోవడం మూర్ఖత్వమే. సామాన్యులు ఎక్కడైనా సామాన్యులే.. మనదేశంలోని పల్లెటూర్లకే ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ ఎంతమంది పాకిస్తాన్ అనే ఒక దేశం ఉందని దాని ఉనికిని గుర్తిస్తారు?? ఇలానే పాక్ లో కూడా తామున్నదే ప్రపంచం అనుకునే అమాయక ప్రజలు ఉండరనుకుంటున్నారా?? ఏది ఏమైనా ప్రభుత్వాలు చేసే తప్పులకు సామాన్య ప్రజలు బలవ్వడం మంచిది కాదు.

మీరు అమెరికా గురించి చేసిన వ్యాఖ్యలని సమర్ధిస్తున్నాను, మీ టపా బావుంది కానీ ఆ ఒక్క విషయం మళ్ళీ ఆలోచించండి. పొరుగు దేశాలు ఎంత చల్లగా వుంటే మన దేశం అంత సుభిక్షంగా ఉంటుంది.

Shashank November 05, 2009 9:17 AM  

శరత్ - మీరు నా టపా ని తప్పుగా తీసుకున్నారు. ప్రాణ నష్టం ప్రాణ నష్టమే కద! అదే అన్నాను. కాని తెహ్రీకీ తాలిబాన్ ని సృష్టించి పోషించి వాళ్ళకి శిక్షణ అన్ని ఇచ్చింది పాక్ ప్రభుత్వమే. ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారు. దానికి నాకు ఆనందం. మామూలు ప్రజల మీద ప్రతీకారం అనేది బై-ప్రాడక్ట్. మీరు పాక్ ప్రజలు అసలు తీవ్రవాదాన్ని సమర్థించరు ఉత్తములు అని అంటున్నారు ఒక్క సారి dawn పత్రికని చూడండి. బోలేడు మంది 26/11 జరిగిన హింసని వ్యతిరేకించలేదు. పైపెచ్చు సమర్థించుకున్నారు - 71 లో బాంగ్లదేశ్ ని విడగొట్టేదానికి చేసిన సహాయానికి ప్రతిఫలం అని అనుకుంటూ. ఇదిగోండి ఒక పాక్ ప్రొఫెసర్ రాసిన వ్యాసం (http://www.outlookindia.com/article.aspx?262535) ఎక్కడ మీకు అతను తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు అనిపించదు.

ఒక చదువుకున్న వాడే ఇలా అంటే మరి ప్రజలు ఏమంటారో? LeT గట్ర contributions పాక్ ప్రజలే ఇస్తారు. అది ఎన్నొ పత్రికల్లో వచ్చిన వార్తే. అంతెందుకు రాజకీయ నాయకులు they cater soundbites to the peoples' sentiment ఒప్పుకుంటారా? నవాజ్ షరీఫ్ కానివండి బెనజీర్ కానివండి యే ఒక్కరు పబ్లిక్ గా భారతాన్ని సమర్థించలేదు. ఎప్పుడు జిహాద్ చేస్తాం అనే అంటారు.. ప్రతి రాలీ లో అదే మాట అంటారు. ఎందుకంటారు? వాళ్ళూ అలా అన్నప్పుడు హోరెత్తేలా చప్పట్లు వినిపించలేదా? ఊ-ట్యూబ్ లో వీడిఓలు కూడా ఉన్నాయి ఇలాంటి స్పీచులవి. మీకు ఇంకొన్ని లంకెలు :

http://www.rand.org/commentary/2001/09/01/JIR.html
http://www.time.com/time/asia/magazine/2001/0205/kashmir_sb1.html

From the article:
There are thousands of young, motivated Pakistani men anxious to join the militancy in Kashmir, which they consider a holy war. They come from all walks of life: not merely from the religious schools known as madrassahs, or the far-flung, poverty-mired towns and villages, but also from Pakistan's educated and Westernized middle and upper classes. In the jihad they find brotherhood, a sense of mission and purpose. And for these highly religious volunteers, many of whom are still in their teens, there is nothing more sacred in life than achieving the status of a martyr.

ప్లీజ్ చదివి మీరే నిర్థారించుకోండి పాక్ ప్రజల మద్దత్తు లేకుండానే ఇది జరుగుతోందేమో అని.

"పొరుగు దేశాలు ఎంత చల్లగా వుంటే మన దేశం అంత సుభిక్షంగా ఉంటుంది." <- ఇది అక్షరాలా సత్యం. కాని ఆ భావన మన ఒక్కరికే ఉంటే సరిపోద్దా? పొరుగు దేశం ఓ యాభై ఏళ్ళ నుండి మన దేశం మీద దొంగచాటున చేసిన దాడులు తుడిపేసుకొని మీరు బాగుంటే చాలు అని అందామా? ఇప్పుడు మనం చేస్తున్నది అదే కద. it takes two to tango. కాదంటారా?

cartheek November 07, 2009 10:25 AM  

baga rasarandi bagundi...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP